????జర్నలిస్ట్ హత్యకేసులో నిందితుడికి కూటమిలో ప్రమోషన్!? అవును… సంచలనం సృష్టించిన గౌరీ లంకేష్ హత్యకేసులో నిందితుడైన శ్రీకాంత్ పంగార్కర్ శివసేనలో చేరినట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2017లో జరిగిన ఈ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పంగార్కర్ మహారాష్ట్రలోని జల్నాలో శివసేనలో చేరాడు. ఇందులో భాగంగా… రాష్ట్ర మాజీ మంత్రి అర్జున్ ఖోట్కర్ సమక్షంలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరినట్లు పీటీఐ నివేదించింది. అవును… సంచలనం సృష్టించిన గౌరీ లంకేష్ హత్యకేసులో నిందితుడైన శ్రీకాంత్ పంగార్కర్ శివసేనలో చేరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన ఖోట్కర్… పంగార్కర్ మాజీ శివసైనికుడని, నేడు పార్టీలోకి తిరిగి వచ్చాడని.. జల్నా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆయన చీఫ్ గా నామినేట్ అయ్యారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక, తాను జల్నా నుంచి పోటీ చేయనున్నట్లు ఖోట్కర్ తెలిపారు. మహాయుతిలో (శివసేన, బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కూడిన కూటమి) సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కాగా… 2017 సెప్టెంబర్ 5న జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ను బెంగళూరులోని ఆమె ఇంటి బయట కాల్చి చంపిన సంగతి తెలిసిందే! జాతీయ మీడియా నివేదికల ప్రకారం… జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. ప్రధాన నిందితుడు అమోల్ కాలె సీనియర్ సహచరుడిగా పంగాకర్ ను సూచించింది. గౌరీ లంకేష్ ను హత్య చేయాలని మహారాష్ట్రకు చెందిన వ్యక్తులే ఆదేశాలు జారీ చేశారని అమోల్ కాలే వెల్లడించినట్లు సిట్ పేర్కొంది.

ఇదే సమయంలో… గౌరీ లంకేష్ హత్యకు ముందు, తర్వాత పంగార్కర్.. కాలేతో టచ్ లో ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని చెబుతారు. ఇతడు 2018 ఆగస్టులో అరెస్టయ్యాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 4న బెయిల్ పై విడుదలయ్యాడు. అంతక ముందు 2011లో శివసేన అతడికి టిక్కెట్ నిరాకరించడంతో.. మితవాద హిందూ జనజతృతి సమితిలో చేరాడు. ఇక ఈ ఏడాది ఆగస్టులో.. 2018 ఆయుధ రవాణా కేసుకు సంబంధించి ఆరోపణలు ఉన్నా.. తగిన సాక్ష్యాధారాలు లేవని బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది!
???? బద్వేల్ పట్టణంలో హత్యయత్నానికి గురికాబడిన ఇంటర్ విద్యార్థిని మృతి.పోలీసుల అదుపులో అత్యాయత్నం చేసిన విగ్నేష్. బద్వేలు- మైదుకూరు రోడ్డులో విగ్నేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
*ఇంటర్ విద్యార్థిని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు*
*బద్వేల్ ఘటనలో నిందితుడిని వెంటనే శిక్షించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ*
*నేరస్తుడికి మరణ శిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం*
*మహిళలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలన్న సిఎం చంద్రబాబు*
*అమరావతి :-* కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై నిన్నటి నుంచి పోలీసు అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి… ఎప్పటికప్పుడు ఆమెకు అందుతున్న చికిత్స గురించి, కేసు విచారణ గురించి తెలుసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ సిఎంకు వివరించారు. వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సిఎం ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే….హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా శిక్షించడమే అని సిఎం అన్నారు. ప్రత్యేక కోర్టు లో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నిందితుడికి శిక్షపడేలా చూడాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఘటనలో నేరస్తుడికి మరణ శిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
???? పెట్రోల్ దాడి ఘటనపై స్పందించిన ఏపీ సీఎం..
పెట్రోల్ దాడి ఘటనపై స్పందించిన ఏపీ సీఎం
కడప జిల్లా బద్వేల్ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. ఇంటర్ విద్యార్థిని చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన సత్వరం విచారణ పూర్తి చేసి, నిందితునికి మరణశిక్ష పడేలా చూడాలని కోరారు. ‘మహిళలు, ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు చేసే వారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికలా ఉండాలి. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ విధానంలో కేసు విచారణ పూర్తి చేయాలి‘ అని సీఎం అధికారులను ఆదేశించారు.
????‘వైసీపీ స్వామి’కి.. చంద్రబాబు ఒకేసారి రెండు బిగ్ షాక్‌లు!!* ..వైసీపీ స్వామిగా పేరు తెచ్చుకున్న విశాఖ శారదా పీఠాధిపతి.. స్వామి స్వరూపానందేంద్రకు కూటమి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఒకే రోజు రెండు అంశాలకు సంబంధించి సర్కారు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 1) భూములు రద్దు. 2) తిరుమలలో కడుతున్న భవనాల తనిఖీ. ఈ రెండు అంశాలను కూడా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విశాఖలో శారదా పీఠం ఉన్న నేపథ్యంలో దీనిని విస్తరించేందుకుగాను.. గత వైసీపీ హయాంలో భీమిలి వద్ద.. 15 ఎకరాలను స్వామి పీఠం తీసుకుంది. అయితే.. మార్కెట్ వాల్యూ కంటే చీప్‌గా దీనిని అప్పగించారన్న అభియోగాలు ఉన్నాయి.
మార్కెట్ ధర ఎకరాకు రూ.15 కోట్లు ఉంటే.. ప్రభుత్వ ధర రూ.2 కోట్లకు అటు ఇటుగా ఉంది. అయితే.. వైసీపీ హయాంలో స్వామి భక్తి ప్రదర్శించిన అప్పటి సీఎం జగన్.. శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాలను కూడా ఒక్కొక్క ఎకరం రూ.లక్ష చొప్పున కేటాయించారు. దీంతో అప్పటి నుంచి ఈ వివాదంపై టీడీపీ నాయకులు తరచుగా స్పందిస్తూనే ఉన్నారు. విశాఖ నాయకులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా.. జగన్ సర్కారు మాత్రం ధార్మిక కార్యక్రమాలకు కేటాయించాం కాబట్టి.. తప్పులేదని సమర్థించింది. ఇక, తాజాగా ఆ భూముల కేటాయింపును రద్దుచేస్తూ.. చంద్రబాబుసర్కారు నిర్ణయం తీసుకుంది.
అయితే.. సర్కారు నిర్ణయంపై మఠం హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిసింది. ఒకసారి కేటాయింపు జరిగిన తర్వాత.. తాము రిజిస్ట్రేషన్ సొమ్మును కూడా చెల్లించిన తర్వాత.. రద్దు చేయడం కుదరదన్నది మఠం తాలూకు న్యాయవాదులు చెబుతున్న మాట. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఇక, 2వ విషయాన్ని చూస్తే.. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తిరుమల కొండపై ఇదే శారదా పీఠానికి బూములు కేటాయించారు. అప్పట్లో వైవీ సుబ్బారెడ్డి బోర్డు చైర్మన్‌గా ఉన్నారు.
బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరువలో కేటాయించిన భూమిలో శారదా పీఠం నిర్మాణాలు కూడా చేస్తోంది. అయితే.. నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటి నిగ్గు కూడా తేల్చాలని చంద్రబాబు సర్కారు ఆదేశించింది. ఈ బాధ్యతలను టీటీడీ ఈవో జె. శ్యామలరావుకు అప్పగించడం గమనార్హం. దీనిపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని, నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయాలని ఆదేశించింది.
????గుంటూరు నగరం పాలెం పోలీసు స్టేషన్ పరిధిలో అమరవీరుల స్థూపం వద్ద రేపు అక్టోబర్ 21 వ తేదీన ఉదయం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గుంటూరు నగరంలో వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ క్రింది విధముగా ట్రాఫిక్ డైవర్షన్ ను క్రమబద్ధీకరించడం జరుగుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు*
*ఈ ట్రాఫిక్ డైవర్షన్ ఉదయం 6 గంటల నుండి మొదలై కార్యక్రమం పూర్తి అయ్యేవరకు ఉంటుందని తెలియపరుస్తూ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ కోరారు*
ఈ క్రింది విధముగా ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు
???? పట్టాభిపురం కంకరగుంట( ఫ్లైఓవర్) వైపు నుంచి వచ్చే వాహనదారులు MTB సెంటర్ వైపు (రమేష్ హాస్పటల్) వైపు వెళ్ళు వారు కలెక్టరేట్ జంక్షన్ వద్ద కుడివైపుగా తిరిగి కలెక్టర్ బంగ్లా రోడ్డు మెడికల్ క్లబ్ వైపు వెళ్ళవలెను.
???? శంకర్ విలాస్ బ్రిడ్జి అండర్ పాస్ నుంచి మరియు రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాహనదారులు అంకమ్మ తల్లి గుడి వద్ద ఎడమ వైపు తిరిగి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి ఇంటి వైపు వెళ్లి కన్నవారి తోట రోడ్డులోని వైయస్సార్ బొమ్మ వద్దనుండి MTB వైపు రోడ్డు గాని కలెక్టరేట్ రోడ్డు వైపు గాని వెళ్ళవలెను.
???? MTB (రమేష్ హాస్పటల్) నుంచి వచ్చే వాహనదారులు కలెక్టరేట్ మరియు పట్టాపురం ఫ్లైఓవర్ (కంకర కుంట) బ్రిడ్జి వైపు యధావిధిగా వెళ్ళగలరు.
???? గౌరవనీయులైన కోర్టు వారు, సిబ్బంది మరియు లాయర్ గారు లు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న కోర్టు లోపలికి వెళ్ళే వారు కోర్టు గేటు నెంబర్ 2 ద్వారా నే వెళ్ళగలరని పోలీసు వారికి సహకరించగలరు.
???? అదేవిధంగా ఐ టి సి కార్నర్ వైపు నుండి నగరంపాలెం పోలీస్ స్టేషన్ మీదుగా వచ్చే వాహనదారులు కలెక్టరేట్ ఆఫీస్ రోడ్డు, పట్టాపురం ఫ్లైఓవర్ మీదుగా వెళ్ల గలరని పోలీసు వారికి సహకరించాలని గుంటూరుజిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ తెలియపరిచారు.
గమనిక *భారీ వాహనాలకు ఎటువంటి అనుమతి లేదు అవసరమైతే ఎస్బిఐ జంక్షన్ వద్ద 2 వీలర్స్ ఆటోలు మరియు కార్లు కూడా డైవర్షన్ చేయవలసిన అవసరం ఉంటుంది*
???? బాధితురాలికి న్యాయం చేయాలి,నిందితుడిని కఠినంగా శిక్షించాలి..ఐద్వా, DYFI, SFI, రైతు సంఘాల డిమాండ్..
బద్వేలు లో మైనర్ బాలిక ను ప్రేమోన్మాది విఘ్నేష్ ను కఠినంగా శిక్షించాలని, భాదిత విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కడప ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఐద్వా, DYFI, SFI, రైతు సంఘాల జిల్లా కార్యదర్షులు ఐ.యన్.సుబ్బమ్మ, వీరణాల.శివకుమార్, వీరపోగు.రవి,బి.దస్తగిరి రెడ్డి,సీఐటీయూ జిల్లా, DYFI, SFI జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులురెడ్డి ముడియం చిన్ని ఎద్దు రాహుల్ లు మాట్లాడుతూ దేశంలో,రాష్ట్రంలో మహిళల పై నిత్యం దాడులు,అత్యాచారాలు పెరిగి పోతున్నాయని అన్నారు.వీటిని అరికట్టడంలో పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు.దేశంలో బలమైన చట్టాలు లేకపోవడంతో అనునిత్యం మహిళలు,విద్యార్థినిలు పై అనేక రూపాలలో దాడులు పెట్రేగి పోతున్నాయని అన్నారు.గతంలో నిర్భయ లాంటి చట్టాలు వున్న అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయని అన్నారు.బద్వేలు లో జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గు పడేలా వున్నదని అన్నారు.బాధితురాలు కుటుంబానికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని,ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,ప్రేమోన్మాది విఘ్నేష్ ని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు గా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం డేవిడ్ రాజ్ రెబ్బ నరసింహలు జిల్లా సహాయ కార్యదర్శి ఆది తులసిశ్వర్ యాదవ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
???? తిరుమలలో ఇకపై ట్రాఫిక్ సమస్యకు చెక్
తిరుమలలో ఇకపై ట్రాఫిక్ సమస్యకు చెక్
AP: తిరుమలలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అత్యవసరంగా ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థపై అధికారులతో కలిసి టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే వారం రోజుల్లోపు సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించాలని సూచించారు.
**పవన్ కు బిగ్ షాక్.. డిప్యూటీ సీఎం గా లోకేష్**
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… ఇటీవల ఏర్పాటు అయిన కూటమి ప్రభుత్వంలో చీలికలు వచ్చే ప్రమాదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా చెబుతున్నారు.
ఏపీలో భారతీయ జనతా పార్టీ ప్రభావం ఎక్కువ లేకపోవడంతో వాళ్ళు.. ప్రభుత్వంపై దృష్టి పెట్టడం లేదు. కానీ బలంగా ఉన్న జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ నేతల మధ్య చిన్న చిన్న గొడవలు.. జరుగుతున్న సంగతి తెలిసిందే.ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో టిడిపి వర్సెస్ జనసేన… మధ్య ఏదో ఒక చిన్న వివాదం తెరపైకి వస్తూనే ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు… ఊహించని షాక్ ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి నుంచి పవన్ కళ్యాణ్ ను తొలగించే ఛాన్స్ ఉందట.
దీనికి సంబంధించిన వార్తలు ఎల్లో మీడియా లోనే ఎక్కువగా వస్తున్నాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ ను పక్కకు పెట్టి నారా లోకేష్ కు ఆ పదవి ఇవ్వబోతున్నారట. ఇటీవల మంత్రులకు జిల్లాల ఇన్చార్జి పదవులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ అటు నారా లోకేష్ కు పదవులు ఇవ్వలేదు. త్వరలోనే పవన్ కళ్యాణ్ ను దించేసి నారా లోకేష్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చేందుకే ఇలా వ్యవహరించాలని కొంతమంది అంటున్నారు.
ఇక మరి కొంతమంది అయితే… డిప్యూటీ ముఖ్యమంత్రినారా లోకేష్ కి ఇస్తారని… హోం మంత్రి పవన్ కళ్యాణ్ కు ఇస్తారని చెబుతున్నారు. ఇక మరి కొంతమంది… పవన్ కళ్యాణ్ కించపరిచేలా… చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పదవుల్లో ఏ తేడా వచ్చిన… జనసేన తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు. అదే ఇదంతా వైసిపి సోషల్ మీడియా ప్రభావం అని కొంతమంది చెబుతున్నారు. మొత్తానికి ఈ అంశం హాట్ టాపిక్ అయింది.
????చెప్పిన ప్రతీ కార్యక్రమాన్ని చేసి చూపిస్తాం..
*గత వైసీపీ పాలనలో విధ్వంసం తప్ప… అభివృద్ధి లేదు*
*బెస్తవారిపేటలో రూ. 93 లక్షల రూపాయల అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసిన “ఎమ్మెల్యే ముత్తుముల”
*ఎన్నికలకు ముందు ఎన్దీయే ప్రభుత్వం చెప్పిన ప్రతీ కార్యక్రమాన్ని చేసి చూపిస్తామని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా బెస్తవారిపేట పంచాయతీలో రూ. 93 లక్షల రూపాయలతో ప్రారంభించనున్న అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది ప్రజల ప్రభుత్వమని గత పాలనలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఎన్దీయే ప్రభుత్వం ప్రజలకు ఏ పాటి చిన్న సమస్య వచ్చిన వెంటనే స్పందించి ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు.. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డీఈ సుబ్బారెడీ, ఎంపీడీఓ రంగనాయకులు, మండల తహసీల్దార్ జితేంద్ర కుమార్, మండల NREGS అధికారి కుమార్, స్థానిక సర్పంచ్ ప్రేమానంద్, మండల అధ్యక్షులు సొరెడ్డి మోహన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పూనూరు భూపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుంటిక నరసింహులు,పట్టణ అధ్యక్షులు దూదేకుల సైదులు, జనసేన మండల అధ్యక్షులు ముంతల మధుసూదన్ రెడ్డి,లంకా నరసింహా రావు,ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.. ని. వర్గ రిపోర్టర్ ఫయాజ్..
*వలీమా కార్యక్రమంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామంలో సయ్యద్ పెద్ద మాబు కుమారుడు చి. మహబూబ్ పీరా” వలీమా కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధూ వరులకు శుభాకాంక్షలు తెలియచేశారు.. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్, స్థానిక నాయకులు పాల్గోన్నారు.*
*”ఛాయ్ బస్టర్” ను ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..*కొమరోలు మండలం, తాటిచెర్ల మోటు గ్రామంలో పీట్ల నారాయణ మరియు చల్లా రంగస్వామి గార్లు నూతనంగా ఏర్పాటు చేసిన “ఛాయ్ బస్టర్” షాపును గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మంచి రుచికరమైన టీ, కాఫీ లను ప్రజలకు పరిచయం చేస్తూ ప్రారంభించిన “ఛాయ్ బస్టర్” మంచి లాభాలతో ముందుకు సాగాలని యజమానులకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు, రైతు అధ్యక్షులు బిజ్జం రవీంద్రా రెడ్డి స్థానిక నాయకులు పాల్గోన్నారు.. డివిజన్ ఇంచార్జ్ అస్లాం బేగ్..
*నిరుపేద వికలాంగురాలి ఇంటికి వెళ్లి నిత్యావసర సరుకులు అందించిన నూర్ భాషా సంఘ నాయకులు..
కంభం మండలం నూర్ భాష అధ్యక్షుడు డి.ఖాదర్ వలీ(చమన్) ఆదివారం నిరుపేద వికలాంగురాలు
భానుబి బేగం ఇంటికి వెళ్ళి 2 నెలల నిత్యావసర సరకులు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ డి భానుబి బేగం మాట్లాడుతూ కష్టకాలంలో తమ కష్టాలు మరియు అవసరాలు తెలుసుకుని తమ ఇంటి వద్దకే వచ్చి నిత్యావసర సరుకులను అందించినందుకు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో నూర్ భాషా సంఘ నాయకులు డి.జిలాని, హబీబుల్లా,అలీషా,న్యామతుల్లా,ఫయాజ్ మాజీ ఎంపీటీసీ,
ఖాదర్ హుస్సేన్ పాల్గొన్నారు.జిల్లా స్టాపర్ రహిమాన్..
*ప్రకాశం జిల్లా..రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని పొలాల్లో సంచరిస్తున్న కొండచిలువను చూసి ఆందోళనకు చెందిన స్థానిక రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ రెస్క్యూ టీం సభ్యులు కొండచిలువలు పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు..
*విద్యుత్ షాక్ తో యువకుడు మృతి*
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంకనాంపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పొలంలోకి నీళ్లు వదిలేందుకు వెళ్లి మోటర్ స్విచ్ వేస్తుండగా విద్యుత్ షాక్ తో గ్రామానికి చెందిన నాగార్జున (26) అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగిన సంఘటనను గుర్తించిన స్థానిక రైతులు నాగార్జున కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు నాగార్జున మృతితో బోరున విలపించారు. జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జ్ ఫయాజ్..
జర్నలిస్ట్ హత్యకేసులో నిందితుడికి కూటమిలో ప్రమోషన్!?..పెట్రోల్ దాడి ఘటనపై స్పందించిన ఏపీ సీఎం…వైసీపీ స్వామి’కి.. చంద్రబాబు ఒకేసారి రెండు బిగ్ షాక్‌లు!!.. బాధితురాలికి న్యాయం చేయాలి..ఐద్వా, DYFI, SFI, రైతు సంఘాల డిమాండ్.. గుంటూరులో ట్రాఫిక్ డైవర్షన్.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల.. వికలాంగురానికి సాయం అందించిన నూర్ భాషా సంఘం.
Recent Posts

