👉ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను విచారించేందుకు హోం మంత్రిత్వ శాఖ ఈడీని ఆమోదించింది.ఫెడరల్ ఏజెన్సీ 56 ఏళ్ల రాజకీయ నాయకుడిపై గత ఏడాది మార్చిలో అరెస్టు చేసిన తర్వాత ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (పిఎంఎల్‌ఎ) కోర్టు ముందు ఛార్జిషీట్ దాఖలు చేసింది..ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేజ్రీవాల్‌ను విచారించేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి అవసరమైన అనుమతిని మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.కేజ్రీవాల్ తన వ్యక్తిగత హోదాతో పాటు అతని రాజకీయ పార్టీ ఆప్ జాతీయ కన్వీనర్ హోదాలో నిందితుడిగా మారారు.మాజీ ముఖ్యమంత్రిని ED ఢిల్లీ ఎక్సైజ్ “స్కామ్” యొక్క “కింగ్‌పిన్ మరియు కీలక కుట్రదారు” అని పిలిచింది.ఢిల్లీ ప్రభుత్వ మంత్రి, ఆప్ నేతలు, ఇతరులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. AAP, ఒక రాజకీయ పార్టీ అయినందున, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం భారతదేశంలోని వ్యక్తిగత పౌరుల సంఘం లేదా సంఘంగా నిర్వచించబడిందని, అందువల్ల దీనిని “కంపెనీ”గా వర్గీకరించవచ్చని ED గతంలో పేర్కొంది.

PMLA సెక్షన్ 70 ప్రకారం నేరం జరిగినప్పుడు ఆ కంపెనీకి అంటే AAPకి కేజ్రీవాల్ “ఇన్‌చార్జ్ మరియు బాధ్యుడు” కాబట్టి, అతను మరియు అతని పార్టీ మనీలాండరింగ్ నిరోధక చట్టం క్రింద పేర్కొన్న నేరాలకు “దోషిగా పరిగణించబడతారు” మరియు విచారించబడతారు మరియు శిక్షించబడతారనీ చెప్పింది.
ఎక్సైజ్ కేసు 2021-22 కోసం ఢిల్లీ ప్రభుత్వం యొక్క ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో మరియు అమలు చేయడంలో అవినీతి మరియు మనీలాండరింగ్‌కు సంబంధించినది, అది తరువాత రద్దు చేయబడింది.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అక్రమాలపై సీబీఐ విచారణకు సిఫారసు చేశారు.
అనంతరం ఈడీ పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసింది.
ఆగస్ట్ 17, 2022న నమోదైన సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్న ఈడీ అక్రమాలపై విచారణ జరిపేందుకు ఆగస్టు 22, 2022న మనీలాండరింగ్ కేసును దాఖలు చేసింది.
👉బాబు మారారు😱: ఉద్యోగుల టాక్….! ఇటీవల సంక్రాంతిని పురస్కరించుకుని 670 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాబు మారారు! అంటూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అయితే.. ఇదేదో.. తమకు కానుకలు ఇచ్చారో.. పెండింగు వేతనాలు, బిల్లులు చెల్లించారనో కాదు. చంద్రబాబు వ్యవహార శైలిలోనే వచ్చిన మార్పును వారు గమనిస్తున్నారు. దీనిని ప్రస్తావిస్తూనే వారు బాబు మారారు.. అంటూకామెంట్లు చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతిని పురస్కరించుకుని 670 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సొమ్ములు ఇవ్వడం సహజంగానే ఉద్యోగులకు ఆనందం కలిగించే విషయం. అయితే.. ఇంతకు మించిన ఆనందంతో ఉద్యోగులు ఉన్నారు. దీనికి కారణం.. పనిభారం తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగు లు వేస్తోంది. నిజానికి చంద్రబాబు హయాం అంటేనే.. పనిగంటల్లో నిక్కచ్చిగా ఉంటారని.. పనితీరు కరెక్ట్ గా ఉండాలని ఒత్తిడి చేస్తారనే పేరుంది. 1995 నాటి ముఖ్యమంత్రిగా ఆయన ఉద్యోగులను పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు-చంద్రబాబుకు మధ్య గ్యాప్ పెరిగింది. ఈ గ్యాప్ ఏళ్ల తరబడి అలానే ఉండిపోయింది. తాజాగా దీనిని తగ్గించుకునేందుకు చంద్రబాబు ప్రయ త్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన ఉద్యోగ సంఘాల డిమాండ్లను పనరిష్కరించేందుకు ప్రయత్ని స్తున్నారు. ఇదేసమయంలో సెలవుల విషయంలో లిబరల్‌గా ఉంటున్నారు. తాజాగా కనుమకు సెలవు లేదు. కానీ, ఉద్యోగ సంఘాలు విన్నవించడంతో రాత్రికి రాత్రి సెలవు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకు న్నారు. ఇదే సమయంలో బదిలీల విషయంలోనూ పనితీరును ప్రామాణికంగా తీసుకుని.. మరింత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిఇక్కడ పనిచేస్తున్నవారికి వారంలో ఐదు రోజుల పనివిధానాన్ని కూడా.. ఇటీవ ల మరోసారి రెన్యువల్ చేశారు. ఈ పరిణామాలుఉద్యోగుల్లో చంద్రబాబుకు పాజిటివిటీని పెంచుతున్నా యి. ఇక, పనితీరు విషయంలోనూ చంద్రబాబు తన పంథాను మార్చుకున్నారు. ఎన్ని గంటలు పనిచేశా రన్నది కాదు.. ఎంత ప్రొడక్టివిటీగా పనిచేశారన్నది చూస్తున్నారు. సాయంత్రం 6 తర్వాత కార్యాలయాల్లో ఉండొద్దన్న ఆదేశాలను కూడా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు.. బాబు మారారు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ తరహా మార్పుతో ప్రభుత్వం పనితీరు కూడా మారే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.
👉శ్రీశైలం టోల్ గేట్ సిబ్బంది చేతివాటం.. 8 మందిపై వేటు*అధిక మొత్తంలో టోల్ వసూలు చేస్తున్న సిబ్బంది.. ఆన్ లైన్ ద్వారా కాకుండా వాహనదారుల నుంచి నగదు వసూలు చేసిన సిబ్బంది..రామకృష్ణుడు, నాగపరమేశ్వరుడు, మల్లిఖార్జునరెడ్డి, గోవిందు, మల్లేశ్వర్ రెడ్డి, డైలీ వేజ్ సిబ్బందిని తొలగించిన శ్రీశైలం ఈవో..
👉పోలీసుల సమక్షంలో దందా!.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ.. రోడ్డు సేఫ్టీ పేరుతో అక్రమ వసూళ్లు..
పోలీసుల సమక్షంలోనే భారీ వాహనదారులను బెదిరించి అక్రమంగా వసూలు చేస్తున్నారని,కానిస్టేబుల్ యూనిఫాం వేసుకుని తప్ప తాగి డ్యూటీ చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు..
👉కబడ్డీ ఆడిన నరసరావుపేట ఎమ్మెల్యే.చదలవాడ *పల్నాడు జిల్లా.వినుకొండ నియోజకవర్గం..ఈపూరు మండలం ముప్పాళ్ళ గ్రామంలో రైతు మిత్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలు ప్రతి ఏడాది కమిటీ సభ్యులు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలతో ఆర్థిక భారమైన లెక్క చేయకుండా పోటీలు ఘనంగా నిర్వహించి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నారు. ఇటువంటి క్రీడలతో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారన్నారు.

