*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

???? యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం : కాకినాడ యుటిఎఫ్ స్వర్ణోత్సవాలు జయప్రదం చేయాలని కోరుతూ శ్రీకాకుళంలో ప్రారంభమైన ప్రచార యాత్ర మంగళవారం కనిగిరి చేరుకుని అక్కడి నుంచి బేస్తవారిపేట మార్కాపురం మీదుగా సాయంకాలం పొదిలికి వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక యుటిఎఫ్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

జూనియర్ కాలేజీ రోడ్లో యుటిఎఫ్ ప్రధాన కార్యాలయం వద్ద జెండాను విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఏ బాదుల్లా,జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ రవి, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు పిల్లి రమణారెడ్డిలు ఆవిష్కరించారు. ఉపాధ్యాయ ఉద్యమానికి దిశా నిర్దేశం చేసిన యూటీఎఫ్ సంఘం స్వర్ణోత్సవాలు జయప్రదం చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాల వెంకటేశ్వర్లు,జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు బి బుచ్చిబాబు,పొదిలి,కొనకన మిట్ల మండలాల ప్రధాన కార్యదర్శులు పి వెంకటేశ్వర్లు,కే కామేశ్వర రావు,సీనియర్ నాయకులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

???? నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరు లోని మాగుంట కార్యాలయంలో పుట్టా విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఈ సందర్భంగా పలువురు నాయకులు, మాగుంట అభిమానులు ఎంపీ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
???? నూతన సంవత్సరం సందర్భంగా ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సరస్వతి విద్యాసంస్థలు చైర్మన్ AV రమణారెడ్డి, తాత ప్రసాద్, బెల్లం సత్యం, ఆత్మకూరి బ్రహ్మయ్య, కుమార్.

???? నూతన సంవత్సరం సందర్భంగా ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేతుల మీదగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు షేక్.అబ్దుల్ ఖాదర్,పీవీ.నారాయణ, kv.కెనడి,కొండల రావు,విజయకుమార్,దర్విన్,రాజ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.*స్టాఫ్ రిపోర్టర్ రహిమాన్..
???? సిఎల్ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ*
కంభం పట్టణంలోని సిఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో మంగళవారం నాడు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కళాశాల క్యాలెండర్ ను ఆ కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా అలీ భాష,మరియు విద్యావేత్త బొల్లా గురవారెడ్డిలు కేక్ కట్ చేసి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ అలీ భాష గారు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ కళాశాల డైరెక్టర్ సిరిగిరి బ్రహ్మం, సిఎల్ఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం భూపని నారాయణ గుండాల ముక్తేశ్వరరావు, ఏనుగుల రవికుమార్, సిహెచ్ నారాయణ,ఎం శ్రీనివాస్ రెడ్డి,వనజ,బ్యూలా,డేవిడ్ పాలిశెట్టి నవీన్,ఉప్పు నారాయణ,అరుణ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
???? శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను కంభం పట్టణంలోని ఉదయగిరి బృందావన కళ్యాణ మండపంలో సంఘ ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఉదయగిరి మల్లికార్జునరావు మాట్లాడుతూ అర్ధవీడు, కంభం, బెస్తవారిపేట మండలం లోని బలిజలు అందరూ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని ప్రభుత్వం ద్వారా అండవలసిన పథకాలు అందకపోతే సంఘం దృష్టికి తీసుకొని వస్తే వాటిని పరిష్కార దిశగా పోరాడతామని, బలిజ కులస్తులలో పేదవారు మరణిస్తే ఆ కుటుంబానికి అండగా నిలవడానికి పదివేల రూపాయలు మట్టి ఖర్చులకు సంఘం ద్వారా అందీయబోతున్నామని తెలియజేసారు.తల్లిదండ్రులు లేని పిల్లకు విద్యకు సంబంధించి వారికీ సంఘం ద్వారా తోడ్పాటు కల్పిస్తామని చెప్పారు.కార్యక్రమంలో అధ్యక్షుడు పగిడి వెంకటరమణ,కార్యదర్శి ఉదయగిరి మల్లిఖార్జునరావు, తాడవ వేంకటేశ్వర్లు,సోమిశెట్టి నారాయణ,కాల్వ బాల రంగయ్య,MPP మెడూరి వేంకటరావు, పగడాల పాండు, సంగ రమణ,ఆకుల మురళి, కోళ్ల రమణ,పత్తి రంగనాయకులు,పార్శ ఆదయ్య,పార్శ సుబ్బయ్య,కాకర్ల నరేంద్ర,కంఠ రామాంజనేయలు, మార్తోట ప్రసాద్,గంజి శ్రీనివాసులు,యన్నం కోటేశ్వరరావు,అన్నం నలబుల వెంకటేశ్వర్లు,ప్రసాద్,సందు నారాయణ,తాటిశెట్టి ప్రసాద్, కాకర్ల నరేంద్ర,పులి హర్ష,మునగాల బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
????ఖుర్ఆన్ పఠనం ద్వారా బాల్యం నుంచే ఆధ్యాత్మిక, నైతిక విలువలు : UFQS & JIH

oppo_0

డిసెంబర్ నెల 29 వ తేదీన మార్కాపురంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ & జమాఅతె ఇస్లామి హింద్ సంయుక్తంగా నిర్వహించిన పదవ ఖుర్ఆన్ కంఠస్థ క్వార్టర్ ఫైనల్ లో ప్రకాశం జిల్లాకు చెందిన 200 మంది విద్యార్థులలో 11 మంది విద్యార్థులు జనవరి 5వ తేదీన నెల్లూరులో జరిగే సెమీఫైనల్స్ కు ఎంపికయ్యారు. వారిలో కంభం పట్టణానికి చెందిన నలుగురు విద్యార్థినీ విద్యార్థులు ఎంపిక కావడం ఎంతో గర్వనీయమని జమాఅతే ఇస్లామి హింద్ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ గౌస్ ఖాన్ కొనియాడారు.మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పార్క్ స్ట్రీట్ నుండి తన్సియా, ఆల్ఫా ఉన్నత పాఠశాల నుండి సాఖిబ్ మహమ్మద్ ఖాన్,కృపామృత ఉన్నత పాఠశాల నుండి ఉమామ పర్వీన్, వాసవి విద్యాసంస్థల నుండి ఆతికా తబస్సుమ్ లను జమాఅతే ఇస్లామీ హింద్ కంభం శాఖ సభ్యులు మొహమ్మద్ రఫీ, యం. రసూల్ బేగ్, పఠాన్ ఆసిఫ్ ఖాన్, రషీదుల్లా ఖాన్ జనాబ్ సద్దాం హుస్సేన్, షేక్షావలి తదితరులు పాల్గొని సన్మానించడం జరిగింది.
????మిరప రైతులకు శిక్షణ కార్యక్రమం.. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని లింగోజిపల్లి గ్రామంలో మిరప రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు .కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి రవీంద్రబాబు సీనియర్ సైంటిస్ట్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ దర్శి వారు మాట్లాడుతూ మిరపలో సస్యరక్షణ, సమగ్ర పోషక యాజమాన్య చర్యల గురించి వివరించారు.ఇందులో భాగంగా పంట మార్పిడి తప్పనిసరి అని, ఒకే పంట పలుమార్లు వేయడం వలన పురుగు ఉధృతి ఎక్కువవుతుందని అన్నారు. సేంద్రియ ఎరువుల వాడకం పెంచి, నత్రజని ఎరువుల వాడకం తగ్గించాలని చెప్పారు. పురుగు మందులు చిట్కాలు పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు సరైన సమయంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆకులు తడిచేటట్లు స్ప్రే చేయాలని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మిరప తోటలో తామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉందని తెలిపారు. సిఫార్సు చేసిన మందులను మార్చి మార్చి పిచికారి చేసుకోవాలని, సూచించిన మోతాదుని పిచికారి చేయాలని తెలిపారు. చలి వాతావరణ పరిస్థితుల్లో సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువ కనిపించే అవకాశం ఉన్నందున ఏదైనా సూక్ష్మ పోషక మందులను 2,3 సార్లు10 రోజుల వ్యవధిలోపిచికారి చేయవలెను సూచించారు. పూజలో తామర పురుగు ఉధృతి తగ్గించుకోవడానికి బ్రో ప్లాన్ లైట్, ఫ్లూక్స మెటా మైడ్, స్పైరో టెట్రామ్యట్ వంటి పురుగుమందులను మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి అని సూచించారు. తామర పురుగులు ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే మాస్ ట్రాఫిక్ పద్ధతిలో ఎకరానికి 100 నుండి 150 జిగురు అట్టలు పెట్టవలెనని చెప్పారు. నీటి తడులు వ్యత్యాసం లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ శిక్షణ కార్యక్రమం అనంతరం మాగుటూరు గ్రామంలోని మిరప మరియు బత్తాయి తోటలను పరిశీలించడం జరిగినది. ఉద్యాన అధికారి మాట్లాడుతూ వేసిన ప్రతి పంట పంట నమోదు మరియు పంటల భీమా చేయించుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో ఉద్యాన అధికారి డి శ్వేత,ఉద్యాన విస్తరణ అధికారి వై సి హెచ్. శేషగిరి, వ్యవసాయ సహాయకులు శ్రీమంతు,మరియు రైతులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్