మోసాలకే పరాకాష్ఠ.. నకిలీ కోర్టు పెట్టి జడ్జిగా అవతారమెత్తి తీర్పులిచ్చేశాడు!..పోలీసులే అయ్యా కానీ దొంగలు..బిష్ణోయ్ ని చంపితే రూ.1,11,11,111..రౌడీషీటర్ దాడిలో గాయపడిన యువతి మృతి..ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య..ఈ ప్రభుత్వంలో ప్రాణాలకే భరోసా లేదే’.. కాంగ్రెస్‌పై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు..!వయనాడ్ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ నేడు నామినేషన్.. మార్కాపురం సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మూడు వందల బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం..విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దు: ఆర్టీసీ ఎండి సజ్జనార్.. అర్ధవీడులో బెల్ట్ షాపులకు వేలంపాట!!!

???? మోసాలకే పరాకాష్ఠ.. నకిలీ కోర్టు పెట్టి జడ్జిగా అవతారమెత్తి తీర్పులిచ్చేశాడు!..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘటన..
కోర్టు తనను ఆర్బిట్రేటర్‌గా నియమించిందని చెబుతూ ట్రైబ్యునల్ ఏర్పాటు..సివిల్ కోర్టులో పెండింగ్ కేసులు ఉన్న వారికి ఎర..త్వరగా తీర్పులిస్తానంటూ డబ్బుల వసూలు..
ప్రభుత్వ భూమికి సంబంధించి తన క్లయింట్‌కు అనుకూలంగా ఉత్తర్వులు..అవి నకిలీవని గుర్తించడంతో కటకటాలపాలు
ఇది మోసాలకే మోసం. ఓ వ్యక్తి ఏకంగా నకిలీ ట్రైబ్యునల్‌నే ఏర్పాటు చేసి తీర్పులు కూడా ఇచ్చేశాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిందీ ఘటన. కోర్టు తనను ఆర్బిట్రేటర్‌గా నియమించిందని చెబుతూ నిందితుడు మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ గాంధీనగర్‌లోని తన కార్యాలయాన్ని కోర్టు రూముగా మార్చేశాడు. 2019లో ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసులో తన క్లయింట్‌కు అనుకూలంగా తీర్పునిచ్చి ఆదేశాలు జారీచేశాడు.
అయితే, అవి నకిలీ ఆదేశాలని గుర్తించిన అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ హార్దిక్ దేశాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ కోర్టు బాగోతం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రస్తుతం కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. ఐదేళ్లుగా అతడు ఇలా తీర్పులు ఇస్తున్నట్టు గుర్తించారు.
సివిల్ కోర్టులో పెండింగ్‌ కేసులున్న వారిని గుర్తించి వాటిని త్వరగా పరిష్కరిస్తానని నిందితుడు తన కోర్టుకు రప్పించుకునేవాడు. అక్కడ వారికి అనుకూలంగా తీర్పులిస్తూ పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడని విచారణలో తేలింది. తనది నిజమైన కోర్టుగా నమ్మించేందుకు తన అనుచరులను కోర్టు సిబ్బందిగా ఉపయోగించుకున్నట్టు పోలీసులు తెలిపారు.
????వయనాడ్ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ నేడు నామినేషన్* హైదరాబాద్:అక్టోబర్ 23
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత ప్రియాంక గాంధీ, ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
బుధవారం ఉదయం 11 గంటలకు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్‌ ఎదుట నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.
????జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన, దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తాం..
జర్నలిస్టులను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అది ఏ పార్టీకి చెందిన వారైనా సరేనని తీవ్రంగా హెచ్చరించిన సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్..ఇటీవల జర్నలిస్టులపై కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన జర్నలిస్టు సంఘాల నేతలు సానుకూలంగా స్పందించడం తో హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు.
????పోలీసులే అయ్యా కానీ దొంగలు…. బాబోయ్*
*పోలీసుల్లో ఇలాంటి పోలీసులు కూడా ఉంటారా!…సమాజానికి న్యాయం చేయాల్సిన వారే ఇలా ఉంటారా!…సంచలనం అయిన ఏలూరు పేకాట కేసు గుట్టురట్టు చేసి..సంచలన నిజాలు బయటపెట్టిన పోలీసులు..తూర్పుగోదావరి జిల్లా మండలం ముక్కామలలో సెప్టెంబర్ 8న కొందరు వ్యక్తులు పేకాడుతున్నారు.
సమాచారం అందుకున్న పెరవలి ఎస్సై అప్పారావు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు రైడ్‌కి వెళ్లారు.పేకాట శిబిరంపై దాడిలో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.6.45 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.అయితే కేసులో మాత్రం రూ.55 వేలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు చూపించారు. మిగిలిన డబ్బులు తలా కాస్త పంచుకుని నిందుతులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. అయితే ఇక్కడే కధ మలుపు తిరిగింది.
రైడ్ జరిగిన సమయంలో ఉన్న టీంలో ఒక కానిస్టేబుల్‌కి నిందితుల్లో ఒకరితో బాగా పరిచయం ఉంది. దాంతో అతడు రూ. లక్ష కానిస్టేబుల్‌కి ఇచ్చి జాగ్రత్తగా దాయమని చెప్పాడు. ఆ తర్వాత లక్ష నగదు దాయమని ఇచ్చిన వ్యక్తి కానిస్టేబుల్ వద్దకు వెళ్లి తన నగదు ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే ఆ లక్ష కూడా రైడ్ అమౌంటులో కలిసిపోయిందని కానిస్టేబుల్ చెప్పటంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది.కానిస్టేబుల్ తన దగ్గర ఎటువంటి అమౌంట్ లేదని చెప్పడంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. దాంతో ఆ వ్యక్తి రైడ్ జరిగిన రోజు కానిస్టేబుల్‌కు తాను ఇచ్చిన లక్ష రూపాయలు నగదు సంబంధించిన సీసీఫుటేజ్‌నుజిల్లాఉన్నతాధికారులకు పంపించాడు. దానిపై రహస్య విచారణ జరిపిన జిల్లా ఉన్నతాధికారులు మొత్తం వ్యవహారాన్ని బయటకు తీశారు. లక్షల రూపాయలు సైడ్ అయ్యాయని గుర్తించారు. వెంటనే పెరవలి ఎస్సై అప్పారావుని, రైటర్ బుద్దిశ్వరుడు, కానిస్టేబుల్ చల్లారావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.వారితోపాటు నిడదవోలు సర్కిల్ పరిధిలో ఘటన జరిగిన నేపథ్యంలో నిడదవోలు సీఐ శ్రీనివాసులు నుకూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఇలా పెరవలిలో పోలీసులు సస్పెండ్ అయ్యారో లేదో ఏలూరులో మరో రైడ్లో ఏకంగా ముగ్గురు పోలీసులు పేకాడుతూ దొరికిపోయారు. శనివారపుపేట అబ్బిరెడ్డి అపార్ట్‌మెంట్‌లో గత కొంత కాలంగా పేకాట జరుగుతోంది. అయితే దీనిపై జరిగిన పోలిసుల దాడిలో ముగ్గురు కానిస్టేబుల్స్‌‌తో పాటు మరో 8 మంది వ్యక్తులు అరెస్టు అయ్యారు. వీరిలో కానిస్టేబుల్ రవికుమార్ (ట్రాఫిక్) , B. ప్రకాష్ (భీమడోలు), A. శ్రీనివాస్ (ఏఆర్ భీమవరం.) ఉన్నారు. వీరి వద్ద నుండి రూ.2,35,500 నగదు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
????బిష్ణోయ్ ని చంపితే రూ.1,11,11,111… రివార్డ్ ప్రకటించిన సేన!..జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ని ఎన్కౌంటర్లో చంపిన ఏ పోలీసు అధికారికైనా రూ.1,11,11,111 నజరానా ఇస్తామని క్షత్రియ కర్ణి సేన ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ వీడియో విడుదల చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. 2023లో కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్వ్ సింగ్ గోగమేడీని దుండగులు కాల్చిచంపారు. ఆపై ఆయనను తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.
????రౌడీషీటర్ దాడిలో గాయపడిన యువతి మృతి..
రౌడీషీటర్ దాడిలో గాయపడిన యువతి మృతి
రౌడీషీటర్ దాడిలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి మృతి చెందింది. నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. వల్లభాపురానికి చెందిన రౌడీషీటర్ నవీన్, తెనాలి ఐతానగర్‌కు చెందిన సహానా (25) ఆరేళ్లుగా స్నేహితులు. ఈ నెల ఇద్దరు తెనాలి మండలం కఠెవరం శివారుకు వెళ్లారు. అక్కడ సహానా.. నవీన్‌కు ఇచ్చిన నగదుతో పాటు గర్భం దాల్చిన విషయాన్ని చెప్పింది. దాంతో మాట మాట పెరగడంతో నవీన్ యువతి తలను కారు డోర్‌కేసి కొట్టాడు.
???? ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య.. గుంటూరు పట్టణంలోని రెడ్డిపాలెంశ్రీ చైతన్య టెక్నో క్యాంపస్ లో చిలకలూరిపేటకు చెందిన కరణం పద్మసుధ 8th క్లాస్ చదువుతుంది, స్కూలులోనే మంగళవారం రాత్రి ఉరి వేసుకుని చనిపోయినట్లు యాజమాన్యం తెలియజేయడంతో, కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు. పద్మసుధ మృతికి కారణం తెలియాల్సి ఉంది. మొఖం చాటేసిన యాజమాన్యం, స్కూలుకు సంబంధించిన యాజమాన్యం పలువురు పలు విధాలుగా మృతికి కారణాలు తెలియజేయడంతో, అనుమానించిన కుటుంబ సభ్యులు, వారి శ్రేయోభిలాషులు, మీడియాను పోలీసు వారి సహకారం కోరుతూ స్కూలు వద్ద నే బైఠాయించారు.
???? త్వరలో పూర్తి నివేదిక అందిస్తాం..
కాళేశ్వరం కమిషన్‌కు తెలిపిన విజిలెన్స్‌ డీజీ..
హైదరాబాద్‌, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నివేదికను త్వరలోనే అందించనున్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కాళేశ్వరం విచారణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘో్‌షను కలిశారు. విచారణ పూర్తి కావస్తోందని నివేదించారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) కూడా త్వరలోనే నివేదిక సమర్పించనున్నట్లు కమిషన్‌కు సమాచారం ఇచ్చింది. బుధవారం నుంచి కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ పునఃప్రారంభించనుంది. ఈ దఫా ఇదివరకే విచారణకు హాజరైన రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లుతో పాటు గజ్వేల్‌ ఈఎన్‌సీ బి.హరిరామ్‌ను కూడా పిలిచే అవకాశాలున్నాయి.
???? హైదరాబాద్‌ను సియోల్ నగరంలా మార్చాలన్నదే సీఎం ఆలోచన: ఎంపీ చామల కిరణ్ కుమార్..
మూసీ ప్రక్షాళన చేసి హైదరాబాద్‌ను సియోల్ నగరంలాగా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సౌత్ కొరియాలోని సియోల్ ఉన్న సీవేజ్ ప్లాంట్ ను తెలంగాణ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సియోల్ నగరంలో STP ప్లాంట్స్ వాడి నీటిని శుద్ధి చేసినట్టు హైదరాబాద్ లో కూడా STP ప్లాంట్స్ ఏర్పాటు చేసి మూసీ నదికి పునరుజ్జీవం తెస్తామని ఆయన తెలిపారు.
**విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దు: ఆర్టీసీ ఎండి సజ్జనార్.. హైదరాబాద్:
విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్నారు.ఆర్టీసీ బస్సులు సరిపడ లేకపోవడం వల్లే ప్రమాదకరంగా ప్రయాణం చేయవలసి వస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జనార్ రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పు డు బస్సులను అందు బాటులో ఉంచుతున్నారని తెలిపారు.
అయినా కొన్ని రూట్లలో విద్యార్థుల రద్దీ వీపరీతంగా ఉంటున్న విషయం సంస్థ దృష్టికి వచ్చిందని తెలిపా రు.కాగా, టీజీఎస్ఆర్టీసీకి చెందిన ఒక బ‌స్సులో కొందరు విద్యార్థులు ఫుట్ బోర్డు ప్ర‌యాణం చేస్తోన్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యియి..
ఈ విషయం ఆర్టీసీ యాజమాన్యందృష్టికి వ‌చ్చింద‌ని తెలిపారు.రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణ‌యించిందని.. ఆ దిశ‌గా చ‌ర్య‌లు కూడా తీసుకోవ‌డం జ‌రుగుతోంద ని తెలిపారు. విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేం దుకు టీజీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని వెల్లడించారు. తమ వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకొని ఫుట్ బోర్డు ప్రయాణం సురక్షితం కాదన్నారు.
????ఈ ప్రభుత్వంలో ప్రాణాలకే భరోసా లేదే’.. కాంగ్రెస్‌పై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు..!!*
తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యను నిరసిస్తూ చేపట్టిన నిరసనను కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విరమించుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ హామీ ఇవ్వడంతో జీవన్ రెడ్డి తన నిరసన విరమించారు.
దాదాపు మూడు గంటల పాటు ఈ నిరసన జరిగింది. అధికారంలో ఉన్న పార్టీ నేతకే భద్రత లేదంటే రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి పాలనను, కాంగ్రెస్ పెద్దలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ నుంచి తప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయని, ప్రజా సేవ చేయాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి తనకు పార్టీతో పని లేదని వ్యాఖ్యానించారు. ‘నీకో దండం.. నీ పార్టీకో’ దండం అంటూ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నేనెందుకు బతకడం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీతో పనిలేదని, ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని అయినా దాని ద్వారా ప్రజాసేవను కొనసాగిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
*నేను భరోసా ఇవ్వలేను..*
”నేను పార్టీలో ఇక ఉండలేదు. నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకే భరోసా లేదు. ఫిరాయింపులను ప్రోత్సహించొద్దని నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు కోరుకున్నారు. కానీ నేడు కాంగ్రెస్ పార్టీ.. వాళ్లు చెప్పిన దాన్నే మరిచింది. మన మహానీయుల విగ్రహాలను ఎందుకు పెడతాం. వారి ఆలోచనా విధాన్ని అలవర్చుకోవాలన్న ఉద్దేశంతో.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ అంటోందే తప్ప వారి విధి విధానాలు ఏమాత్రం ఆచరించడం లేదు. గతంలో కేసీఆర్ ఎలా నడుచుకున్నారో.. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే మార్గంలో వెళ్తోంది. మన నాయకుడు రాహుల్ గాంధీ అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నాయి. ఎవరికీ భరోసా ఇచ్చే స్థితిలో నేను లేను. నా ఆవేదనను మాత్రమే వ్యక్తం చేస్తున్నా” అని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
*శాంతి భద్రతలేమయ్యాయి..*
”కేసీఆర్ తప్పు చేశాడు కాబట్టి నేను చేస్తా.. కేటీఆర్ అక్రమాలు చేస్తే కాని తప్పు నేను చేస్తే అక్రమం అవుతుందా అనడం సరైన పద్దతి కాదు. కేసీఆర్ తప్పు చేశారు కాబట్టే ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. అయితే మన నాయకుడు కేసీఆరా? రాహుల్ గాంధీనా? మన నాయకుడు రాహుల్ గాంధీ ఏం చెప్పారు. మీరు ఏం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సంతోషపడాలా? లేక నా మనుషులను చంపేస్తున్నారని బాధపడాలో అర్థం కావట్లేదు. నా అనుచరుడిని చంపిన నిందితుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున డబ్బులు పంచాడు. బీఆర్ఎస్ నేతలకు అడ్డొస్తే భౌతికంగా దాడులు చేస్తున్నారు. నిందితుడు నా అనుచరుడిని చంపేస్తానని ముందే హెచ్చరించాడు. అంత హెచ్చరించినా పోలీసులు కనీసం పట్టించుకోలేదు. జరుగుతున్న పరిణామాలను తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. ప్రభుత్వానికి పుల్ మెజారిటీ ఉన్నా ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు. ఫిరాయింపు రాజకీయం కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వం పునారాలోచించాలి” అని వేడుకున్నారు.
*నాకీ రాజకీయాలొద్దు..*
”నేను రాజకీయల నుండి తప్పుకుంటా. దయచేసి మమ్మల్ని బతకనివ్వండి. నిన్నటి దాకా వాళ్లే రాజ్యం ఎలిండ్రు. ఇవ్వాళా వాళ్ళే రాజ్యం చేస్తుండ్రు. నేనే రాజకీయాల నుండి తప్పుకుంటా. నాకు ఏ పదవి అక్కర్లేదు. వాళ్లనే రాజ్యం చేసుకొమ్మనండి. కాంగ్రెస్ పార్టీ ముసుగులో మా ప్రాణాలు తీస్తుంటే రక్షించాల్సిన పోలీసులు మీరు వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు. పార్టీ కూడా అలాంటి వారికే వత్తాసు పలుకుతుంది. నీకూ, నీ పార్టీకో దండం లక్ష్మణ్..ఇకనైనా మమ్మల్ని బ్రతకనివ్వండి. ఇంతకాలం మానసికంగా అవమానలకు గురైనా తట్టుకున్నాం. ఇవ్వాళా ప్రాణాలకే రక్షణ లేకపోతే మాకేందుకు పార్టీ, ప్రభుత్వం” అని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి.
???? పోలీస్ అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా మార్కాపురం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.
మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు సైదు బాబు, అంకమ్మరావు, ఏఎస్ఐ రామ్మోహన్ రావు, డాక్టర్స్, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది యువత తదితరు పాల్గొన్నారు.
???? అర్ధరాత్రి అక్రమరేషన్ పై పంజా విసిరిన సబ్ కలెక్టర్
???? 3 టన్నుల పై బియ్యం తో వెళ్తున్న లోడుపై మెరుపు దాడి చేసిన* మార్కాపురం సబ్ కలెక్టర్* ???? 300 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత..
*ప్రకాశం జిల్లా కంభం* ::బుధవారం అర్ధరాత్రి సమయం లో మాటేసి మరి మూడు టన్నుల పైగా అక్రమముగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ పట్టుకున్నారు. పక్కా గా వచ్చిన సమాచారం మేరకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పరిది లోని కుంట వద్ద నుండి తమిళనాడు రాష్ట్ర బంగారుపేట కు అక్రమముగా తరలిస్తున్న మూడు టన్నుల పై చిలుకు రేషన్ బియ్యాన్నీ మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట నాగ త్రినాధ్ తో పాటు బెస్తవారీపేట ఎం ఆర్ ఓ జితేంద్ర తో కలిసి చాక చక్యంతో దాడులు చేసి పట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనాన్ని అక్రమ బియ్యం రవాణా చేస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ దాడీలో కంభం మండలం వీఆర్వో సంఘం అధ్యక్షుడు దాదా పీరా, వి ఆర్వో పీర్ సా, వెంకటేశ్వర్లు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
????అర్ధవీడులో బెల్ట్ షాపులకు వేలంపాట!.. ప్రకాశం జిల్లా
అర్ధవీడు మండలం మాగుటూరు, గ్రామంలో బెల్ట్ షాపులు బహిరంగంగా వేలంపాట నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సోమవారం రాత్రి గ్రామంలోని ఓ గుడిలో వేలంపాట నిర్వహించగా ఏడు లక్షలకు వ్యక్తి మద్యం బెల్ట్ షాప్ వెక్కించుకున్నాడని సమాచారం
*ఎమ్మార్పీ కన్నా 30 రూపాయలు నుంచి 50 రూపాయల వరకు అధికంగా అమ్ముకోవచ్చునని గ్రామంలో మరెవరు మధ్యమరాదని తీర్మానం చేసినట్లు సమాచారం*???

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా