*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

????భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు
AP: తెలుగు వారికి, భారతీయులు అందరికీ సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మాట్లాడుతూ.. “ప్రజల దర్శనం చేసుకున్నాక, దుర్గమ్మ దర్శించుకున్నాను. రాష్ట్రం అభివృద్ధి చెందేలా దుర్గమ్మ చల్లనిచూపు మనపై ఉంది. అందరికీ ఆదాయం పెరిగి, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా. ప్రజలకు మంచి జరిగేలా అనేక కార్యక్రమాలు చేపట్టాం. భవిష్యత్తు తెలుగువాళ్లదే, త్వరలోనే మరింత మంచిని చూస్తారు” అని పేర్కొన్నారు.
????అమెరికాలో తెలుగు ముఠా*
*లక్ష డాలర్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్*
*అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో తెలుగు రెస్టారెంట్లు, షాపులు టార్గెట్ చేసి తూనికలు సరిగా లేవంటూ బెదిరిస్తూ లక్ష డాలర్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్*
*రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ తెలుగు యువకులు*
???? అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు దేశంలో టోల్ గేట్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. గత ఏడాది కంటే అదనంగా రూ. 6 వేల కోట్లు సమకూరినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. దేశంలో టోల్ గేట్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. గత ఏడాది కంటే అదనంగా రూ. 6 వేల కోట్లు సమకూరినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2023 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల ద్వారా రూ.62,293.4 కోట్లు వసూలైతే 2024 డిసెంబర్ 31 నాటికి ఈ మొత్తం రూ.68,037.60 కోట్లకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలో దాదాపు రూ. 6 వేల కోట్లు అదనపు ఆదాయం వచ్చింది. దేశంలో మొత్తం 1040 టోల్ గేట్లు ఉన్నాయి. సుమారు 46,884 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులపై ఈ టోల్ గేట్లను ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్యాగ్ ద్వారా వాహనాల నుంచి ఈ టోల్ గేట్లలో ట్యాక్స్ వసూలు చేస్తుంటారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది అదనంగా 4,289 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించి 94 టోల్ గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో టోల్ ఆదాయం కూడా బాగా పెరిగింది. గత ఏడాది రోజుకు సగటున రూ.170.66 కోట్లు వసూలైతే, ఈ ఏడాది ఆ మొత్తం సగటున రూ.191.14 కోట్లకు చేరింది. ఫాస్ట్ ట్యాగ్ విధానం అమలులోకి తెచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరుగుతోంది. అదేసమయంలో పన్ను ఎగవేతలు కూడా తగ్గిపోయాయి. రహదారులపై వాహనాలు గంటలకొద్దీ వేచిచూడాల్సిన అవసరం లేకపోయింది. రవాణా మెరుగు అవ్వడంతో పర్యాటక రంగం, దాని అనుబంధ రంగాలు బాగా అభివృద్ధి చెందాయి. ఫలితంగా టోల్ ట్యాక్స్ వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు చెబుతున్నారు. టోల్ గేట్ల ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం పెరిగినా, ఆ మేరకు సౌకర్యాలు పెరగడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జాతీయ రహదారుల్లో కనీస సౌకర్యాలు ఉండటం లేదని, అదేవిధంగా రహదారుల నిర్వహణ అధ్వానంగా ఉంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
???? పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? మోడీ సర్కారులో పవన్ కల్యాణ్ కు ఉన్న పలుకుబడి అంతా ఇంతా కాదన్నట్లుగా ప్రచారం జరుగుతుంటుంది. ప్రముఖులు మాట్లాడే మాటలకు ఎందుకంత ప్రాధాన్యం అంటే.. వారి నోటి నుంచి అప్రయత్నంగా వచ్చే మాటలు విలువైన సమాచారాన్ని అందిస్తాయి. కాకుంటే.. వారి మాటల్లోని మర్మాన్ని.. ఒక మాటకు.. మరో మాటకు మధ్యనున్న లింకును అర్థం చేసుకోగలిగితే కొన్ని అంశాలపై క్లారిటీ వచ్చేస్తుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తన మాటలతో ఇప్పటివరకు కొన్ని అంశాల మీద కన్ఫ్యూజన్ ను క్లియర్ చేయటమే కాదు.. మరికొన్ని అంశాల మీద క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి. మోడీ సర్కారులో పవన్ కల్యాణ్ కు ఉన్న పలుకుబడి అంతా ఇంతా కాదన్నట్లుగా ప్రచారం జరుగుతుంటుంది. ఇటీవల మహారాష్ట్రలో ముగిసిన ఎన్నికల్లో బీజేపీ గెలుపులోనూ పవన్ పాత్ర ఉందని.. ఆయనకారణంగా కమలం పార్టీ మరిన్ని సీట్లను సొంతం చేసుకున్నట్లుగా జాతీయ మీడియా సైతం ప్రచారం చేసింది. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమిలో పవన్ ఎంత కీలకమన్నట్లుగా వార్తలు వచ్చాయి. పవన్ కు మోడీ అమితమైన ప్రాధాన్యతను ఇస్తారని చెబుతారు. అయితే.. ఆ మాటల్లో నిజం ఎంతన్న విషయం పవన్ తాజా మాటలు అసలు విషయాల్ని చెప్పేస్తాయి. తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి అంశంపై అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇవ్వటమే కాదు.. ఆయన ఎమ్మెల్సీ అయ్యాకే.. మంత్రి అవుతారని స్పష్టం చేశారు. దీంతో.. పదవుల విషయంలో తమకు మరీ అంత కక్కుర్తి లేదన్న విషయాన్ని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తన చుట్టు ఉన్న వారికి సంబంధించిన కులాలు తెలియవని చెప్పిన పవన్ కల్యాణ్.. నాగబాబుకు అర్హత కారణంగానే మంత్రి అవుతున్నారే తప్పించి.. తన సోదరుడు కావటం వల్ల మాత్రం కాదని స్పష్టం చేయటం ఆసక్తికరంగా మారింది. దీనికి మించిన మరో ఇంట్రస్టింగ్ అంశం ఏమంటే.. నాగబాబుకు రాజ్యసభ సీటు కట్టబెట్టేందుకు పవన్ ప్రయత్నించారంటూ కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి.
తాజాగా ఆ విషయాన్ని పవన్ కన్ఫర్మ్ చేశారని చెప్పాలి.నాగబాబు ఎన్నో త్యాగాలు చేశారని.. గత ఎన్నికల్లో తాము పక్కాగా గెలిచే అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉన్నా.. బీజేపీ కోరటంతో వదులుకున్నట్లు చెప్పారు. బీజేపీ కోసం పవన్ త్యాగాల పర్వం అక్కడితో ఆగలేదు. రాజ్యసభ అభ్యర్థిత్వం వస్తుందని అనుకున్నానని.. కానీ బీజేపీ వారి ఇబ్బందుల వల్ల ఇవ్వటం కుదర్లేదని చెప్పటం చూస్తే.. ప్రతి అంశంలోనూ పవన్ ను బీజేపీ వాడుకోవటమే తప్పించి.. ఆయనకు ఉపయోగపడిన వైనం కనిపించదు. తమకెంతో చేస్తున్న పవన్ కోరినట్లుగా రాజ్యసభ సీటు ఇవ్వకపోవటం దేనికి నిదర్శనం? మోడీ అనుకోవాలే కానీ.. పవన్ కోరిన రాజ్యసభ సభ్యత్వాన్ని కేటాయించటం పెద్ద కష్టం కాదు. కానీ.. అదేమీ జరగలేదంటే.. ఏమిటి అర్థమన్నదే అసలు పాయింట్. ఆ విషయం పవన్ మాటల కారణంగా అందరికి తెలిసిందని చెప్పాలి.
???? *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి!* ఏలూరు జిల్లా*
*నూజివీడు మండలం, మర్రిభందం గ్రామం*
*జనసేన సైనికుడు* *దోనవల్లి వెంకట్రావు పై కత్తులతో రాడ్లతో దాడికి పాల్పడిన లేడీ రౌడీ షీటర్!*
*పాత కక్షలు గొడవ నేపథ్యంలో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న వెంకటరావు పై కత్తులతో రాడ్లతో జన సైనికుడిపై దాడికి పాల్పడిన వైనం!*
*వెంకట్రావుని కత్తితో నరకడంతో చేతి పై కత్తితో నరికి చంపడానికి ప్రయత్నించారంటూ సమాచారం!*
*జనసేన పార్టీ నాయకులు* *దొనవల్లి వెంకట్రావుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళుతున్నా కుటుంబ సభ్యులు!* *పూర్తి వివరాలు తెలియాల్సింది* .
???? నూతన సంవత్సరం సందర్భంగా ఒంగోలు లోని లాయరపేట లోనున్న శ్రీ శ్రీ షిరిడి సాయి బాబా మందిరం లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు,ఈ సందర్భంగా పెద్దలు సదా శివయ్య స్వామిని సన్మానించుకున్నారు. కార్యక్రమంలో తాతా ప్రసాద్,ఆత్మకూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు…* స్టాఫ్ రిపోర్టర్ రహిమాన్..
???? ఒంగోలు V. I. P రోడ్ లో నున్న పద్మాలయాస్ బేకరీ సిబ్బంది తో కలిసి 2025 నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు యాజమాన్యం,సిబ్బంది తదితరులు ఈ సందర్భంగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.
????టంగుటూరు మండలం నాయుడుపాలెం గ్రామంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రివర్యులు డోలబాల వీరాంజనేయ స్వామి స్వగృహం నందు కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి,తాత ప్రసాద్ శ్రీనివాస రావు,బెల్లం సత్యం,శ్రీనివాసరావు (చంటి) మద్దెల శివ పాల్గొన్నారు.

???? నూతన సంవత్సరం సందర్భంగా ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినారు.
???? నూతన సంవత్సరం సందర్భంగా ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో అభిమానులు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్నారు.
???? నూతన సంవత్సరం సందర్భంగా ఒంగోలు లోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఏ ఆర్ దామోదర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి.

????తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్చార్జి ముక్క రూపానంద రెడ్డికి,మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు…అన్నమయ్యజిల్లా)
????వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన పోలీసులు.*
దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన అచ్చయమ్మ అనే వృద్ధురాలు
దర్శనం నిమిత్తం క్యూ లైన్‌లో వేచి ఉండగా కళ్లు తిరిగి పడిపోయిన వృద్ధురాలు
వెంటనే అప్రమత్తమై సంరక్షణ చర్యలకు పూనుకున్న వన్ టౌన్ పోలీసులు .వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్సను అందించడంతో ప్రస్తుతం వృద్ధురాలు సురక్షితం….
????నెల్లూరు జిల్లా..కావలి పట్టణం లోని గాయత్రీ నగర్ లే అవుట్ లో ఓ ఇంట్లో అన్షిత బిస్వాల్ (24)అనే మహిళ అర్థరాత్రి దారుణ హత్య… రాత్రి నూతన సంవత్సరం వేడుకలు చేసుకొని ఇంట్లోనే అందరూ పడుకుని ఉండగా హత్య. బిశ్వాల్ కుటుంబం కలకత్తా రాష్ట్రానికి చెందిన వారు.మొలలకు మందు ఇచ్చే క్లినిక్ నడుపుతున్న బిశ్వాల్ కుటుంబం .వారి క్లినిక్ లో పనిచేసే యువకుడే బి ను హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్న స్థానికులు.
కావలి వన్ టౌన్ పోలీసులు అదుపులో నిందితుడు వున్నట్టు సమాచారం.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్