????పొమ్మనలేక పొగ”… కార్పొరేట్ రంగంలో ఏమిటీ కొత్త ట్రెండ్? అయితే.. ఇప్పుడు ఆ హెచ్చరికలు నిజమవుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచమంతా అవలంబిస్తోన్న విధానమే ఈ సైలంట్ ఫైరింగ్! కార్పొరేట్ రంగంలో ఎప్పటికప్పుడు కొన్ని కొత కొత్త పదాలు పుట్టుకొస్తుంటాయనే సంగతి తెలిసిందే. అనంతరం ఇవి సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ లో చేరి, వైరల్ గా మారుతుంటాయి. మూన్ లైంటింగ్, క్వైట్ క్విట్టింగ్ వంటివి ఈ కోవలోకి వచ్చేవే. ఈ సమయంలో తాజాగా “సైలెంట్ ఫైరింగ్” అనే పదం ఒకటి ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. అవును… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వస్తే చాలా రంగాల్లో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే హెచ్చరికలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆ హెచ్చరికలు నిజమవుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచమంతా అవలంబిస్తోన్న విధానమే ఈ సైలంట్ ఫైరింగ్! .. ఒక్క మాటలో చెప్పాలంటే… పొమ్మనలేక పొగబెట్టడాన్నే సైలంట్ ఫైరింగ్ అంటారు. కంపెనీలు ఉద్యోగులకు తమ విధులను కష్టతరం చేసి, వారంత వారే జాబ్ కి రిజై న్ చేసేలా చేయడమే ఈ సైలంట్ ఫైరింగ్ అసలు ఉద్దేశ్యం అన్నమాట. అలా సదరు ఉద్యోగులు జాబ్ కి రిజైన్ చేసిన తర్వాత.. వారి స్థానంలో ఏఐని భర్తీ చేయాలనేది యాజమాన్యాల ఆలోచన అట! మరోవైపు ఏఐ తమ ఉద్యోగాలను ఎక్కడ భారీ చేసేస్తుందో అనే ఆందోళనతో చాలా మంది పనిపై కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారని.. సుమారు 10 మందిలో ముగ్గురు ఉద్యోగులు ఈ ఆందోళనల కారణంగా పనిలో నిమగ్నం కావడం లేదని అంటున్నారు. ఈ విధయంగా ఏఐ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పలువురు ఉద్యోగుల జీవితాల్లో నిప్పు పెట్టేస్తోందని తెలుస్తోంది!
????ఒంగోలు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు మరియు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఎన్.ఎస్.పీ. గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా,ఎస్పీ. ఏ.ఆర్. దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ తో మంత్రి చర్చించారు.
???? వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ
????తిరుపతిలో ఎక్స్ పైర్ డేట్ దాటిన మద్యం అమ్మకాలు..!
తిరుపతిలో దారుణాలు జరుగుతున్నాయి. తిరుపతిలో ఎక్స్ పైర్ డేట్ దాటిన మద్యం అమ్మకాలు..జోరుగా కొనసాగుతున్నాయి. తిరుపతిలోని శిల్పారామం ఆవరణంలోని ఓ మద్యం షాపులో కాలం చెల్లిన మద్యం విక్రయాలు జరుగడం తాజాగా వెలుగు లోకి వచ్చింది. ప్రశ్నించిన కస్టమర్లపై నిర్వాహకులు దురుసు ప్రవర్తనతో రెచ్చిపోయారు. అనంతరం ఎక్సైజ్ సిబ్బందికి వినియోగదారులు..ఫిర్యాదు చేశారు. దింతో మద్యం దుకాణంలో ఎక్సైజ్ శాఖ తనిఖీలు నిర్వహించింది. మద్యం సిండికేట్ లో కీలక సభ్యుడిగా లిక్కర్ షాపు నిర్వాహకుడు ఉన్నాడు. గతంలో ఓ మాజీ మంత్రి పేరుతో దందాలు కూడా చేసాడట.
????ఉద్యోగం ఇప్పిస్తానని 3.08 లక్షల నిలువు దోపిడీ…
జోగులాంబ గద్వాల జిల్లాలోని వెంకంపేటలో ఘటన…
గత కొన్ని రోజుల క్రితం వైద్య విభాగంలో ఉద్యోగ్యం ఇప్పిస్తానని ఇద్దరికీ టోకరా…
గద్వాల మండలంలోని వెంకంపేట గ్రామంలోని యువరాజు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఇద్దరితో ఉద్యోగం ఇప్పిస్తానని ఒకరితో 2.50 లక్షలు మరొకరితో 58 వేలు..
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు…
????ఉమ్మడి నెల్లూరు జిల్లా…చిల్లకూరు మండలం*
*అక్రమ సంబంధం కోసం,ఆస్తి కోసం 11 ఏళ్ల లాసిక్ ను ఉప్పుటేరు లో తోసి చంపేశారు
????ఈనెల 7వ తేదీన చిల్లకూరు మండలం వరగలి గ్రామం వద్ద 11 ఏళ్ల లాసిక్ అనే బాలుడు ఉప్పుటేరు లో శవమై కనిపించిన వైనం..*అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొన్న చిల్లకూరు పోలీసులు…
దర్యాప్తు చేపట్టి బాలుని మృతి హత్య గా నిర్దారించిన పోలీసులు…అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడనే కారణం తోనే బాలుడిని కాలువలో వేసి చంపేసిన కాతారి అనిల్ అనే వ్యక్తి,సహకరించిన చరణ్..
లాశిక్ ను చంపేస్తే అక్రమసంబంధం సాఫీగా సాగుతుంది ఆస్తి కూడా వస్తుందిని పథకం ప్రకారం హత్య చేసిన నిందితుడు…కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన గూడూరు డీఎస్పీ వెంకట రమణ…
????టిడిపిలో వర్గ పోరు*
*కడప జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని రామాపురం గ్రామంలో టిడిపిలోని అంతర్గత వర్గ పోరు బయటపడింది.*
రామాపురం గ్రామానికి చెందిన గురువిరెడ్డి అలియాస్ గురవయ్య అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన సురేంద్ర అనే వ్యక్తి రాళ్లతో దాడి చేసి గాయపరిచాడు.
గురువు రెడ్డి చాలా ఏళ్లుగా టిడిపిలో వరదరాలరెడ్డి వర్గంలో ఉంటున్నాడు.
సురేంద్ర గత ఎన్నికల ముందు వైసీపీ నుండి టిడిపిలోకి మారాడు. ఇవాళ ఉదయం గురు రెడ్డి తన పొలంలో పనిచేసుకుంటూ ఉండగా సురేంద్ర అనే వ్యక్తి ఇసుక తవ్వుకునే క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ గొడవలో ఇరువురు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో గురువయ్య కు అతని బంధువులకు తలకు తీవ్ర గాయాలు కాగా సురేంద్రకు కూడా తలకు గాయమైంది. ఇరువురు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
గాయపడిన గురువయ్యను ఎమ్మెల్యే వదలాల్ రెడ్డి పరామర్శించారు.దాడి చేసుకున్న ఎయిర్ వర్గాలపై ప్రభుత్వ ఆసుపత్రిలోని అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసి విచారణ చేపట్టారు
????కడప జిల్లా..జమ్మలమడుగు మండలంలో వైస్సార్సీపీ , బిజెపి వర్గాల మధ్య ఘర్షణ..జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరు గ్రామంలో వైయస్సార్సీపి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ
గొడ్డలి, వేట కొడవళ్ళతో పరస్పర దాడులు ఏడుగురికి గాయాలు,ఇద్దరి పరిస్థితి విషమం.. భూతగాదా విషయంలో ఇరు వర్గాలు ఘర్షణ పడినట్లు సమాచారం ..గాయపడిన వారిని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలకు తరలింపు.. గాయపడిన బాధితులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ..గతంలో జరిగిన గొడవలను పోలీసులు పూర్తిస్థాయిలో పరిష్కరించకపోవడంతోనే ఈ దాడులకు కారణమని ఆరోపించిన ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి
????ఎక్సైజ్ అధికారి ప్రభు వినయ్ సస్పెండ్..!!!
*వనపర్తి అక్టోబర్ 30 (జోగుళాంబ ప్రతినిధి)*:-జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..ప్రభు వినయ్ కుమార్ గత 4 నెలల నుంచి విధులకు హాజరు కాకుండా హాజరు రిజిస్టర్ , ఫైళ్లను ఇంటివద్దకే తెప్పించుకుని సంతకాలు చేస్తూ.. జీతం తీసుకుంటున్నాడని, సర్వీస్ రిజిస్టరులో పుట్టినతేదీ మార్చుకుని, చట్టవిరుద్ధంగా సర్వీస్ పొడిగించుకోవటంతో పాటు ..సీనియారిటీ లిస్టులో అక్రమాలకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.ల్పడ్డారని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ వనపర్తి జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఫిర్యాదు చేశాడు . ఫిర్యాదు చేయడంతో ప్రభు వినయ్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపిన అధికారులు అతని సస్పెండ్ చేశారు. తన ఫిర్యాదుపై స్పందించి ప్రభు వినయ్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వానికి ఈ సందర్బంగా రాచాల కృతజ్ఞతలు తెలిపారు
????ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ (RSASTF)కొవ్వొత్తుల ర్యాలీతో అమర వీరులకు టాస్క్ ఫోర్సు నివాళి..తిరుపతి..
అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు బుధవారం ఘనంగా నివాళులర్పించారు. 
టాస్క్ ఫోర్స్ ఇంచార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలు మేరకు ర్యాలీని టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ ప్రారంభించారు. టాస్క్ ఫోర్సు కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ నంది సర్కిల్ మీదుగా వెళ్లి తిరిగి టాస్క్ ఫోర్సు కార్యాలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పీ.శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అమర వీరులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారు చేసిన త్యాగాల ఫలితంగానే ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతున్నారని గుర్తు చేశారు. ర్యాలీలో అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో ఏసీఎఫ్ శ్రీనివాస్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ, ఎఫ్ఆర్ఓలు, ఆర్ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
???? భీమా చెక్ అందజేత .. ప్రకాశం జిల్లా అర్ధవీడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు శాఖ ఆధ్వర్యంలో పిఎం జేజే వై పథకం ద్వారా అర్ధవీడు గ్రామానికి చెందిన ఎస్ కే భయ్యన్న రెహమాన్ భాషా ఇటీవల మృతి చెందాడు.మృతుడు ఎపిజిబి బ్యాంకులో భీమా సౌకర్యం ఉన్నందునా బుధవారం రెండు లక్షల చెక్ ను మృతుని భార్యయైన షెహనాజ్ కు బ్యాంకు మేనేజర్ భద్రీనాద్ అందజేశారు.అనంతరం మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకులో ఖాతా ఉన్నవారు పి ఎం జెజె వై, పిఎంఎస్ బివై పథకం ద్వారా భీమా చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మణికంఠ, ఆశీస్,మెసెంజర్ రవి పాల్గొన్నారు.
????ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో రాత్రి 11.30 సమయంలో కృష్ణ థియేటర్ వద్ద ఉన్న sbi atm ను పగులగొట్టి నగదు చోరికి ప్రయత్నించిన దొంగ* .
బ్యాంక్ అధికారుల నుండి పోలీసులకు సమాచారం రావటంతో వెంటనే దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
???? కడప ఆర్టీవో ఆఫీస్ లో బ్రేక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న విజయ భాస్కర్ రాజు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉండడంతో తిరగబడిన కొంతమంది డ్రైవర్.
ఏం చేయాలో దిక్కుతోచగా పరుగులు పెట్టిన విజయ భాస్కర్ రాజు. దీంతో కడప ఆర్టీవో ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైంది.
ఇంకా భారీ స్థాయిలో కడప ఆర్టిఓ ఆఫీస్ లో వాహనదారులను పట్టిపీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కొంతమంది డ్రైవర్లు. నిత్యం ఏదో ఒక సాకుతో తమ వాహనాలకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని డబ్బులు ముట్ట చెప్పితే గాని వాహనాన్ని వదిలిపెట్టడం లేదని డ్రైవర్లు ఆవేదన.
ఇంత నీచమైన అధికారులను ఎక్కడ చూడలేదని తీవ్ర ఆగ్రహం.

????ఒంగోలు మాగుంట కార్యాలయంలో పార్లమెంటరీ ఎన్ డి ఏ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి , జిల్లా ఒంగోలు మేయర్ గంగాడ సుజాత , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ ,మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య , ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు , దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి , మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి , గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి , సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్.విజయ్ కుమార్ ,కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు , టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ , 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంక దినకర్ , జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ,జనసేన వీర మహిళా రాయపాటి అరుణ , బిజెపి నాయకులు
తిరుపతిలో ఎక్స్ పైర్ డేట్ దాటిన మద్యం అమ్మకాలు!..కడప జిల్లా రామాపురం పెద్ద దండూరు లో వర్గ పోరు..బ్రేక్ ఇన్స్పెక్టర్ అక్రమ వసూళ్లు..ఎన్ డి ఏ సమన్వయ కమిటీ సమావేశం..ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ కొవ్వొత్తుల ర్యాలీ..అర్ధవీడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు శాఖ ఆధ్వర్యంలో చెక్ అందజేత..ఎక్సైజ్ అధికారి ప్రభు వినయ్ సస్పెండ్..పొమ్మనలేక పొగ”… కార్పొరేట్ రంగంలో ఏమిటీ కొత్త ట్రెండ్?.
Recent Posts

