ఐకాన్ స్టార్ ఐతే ఏంటి?.. సీఎంకు అల్లు అర్జున్ సారీ చెప్పాల్సిందే! : మంత్రి కోమటిరెడ్డి ..”అల్లు అర్జున్ ఏమైనా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నాడా! : సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్… అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి?.. బీడీ కార్మికులకు శుభవార్త … కర్నూలు జిల్లాలో….కలకలం….క్లాస్‌రూమ్‌లో ఉండగానే టీచర్‌ కిడ్నాప్‌.. అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం .. పేద‌ల‌ను కేంద్రంగా చేసుకుని పార్టీలు ఇస్తున్న ఉచిత హామీల‌తో దేశం అల్ల‌క‌ల్లోలం అవుతోంద‌న్న ఆర్బిఐ … ఇన్స్‌పెక్టర్‌కే టోకరా ఇచ్చిన సైబర్ నేరగాళ్లు..! .. రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలు ప్రారంభించిన మంత్రి డా.డోలా …

???? అల్లు అర్జున్ ఏమైనా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నాడా!…
అసలు అల్లు అర్జున్ కి తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా!
పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు.. నీకు ఎందుకు చెప్పాలి నువ్వు ఏమన్నా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నావా…నువ్వు మామూలు పౌరుడివి.. నీకు ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా తెలంగాణలో ఎక్కడ ఉందో కూడా తెలియదు…అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయింది.. నీ గురించి మేము ఎందుకు బాధపడాలి..
తెలంగాణ సమాజం సౌమ్యులు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తున్నారు – ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి
????హీరో అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి?**
హైదరాబాద్:
పుష్ఫ 2 సినిమా హీరో అల్లు అర్జున్ ఇంటిపై కొద్దిసేపటి క్రితంరాళ్ల దాడి జరిగినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంపై కొందరు జేఏసీ నాయకులు రాళ్ల దాడికి పాల్పడినట్లు సమాచారం. సంథ్య థియేటర్ వద్ద తోపులాట ఘటన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా అసెంబ్లీలో సంథ్య థియేటర్ వద్ద తోపులాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి,స్పందించడం, అల్లు అర్జున్ వైఖరిని తప్పుపట్ట డంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని, శాసనసభలో రేవంత్ చెప్పినవన్నీ అవాస్తవాలని సీఎం పేరు ప్రస్తావించ కుండా చెప్పారు.
తనపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. అల్లు అర్జున్ కాంగ్రెస్ ప్రభు త్వంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారు.
ఈ దశలో కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరనే సమాచారం..
????బౌన్సర్లు పబ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే తాటతీస్తాం..
*బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత..
*బౌన్సర్లకు సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్*
???? పేద‌ల‌ను కేంద్రంగా చేసుకుని పార్టీలు ఇస్తున్న ఉచిత హామీల‌తో దేశం అల్ల‌క‌ల్లోలం అవుతోంద‌ని ఆర్బిఐ తెలి పింది. ఉచిత విద్యుత్తు, ఉచిత ప్ర‌జార‌వాణా(ఆర్టీసీ), ఉచిత వంట‌గ్యాస్ సిలిండ‌ర్లు, యువ‌త‌కు నిరుద్యోగ భృతి, రైతుల‌కు రుణ మాఫీ, పెట్టుబ‌డి సాయం, మ‌హిళ‌ల‌కు నిధులు.. ఇలాంటి వాటి వ‌ల్ల రాష్ట్రాల పెట్టు బ‌డి వ్య‌యం త‌గ్గిపోయిందని తెలిపింది. ఇది మున్ముందు కూడా సాగితే.. రాష్ట్రాలు మ‌రిన్ని అప్పులు చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలో వాటిని త‌క్ష‌ణ‌మే వ‌దిలి పెట్టేందుకు ప్ర‌య‌త్నించాల‌ని సుద్దులు చెప్పింది.
???? నెటిజ‌న్ల కామెంట్లు ఇవీ.. పేద‌ల‌కు ఉచితాలు, నిరుద్యోగుల‌కు భృతి ఇవ్వ‌డాన్ని త‌ప్పుబ‌ట్టిన ఆర్బీఐపై నెటిజ‌న్లు నిప్పులు చెరిగారు. 4 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ల రుణాలు మాఫీ చేస్తే ఏమీ కాదా?.. బడా కార్పొరేట్ల టాక్స్ తగ్గిస్తే ఏమీ కాదా? వాళ్లకు ఉచితంగా భూములు, బ్యాంకుల్లో డబ్బులు, మౌలిక సదుపాయాల పేరుతో అన్ని కట్టబెడితే ఏమి కాదా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నించారు. సమాజంలో చేయూత ఇవ్వాల్సిన మహిళలకు ఇస్తే మాత్రం వనరులు తగ్గిపోతాయా? పకృతి సంపదను కార్ఫోరేట్ సంస్థలకు అప్పన్నంగా అప్ప‌గిస్తే మాత్రం.. దేశానికి, రాష్ట్రాలకు ఏమీ కాదా? అని ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. కాగా, గ‌తంలో ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌గా రంగ‌రాజ‌న్ ఉన్న‌ప్పుడు కూడా.. ఉచిత ప‌థ‌కాలు ఇచ్చే రాష్ట్రాల‌కు అప్పులు ఇవ్వ‌డం త‌గ్గిస్తామ‌ని పేర్కొన్నారు. ఇది అప్ప‌ట్లో పెను దుమారానికి దారి తీసింది. ఆయ‌న మంచి సంస్క‌ర‌ణ‌లు చేయాల‌ని అనుకున్నా.. రాజ‌కీయ నేత‌లు ముందుకు సాగ‌కుండా.. కాళ్ల‌కు బంధం విధించార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి .
????ఐకాన్ స్టార్ ఐతే ఏంటి?.. సీఎంకు అల్లు అర్జున్ సారీ చెప్పాల్సిందే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీనటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదన్నారు. శనివారం మీడియా సమావేశంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా స్పందించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనడం హాస్యాస్పదం. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారని మండిపడ్డారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. త్వరలో సినీ ఇండస్ట్రీ పెద్దలతో భేటీ అయి చర్చిస్తామని మంత్రి తెలిపారు. మంచి సినిమాలు తీస్తే ప్రోత్సహిస్తాం.. సినీరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అల్లు అర్జున్ తప్పుబట్టడం సరికాదని.. అల్లు అర్జున్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలన్నారు. తొక్కిసలాటపై అసెంబ్లీ తన ఇమేజ్ దెబ్బతీశారని అల్లు అర్జున్ అంటున్నారు.. కానీ, సీఎం వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడలేదని.. ఆరోజు జరిగిన ఘటనను పూర్తిగా వివరించి చెప్పారన్నారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమయ్యాడని మంత్రి అన్నారు.
????పోలీసులు వద్దని చెప్పినా.. అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అల్లు అర్జున్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన వెళ్లి కనీసం బాధితులను పరామర్శించలేదని మండిపడ్డారు. అరెస్ట్ సమయంలో పోలీసులు ఎంతో సహనంతో వ్యవహరించారన్నారు. ఒక వ్యక్తి ప్రాణం పోవడం మామూలు విషయం కాదన్నారు. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయితే ఏంటీ? చట్టం ముందు అందరూ సమానులేనని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. స్టార్లకు ప్రత్యేక మినహాయింపులు ఏమీ ఉండవన్నారు. తప్పు చేస్తే నటుడికైనా.. ఎమ్మెల్యేకైనా శిక్ష తప్పదన్నారు.
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేస్తే కేటీఆర్,హరీశ్ రావు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. వారికి మెంటల్ బ్యాలెన్స్ తప్పిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఒక వ్యక్తి ప్రాణం పోతే అరెస్టు చేయరా? అని ప్రశ్నించారు. ఐకాన్ స్టార్? సూపర్ స్టార్ అయితే ఏంటని నిలదీశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. పుష్ప-2కు 2 నుంచి 3వేల కోట్లు వచ్చాయంటున్నారని… రేవతి కుటుంబానికి రూ. 20 కోట్లు ఇస్తే ఏంటని అన్నారు.
????బీడీ కార్మికులకు శుభవార్త*…
*తాడిపత్రి కడప రోడ్డులో 1994లో పట్టాలు పొందిన బీడీ కార్మికులకు శుభవార్త* గతంలో స్థలాలు రద్దు చేయడానికి YSRCP నాయకులు ప్రయత్నించగా మున్సిపల్ చైర్మన్ *జెసి ప్రభాకర్ రెడ్ది* గారు బీడీ కార్మికుల తరపున కోర్టుకి వెళ్లి స్థలాలు నిలబెట్టించారు. తాజాగా ఆ స్థలాల్లో పక్కా గృహాలు కట్టించేందుకు MLA *జెసి అష్మిత్ రెడ్డి* గారు శ్రీకారం చుట్టారు. కావున 1994లో పట్టాలు పొందిన బీడీ కార్మికులు తక్షణమే పట్టాతో పాటు సంబందించిన పత్రాలు ఇవ్వాలని తెలియజేశారు. పట్టా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కింది పత్రాలను రెండు రోజుల్లోగా MLA గారి కార్యాలయంలో అందజేయగలరు.
• దరఖాస్తు దారుని ఆధార్ కార్డు,
• రేషన్ కార్డు,
• ఇంటి స్థలం పత్రాలు లేదా డి.పట్టా లేదా స్థల ధ్రువీకరణ పత్రం,
• పాన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు,
• ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా పాసు పుస్తకం నకలు,
• దరఖాస్తుదారుని తల్లిదండ్రుల, భార్య, భర్తల ఆధార్ కార్డుల నకలు,
గమనిక : సమయం లేదు.. రెండు రోజుల్లో పత్రాలు ఇచ్చిన వారికి మాత్రమే ఇళ్లు మంజూరు అవుతాయి అన్న విషయం గమనించగలరు.
మరిన్ని వివరాలకు
కిరణ్ 7998799499,
జమీర్ 9985792111 ,
సోము 9441145966 లను సంప్రదించగలరు.
???? నేడు (22/12/2024) తాడిపత్రి పట్టణం, సంజీవ్ నగర్ లో వెలసిన గాయత్రి మాత ఆలయం వద్ద దాదాపు 5 కోట్ల వ్యయంతో కల్యాణ మండప నిర్మాణానికి భూమిపూజ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ జెసి ప్రభాకర్ రెడ్డి, జెసి ఉమమ్మ దంపతులు.ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు…
????ఏపీ లో కర్నూలు జిల్లాలో….కలకలం….క్లాస్‌రూమ్‌లో ఉండగానే టీచర్‌ కిడ్నాప్‌..కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసిన ***
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయ్యారు. క్లాస్‌రూమ్‌లో ఉండగానే దుండగులు కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. ఉదయం 10 గంటల నుంచి ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యుల ఆందోళనకు గురయ్యారు.
పోలీసులే కిడ్నాప్ చేసారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మునీర్ అహ్మద్ కిడ్నాప్ కావడం ఇది మూడవసారి అని కుటుంబ సభ్యులు అంటున్నారు.
కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుక 20 కోట్ల రూపాయల విలువ చేసే భూవివాదంలో కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. భూవివాదంపై మునీర్ అహ్మద్ ఫిర్యాదుదారుగా ఉన్నారు. భూమిపై హైకోర్టులో విచారణ కొనసాగుతోందని.. వెల్దుర్తి పీఎస్‌లో బాధితుని భార్య ఫిర్యాదు చేశారు.
మునీర్ అహ్మద్ సోదరుడు, రిటైర్డ్ ఎస్బీఐ అధికారి మక్బూల్ బాషా కూడా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
????అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి వ్యాపారులే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోయా రు. ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడు న్న వారు తీవ్ర భయాందో ళనలకు గురయ్యారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అన్నమయ్య జిల్లాలో ఇద్దరు పాత సామాన్ వ్యాపారులపై తుపాకులతో దాడి చేయడం సంచలనం కలిగించింది. పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే…
అన్నమయ్య జిల్లాలో ఇవాళ ఉదయం రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరిపై దుండగులు కాల్పులకు దిగారు. విచక్షణ రహితంగా తుపాకులతో దాడులకు పాల్పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
పాత సామాగ్రి వ్యాపా రులపై గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరపడంతో అన్నమయ్య జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దుండగుల కాల్పుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పోలీసులకు సమచారం అందండతో సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతు న్నారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వారి కదలికల కోసం దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాల్పులు జరిపిన ఇద్దరికి ఎవరితో నైనా గొడవలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నా రు. అసలు దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు. కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు జరుపుతున్నారు.
????వీళ్ళు మామూలోలు కాదు బాబోయ్…… ఇన్స్‌పెక్టర్‌కే టోకరా ఇచ్చిన సైబర్ నేరగాళ్లు..!*
ఇటీవల కాలంలో నెట్టింట్లో బూచోళ్లు ఎక్కువయ్యారు. అడ్డమైన లింకులు పెట్టి, డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో అడ్డంగా దోచుకుని సైబర్ ముఠాలు.. వైఫైలా మన చుట్టూరా ఉన్నాయి. అలాంటి వాళ్ల ఉచ్చులో పడుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
విజయవాడకు చెందిన ఒక సీఐ వ్యక్తిగత పనుల మీద ముంబై వెళ్లారు.
అక్కడ ఒక హోటల్లో ఆధార్‌ కార్డు, ఫోన్ నెంబర్ ఇచ్చి గదిలోకి దిగారు. ఐదు రోజుల తర్వాత డిసెంబర 19వ తేదీన గురువారం విమానంలో విజయవాడకు వచ్చేశారు. శుక్రవారం ఉదయం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. మీరు ముంబై వచ్చారా అని ఆరా తీశారు. అక్కడ ఒక రోడ్డు యాక్సిడెంట్ చేశారని.. మీ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడని బెదిరించడం ప్రారంభించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే ఎన్నో కేసులను డీల్ చేసిన సీఐకే అదే తరహా ఫోన్ రావడంతో కంగుతిన్నారు. ఫోన్ చేసిన వ్యక్తికి తనదైన శైలిలో ప్రశ్నలు వేసి క్లాస్ తీసుకోవడంతో నేరగాళ్లు ఫోన్ పెట్టేశారు.
మాస్డ్క్ ఆధార్ ఇస్తే మేలు.. హోటల్లో ఇస్తున్న ఆధార్ కార్డు ఇతర వివరాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయనటానికి ఇది ఒక ఉదాహరణ. ప్రతి ఒక్కరూ మాస్డ్క్ ఆధార్ కార్డు ఇస్తే బాగుంటుందని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్ కార్డులోని 12 అంకెల స్థానంలో చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి మిగిలిన వాటి స్థానంలో ఎక్స్ గుర్తు ఉంటుంది. ఇలాంటి ఆధార్ కార్డులతో చాలా వరకు మోసాలు నివారించవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో బ్యాంకింగ్, ఆధార్ నెంబర్లతో సంబంధంలేని ఫోన్ నెంబర్లు ఇస్తే మేలని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.
???? హాస్పిటల్లో ఉన్న శ్రీతేజను చిరంజీవి ఎందుకు పరామర్శించట్లేదు
సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం ఇలాగే మానవత్వం లేకుండా ఉంటారా – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
???? ఇమామ్‌కు రూ.10,000.. మౌజన్‌కు రూ.5,000 గౌరవ వేతనం చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు
???? ప్రకాశం జిల్లా శిoగరాయకొండ మండలం పాకలలో రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలు ప్రారంభించిన మంత్రి డా. డోలా …
వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న 400 మంది పాఠశాల, ఇంటర్ విద్యార్థులు…వైసీపీ హయాంలో క్రీడల్ని, క్రీడాకారులను పట్టించుకున్న పాపాన పోలేదు…మేం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందిస్తాం…జిల్లాలో ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాల నిర్మాణాలు పూర్తి చేస్తాం …సింగరాయకొండ గురుకుల పాఠశాలలో రూ. 95 లక్షలతో ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నాం…దివ్యాంగుల కోసం రూ.200 కోట్లతో విశాఖలో 20 ఎకరాల్లో స్టేడియం నిర్మిస్తున్నాం…
పేద కుటుంబాల్లోని మెరికల్లాంటి క్రీడాకారుల్ని వెలికితీసి ప్రోత్సాహిస్తాం…డా.డోలా శ్రీ బాలవీరాంజ నేయస్వామి
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్