ఇసుక పాలసీలో కొద్దిగా మార్పులు.. పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి మృతి..18 లక్షల విలువైన బియ్యం పట్టివేత.. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది- మాజీ సీఎం జగన్..ఆన్‌లైన్ బెెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బుక్కైన హీరోయిన్ తమన్నా.. విద్యార్థులను మద్యం తాగించి ? ..బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి..తల దువ్వినందుకు గుండు కొట్టించిన ఎస్సై.. మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు..గ్యాంగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – మార్కాపురం డి.ఎస్.పి నాగరాజు..భూ ప్రళయానికి సంకేతం ఇదేనంట?..

???? ఇసుక పాలసీలో కొద్దిగా మార్పులు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..ట్రాక్టర్లో సైతం ఉచిత ఇసుక తీసుకు వెళ్ళవచ్చు అంటూ ఆదేశాలు..భవన కార్మికులకు పని కల్పించే లక్ష్యంతోటే ఈ వేసులుబాటు అంటున్న అధికారులు.
????ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రేషన్ బియ్యం పట్టివేత…550 క్వింటాల రేషన్ బియ్యం,రెండు లారీలను స్వాధీనం..రేషన్ బియ్యం తరలిస్తున్న బాపట్ల జిల్లా కి చెందిన చీమకుర్తి సుధాకర్,కర్ణాటక కు చెందిన సలవుద్దీన్ అరెస్ట్.
????రేషన్ మాఫియా తరలింపులో గుంటూరు పట్టణానికి చెందిన వ్యాపారి హస్తం.*
*ప్రముఖ రేషన్ మాఫియా వ్యాపారి కోసం గుంటూరు కు చేరుకున్న నల్గొండ పోలీసులు..*
*పరారీలో ఉన్న గుంటూరు కు చెందిన రేషన్ బియ్యం వ్యాపారి..*పట్టుకున్న రేషన్ బియ్యం విలువ 18 లక్షల రూపాయల విలువ ఉంటుందని తెలిపిన ఎస్పీ శరత్ కుమార్…రేషన్ బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజస్థాన్, కర్ణాటక ,గుజరాత్ కు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడి..
????కర్నూలు జిల్లాలో ఉన్మాది ఘాతుకం*
ఇంటర్‌ విద్యార్థిని హత్య చేసిన ఉన్మాది..
విద్యార్థిని అశ్విని నోట్లో పురుగుల మందు పోసి హత్య
ప్రేమను నిరాకరించిందని కిరాతకం..
ఇంట్లో ఎవరూలేని సమయంలో తెగబడ్డ ఉన్మాది సన్నీ..
ఆస్పరి మండలం నగరూరులో ఘటన..
పీఎస్‌లో అశ్విని తల్లిదండ్రుల ఫిర్యాదు, కేసు నమోదు..
????రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ..మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి..
11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడంలేదు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణం. నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైంది..
లిక్కర్‌, ఇసుక స్కాంల్లో నిండామునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయి. బాబుగారు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడంలేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చినుంచి పెండింగ్‌లో పెట్టారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు. జీరో వేకెన్సీ పాలసీకి మంగళంపాడారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారు. విలేజ్‌క్లినిక్స్‌, పీహెచ్‌సీలను నిర్వీర్యంచేశారు. ఫ్యామిలీ డాక్టర్‌ ఊసేలేదు. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. కొత్త మెడికల్‌ కాలేజీలను అస్తవ్యస్తం చేశారు. స్కాంలు చేస్తూ అమ్మడానికి సిద్ధమవుతున్నారు. తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారు..ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి అని కోరారు..
???? ఒంగోలులోని మాగుంట కార్యాలయం లో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డిని మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, అసిస్టెంట్ జియాలజిస్ట్ వర్మ, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్ బాబు, తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.
????ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇటీవల ఒంగోలు లో నూతనంగా ప్రారంభించినస్నేహ సూపర్ స్పెషాలిటీ హాస్పిటలను సందర్శించిన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , మరియు డా.శరత్ మళ్లీపెద్ది ,డా.మళ్లీపెద్ది వి. కృష్ణయ్య , డా. సాయిస్నేహ యడ్లపల్లి తదితరులు పాల్గొన్నారు.


???? ఒంగోలు లోని బచ్చల బాలయ్య కళ్యాణమండపం లో నక్క సుకుమార్ గారు మరియు కాంతమ్మ ల కుమారుడు చి.కె .సుజిత్ మరియు చి. ల. సౌ. ప్రీతీ ఐశ్వర్య ల వివాహ మహోత్సవం లో పాల్గొని నూతన వధు వరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయినాబత్తిన ఘనశ్యాం , రాచర్ల మాజీ జెడ్పిటిసి కుప్పా రంగసాయి, నాదెండ్ల సుధాకర్ ,డా. రాజ్ విమల్ , సింగ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
????నేడు ఒంగోలులోని మాగుంట కార్యాలయం లో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్రీయ విద్యాలయ రిటైర్డ్ ప్రిన్సిపల్ మహేష్ కుమార్ ముందోటి ,వైస్ ప్రిన్సిపల్ బి. సూర్య ప్రకాష్ రావు,కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఓవి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.. స్టాఫ్ రిపోర్టర్ ఎస్ఎస్ రెహమాన్.
???? బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, రేడియో జాకీ(ఆర్‌జే) శేఖర్‌ బాషాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. యూట్యూబర్‌ హర్షసాయి బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు శేఖర్‌ బాషాను విచారించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శేఖర్‌ బాషా యూట్యూబ్‌ చానల్స్‌లో తప్పుడు ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని బాధితురాలు ఇటీవల పోలీసులను ఆశ్రయించింది.
కాగా, యూట్యూబర్‌ హర్షసాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద రూ. 2కోట్ల వరకు తీసుకున్నాడని, అత్యాచారం చేసి మోసం చేశాడని ఆమె కొద్ది రోజుల క్రితం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగా నిందితుడు హర్షసాయి పరారీలో ఉన్నాడు. మరోపక్క, సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ కేసు విషయంలోనూ శేఖర్‌ బాషా మీడియాలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే.
????ఆన్‌లైన్ బెెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బుక్కైన హీరోయిన్ తమన్నా..!!!
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసి హీరోయిన్ తమన్నా అడ్డంగా బుక్కైంది.
హెచ్‌పీజెడ్ టోకెన్ స్కామ్ అనేది కోట్లాది రూపాయల క్రిప్టో కరెన్సీ కుంభకోణం. భారీ ఎత్తున లాభాలు వస్తాయని, బిట్ కాయిన్స్ మైనింగ్ చేస్తామని హెచ్‌పీజెడ్ మోసాలకు పాల్పడింది. దీనిపై మొదటగా నాగాలాండ్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ అవుతున్న మూడు చైనీస్ కంపెనీలకు ఈ యాప్‌తో సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ యాప్‌కు తమన్నా ప్రమోషన్ చేయడంతో ఈడీ విచారణకు పిలిచింది.
????విద్యార్థినులకు మద్యం తాగించి… టూర్ లో లెక్చరర్ల తప్పుడు పని! ????????????అవును… విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులు తప్పుడు పనులకు పూనుకున్నారు.. ఇంట్లో తల్లితండ్రులు ఎలా కంటికి రెప్పలా కాపాడుకుంటారో, ఆ విధంగా విద్యార్థినులను చూసుకోవాల్సిన లెక్చరర్లు చిల్లర వ్యవహారాలు చేశారు.. వారి వంకర బుద్ధిని బయటపెట్టుకున్నారు.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం అధ్యాపక వృత్తికే మచ్చగా ఉందని అంటున్నారు. అవును… విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారిని నమ్మి, ఎదిగిన ఆడపిల్లలను విహారయాత్రకు పంపిన తల్లితండ్రుల నమ్మకాన్ని వమ్ముచేశారు. తమను ఎంతో నమ్మి వచ్చిన విద్యార్థినులపై తప్పుడుగా ప్రవర్తించారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. కేసు నమోదైంది! కర్ణాటకలోని కనకపురలో గల ఓ కళాశాల అధ్యాపకులు.. విద్యార్థులను అక్టోబరు 5వ తేదీ నుంచి 10వరకూ మడికేరి విహారయాత్రకు తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో అక్టోబరు తొమ్మిదో తేదీ రాత్రి ముగ్గురు విద్యార్థినులను తమ గదిలోకి పిలిపించుకుని వారితో మద్యం తాగమని ముగ్గురు లెక్చరర్లు ఒత్తిడి చేశారట. అలా బలవంతంగా వారితో మద్యం తాగించి.. అనంతరం డ్యాన్స్ చేయాలని బలవంతం చేశారని చెబుతున్నారు. ఈ సమయంలో తమతో అసభ్యంగా ప్రవర్తించారని బాధిత విద్యార్థినులు వాపోతున్నారు. ఈ క్రమంలో మేల్కొన్న తర్వాత.. సమస్యను కుటుంబ సభ్యులకు వివరించారట బాధిత విద్యార్థినులు. లెక్చరర్లు తమతో అలా ప్రవర్తిస్తున్న సమయంలో అటెండర్ వచ్చి వారించినా.. తప్పని చెప్పినా.. అతడిని దుర్భాషలాడుతూ లెక్చరర్లు బయటకు గెంటేశారని చెబుతున్నారు. ఈ సమయంలో తమను రక్షించడానికి మహిళా లెక్చరర్లు రాలేదనేది బాధిత విద్యార్థినుల ఫిర్యాదుగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. తమ తల్లితండ్రులతో కలిసి బాధిత విద్యార్థినులు ముగ్గురు లెక్చరర్స్ పై కనపుర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో ఆ ముగ్గురు లెక్చరర్స్ పై చర్యలు తీసుకోవాలని కర్ణాటక బాలల హక్కుల కమిషన్ కళాశాల యాజమాన్యానికి ఆదేశాలు జారీచేసింది.
???? బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి
పోలీసుల అదుపులో 42 మంది యువతులు, 100 మంది యువకులు..హైదరాబాద్ – బంజారాహిల్స్‌లోని పబ్స్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల నిన్న రాత్రి సోదాలు నిర్వహించారు.
ఉద్యోగాల పేరుతో యువతులను ట్రాప్ చేస్తున్న పబ్ యాజమాన్యాలు. ఎక్కువ బిల్‌ వచ్చేలా చేసే యువతులకు కమీషన్.. అశ్లీల నృత్యాలు చేసే యువతులకు ఎక్కువ డబ్బు ఆఫర్ చేస్తున్న పబ్ యాజమాన్యం.
???? విశాఖ: మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో ఈడీ సోదాలు.. ఎంవీవీ ఆడిటర్‌ జీవీ నివాసం, హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్, కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయాల్లోనూ తనిఖీలు.. మధురవాడ భూమి కొనుగోలు కేసులో సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు..
????మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి…*
డివిజన్ పరిధిలో ప్రజలు గ్యాంగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించిన డి.ఎస్.పి నాగరాజు….
తాళాలు వేసి ఊర్లకు వెళ్లినా వారి ఇండ్లపై దృష్టి పెడుతున్న గ్యాంగ్ దుండగులు…పట్టణం, గ్రామాలకు దూరం ఉండే దేవాలయాల్లోని హుండీలకు దొంగలిస్తున్న గ్యాంగులు..ఒంగోలులో చెడ్డి గ్యాంగ్ కదలికలను పసిగట్టిన పోలిసులు….పండుగలకు, పెండ్లిలకు ఇతర
ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసులకు తెలియజేయాలని సూచించిన డి.ఎస్.పి… దొంగల ప్రాభవం ఎక్కువగా ఉన్నందున డివిజన్లోని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
???? కడప జిల్లా బద్వేల్
బద్వేల్ పిపి కుంట వద్ద ఉన్నటువంటి సెంచరీ ప్లైవుడ్ సమీపంలోని అటవీ ప్రాంతానికి సమీపాన మైనర్ బాలిక ఒంటిపై మంటలు, కేకలు వేయడంతో గుర్తించిన స్థానికులు…పోలీసులు స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలింపు…ఆత్మహత్య ప్రయత్నమా లేక మరెవరైనా పెట్రోల్ పోసి నిప్పు అంటించారా అన్నది తెలియాల్సి ఉంది..
బద్వేల్ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న దస్తగిరమ్మ…
???? గంజాయి మత్తు లో బామ్మను చంపిన మనవడు..
????హైదరాబాద్ మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది రవకొల్ లో నివసించే ప్రశాంత్ అనే యువకుడు గంజాయి మత్తులో తన బామ్మ బాలమ్మను కిరతకంగా హత్యాచేశాడు బాలమ్మతో పింఛన్ డబ్బుల కోసం గొడవ పడిన ప్రశాంత్ ఆమె ఇవ్వకపోవడం తో తల పై దరణంగా కొట్టి చంపేశాడు కుటుంబ సభ్యులు ఫిర్యాదు తో పోలీసులు కేసు నమెదు.
???? పోలీస్ స్టేషన్లో న్యాయం జరగడంలేదని పోలీసుల ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి మృతి..ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ లే.. నా చావుకు కారణం అంటూ సెల్ఫీ వీడియో ..
పాలకుర్తి పోలీస్ స్టేషన్ ముందు శుక్రవారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లకావత్ శ్రీను మృతి.భారీగా పోలీస్ స్టేషన్ ముట్టడికి గిరిజన సంఘాల ప్లాన్..ఈ లోపే.. ఎస్సై సాయి ప్రసన్న కుమార్ ను డిస్మిస్ చేయాలనే యోచనలో వరంగల్ పోలీసు కమిషనర్..అత్యుత్సాహం ప్రదర్శించి కొట్టిన సిబ్బందిపై.. సీఐ మహేందర్ రెడ్డి పై శాఖ పరమైన చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం…
???? తల దువ్వినందుకు గుండు కొట్టించిన ఎస్సై.. మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు..
నాగర్ కర్నూల్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. లింగాల పోలీస్ స్టేషన్‌లో యువకులు గుండు కొట్టించడం కలకలం రేపుతోంది.
ఓ పెట్రోల్ బంక్ గొడవ విషయంలో స్టేషన్లకు పిలిపించి,ముగ్గురు యువకులను విచారి స్తుండగా సతీష్ అనే యువకుడు తల దువ్వుకున్నాడు.
దీంతో ఎస్సై ఆగ్రహంతో ఊగిపోయాడు. నా ముందే తల దువ్వుకుంటావా? అని సతీష్ అనే యువకుని తో పాటు మరో ఇద్దరు యువకులకు గుండు కొట్టించి ఇంటికి పంపించేశాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు తన ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటన లింగాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోని ఓ పెట్రోలు బంకు వద్ద యువకులకు, సిబ్బందికి మధ్య పెట్రోల్ విషయంలో గొడవ జరిగిందని విశ్వసనీయ సమాచారం. పెట్రోలు బంకు నిర్వాహ కుల ఫిర్యాదు మేరకు యువకులను పీఎస్‌కు తరలించారు. ముగ్గురు యువకుల్లో ఒకరు ఎస్సై ని ప్రశ్నించారు. దీంతో ఎస్సీ జగన్ ముగ్గురు యువకు లకు గుండు చేయించాడు.
మరుసటి రోజు ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ సంఘటన పోలీస్ డిపార్ట్మెంట్ లోను కలకలం రేపుతుంది, ఈ సంఘటనపై పోలీసు ఉన్నత అధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
????భూ ప్రళయానికి సంకేతం ఇదేనంట.. భయపెడుతున్న యూకే యూనివర్సిటీ పరిశోధనలు..!
అగ్నిపర్వతాలు పేలిపోవడం వల్ల.. పెద్ద మొత్తంలో కార్బన్ డైయాక్సైడ్ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని.. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుందని పరిశోధకులు చెపుతున్నారు.ప్రళయం వచ్చి మానవ జాతి భూమి నుంచి తుడిచిపెట్టుకుపోతుందని.. ఇది జరిగినప్పుడు మనుషులు, జంతువులతో సహా ఏ జీవి కూడా భూమిపై నివసించదని.. ఒక రోజు బూమి పూర్తిగా నాశసనమవుతుందని శాస్త్రవేత్తలు విస్మయం కలిగించే వాస్తవాన్ని వెల్లడించారు.ప్రళయం వచ్చి మానవ జాతి భూమి నుంచి తుడిచిపెట్టుకుపోతుందని.. ఇది జరిగినప్పుడు మనుషులు, జంతువులతో సహా ఏ జీవి కూడా భూమిపై నివసించదని.. ఒక రోజు బూమి పూర్తిగా నాశసనమవుతుందని శాస్త్రవేత్తలు విస్మయం కలిగించే వాస్తవాన్ని వెల్లడించారు.
యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారని డైలీ మెయిల్ నివేదిక తెలిపింది. 250 మిలియన్ సంవత్సరాల తర్వాత భూమిపై వరదలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారని డైలీ మెయిల్ నివేదిక తెలిపింది. 250 మిలియన్ సంవత్సరాల తర్వాత భూమిపై వరదలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
మానవులతో సహా అన్ని జీవరాశులు భూమి నుంచి కనుమరుగవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి సగటు ఉష్ణోగ్రత 70 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుంది. అలాంటి వాతావరణంలో ఏ జంతువు కానీ.. మనిషి కానీ జీవించలేరని తెలిపారు.. వేడెక్కడం వల్ల సమస్త జీవరాశులు నాశనమవుతాయి.
మానవులతో సహా అన్ని జీవరాశులు భూమి నుంచి కనుమరుగవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి సగటు ఉష్ణోగ్రత 70 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుంది. అలాంటి వాతావరణంలో ఏ జంతువు కానీ.. మనిషి కానీ జీవించలేరని తెలిపారు.. వేడెక్కడం వల్ల సమస్త జీవరాశులు నాశనమవుతాయి.
ప్రస్తుతం మనం ప్రపంచంలో కార్బన్ పరిమాణాన్ని పెంచుతున్న రేటు త్వరలో భూమిపై జీవరాశి అంతానికి లేదా అంతరించిపోవడానికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతరించిపోయినప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని చెపుతున్నారు.ప్రస్తుతం మనం ప్రపంచంలో కార్బన్ పరిమాణాన్ని పెంచుతున్న రేటు త్వరలో భూమిపై జీవరాశి అంతానికి లేదా అంతరించిపోవడానికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతరించిపోయినప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని చెపుతున్నారు.
ఆ సమయంలో అంటే 66 మిలియన్ సంవత్సరాల క్రితం, భూమిపై కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ఇప్పుడు ఉన్న దానికంటే రెట్టింపు ఉందని పరిశోధనా బృందం అధిపతి అలెగ్జాండర్ ఫార్న్స్వర్త్ చెప్పారు. ఇది శరీరాన్ని వేడెక్కించి జీవులను చంపిందని అంటున్నారు.
ఆ సమయంలో అంటే 66 మిలియన్ సంవత్సరాల క్రితం, భూమిపై కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ఇప్పుడు ఉన్న దానికంటే రెట్టింపు ఉందని పరిశోధనా బృందం అధిపతి అలెగ్జాండర్ ఫార్న్స్వర్త్ చెప్పారు. ఇది శరీరాన్ని వేడెక్కించి జీవులను చంపిందని అంటున్నారు.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా