????తెలంగాణలో వెలుగులోకి మరో స్కామ్.. ఏసీబీకి మున్సిపల్ శాఖ ఫిర్యాదు*
హైదరాబాద్.. పార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి నిధుల గోల్‌మాల్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం జరిపిన కేటాయింపులపై ఏసీబీకి మున్సిపల్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని మున్సిపల్ శాఖ కోరింది. కోట్లల్లో నిధులు బదిలీలు జరగడంపై మున్సిపల్ శాఖ విచారణ కోరింది. నిబంధనలు పాటించకుండా ఎమ్‌ఏయూడీ నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓకు రూ. 55కోట్ల చెల్లింపులు జరిగాయి. ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పాటించకపోవడంతో ఫార్ములా ఈ రేసింగ్ సెషన్ -10 రద్దు అయ్యింది. బోర్డు, ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రూ.55 కోట్లు విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులు జరిగాయి.
కాగా.. గత ఏడాది ఫిబ్రవరి-11న హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కి.మీ. ట్రాక్‌లో మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీ జరిగింది. సీజన్-9 ఫార్ములా-ఈ రేస్ నిర్వహణకు రూ.200 కోట్లు ఖర్చయింది. ఇందులో ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌కో రూ.150కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30 కోట్లు ఖర్చుచేశాయి. రహదారులు, ఇతర మౌలిక వసతులకు హెచ్‌ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. ఇది విజయవంతం కావడంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి (సెషన్-10) నిర్వహించేందుకు ఫార్ములా-ఈ ఆపరేషన్(ఎఫ్‌ఈవో)తో ఎంఏయూడీ 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది.
ఈ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గా ఉండి.. ఖర్చంతా ప్రైవేటు సంస్థలైన గ్రీన్కో, ఫార్ములా-ఈనే భరించాల్సి ఉంది. కానీ.. గత సీజన్‌లో ప్రధాన భాగస్వామిగా ఉన్న గ్రీన్కో సంస్థను తొలగించి దానిస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేలా సీనియర్ ఐఏఎస్ ఒకరు సొంత నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అటు ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా, కనీసం ఆర్థికశాఖ దృష్టికి తీసుకెళ్లకుండానే ఆ ఉన్నతాధికారి ఈవెంట్ నిర్వహణకు హెచ్‌ఎండీఏ నుంచి రూ. 55 కోట్లు ముందస్తు చెల్లింపులు చేశారు.
ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయి డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్ రేస్ నుంచి తప్పుకొంటున్నట్లు అదే నెలలో ఎఫ్‌ఈవో ప్రకటించింది. అనంతరం ‘సెషన్-10’ రద్దయింది. ఫిబ్రవరి 10న ఈవెంట్ జరిగి ఉంటే హెచ్‌ఎండీఏపై రూ.200 కోట్ల భారం పడేది. కానీ, ఇంతలో విషయం బయటపడడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఫార్ములా-ఈ రేసుపై చట్టవిరుద్ధంగా నిర్ణయం తీసుకున్న అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు కూడా జారీ చేశారు. ఇదిలాఉండగా.. ఈ రేసింగ్‌లో నిధుల గోల్‌మాల్ అంశంపై విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. మరి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.. కేపి
????కాటేసిన కన్న తండ్రి.. సొంత కూతురు, కొడలిపై అత్యాచారం..
ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. మానవ సంబంధాలు మంటగలిపేలా ఓ వ్యక్తి మైనర్లయిన కన్న కూతురు, మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 19న ఇంట్లో అత్యాచారానికి పాల్పడ్డాడని, 21న కలప కోసం అడవికి తీసుకెళ్లి మరోసారి అత్యాచారం చేశాడని కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు నిందితుడు తన మేనకోడలిపై అక్టోబర్ 21 అత్యాచారం చేసినట్లు తెలిసింది. నిందితుడు 2020లో అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి ఇటీవల పెరోల్‌పై రిలీజ్ కావడం గమనార్హం.
????దీపావళి నేపథ్యంలో వాయుకాలుష్యం నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకటించిన దియాజలావ్ కార్యక్రమం తరహాలో రాష్ట్రంలోనూ ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు. హోంమంత్రి అనిత మంగళవారం పవన్ కల్యాణ్‌ను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఇరువురూ చర్చించారు. పర్యావరణహితంగా దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు
????భూ కబ్జాదారుల నుంచి తమ భూముల్ని విడిపించి, న్యాయం చేయాలని పలువురు బాధితులు టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. సహకార సంఘం నిధులు దుర్వినియోగం చేసిన అధికారిపై విచారణ జరపాలని, కెపాసిటీ బిల్డింగ్ సెంటర్స్ నిర్వహణ బిల్లులు విడుదల చేయాలని మరికొందరు కోరారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీహెచ్‌సీ చైర్మన్ తాతయ్య, తెలుగు రైతు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై అధికారులకు మంత్రి ఫోన్ చేసి, చర్యలకు ఆదేశించారు. ఒక దివ్యాంగుడికి వీల్‌చైర్ అందించారు. వీఆర్వో నకిలీ రికార్డులు సృష్టించి, తమ భూమిని కొట్టేయాలని చూసి, తమను పోలీసులతో బెదిరిస్తున్నారని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన సొట్టా నరసింహులు వాపోయారు. కాగా, టీడీపీ కేంద్ర కార్యాలయంలో 31న ప్రజావేదిక కార్యక్రమాన్ని దీపావళి పండగ సందర్భంగా రద్దు చేసినట్లు ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు.
????ఏలూరుజిల్లా భీమడోలులో ఎస్సై డైవర్ అత్యుత్సాహం!
భీమడోలు లో టూ వీలర్ పై కేసులు రాస్తున్న ఎస్ఐ..
ఒక వ్యక్తిని బండి ఆపమంటే ఆగకుండా వెళ్తున్నాడని లాటితో దాడి చేసిన ఎస్సై డ్రైవర్..
వ్యక్తి ఒంటిపై బొబ్బలు రావడంతో కుటుంబ సభ్యులు కలిపి స్టేషన్ వద్ద ధర్నా చేయడానికి వెళ్లిన పెద్దలు..
పూర్తి సమాచారం తెలియవలసి ఉంది.
????ఊర పందిని కోస్తే అడవి పంది అంటూ కేసు కడతామని బెదిరించి నాలుగు లక్షల డిమాండ్ చేసి 1,60,000 వసూలు చేశారు అటవీశాఖ అధికారులు అంటూ బాధితుల ఆరోపణలు*
చిత్తూరు జిల్లా
పలమనేరు నియోజకవర్గం పలమనేరు: రూరల్ మండలం బండమీద జరావారి పల్లికి చెందిన హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులు ముందు మా ఊరు దగ్గర ఊర పందిని కోసుకుంటుంటే అడవి పంది అని చెప్పి అటవీ శాఖ అధికారులు మా వద్ద ఉన్న ఫోన్లు లాక్కొని చావభాదారన్నారు. అంతేకాకుండా కేసు కట్టకుండా ఉండేందుకు నాలుగు లక్షలు డిమాండ్ చేయగా మా దగ్గర ఉన్న గొర్రెలు,ఆవులు అమ్మి 1,60,000 ఇచ్చామన్నారు. ఈ ఘటనపై డిఎఫ్ఓకు ఫిర్యాదు చేసి ఉన్నామన్నారు. న్యాయం చేయాల్సిందిగా మీడియాను కోరారు. కాగా ఈ ఘటనపై నిజా నిజాలు జిల్లా అటవీ శాఖ అధికారులు వెల్లడించాల్సి ఉంది.
???? ట్రూ అప్ చార్జీలకు నిరసనగా..
ఈరోజు తాడిపత్రి పట్టణంలో స్థానిక నెహ్రూ పార్కు వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ CPI ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ కూటమి నాయకులు ఇచ్చిన హామీలు నీటి మూట అయిందని ట్రూ ఆప్ పేరుతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై భారం మోపుతుందని అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే విద్యుత్ చార్జీలు పెంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుందని ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న ప్రజలకు యూనిట్కు 1.58. పైసలు భారం వేస్తోందని అన్నారు 30 యూనిట్ల కన్నా తక్కువ వాడేవారు 1.90. పైసలు చెల్లిస్తుండగా ఇకపై 2.73.పైసలు చొప్పున చెల్లించాలి అంటే 44% భారం పడనుంది ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో 6.072. కోట్ల భారం ప్రజలపై వేస్తుందని మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదానికి లాలూచీ పడినట్లే చంద్రబాబు ప్రభుత్వం కూడా అదేవిధంగా కొనసాగిస్తూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి లొంగిపోయిందని అన్నారు స్మార్ట్ మీటర్ల గురించి ఏపీ ఈ ఆర్ సి కి చెప్పకుండా హిందూజా కంపెనీకి 1.234. కోట్లు దోచిపెడుతున్నారని అన్నారు మరియు తాడిపత్రి పట్టణంలో మీటర్ ఫాల్టు వల్ల వేలాది రూపాయలు కరెంట్ బిల్లు వస్తుంటే మీటర్ టెస్టింగ్ అప్లై చేసిన నెలల తరబడి గడిచిన మీటర్ టెస్టింగ్ కి పంపడం లేదని వేలాది రూపాయలు ప్రజలపై భారాలు పడుతున్న అధికారులు మాత్రం మొద్దు నిద్ర నిద్రపోతున్నట్టు ఉంది అని అన్నారు కొన్ని వార్డులకు కరెంటు అసలే పోదు మరికొన్ని వార్డులకు నిరంతరం కరెంటు కోత జరుగుతుంది విద్యుత్ అధికారులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అర్థం కాని పరిస్థితి మరి అధికారులు ఇటువంటి ధోరణి కొనసాగించకుండా చూడాలని వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని ప్రజలపై విద్యుత్ బారాలు మోపకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
సిపిఐ పార్టీ నాయకులు అబ్రహం రత్నమయ్య ఏఐటీయూసీ నాయకులు ఉమా గౌడ్ రమణ
*????సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్టు.. కాసుల కోసం కాసుల కోసం కక్కుర్తి పడి …..స్కెచ్ మామూలుగా లేదుగా!*
మరో అవినీతి తిమింగలాన్ని అధికారులు అరెస్ట్ చేశారు.
బతికున్న వ్యక్తిని మృతి చెందినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, కాసులకు కక్కుర్తిపడి ఏకంగా రూ.కోటి విలువైన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన కేసులో ఓ సబ్ రిజిస్ట్రార్‌పై కేసు నమోదైంది. దీంతో పోలీసులు సదరు అవినీతి అధికారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. సికింద్రాబాద్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్‌గా ఉన్న జ్యోతి అనే అధికారి గతంలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసింది.
అయితే సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న సమయంలో ఓ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.దీంతో పోలీసులు ఆమెను మంగళవారం అరెస్టు చేశారుమేడ్చల్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. విచారణ నిమిత్తం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు
????అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం.*
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశం.
ఈ సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా వి.మాడుగుల పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు చెక్పోస్టులు తనిఖీలో భాగంగా సుమారు 408 కేజీల గంజాయి రెండు కేజీల గంజాయి (యాశస్) గంజాయి లిక్విడ్ ని పట్టుకున్నామని అని అన్నారు . వీటి విలువ సుమారు 21లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణకి తరలించే వెహికల్స్ ఒకలారీ. బొలెరో వ్యాన్. పల్సర్ మోటార్ బైక్ సీజ్ చేసామని అన్నారు .
గంజాయి అక్రమ రవాణాలో కేరళకు చెందిన 3 స్మగ్లర్లు చింతపల్లి ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ముగ్గురు స్మగ్లర్లు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
గాంజాయి అక్రమ రవాణా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు . స్మగ్లర్ కోసం పోలీసులు గాలిస్తున్నామన్నారు.
????చావు అంచుల వరకు వెళ్లొచ్చిన యువతి….*
సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ యువతి మృత్యువు అంచుల వరకూ వెళ్లింది.
కర్ణాటకకు చెందిన హంస గౌడ (20) తన స్నేహితురాలితో కలిసి ఆదివారం మందారగిరి హిల్స్ కు వెళ్లింది. వాటర్ ఫాల్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ హంస నీటిలో కొట్టుకుపోయింది. 20 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆమెను కాపాడారు. బండరాళ్ల మధ్యలో ఛాతిలోతు నీటిలో బిక్కుబిక్కుమంటూ గడిపానని, సెల్ఫీ కోసం ఎవరూ ఇలా చేయొద్దని హంస తెలిపింది.
*అనంతపురం: గుత్తిలో సైబర్ మోసం..
రైల్వే ఉద్యోగి నుంచి రూ.72 లక్షలు కొట్టేసిన నేరగాళ్లు..
ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ టోకరా.. ముంబై బాంబు బ్లాస్ట్ ఘటనలో మీ పేరు ఉందంటూ బెదిరింపు..
అరెస్ట్ చేయకుండా ఉండేందుకు డబ్బు పంపాలన్న నేరగాళ్లు
????యర్రగొండపాలెం – హైదరాబాద్ రోడ్డు పట్ల ఎందుకీ నిర్లక్ష్యం…? *మదిరె రంగ సాయి రెడ్డి ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు*
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిని పరిశీలించిన ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగ సాయి రెడ్డి.
ఈ రోడ్డు దుస్థితి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
నిత్యం ప్రజా ప్రతినిధులు, అధికారులు, వేల కొలది వాహన దారులు ఈ రహదారి ద్వారానే యర్రగొండపాలెం నుండి హైదరాబాద్ రాకపోకలు కొనసాగిస్తుంటారు.
అతి కొంచెం వెడల్పుతో, లోతైనా గుంతలతో, రోడ్డుకు అడ్డంగా కంప చెట్లతో అత్యంత భయంకరంగా ఉన్న ఈ రోడ్డు ప్రయాణికుల పాలిట శాపంగా పేర్కొన్నారు.
ఇప్పటికైనా ఈ రహదారిని అభివృద్ధి పరిచి వాహన దారుల కష్టాలను తీరుస్తారని విజ్ఞప్తి చేశారు.
????షర్మిల ఎఫెక్ట్: జగన్‌కు వైఎస్ సానుభూతి పరుల గుడ్ బై..!!! 
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా సెంటిమెంటును ప్రధానంగా నమ్ముకుని రాజకీయాలు చేసేవారు.. ఆ సెంటిమెంటు కొండలు కరిగిపోతే ఓర్చుకోలేరు. వారివారి మార్గాలను వారు చూసుకుంటారు. ఎందుకంటే.. ఏ నాయకుడికైనా. ఏ పార్టీకైనా.. ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా.. సెంటిమెంటే ప్రధాన బలం. ఇప్పుడు ఈసెంటిమెంటు వైసీపీకి ప్రమాదంగా మారింది. ఒకప్పుడు ప్రమోదంగా ఉన్న ఈ సెంటిమెంటు.. ఇప్పుడు వైసీపీలో కరిగిపోతోంది.
షర్మిల ఆస్తుల వివాదం తెరమీదికి రావడం.. ఆమె మీడియా ముందు కన్నీరు పెట్టడం.. వంటి ఘటనల అనంతరం.. వైఎస్ సానుభూతి అనే పెద్ద పునాదులపై ఏర్పడిన వైసీపీకి బీటలు పడుతున్నాయి. సానుభూతి కరిగిపోతోంది. దీంతో వైఎస్‌ను చూసి.. ఆయన కుమారుడిగా జగన్ చెంతకు చేరిన నాయకులు చాలా మంది ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. ఆస్తులు పోతో సంపాయించుకోవచ్చు. పదవులు పోయినా.. సంపాయించుకోవచ్చు. కానీ, ప్రజల్లో సానుభూతి పోతే.. తిరిగి సంపాయించుకోవడం ఈజీకాదు.
ఇదే కోణంలో ఆలోచిస్తున్న వైసీపీ సీనియర్లు కొందరు.. ఇప్పుడు జగన్‌కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత విధేయులుగా ఉండి.. తర్వాత కాలంలో జగన్‌ను అనుసరించిన వారు.. వైఎస్ సెంటిమెంటుతోనే రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ వారు వైఎస్ సానుభూతి పరులుగానే ఉన్నారు. కానీ, ఇప్పుడు వైఎస్ సానుభూతి వ్యవహారం పెద్ద చర్చగా మారడంతో వారు తమ దారి తాము చూసుకుంటున్నారు.
తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్ అనుచరుడిగా గుర్తింపు పొందిన మానుగుంట మహీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్టు తెలిసింది. తాజా పరిణామాలతో ఆయన విసుగు చెందారని.. షర్మిలకు అన్యాయం చేస్తున్నారన్న వాదనను బలంగా విశ్వసిస్తున్నారని.. ఆయన అనుచరులు చెబుతున్నా రు. ఈ క్రమంలో జగన్ దగ్గర ఇక, రాజకీయాలు చేయలేనని ఆయన తీర్మానించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో త్వరలోనే ఆయన టీడీపీ చెంతకు చేరనున్నట్టు తెలిసింది.
కందుకూరు నియోజకవర్గం నుంచి పలు మార్లు విజయం దక్కించుకున్న మహీధర్‌రెడ్డి..వైసీపీ హయాంలో మంత్రి పదవిని కోరుకున్నారు. కానీ, జగన్ దీనికి అంగీకరించలేదు. అంతేకాదు..ఈ ఏడాది ఎన్నికలలో ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు. అయినా.. సర్దుకుపోయారు. కానీ, తాజాగా వైఎస్ కుమార్తె షర్మిల కు అన్యాయం జరుగుతున్నదన్న ఆవేదనతో పాటు వైఎస్ సెంటిమెంటు కూడా వైసీపీకి దూరమవుతోందని గ్రహించిన మానుగుంట పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ కావడం గమనార్హం.
???? మాగుంట కార్యాలయంలో మలేషియన్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ వారి 36 మలేషియన్ ఇంటర్నేషనల్ ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్స్ చాపియన్ షిప్ రెడ్డి రామ తులసి లాంగ్ జంప్ బ్రాంజ్ మెడల్ సాధించినందువలన అభినందనలు తెలిపిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి .

???? ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయంలో కలిసిన వీఆర్వో బంగి చిన్న ఓబులేష్ .
???? పవన్ కల్యాణ్ పరువు పాయే! ఈ సందర్భంగా స్పందించిన అధికారులు… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు సరస్వతి పవర్ సంస్థకు సంబంధించిన భూములపై వారి పరిశీలనలో తెలుసుకున్న విషయాలు వెల్లడించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, షర్మిల ఆస్తుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మూడు లేఖలు, నాలుగు ప్రెస్ మీట్లు, ఐదు ఆరోపణలు, ఆరు విమర్శలు అన్నట్లుగా వ్యవహరం సాగుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో సరస్వతీ పవర్ సంస్థకు చెందిన భూములకు సంబంధించి ఆసక్తికర ఘటన తెరపైకి వచ్చింది. అవును… సరస్వతీ పవర్ సంస్థకు చెందిన షేర్ల వివాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే… ఈ సంస్థకు సంబంధించిన భూముల విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూ లేదని అంటుంటారు. కాకపోతే.. జగన్ మీద కేసులు పెండింగులో ఉండటంతో.. సరస్వతీ పవర్ భూములు కూడా ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. అంటే.. వాటిని అనుభవించగలరు తప్ప ఇతర లావాదేవీలు చేయలేరన్నమాట! ఆ సంగతి అలా ఉంటే… ఈ సంస్థకు చెందిన భూములపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా… ఆ భూముల్లో అటమీ భూములు, ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయేమో చూడాలని అధికారులను ఆదేశించారు. ఇలా డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ శాఖ అధికారులు స్వయంగా హుటా హుటిన వెళ్లి.. సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూమూలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు సరస్వతి పవర్ సంస్థకు సంబంధించిన భూములపై వారి పరిశీలనలో తెలుసుకున్న విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా… సరస్వతీ పవర్ సంస్థకు మాచవరం మండలంలోని మూడు గ్రామాలలో ఉన్న భూములు అన్నీ పట్టా భూములే అని తేల్చారు. చెన్నాపాలెంలో 272.96 ఎకరాలు.. పిన్నెల్లిలో 93.79 ఎకరాలు.. వేమవరంలో 710.63 ఎకరాలు కలిపి మొత్తంగా 1073.38 ఎకరాలు ఉన్నాయని.. అవన్నీ కూడా పట్టా భూములే అని స్పష్టం చేశారు. ఈ భూముల్లో చెరువులు కానీ.. వాగులు, కుంటలు వంటివి ఏమీ లేవని.. వాటర్ పాల్స్ వంటివీ లేవని రెవిన్యూ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో… వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ ను గట్టిగా తగులుకుంటున్నారు! సబ్జెక్ట్ పై అవగాహన లేకుండా పవన్ అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు! జగన్ ఫ్యామిలీలో ఆస్తుల కు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్న వేళ
సరస్వతీ పవర్ సంస్థ ల్యాండ్స్ ని సర్వే చేయించమని ఆదేశిస్తే… అవన్నీ పక్కాగా పట్టా భూములంటూ రెవిన్యూ అధికారులు స్పష్టంగా వెల్లడించిన వీడియోలు షేర్ చేస్తున్నారు. దీంతో.. పవన్ పరువు పాయే అనే చర్చ సామాన్య ప్రజానికంలోనూ మొదలైందని అంటున్నారు. ప్రస్తుతం ఈ భూములపై సర్వే చేసిన అధికారులు ఇచ్చిన వివరణకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. “మొత్తం పరువు పోయిందిగా..” అంటూ కామెడీ బిట్స్ జోడించి నెట్టింట రచ్చ చేస్తున్నారు.
*ఘనంగా కేపీ నాగార్జునరెడ్డి జన్మదిన వేడుకలు..
గిద్దలూరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్నా వైసీపీ కార్యాలయంలో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే , గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ కేపీ నాగార్జున రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి, తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

