అదానీ ప్రయోజనాల కోసమే.. రాహుల్ గాంధీ– సెబీ చైర్‌పర్సన్‌ మాధవి బచ్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ఆరోపణలు..వైయస్ కుటుంబ అక్రమ ఆస్తులు ప్రజలకు పంచాలి..మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు ..కాలం చెల్లిన మందులు!!!..ఫిజీషియన్ల శాంపిళ్ల విక్రయాలు.. లారెన్స్ బిష్ణోయ్ హత్యకు ప్లాన్..సైబర్ మాయాజాలంలో 72 లక్షలు పోగొట్టుకున్న గుత్తి కి చెందిన ఓ ఉద్యోగి.. ఎస్సై వేధిస్తున్నాడని చిరు వ్యాపారి ఆత్మహత్యాయత్నం!.

???? వైయస్ కుటుంబ అక్రమ ఆస్తులు ప్రజలకు పంచాలి..మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు …వైఎస్ జగన్, షర్మిల, విజయమ్మ మధ్య కుటుంబ కలహం ఉంది.దీంతో ఏం రాజకీయ పార్టీ కి సంబంధం లేదు.కొన్ని మీడియాల్లో టీడీపీ,జనసేన , బీజేపీ సంబంధం ఉందనడం కరెక్ట్ కాదు.
తల్లి బిడ్డల మధ్య ఉన్న వివాదం రాష్ట్ర ప్రజల మధ్యకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ లో 10 ఏళ్ళ పాటు మంత్రిగా పని చేశాను.కుటుంబ కలహం, పార్టీల భవిష్యత్ నడివీదికి తీసుకువచ్చి పార్టీల మనుగడ ప్రశ్నార్థకం చేశారు.
రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలోని జగన్ లక్ష కోట్లు సంపాదించాడని అభియోగాలు ఉన్నాయి.

????రాజశేఖర్ రెడ్డి హయాంలో వేలకోట్లు జగన్ దోచుకున్నాడు అంటే…. అందులో రాజశేఖర్ రెడ్డి పాత్రని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కుటుంబ సమస్యని రాజకీయ సమస్యగా మార్చి… ఆస్తులు ఎవరికి రావాలి… అధికారం ఎవరికి రావాలి అని ప్రశ్నించుకుంటూ వీధిన పడ్డారు.
జగన్, షర్మిల, విజయమ్మ ముగ్గురూ వీధిన పడ్డారు.
????ముగ్గురి దగ్గర ఉన్న అక్రమ సంపాదన ప్రజలకు పంచాలి.
అక్రమ సంపాదన వాళ్లే పంచుతారా… లేక కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి పంచుతుందా..అన్నది తేలాలి.
????మా ఆస్తులు మైనస్ కి వెళ్తుంటే… వైయస్ కుటుంబం ఆస్తులు తరతరాలు తిన్న తరగని విధంగా పెరిగాయి.
దోపిడీదారుల దగ్గర ఉండలేక ధనలక్ష్మి బయటకు వస్తుంది.
????మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చారు.
రాబోయే ఐదేళ్లలో ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయింపు జరుగుతుంది.
ప్రకాశం జిల్లాలోని తాగునీటి ప్రాజెక్టులు వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి అయ్యాయి.సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.కూటమిలో ఉన్న మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళుతున్నాయన్నారు.
????చిరు వ్యాపారి ఆత్మహత్యాయత్నం*
వరంగల్: అర్ధరాత్రి మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో చిరు వ్యాపారి ఆత్మహత్యాయత్నం.ఎస్ ఐ విటల్ వేధిస్తున్నాడంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని స్టేషన్ లో ఆత్మహత్యయత్నం.పెట్రోల్ బాటిల్ లాక్కున్న సిబ్బంది ప్రధమ చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలింపు.ఆటోనగర్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న చిరు వ్యాపారి శ్రీధర్.గత నెల రోజుల నుండి ఎస్ఐ విట్టల్ వేధిస్తున్నాడంటూ ఆరోపణ.
** అదానీ ప్రయోజనాల కోసమే..రాహుల్ గాంధీ– సెబీ చైర్‌పర్సన్‌ మాధవి బచ్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ఆరోపణలు
న్యూఢిల్లీ : సెబీ చైర్‌పర్సన్‌ మాధవి బచ్‌పై కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ మరోసారి ఆరోపణలు గుప్పించారు. అదానీ ప్రయోజనాల కోసం ఆమె పని చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు రాహుల్‌ ఒక వీడియోను విడుదల చేశారు. ”చిన్న ఇన్వెస్టర్లకు రక్షణగా నిలవాల్సిన మాధవి బచ్‌.. అక్రమాలకు పాల్పడుతూ అదానీ ప్రయోజనాలను పరిరక్షిస్తున్నారు.
అదానీ సంస్థల విలువలను అమాంతం పెంచేందుకు ఉపయోగ పడటమే కాకుండా.. ఆ సంస్థల విస్తరణకూ మాధవి బచ్‌ పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ఆమె అక్రమాలు ఊహించిన దాని కన్నా.. చాలా అధికంగా ఉన్నాయి. మోడీ సర్కారు దేశ సంపదంతా కొందరి వద్దే పోగుపడేలా చేసింది.వ్యవస్థల విధ్వంసమే మరింత ప్రమాదకర రూపంలో ఆశ్రిత పెట్టుబడిదారులకు అవకాశాలను కల్పిస్తున్నది.మాధవి బచ్‌ను శిక్షించకుండా రక్షిస్తున్నది ఎవరు?” అని రాహుల్‌ ప్రశ్నించారు.మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాల కారణంగానే ఆమె సెబీ చైర్‌పర్సన్‌ పదవీలో ఉన్నారని తెలిపారు.ఆమె అక్రమాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే,మీడియా ప్రశ్నించటం లేదనీ,ఇటు ప్రభుత్వమూ ఆమెపై చర్యలు తీసుకోవటం లేదన్నారు.మాధవీ బచ్‌ లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే..
** కాలం చెల్లిన మందులు!!!..ఫిజీషియన్ల శాంపిళ్లు.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రయివేటు మెడికల్‌ షాపుల దందా.. డీసీఏ దాడుల్లో విస్తుపోయే నిజాలు???????????? .. షోకాజ్‌ నోటీసులు జారీ.. హైదరాబాద్‌
ప్రభుత్వాస్పత్రుల ప్రాంగాణాల్లో కొలువుదీరిన ప్రయివేటు మెడికల్‌ షాపుల్లో కాలం చెల్లిన మందులు బయటపడ్డాయి. ఫిజీషియన్‌ శాంపిళ్లు ఆ మెడికల్‌ షాపుల్లో దర్శనమిచ్చాయి. నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్న ఆ మెడికల్‌ షాపులపై డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు జరిపిన దాడుల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని పలు ఆస్పత్రుల్లోని ప్రయివేటు మెడికల్‌ షాపులపై ఏకకాలంలో దాడులు చేశాయి. 15 మెడికల్‌ షాపులకు షాకాజ్‌ నోటీసులను జారీ చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాంగణంలోని వైష్ణవి మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, జీవన్‌ ఉష స్రవంతి జెనరిక్‌ మెడికల్‌ స్టోర్స్‌, కులీ కుతుబ్‌ షా మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, జీవన్‌ ధారా ఫార్మసీ, అమ్రిత్‌ ఫార్మసీ (హెచ్ఎల్ఎల్‌ లైఫ్‌ కేర్‌ లిమిటెడ్‌ యూనిట్‌), నిలోఫర్‌ ఆస్పత్రిలో ప్రాంగణంలోని సాయి ఫార్మసీ కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌, అమ్రిత్‌ ఫార్మసీ, పెట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి ప్రాంగణంలోని జన జీవనీ జ్యోతి స్టోర్స్‌పై దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్‌లో గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో తిరుమల మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, శ్రీసాయి మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, జీ.పీ.మొహిత్‌ మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలో ప్రజారోగ్య ఫార్మసీ (ఉమెన్‌ మెడికల్‌ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌) అమ్రిత్‌ ఫార్మసీ (హెచ్ఎల్ఎల్‌ లైఫ్‌ కేర్‌ లిమిటెడ్‌ యూనిట్‌), రాణి రుద్రమ దేవి జీవన్‌ ధారా ఫార్మసీ తో పాటు కరీంనగర్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ జీవన్‌ ధారా ఫార్మసీ (జెనెరిక్‌ మెడికల్‌ షాప్‌ ), ప్రజారోగ్య ఫార్మసీ (ఉమెన్‌ మెడికల్‌ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌)లలో దాడులు చేసిన తనిఖీలు చేశారు. మెడికల్‌ షాపులపై దాడుల్లో ఈ దుకాణాలు అనేక విధాలుగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు బయట పడిందని డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌ వీ.బీ.కమలాసన్‌ రెడ్డి తెలిపారు. మెడికల్‌ ప్రాక్టీషనర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మందుల అమ్మకం, రిజిస్టర్డ్‌ ఫార్మాసిస్ట్‌ లేకపోవడం, షెడ్యూల్డ్‌ డ్రగ్స్‌కు సంబంధించిన రిజిస్టర్లు లేకపోవడం, సేల్స్‌ అండ్‌ పర్చేస్‌ బిల్లులను చూపించ లేకపోవడం, స్టోరేజ్‌ కండీషన్ల మేరకు మందులను స్టోర్‌ చేయకపోవడం, ఫిజిషియన్ల శాంపిళ్లు, ప్రభుత్వ సరఫరా మందులు, కాలం చెల్లిన మందులున్నట్టు దాడుల్లో వెల్లడైంది. షోకాజ్‌ నోటీసులకు సంబంధిత మెడికల్‌ షాపుల యాజమా న్యాలు వివరణ ఇచ్చిన తర్వాత డ్రగ్స్‌ రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని కమలాసన్‌ రెడ్డి పేర్కొన్నారు.
???? సైబర్ నేరగాళ్ల మాయాజాలంలో 72 లక్షలు పోగొట్టుకున్న గుత్తి కి చెందిన ఓ ఉద్యోగి.. అనంతపురం జిల్లా.. సైబర్ నేరాళ్ల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది! పైగా పోలీసులు పరిష్కారాలు కనుగొనే కొద్దీ సరికొత్త దారులు వెతుకుతూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇందులో భాగంగా… తాజాగా అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.ఈ మాయంలో పడి ఓ ఉద్యోగి రూ.72 లక్షలు పోగొట్టుకున్నాడు. అవును… అప్రమత్తంగా ఉంటూ, ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పోలీసులను ఆశ్రయించాలని చెబుతున్నా.. వీటి బారిన పడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్ కు చెందిన షేక్ మహమ్మద్ వలీ సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ. 72 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇతడు రైల్వే గార్డుగా పని చేస్తున్నాడు. అసలేం జరిగిందంటే… ఇటీవల ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు, సీబీఐ అధికారులమని చెప్పి మహమ్మద్ వలీకి ఓ వీడియో కాల్ వచ్చింది.. ఆ ఫోన్ సైబర్ నేరగాళ్లదని అప్పటికి వలీ గ్రహించలేకపోయాడు. ఈ సమయంలో.. ముంబై బాంబు బ్లాస్ట్ ఘటనలో నీ పేరు ఉందని వలిని బెదిరించారు సైబర్ నేరగాళ్లు. వెంటనే అరెస్ట్ చేయకుండా ఉండాలంటే కొంత డబ్బు పంపాలని బెదిరించారు. ఈ క్రమంలో.. పలు దఫాలుగా రూ.72 లక్షల సొమ్మును కొట్టేశారు. ఇంత పోగొట్టుకున్న తర్వాత గ్రహించాడో ఏమో కానీ… తాను సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు చెబుతూ గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మహమ్మద్ వలి. ఈ సందర్భంగా స్పందించిన వలీ… తన కూతుళ్ల పెళ్లిళ్ల కోసం దాచిపెట్టుకున్న డబ్బులు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారని వాపోతున్నారు! దీంతో… ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
????ఈసారి రివర్స్… లారెన్స్ బిష్ణోయ్ హత్యకు ప్లాన్.. వివరాలివే! దీంతో.. లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోసారి చర్చనీయాంశం అయ్యింది. ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే.
దీంతో.. లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోసారి చర్చనీయాంశం అయ్యింది. దీనితో పాటు బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపులతో పాటు బాబా సిద్ధిఖీ కుమారుడికి బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయని అంటున్నారు. దీంతో.. పోలీసులు ఈ గ్యాంగ్ పై పూర్తి దృష్టి సారించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారని అంటున్నారు. ఈ మేరకు ఈటీవల ఈ గ్యాంగుకు సంబంధించి ఏడుగురు షూటర్స్ ని అరెస్ట్ చేసినట్లు కథనాలొచ్చాయి. అయితే… ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ ని చంపడానికి మరో గ్యాంగ్ స్టర్ ప్లాన్ చేశారనే విషయం తెరపైకి వచ్చింది.
లారెన్స్ బిష్ణోయ్ హత్యకు మరో గ్యాంగ్ నాయకుడు కుట్ర పన్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా… క్రిమినల్ ముఠా బంబిహా నాయకుడు తన గ్యాంగ్ పలుకుబడిని పెంచుకోవడం కోసం బిష్ణోయ్ అడ్డం గొలగించుకోవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. దీనికోసం బంబిహా ముఠా నాయకుడు కుశాల్ చౌధ్రీ తన అనుచరుడు పవన్ షూకీన్ అలియాస్ సోనూతో కలిసి ఓ పథకం పన్నినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికోసం పవన్ ఇద్దరు షార్ప్ షూటర్స్ ని పురమాయించినట్లు చెబుతున్నారు. వీరిద్దరూ ఓ వ్యాపారవేత్త ఇంటివద్ద రెక్కీ నిర్వహించి కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. అనంతరం అతడి నుంచి రూ.15 కోట్లు డిమాండ్ చేశారని.. అయితే అంత మొత్తం చెల్లించడానికి సదరు వ్యాపారవేత్త అంగీకరించారని చెబుతున్నారు. అయితే..ఈ లోపు ఆ ఇద్దరు షూటర్స్ ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఆ ఇద్దరినీ విచారించగా.. లారెన్స్ బిష్ణోయ్ హత్యకు చేసిన ప్లాన్ విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. ఈ సందర్భంగా…లారెన్స్ బిష్ణోయ్ ని చంపేందుకు జైల్లో ఉన్న కుశాల్ చౌద్రీ ప్లాన్ చేస్తున్నాడని..దానికోసమే డబ్బులు సమీకరించేందుకు ఆ వ్యాపరవేత్తను బెదిరించినట్లు గుర్తించారని అంటున్నారు. మరోపక్క కుశాల్ ను చంపాలని లారెన్స్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. ఇటీవల సబర్మతీ జైల్లో అతడిని ప్రశ్నించినప్పుడు.. అతడి హిట్ లిస్ట్ లో ఉన్నవారిలో బంబిహా గ్యాంగ్ నాయకుడు కూడా ఉన్నట్లు చెప్పాడని అంటున్నారు.దీంతో ఇప్పుడు ఈ గ్యాంగ్ స్టర్స్ మర్డర్ ప్లాన్స్ వైరల్ గా మారాయి!!

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!