????వరద బాధితుల సహాయార్థం 3ఎఫ్ ఆయిల్‌పామ్ ప్రైవేట్ లిమిడెట్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళంగా ఇచ్చింది. ఆదివారం సీఎం చంద్రబాబును కలిసిన కంపెనీ ఎండీ సంజయ్ గోయంకా, డైరెక్టర్ ఆశీష్ గోయెంకా విరాళం చెక్కు అందజేశారు. వరద బాధితులను ఆదుకొనేందుకు ఉదారంగా రూ.కోటి విరాళం అందించిన ప్రముఖ ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ కంపెనీ 3ఎఫ్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. రూ.300 కోట్ల పెట్టుబడితో తూర్పుగోదావరి జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఫెసిలిటీతో ఆంధ్రప్రదేశ్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఈ కంపెనీ యోచిస్తోందని సీఎం పేర్కొన్నారు.
????తెలంగాణలో 10 మంది బెటాలియన్ కానిస్టేబుల్స్ డిస్మిస్.. ఆందోళన చేస్తున్నవారిపై పోలీసుశాఖ చర్యలు..
క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడ్డారని తొలగిస్తూ ఆదేశాలు..
బెటాలియన్స్‌లో అశాంతికి 10 మంది కానిస్టేబుల్స్ కారణమని ఆరోపణ..ఇటీవలే 39 మందిని సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు..
????కొండాపూర్ 8వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల క్యాండిల్ ర్యాలీ..
రాష్ట్ర వ్యాప్తంగా సస్పెండ్ చేసిన కానిస్టేబుల్‌లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కానిస్టేబుల్ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ తీసిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు, వారి పిల్లలు…
???? జన్వాడ ఫాంహౌ్‌సలో పార్టీ వ్యవహారంపై స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేస్తే.. అందులో తాగి దొరికిన దొంగలు తమ తప్పును సమర్థించుకునేందుకు ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో పోలీసులను దాడికి పంపలేదని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎవరూ పోలీసులను ప్రతి ఫాంహౌ్‌సలో ఏం జరుగుతుదో చూడమని చెప్పలేదన్నారు. అర్థరాత్రి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడి జరిగిందన్నారు. ‘మీరు నిర్దోషులైతే చట్టం ద్వారా నిరూపించుకోవాల’ని కేటీఆర్‌ను ఉద్దేశించి సూచించారు.
???? మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి ఆప్ దూరం.. మిత్రపక్షాల కోసం కేజ్రీవాల్ ప్రచారం..!!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్ణయించింది. అయితే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ-ఎస్పీ, కాంగ్రెస్‌తో కూడిన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు.
ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈ విషయాన్ని శనివారం తెలిపారు. ‘పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్రలో పోటీ చేయదు’ అని ట్వీట్ చేశారు.
కాగా, మహారాష్ట్రలో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం కోసం శివసేన (యూబీటీ), ఎన్సీపీ-ఎస్పీ తమ పార్టీని సంప్రదించినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. అలాగే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) తరపున కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తారని చెప్పారు.
మరోవైపు మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరుగనున్నది. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న రెండు రాష్ట్రాల్లో ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
???? గుంటూరు జిల్లాలో ఎక్కడైనా బాణసంచా సామాగ్రి అక్రమ విక్రయాలు, అక్రమ నిల్వలు సంబంధించిన సమాచారం ఉంటే జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8688831568 గాని 100, కు సమాచారం తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ తెలిపారు.
????వివాహ మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*
*కొనకన మిట్ల మండలం గొట్లగట్టు గ్రామంలో ఆదివారం నాగం లక్ష్మయ్య,చెన్నా లక్ష్మమ్మ ల కుమారుడి వివాహ మహోత్సవానికి హాజరు అయి నూతన వధూవరులు అయిన గురుకృష్ణ,వెంకటరజని లను ఆశీర్వదించినారు.

????ఒంగోలు టౌన్ బృందావనం కల్యాణ మండపం నందు ఆళ్ల రవీంద్రరెడ్డి, నాగలక్ష్మిల కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరు అయి నూతన వధూవరులు అయిన రమ్యశ్రీ,అచ్యుత్ రెడ్డిలను ఆశీర్వదించినారు *
????అన్నపురెడ్డి కాశిరెడ్డికి నివాళులు అర్పించిన మాజి ఎమ్మెల్యే అన్నా*
తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామం నందు అనారోగ్యంతో బాధపడుతు అన్నపురెడ్డి కాశిరెడ్డి మరణించగా విషయం తెలుసుకున్న ఆయన కాశిరెడ్డి పార్ధీవదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు*జిల్లా ఇంచార్జ్ ఎస్ రెహమాన్..
????డ్రగ్ పార్టీ ముఠా నాయకుడు కేటీఆర్.. ప్రతిపక్షాల ఆరోపణలు..▪️జన్వాడ లో ఉన్న కేటీఆర్ బావమరిది ఫార్మ్ హౌస్ లో దొరికిన ఇండియన్ బాటిల్స్ మరియు ఫారం బాటిల్స్.▪️రేవ్ పార్టీలో 14 మంది మహిళలు మరియు 21 మంది పురుషులు పాల్గొన్నారు.▪️తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి రేవ్ పార్టీలను ప్రోత్సహించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ.
▪️నిన్న జరిగిన రేవు పార్టీలో కేటీఆర్ ఉన్నాడో లేడో మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి.
▪️కేటీఆర్ బ్లడ్ శాంపిల్ కూడా టెస్ట్ చెయ్యాలి.
▪️ప్రభుత్వం మీద విమర్శించే కేటీఆర్ ఇప్పుడు మీ బామ్మర్ది ఫామ్ హౌస్ రేవ్ పార్టీ మీద ఎందుకు స్పందించడం లేదని ప్రతిపక్ష నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
????కంభంలో పట్టుబడ్డ బాణాసంచా సీజ్*. కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో అమరావతి – అనంతపురం జాతీయ రహదారిలోని ఒక రూములో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ దీపావళి బాణాసంచాను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.ఆ బాణాసంచా విలువ సుమారు రూ.3,75,000 ఉంటుందని ఎస్సై బి నరసింహ రావు తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసంచారం మధ్యలో ఇలా అక్రమంగా బాణాసంచా నిలువ ఉంచడం నేరమన్నారు.
????జగన్‌ను టెన్షన్ పెడుతోన్న వైసీపీలో ఆ ఇద్దరు మేడమ్స్…! గతంలో రజనీ ప్రెస్‌మీట్లతో పాటు మీడియాలో చేసే హడావిడి ఒక రేంజ్‌లో ఉండేది.. ఇప్పుడు రజనీ ఫుల్ సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను ఇప్పుడు వైసీపీలో ఇద్దరు మేడమ్స్ బాగా టెన్షన్ పెట్టేస్తున్నారట. జగన్ రాజధాని ప్రాంతంలో కీలక నగరం అయిన గుంటూరులో ఎప్పుడు పర్యటించినా పక్కన మాజీ మంత్రి విడదల రజనీ ఉంటున్నారు. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటల తూటాలు పేల్చే రజనీ ఇప్పుడు ఒక్క మాట మాట్లాడటం లేదు. గతంలో రజనీ ప్రెస్‌మీట్లతో పాటు మీడియాలో చేసే హడావిడి ఒక రేంజ్‌లో ఉండేది.. ఇప్పుడు రజనీ ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఇక ఇప్పుడు వైసీపీలో బాగా హైలెట్ అవుతోన్న శ్యామల జోరు ముందు రజనీ పూర్తిగా బేజారు అవుతున్నారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ లో సంచలన దృశ్యాలు! ఇక గుంటూరుకే చెందిన మరో కీలక మహిళానేత.. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత సైతం సైలెంట్ అయిపోయారు. అసలు ఆమెను ఎన్నికలకు ముందే జగన్ నానా ఇబ్బందులు పెట్టారు. ఆమె ప్రత్తిపాడు సీటు కోరుకుంటే అది కాకుండా రాజధాని ప్రాంతం అయిన తాడికొండ సీటు ఇచ్చారు. అక్కడ పోటీ చేయడం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు మేడమ్స్ జగన్‌ను బాగా టెన్షన్ పెట్టేస్తున్నారట. విడదల రజనీ అయితే జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఆమె భర్తది కాపు సామాజిక వర్గం.. రజనీ భర్త కుమారస్వామి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో ఉన్నారంటున్నారు. ఆయన లాబీయింగ్‌తోనే రజనీ జనసేన ఎంట్రీకి లైన్ క్లీయర్ అయ్యిందంటున్నారు. ఇక మేకతోటి సుచరిత కూడా జగన్ పర్యటనల్లో కనపడడం లేదు. సుచరిత అయితే జగన్‌కు దూరం జరగడం.. వైసీపీకి బైబై చెప్పడం ఫిక్స్ అని.. అయితే ఆమె ఏ పార్టీలో చేరతారు ? అన్నది అంతు పట్టడం లేదంటున్నారు. ఇక ఈ ఇద్దరు కీలక మహిళా నేతలు పార్టీ మారిపోతే గుంటూరు వైసీపీలో జగన్‌కు మిగిలేది ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ లాంటి వాళ్లు మినహా ఎవ్వరూ ఉండరన్న గుసగుసలు ఉన్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి కూడా గుడ్ బై చెప్పారు. ఇక పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య కూడా జనసేనలో చేరిపోయారు. ఓవరాల్‌గా చూస్తే గుంటూరు వైసీపీలో జగన్ మిగిలేది బలహీన నాయకులే అన్నట్టుగా కనిపిస్తున్నారు.
3ఎఫ్ ఆయిల్‌పామ్ ప్రైవేట్ లిమిడెట్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం..వైసీపీని వీడనున్న ఇద్దరు మహిళా నాయకురాళ్ళు!..కేటీఆర్ బ్లడ్ శాంపిల్ కూడా టెస్ట్ చెయ్యాలని డిమాండ్..మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి ఆప్ దూరం..తెలంగాణలో 10 మంది బెటాలియన్ కానిస్టేబుల్స్ డిస్మిస్.. పలు వివాహ కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే అన్నా.. కంభంలో బాణాసంచా స్వాధీనం
Recent Posts

