జగన్ వర్సెస్ షర్మిళ… వైసీపీ పప్పులో కాలు వేసిందా? ..హైదరాబాద్‌లో చెట్లను నరికితే భారీగా జరిమానా..కావలి నియోజకవర్గం లో కొన్నిచోట్ల యదేచ్చగా వన్యప్రాణుల వేట.. కంభం చెరువును పట్టించుకోరా..ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి లక్ష రూపాయల చెక్కును అందజేసిన పారిశ్రామికవేత్త ..నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి గౌరవ అతిథ్య ఆహ్వానం.

????జగన్ వర్సెస్ షర్మిళ… వైసీపీ పప్పులో కాలు వేసిందా? వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదాలు ఇప్పుడు కోర్టుమెట్లెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ – వైఎస్ షర్మిళ మధ్య ఆస్తుల పంచాయతీ కోర్టుకు చేరింది. వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదాలు ఇప్పుడు కోర్టుమెట్లెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ – వైఎస్ షర్మిళ మధ్య ఆస్తుల పంచాయతీ కోర్టుకు చేరింది. ఈ సమయంలో ఇద్దరి మధ్యా లేఖల యుద్ధం జరుగుతుంది. ఆ లేఖలు మరో వైపు నుంచి వైరల్ అవుతోన్న పరిస్థితి నెలకొంది! ఆ సంగతి అలా ఉంటే… ఈ వ్యవహారంలో వైసీపీ ఇస్తోన్న వివరణ జగన్ కు ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉందా అనే చర్చకు తెరలేపింది.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అన్నా చెల్లెల్ల మధ్య నెలకొన్న ఆస్తి తగాదాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత, కుటుంబ వ్యవహారం అని ఎవరైనా భావించినప్పటికీ… ఈ విషయంలో అన్న.. మాజీ సీఎం, చెల్లెలు.. పీసీసీ చీఫ్ కావడంతో ప్రజల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో… ఈ వ్యవహారంపై వైసీపీ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా… “వారసత్వపు ఆస్తులు కానప్పటికీ.. స్వార్జితం అయినప్పటికీ.. తన చెల్లెలి మీద ఉన్న ప్రేమాభిమానాలతో ఇస్తానని కమిట్మెంట్ చూపించి ఎంవోయూ రాసిచ్చారు జగన్.. ఇదే సమయంలో.. కేసులు తేలిన తర్వాత ఆస్తులు అప్పగిస్తారు.. కానీ.. ఈ లోపే చట్టవిరుద్ధంగా సరస్వతీ పవర్ లో జగన్ ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను ఆధారంగా చేసుకుని విజయమ్మ దగ్గర నుంచి షేర్లను బదిలీ చేయించుకున్నారు”. “ఈ వ్యవహారం లీగల్ గా జగన్ కి ఇబ్బందులు తెచ్చే విషయమని న్యాయవాదులు చెప్పడంతో.. గత్యంతర లేని పరిస్థితుల్లో లీగల్ స్టెప్ తీసుకున్నారు” అని వైసీపీ వెల్లడించింది. అసలు చెల్లెలిపై ప్రేమ చూపకూడదని అనుకుంటే.. జగన్ ఎంవోయూ రాసిచ్చేవారే కాదు కదా? అనేది వైసీపీ వేస్తోన్న ఎదురు ప్రశ్న!.. దీనికి అనుబంధంగా… సరస్వతి పవర్ విషయంలో లీగల్ సమస్యలు కాబట్టి.. 2021లో జగన్ గిఫ్ట్ డీడ్ కు పరిమితం అయ్యారు. అసలు లీగల్ గా అవకాశం ఉండి ఉంటే.. ఆరోజే షేర్లలో బదిలీ చేసేవారు కాదా?.. అని ప్రశ్నించింది. కానీ, షేర్ల బదిలీ చట్టవిరుద్ధమని తెలిసి కూడా బదిలీ చేశారంటే.. ఇది జగన్ ను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేయడం కాదా? ఇది ఆయన బెయిల్ రద్దుకు అనుకూలమైన పరిస్థితులు సృష్టించడమే కదా? అనేది వైసీపీ వేస్తోన్న మరో కీలక ప్రశ్న. చెల్లెలిపై అభిమానంతో మంచి చేయబోయి తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి జగన్ ది.. ఇంతటి పరిస్థితుల్లో పదేళ్లలో రూ.200 కోట్లు జగన్ తన చెల్లికి ఇచ్చారు.. అని వైసీపీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. అయితే… ఇలా పూర్తిగా వ్యక్తిగతమైన ఈ వ్యవహారాన్ని తెరపైకి తేవడం.. జగన్ బెయిల్ రద్దుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇదొక భాగం అంటూ స్పందించడం.. దీనికితోడు రూ.200 కోట్లు తన చెల్లికి జగన్ ఇచ్చారని చెప్పడం వంటి విషయాలు తెరపైకి రావడం అంటే అది వైసీపీ సెల్ఫ్ గోల్ వంటిదా అనే సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు జగన్ అభిమానులు. ఈ సందర్భంగా… తనను బెదిరిస్తున్నారని షర్మిళ లేఖ తీసుకుని కోర్టుకు వెళ్తే మరో కొత్త సమస్య వచ్చే ఇబ్బంది లేదంటారా? అనేది జగన్ ఫ్యాన్స్ వేస్తోన్న మరో ప్రశ్న. ఈ విషయంలో పూర్తిగా అన్ని రకాలుగా ఆలోచించకుండా అత్యుత్సాహంతో స్పందిస్తే.. జగన్ కు సరికొత్త సమస్యలు తెచ్చిపెట్టినట్లవుతుందనే విషయం మరిచిపోకూడదని ఆయన అభిమానులు అంటున్నారు.

????వై,యస్, జగన్ మోహన్ రెడ్డి కి ఆవేదనతో లేఖ రాసిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ..!
మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎమ్‌ఓయు ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగు జాడల్లో నడవాల్సిన మీరు ఈ విదంగా దారి తప్పడం నాకు ఆశ్చర్యం వేస్తోంది.సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్న నువ్వు నీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు లాక్కోవటానికి సిద్ధమయ్యావా జగన్ మోహన్ రెడ్డి అని ఆమె లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
????రంగారెడ్డి జిల్లా:- మాజీ కలెక్టర్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ..భూకేటాయింపు అక్రమాలపై అమోయ్ కుమార్‌ను ప్రశ్నించిన ఈడీ..ఏడున్నర గంటల పాటు వివిధ అంశాలపై ఈడీ ప్రశ్నలు..ఉదయం మీడియా కంటపడకుండా ఈడీ కార్యాలయానికి రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌ను ఈడీ ఏడున్నర గంటల పాటు విచారించింది. రంగారెడ్డి జిల్లాలో భూకేటాయింపులపై అక్రమాలు జరిగాయన్న కేసులో అమోయ్ కుమార్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన ఈరోజు ఉదయం 8 గంటలకు మీడియా కంటపడకుండా బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు.ఈడీ అధికారులు ఆయనను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విచారించారు. వందల కోట్ల రూపాయల విలువ చేసే 42 ఎకరాల భూమిని అక్రమంగా ఎలా బదిలి చేశారని ఈడీ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అమోయ్ కుమార్ గతంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలకు కలెక్టర్‌గా పని చేశారు…
???? కంభం చెరువును పట్టించుకోరా…?*
-మదిరె రంగ సాయి రెడ్డి, ప్రజా సంకల్ప వేదిక అధ్యక్షులు..
ఆసియా ఖండం లోనే అతి పెద్ద మానవ నిర్మిత చెరువుల్లో ప్రకాశం జిల్లాలోని కంభం చెరువు ఒకటని ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగ సాయి రెడ్డి గురువారం సందర్శించి ఆవేదన వ్యక్తం చేశారు.
500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెరువు వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.
శ్రీ కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ చెరువు ద్వారా ఇప్పటికీ వేలాది ఎకరాలకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందుతోంది.చెరువు చుట్టూ పచ్చని కొండలు , ఆహ్లాదకర వాతావరణం ఉండటంతో పర్యటకులు విరివిగా వస్తుంటారు.
ప్రభుత్వాలు మాత్రం ఈ చెరువు అభివృద్ధి కి శిలా ఫలకాలు ఏర్పాటుతో సరిపెట్టుకుంటున్నారు.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మితమైన ఈ చెరువు దాదాపు 30 అడుగుల లోతు 3.5 TMC ల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు.ఈ కంభం చెరువు మధ్యలో సుమారు 22 కొండలున్నాయి.నల్లమల అడవుల నుంచి వచ్చే నీటిని నిల్వచేసి, సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ చెరువు ద్వారా ఉపయోగిస్తారు.
ఈ చెరువు కట్టపై నుంచి చూస్తే కనుచూపు మేర నీళ్లు, పచ్చని కొండలతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.
కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ప్రభుత్వాలు దృష్టి సారించలేదు.ఈ నిర్లక్ష్యం కారణంగా చెరువులో పూడిక పెరిగిపోయి, పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరిగినాయి.
నేడు ఈ చెరువుకు ఉన్న రెండు పెద్ద తూములు బలహీనపడి శిథిలావస్థకు చేరుకున్నాయి.
శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంభం చెరువును సందర్శించేందుకు, ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు నిత్యం ఇక్కడకు పర్యాటకులు వస్తుంటారు.
సందర్శకులకు మౌలిక వసతుల కల్పన, బోటింగ్‌, చెరువు మధ్యలో ఉన్న కొండలపై రిసార్ట్స్‌ వంటి వాటి నిర్మాణాలకు ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు.
ఈ కంభం చెరువు కట్టపై దేవాలయాలు, ఒక దర్గా కూడా ఉంది.ప్రతి ఏటా ఇక్కడ ముస్లింలు ఇక్కడ తేజతేరి పండుగను ఘనంగా నిర్వహిస్తారు.
కానీ అక్కడ కనీస వసతులు లేకపోవటం విచారకరం.
చెరువుకి వచ్చే మార్గం కూడా సరిగా లేదని సందర్శకులు వాపోతున్నారు.సాధారణ సమయంలోనే వేల మంది పర్యాటకులు చెరువును చూసేందుకు వస్తారని స్థానికులు అంటున్నారు.ఈ కంభం చెరువు వద్ద మౌలిక వసతులు కల్పించి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా విరజిల్లుతుందని మదిరె రంగ సాయి రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
కంభం చెరువును అభివృద్ధి చేసుకునేందుకు స్థానిక శాసన సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మదిరె రంగ సాయి రెడ్డి డిమాండ్ చేశారు.
????రేపటి నుంచి అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన..అమరావతి: ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న లోకేశ్.. ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన.
????ఇంకనుంచి ఒక క్లిక్తో.. వంద రకాల సేవలు*
ఏపీలో రేషన్ కార్డుల జారీ వివరాలు, రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుకింగ్, పంటల మార్కెట్ ధరలు తెలుసు కోవడం, దైవదర్శనాల అందుబాటు, విద్యార్థుల హాజరులాంటి సేవలను ఇక నుంచి ఒక్క క్లిక్తో పొందొచ్చు. వాట్సప్ బిజినెస్ సర్వీసు వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 30నుంచి వాట్సప్ ద్వారా 100రకాల సేవలను అందించేందుకు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి వాట్సప్ మాతృసంస్థ మెటాతో ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం
కుదుర్చుకుంది.
????TG: హైదరాబాద్‌లో ఉన్న ప్రతి చెట్టును కాపాడేందుకు అటవీశాఖ వాల్టా చట్టాన్ని కఠినతరం చేస్తోంది. ఎవరైనా పార్కులో మొక్కలను తీసివేసిన, ఇంట్లో చెట్టు కొమ్మలను నరికినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించితే భారీగా జరిమానాలు విధిస్తామని వెల్లడించింది. వాల్టా చట్టం ప్రకారం తమ ఇంటి ఆవరణలోని చెట్టును ఎవరూ స్వయంగా నరికివేయకూడదు. వాటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
???? గల్ఫ్ మృతుల ఎక్స్ గ్రేషియాకు రూ.6 కోట్ల 45 లక్షల విడుదల…
2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ లో 160 మంది తెలంగాణ కార్మికులు మృతి చెందినట్లు అంచనా..
ముఖమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అదేశాల మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం ఈనెల 21న రూ.6 కోట్ల 45 లక్షలను15 జిల్లాల కలెక్టర్లకు విడుదల చేసింది.గల్ఫ్ మృతుల సంఖ్య ఆధారంగా నిజామాబాద్ జిల్లాకు రూ.1 కోటి 75 లక్షలు, జగిత్యాలకు రూ.1 కోటి 40 లక్షలు, రాజన్న సిరిసిల్లకు రూ.60 లక్షలు, నిర్మల్ కు రూ.50 లక్షలు, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, ఆదిలాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మెదక్ జిల్లాకు రూ.20 లక్షల చొప్పున నిధులు విడుదల..
*???? కావలి నియోజకవర్గం లో కొన్నిచోట్ల యదేచ్చగా వన్యప్రాణుల వేట.. మాంసం విక్రయాలు????*
*????జింకలు,వన్యప్రాణుల వేటే లక్ష్యంగా విద్యుత్ తీగలు ఏర్పాటు..*????ఎన్నో రోజులుగా వన్యప్రాణుల వేట కొనసాగుతున్నా పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు*
*????అభివృద్ధి చేయడంలో మంచి పేరు తెచ్చుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వన్యప్రాణుల వేటగాళ్లపై అరాచకాలు పై దృష్టి సారించాలి*
కావలి నియోజకవర్గ పరిధిలోని దగదర్తి మండలంలోని చెన్నూరు, బోడిగుడిపాడు,మనుబోలుపాడు లింగాలపాడు,సిద్ధారెడ్డి పాలెం తదితర గ్రామాలు సమీపం లో అటవీ ప్రాంతంలో తిరుగుతున్న జింకలను,వన్య ప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలును ఏర్పాటు చేసిన వేటగాళ్లు వన్య ప్రాణులను చంపి వాటి మాసం బహిరంగంగా అమ్మకాలు చేపడుతున్నట్టు సమాచారం,జింక మాంసం ఒక కేజీ 400రూ ల నుండి 600 రూపాయల వరకు విక్రయిస్తున్నారని తెలుస్తుంది,వేటగాళ్లు చెన్నూరు పంచాయతీలోని సిద్ధారెడ్డి పాలెం వద్ద ఉన్న చింతలగుంట చెరువు వద్ద వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్నట్టు స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు, వన్యప్రాణుల చట్టాల ప్రకారం వన్యప్రాణుల అక్రమ వేట సాగించిన నేరగాళ్ళు పై అతి కఠినమైన శిక్షలు అమలుచేస్తారు, అడవి తో పాటు వన్యప్రాణులను సంరక్షించాల్సిన అటవీశాఖ అధికారులు, పోలీస్ అధికారులు ఈ అక్రమంగా వన్యప్రాణుల వేట సాగించే నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించి వన్యప్రాణులను కాపాడాలని స్థానిక ప్రజలతో పాటు వన్య ప్రాణి ప్రేమికులు కోరుకుంటున్నారు… ఇటీవల వేటగాళ్లు చిత్తూరు జిల్లాలో ఒక చిరుతను అతి భయంకరంగా చంపి దాని కాలిగోళ్ళు, పళ్ళు తీసుకెళ్లిన ఘటన మరువకముందే నెల్లూరు జిల్లాలో వన్యప్రాణులను యదేచ్ఛగా వేటాడుతున్నారు అనే వార్త కలవరపెడుతుంది, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ వన్యప్రాణుల వేటను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
???? ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి లక్ష రూపాయల చెక్కును అందజేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త చిలకల కృష్ణారెడ్డి ..
వైద్యశాల అభివృద్ధికి పారిశ్రామికవేత్త కృష్ణారెడ్డి లక్ష విరాళం

మండలంలోని నాగిరెడ్డిపల్లి ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక వసతుల కోసం మరియు ప్రైవేటు వైద్యశాలకు ధీటుగా గా ప్రభుత్వ వైద్యశాలను తీర్చిదిద్ధి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సంకల్పానికి తనవంతుగా మండలంలోని కంకణంపాడు గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మండల టిడిపి సీనియర్ నాయకుడు చిలకల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డికి లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని వెలిగండ్ల మండలంలో ప్రతిరోజు తనవంతుగా సహాయమందిస్తున్న దాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్యం తో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యశాలలోనే వైద్యం చేయించుకునే విధంగా ప్రజలకు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో కేలం ఇంద్రభూపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ సానా జైపాల్ రెడ్డి,ప్రధానోపాధ్యాయుడు గవర గట్ల చిన్న మాల కొండయ్య, బొప్పరాజు లక్ష్మీనారాయణ, ముత్తిరెడ్డి శ్రీనివాసులు, పిన్నిక కృష్ణ పాల్గొన్నారు.. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రహమాన్..
???? ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ప్రముఖులు..రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ క్యాంప్ ఆఫీస్ నందు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇన్చార్జిలు సమావేశమై వివిధ అంశములపై చర్చించి, జిల్లా లోని దామచర్ల సత్య, నూకసాని బాలాజీ, పిల్లి మాణిక్యాలరావు మరియు లంక దినకర్లకు రాష్ట్రస్థాయి వివిధ కార్పొరేషన్ చైర్మన్ లుగా నియమించినందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలియజేసినారు మరియు సదరు చైర్మన్ లకు అభినందనలు తెలియజేసినారు. ఈనెల 29 వ తేదీ న రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు తో వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి పురోగతి పనులపై చర్చించుటకు నిర్ణయించినారు అదేవిధంగా గుండ్లకమ్మ మరియు ఇతర నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించుటకు నిర్ణయించినారు. అలాగే సాగునీటి సంఘాలు మరియు సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించుట గురించి చర్చించినారు.
ఈ సమావేశము లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోల బాలవిరాంజనేయులు మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఎర్రగొండపాలెం ఇన్చార్జి గూడూరు ఎలక్షన్ బాబు దర్శి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ మరియు మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్యా పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి ప్రతినిధి బెజవాడ సురేష్ రెడ్డి ఒంగోలు జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ పాల్గొన్నారు.
????ఈ రోజు ఢిల్లీ లోని పార్లమెంట్ భవనం లోని మీటింగ్ హాల్ లో గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్ మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన రెండవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆధ్వర్యంలో వివిధ ప్రధాన పథకాలు మరియు కార్యక్రమాల అమలుకు సంబంధించి పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థలు,కార్యాలయాల పనితీరు పై సమీక్ష జరిగినది.
????డిల్లీలో గృహ & పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలో సమావేశం నిర్వహించిన ఎంపీ మాగుంట.. ఈ రోజు డిల్లీలో పార్లమెంటు హౌస్ అనుబంధ హాలులో గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి రెండవ సమావేశాన్ని కమిటీ సభ్యులతో నిర్వహించారు. మొదట కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ కార్యదరి, శ్రీనివాస్ ఆర్. కటికితల మాగుంట శ్రీనివాసులురెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలియజేశారు. తదుపరి, ఈ సమావేశంలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖకు సంబంధించిన సంస్థలు మరియు కార్యాలయాల పనితీరుపై మరియు 2024-25 సంవత్సరానికి గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ నుండి 2024-25 సంవత్సరానికి కావలసిన నిధులు మంజూరు అంశపై కమిటీ సభ్యులతో చర్చలు జరిపారు.
జిల్లా ఇంచార్జ్ ఫయాజ్..
????మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో రోడ్లమీద అక్రమ కట్టడాలను తొలగించాలని సబ్ కలెక్టర్, మార్కాపురం సీఐ, మున్సిపాలిటీ కమిషనర్, మార్కాపురం టౌన్ ఎస్ఐ అక్రమంగా రోడ్ల పైన ఉన్నటువంటి అన్ని తొలగించాలని పేర్కొన్నారు. డివిజన్ రిపోర్టర్ అస్లాం బేగ్..
????యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో చిరుత మృతి కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము..* ఐదు మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నాము. ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారు .. చిరుత ను ఏవిధంగా హతమార్చారు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నాం.. ఇందుకు తమిళనాడు ,చిత్తూరు పోలీసులు పూర్తి సహకారం అందిస్తున్నారు* బంగారు పాళ్యం మండలం వెలుతురు చేను గ్రామంలో ఓ ఇంటిలో పులిగోరు , కాళ్లు స్వాధీనం చేసుకున్నాం. విచారణ తర్వాత నిందితుల అరెస్టు వివరాలను వెల్లడిస్తాం. మీడియా సమావేశంలో డీఎఫ్ఓ భరణి
????*నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి మరో గౌరవ ఆథిత్య ఆహ్వానం*
. ఐక్యరాజ్య సమితి సమావేశాలకు భారత ప్రతినిధిగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి రెడ్డి ఎంపిక..
79వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలు అమెరికా దేశం న్యూయార్క్ నగరంలో నవంబర్ నెలలో 18-22 వరకు జరుగనున్నాయి. న్యూయార్క్ జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశంలో మన భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి రెడ్డి కి అవకాశం కల్పించారు.ఐక్యరాజ్య సమితి సమావేశాలకు భారతదేశ ప్రతినిధిగా మాట్లాడేందుకు అవకాశం కల్పించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నానని,భారత దేశం, ఆంధ్ర ప్రదేశ్ గర్వించే విధంగా అంతర్జాతీయ వేదిక లపై నడుచుకుంటానని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు.
????పర్చూరు నియోజకవర్గంలో దేవాలయాలను టార్గెట్ చేసిన దొంగలు…బాపట్ల జిల్లా,
ఇటీవల కొత్తపాలెం, బోడవాడ దేవాలయాల్లో ఏకకాలంలో జరిగిన దొంగతనాలు మరువక ముందే స్వర్ణ గ్రామంలో స్వర్ణమ్మ తల్లి దేవాలయంలో మరో భారీ చోరి…
గుడి తాళాలు పగులగొట్టి లక్షన్నర వరకు నగదుని ఎత్తుకెళ్లిన దొంగలు…సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన కారంచేడు పోలీసులు..
????జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి.. మరో కార్మికునికి తీవ్రగాయాలు..జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో గల ట్రాల్ ప్రాంతంలో గురువారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రీతమ్ సింగ్‌ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని ఆర్మీ అధికారులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఉగ్రవాదులు కాశ్మీరేతరులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపారు. గత వారం రోజులుగా కాశ్మీర్‌లో స్థానికేతర కార్మికులపై దాడులు జరుగుతున్నాయి.
పోతున్నాయి.
????అక్రమంగా నిల్వ ఉంచిన మూడు లక్షల విలువైన టపాసులు స్వాధీనం.. కంభం పట్టణంలోని సంగా వీధిలో అక్రమంగా నిలువ ఉంచిన మూడు లక్షల విలువైన టపాసులను కంభం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా