ఉమ్మడి అనంతలో వరద విళయం..వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున..వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేష్..హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం ..గండేపల్లి సెంధిని (లిక్కర్)ఫ్యాక్టరీలో సిఐడి సోదాలు.. సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బెదిరింపులు.. రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన కానిస్టేబుల్ భార్యలు.. దారి దోపిడి కేసును ఛేదించిన బాపట్ల పోలీసులు..జడ్పి సర్వసభ్య సమావేశంలో సమస్యలు లేవనెత్తిన ఎమ్మెల్యే ముత్తుముల..ఏసీబీకి చిక్కిన పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్..సత్యకుమార్ యాదవ్పై హత్యాయత్నం..బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్ ..6 ఎకరాల భూమి స్వాహా..

????వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేష్..
అమరావతిః ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు.ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి..అనంతరం తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
????మామూనూరు 4వ బేటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల ఆవేదన..వరంగల్ జిల్లా..కానిస్టేబుళ్లను వెట్టిసాకిరి చేపిస్తూ.. కనీసం సెలవులు ఇవ్వకుండా.. కుటుంబానికి దూరం చేస్తున్నారని కన్నీరు మున్నేరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు..కానిస్టేబుల్ ల భార్యలు రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు..నిరసన ఆపేందుకు RTO ఆపీస్ నుండి మామునూరు బేటాలియన్ వరకు పెద్ద ఎత్తున బందోబస్తూ ఏర్పాటు..రిజర్వ్డ్ పోలీసుల బాధలను అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విన్నపం..కొత్త డీజీ రావడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం.
???? ఉమ్మడి అనంతలో వరద విళయం ..
తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కురిసాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం అనంతపురం జిల్లాలోని అనంతపురం నగర శివారు కాలనీలో పూర్తిగా నీట మునిగాయి. శ్రీ సత్య సాయి జిల్లాలో చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండున్నర దశాబ్దాల కాలంలో ఎప్పుడూ లేనివిధంగా చిత్రావతిలో నీరు పారుతోంది. అదే జిల్లాలోని కనగానపల్లి చెరువు తెగిపోవడంతో అనంతపురం నగరం సమీప కాలనీలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని ఎన్నడూ కూడా ఇలా ఇంత పెద్ద ఎత్తున వరద నీరు రాలేదని పలు కాలనీలవాసులు తెలిపారు.
భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందుతుంది. తిండి గింజలు కట్టుకున్న బట్టలు సైతం నీటిపాలయ్యాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రధానంగా శ్రీసత్యసాయి జిల్లాలోని వాగులు,వంకలు,చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అక్కడికి సమీపంలో ఉన్న కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. అదే సందర్భంలో నీట మునిగిన పలు కాలనీల నుంచి ప్రజలను పోలీసు యంత్రాంగం రక్షించింది.అనంతపురంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు పండమేరు వాగు ఉప్పొంగింది.
వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం పెరుగుతుండ డంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. భారీ వర్షాలకు 44 పై భారీగా వర్షపు నీరు చేరడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహన దారులు వదర నీటిలో ఇబ్బందులు పడ్డారు.
????వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున..
అనంతపురంలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది, ఈ భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది, పండ మేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది,సినీ నటుడు అక్కినేని నాగార్జున మంగళవారం వరదలో చిక్కుకున్నారు. అనంతపురంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవం లో ఆయన పాల్గొనాల్సి ఉంది. పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణీస్తున్న కారు వరదలో చిక్కుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు మరో దారిలో పుట్టపర్తి నుంచి అనంత పురానికి ఆయనను సురక్షితంగా సాగనంపారు.
???? ఇటీవల బాపట్ల జిల్లా మేదర మెట్ల హైవేలో జరిగిన 39.5 లక్షల దారిదోపిడి కేసును ఛేదించిన పోలీసులు..
అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి… అభినందించారు…బాపట్ల జిల్లా మేదరమెట్ల లో సంచలనం కలిగించిన భారీ దారి దోపిడీని చేదించిన అద్దంకి రూరల్ సీఐ డి మల్లికార్జునరావు, మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ లను జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ తుషార్ డూడి… అభినందించారు…ముందుగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించరు..
ధనికొండ వెకన్నస్వామి, పగడాల మహేష్, టెంటు కార్తీక్, పూరేటి శివశ్రీనివసరావు, లను సోమవారం మేదరమెట్ల వై జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 39.5 లక్ష లను స్వాధీనం చేసుకున్నారు.. నేరస్తులు ఓకే గ్రామని చెందిన వారు. కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అడినందించారు… ఈ కార్యక్రమాల్లో జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వరావు, సీఐ లు ఎస్ఐ లు పోలిసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి ఫయాజ్..
????హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం !????
హైదరాబాద్‌లో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ ధరలే ప్లాట్లు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ఈ కంపెనీ వంద కోట్లలకుపైగా వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నెలలు గడిచిపోతున్నా ప్లాట్లు ఇవ్వకపోవడం తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులంతా ఆ కంపెనీ కార్యాలయం ఉన్న ఎల్బీనగర్ లో ఆందోళనకు దిగారు.
స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థ ఫామ్ ల్యాండ్స్, హెచ్‌ఎండీఏ ప్లాట్లు అమ్ముతామని ఏజెంట్లను పెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేసుకుంది. మొదట్లో పెద్ద ఎత్తున లగ్జరీ కార్యక్రమాలు నిర్వహించింది. ఏజెంట్లకు ఆడికార్లు వంటివి బహుకరించింది. ఈ బిల్డప్ చూసి భారీగా భూములున్నాయని చాలా మంది అనుకున్నారు. పద్ద ఎత్తున రిటర్న్స్ వస్తాయని చెప్పి ప్లాట్ల కోసం డబ్బులు కట్టించు కున్నారు.ఏవో ఒప్పంద పత్రాలు ఇచ్చారు కానీ అందులో భూమి,ప్లాట్ల వివరాలు లేవు.మూడేళ్ల నుంచి వారి కార్యకలాపాలు తగ్గిపోయాయి.డబ్బులు కట్టిన వారు తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని అడుగుతున్నా స్పందించడం లేదు. చివరికి వారు స్పెక్ట్రా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్కువ ధరకు ప్లాట్లు అని చెబితే…సర్వం పోగొట్టుకున్న కుటుంబాలు లబోదిబో మంటున్నాయి. స్టేట్ ఇంచార్జ్ హైదర్ అలీ..
???? సత్యకుమార్ యాదవ్పై హత్యాయత్నం..పోలీసులకు ఫిర్యాదు..
మంత్రి సత్య కుమార్ యాదవ్ పై గత వైసీపీ ప్రభుత్వంలో హత్యాయత్నం జరిగిందని బీజేవైఎం నేత సురేశ్ గుంటూరు ఎస్పీకి పిర్యాదు చేసారు. 2023లో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపి తిరిగి వస్తుండగా, అప్పటి ఎంపీ నందిగం సురేశ్ మరియు మరికొందరు దాడికి యత్నించారని పేర్కొన్నారు. ఆ సమయంలో పోలీసుల వద్ద ఫిర్యాదు చేసినప్పటికీ, ఫిర్యాదును స్వీకరించలేదని సురేశ్ ఆరోపించారు. ప్రస్తుతం, గుంటూరు ఎస్పీ తాజా ఫిర్యాదును స్వీకరించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.బీజేవైఎం (భారతీయ జనతా యువ మోర్చా) నేత సురేశ్ రాజకీయంగా యాక్టివ్ ఉన్న యువనాయకుడు. ఆయన బీజేపీకి చెందిన యువ నాయకత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. సురేశ్ తరచుగా రాజకీయ, సామాజిక అంశాలపై బలమైన వైఖరిని ప్రకటిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంటాడు..స్టేట్ ఇంచార్జ్ హైదర్ అలీ.
????ఎన్టీఆర్ జిల్లా ..కంచికచర్ల మండలం, గండేపల్లి సెంధిని (లిక్కర్)ఫ్యాక్టరీలో సిఐడి సోదాలు..
ఉదయం నుంచి రహస్యంగా కొనసాగుతున్న సోదాలు..
మీడియాను లోపలికి అనుమతించని సిఐడి బృందం..
గతంలో ఫ్యాక్టరీ పై కేసు నమోదు అయిన నేపథ్యంలో నేడు విచారణ నిమిత్తం సిఐడి అధికారులు తనిఖీలు చేస్తున్నట్లుగా సమాచారం..
మరింత సమాచారం తెలియాల్సి ఉంది
???? దేశంలోని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బెదిరింపులు..
దేశంలోని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బెదిరింపులు
దేశ రాజధాని ఢిల్లీలోని రోహణిలో పేలుడు ఘటన మరువకముందే మరోసారి సీఆర్పీఎఫ్ పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. దేశంలోని అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను తరగతి గదుల్లో అమర్చినట్లు దుండగుడు మెయిల్‌లో పేర్కొన్నాడు. ఉదయం 11 గంటల్లోగా అన్ని పాఠశాలలను ఖాళీ చేయాలని అన్నాడు. కాగా, ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
????ఏసీబీకి చిక్కిన పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్..!
వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం మున్సిప‌ల్ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఏసీబీ దాడులు నిర్వ‌హించారు.
పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు కాంట్రాక్టర్ నుంచి రూ.20,000 లు లంచం తీసుకుంటుండ‌గా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఏసీబీ అడిష‌న‌ల్ ఎస్పీ బి.శ్రీ‌కృష్ణ గౌడ్, కమిషనర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా రు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.
????ప్రకాశం జిల్లా జడ్పి సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.
చిన్నపాటి వర్షానికి నూతనంగా నిర్మించిన గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి వర్షానికి లీక్ అవుతుంది????…రోగులు ఇబ్బంది పడుతున్నారు..నాణ్యత లోపంతో గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు.. కాంట్రాకర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలి… అదే కాంట్రాక్టర్ తో ఆసుపత్రి మరమ్మతులు చేపట్టాలి..కలెక్టర్ కుడా ఆసుపత్రిని విజిట్ చేశారు…???? ఎటువంటి మార్పు లేదు..గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్సుకి కొత్త గా డ్రైవర్ కేటాయించాలి..ఇక కొద్ది ప్రస్తుత అంబులెన్సు డ్రైవర్ రెండు నెలలో రిటర్డ్ అవుతున్నారు.. ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లెడ్ కొరత ఉంది.. అధికారులు దృష్టి సారించి ఆసుపత్రిలో బ్లెడ్ నిల్వలు పెంచాలి..మరో మత్తు డాక్టర్ ని గిద్దలూరు ఆసుపత్రికి కేటాయించాలి.. ఆసుపత్రిలో డాక్టర్స్ కొరత ఉంది.. డిప్యుటీషన్ వెళ్లిన డాక్టర్స్ మళ్ళీ గిద్దలూరు లో విధులు నిర్వహించే విదంగా అధికారులు చూడాలి..
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎస్ రహేమాన్..
????కడప జిల్లా..యర్రగుంట్ల..*బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్
*6 ఎకరాల భూమి స్వాహా????????????
తాను బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి తన భూమిని ఆన్లైన్లో ఎక్కించుకున్నారని యర్రగుంట్లకు చెందిన భూమి రెడ్డి చిన్ననాగిరెడ్డి అనే వృద్ధుడు వాపోయాడు.
యర్రగుంట్లలో ఆయన తన గోడును విలేకరులకు తెలుపుతూ.ముద్దనూరు మండలం చిన్న దుద్యాల గ్రామంలో తనకున్న 6 ఎకరాల భూమి నీ ముద్దునూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రైటర్ గా పనిచేస్తున్న బో రెడ్డి శివశంకర్ రెడ్డి తాను మరణించినట్లు తప్పుడు ధృవీకరణ పత్రాన్ని సృష్టించి తన పేరు మీద ఉన్న భూమిని ఆన్లైన్లో శివశంకర్ రెడ్డి తన పేరు మీదికి మార్చుకున్నాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మండల తహసిల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ శివ శంకర్ రెడ్డి పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికారులు తిప్పుకుంటున్నారని ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు..

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా