సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..ఇకపై అన్ని కేసులు ప్రత్యక్ష ప్రసారం.. గంజాయి బ్యాచ్ కు సీఎం చంద్రబాబు హెచ్చరిక .. “రెడ్ బుక్…అరెస్టుల పర్వం మొదలైంద?..ఈ పోస్టు కార్డులు చూసైనా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వండి-షర్మిల. 150 కేజీల గంజాయి స్వాధీనం. ..కప్పట్రాలలో యురేనియం తవ్వకాలపై స్థానికులు వ్యతిరేకం..పోలీస్ స్టేషన్‌లోనే ఒంటికి నిప్పుంటించుకుని ఆత్మహత్యా యత్నం.. హోంగార్డుల పిల్లలకు ప్రోత్సాహకర చెక్కులు అందజేత..

???? సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కేసులు ప్రత్యక్ష ప్రసారం..
ఇప్పటివరకూ రాజ్యాంగ ధర్మాసనం, సీజేఐ విచారణలను మాత్రమే లైవ్ టెలికాస్ట్ చేసిన సుప్రీంకోర్టు
త్వరలో అన్ని రోజు వారీ కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న సర్వోన్నత న్యాయస్థానం
న్యాయ ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో చొరవ తీసుకున్న సీజేఐ డీవై చంద్రచూడ్.
????గంజాయి బ్యాచ్ ని హెచ్చరిస్తున్నా. గంజాయి ఆపేయండి. ఇక రాష్ట్రంలో మీ ఆటలు సాగవు..
రౌడీషీట్స్ తరహాలో గంజాయి షీట్స్ తెరవాలని మంత్రులు ప్రతిపాదనలు ఇచ్చారు..పబ్లిక్ ప్రదేశాల్లో, పోలీస్ స్టేషన్ లో గంజాయి బ్యాచ్ ఫోటోలు పెడతాం.
గంజాయి ఎవడూ పండించటానికి వీలు లేదు, రవాణా చేయటానికి వీలు లేదు, సేవించటానికి వీలు లేదు.
ఇదే మీకు ఫైనల్ వార్నింగ్…ఏపీ సీఎం చంద్రబాబు
????మద్యం పాలసీలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు: సీఎం*
ఏపీలో అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మెగా DSC, డిసెంబర్ నాటికి స్కిల్ సెన్సస్,పెన్షన్ల పెంపు వంటి పథకాలు అమలు ఇప్పటికే చేశామన్నారు.
ఉచిత ఇసుక, మద్యం పాలసీలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ జోక్యం చేసుకోవద్దన్నారు.మద్యం,ఇసుక విషయంలో పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు..
???? వైఎస్ఆర్సీపీ 11 కి పడిపోవడానికి చేయని తప్పులు లేవు.. ఎన్ డీ ఏ లో ఉండే ఏ ఒక్క చిన్న కార్యకర్త తప్పు చేసినా దాని ప్రభావం ముఖ్యమంత్రి పై పడుతుంది..
*మన ప్రవర్తనే మళ్ళీ ఎన్నికల్లో మన గెలుపు ఓటములను నిర్దేశిస్తుంది…* ఇదే సింపుల్ లాజిక్.. నాలుగు నెలలలో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈరోజు ఇస్తా.. చంద్రబాబు స్పష్టం చేశారు.
????రూ.5 కోట్లు ఇవ్వకుంటే..సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతాం’: హీరో సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు..????ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులు..బెదిరింపులపై పోలీసులకు వాట్సాప్ మెసేజ్..
బాబా సిద్ధిఖీ మాాదిరిగా చంపుతామని వార్నింగ్..!!!
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యోదంతం సంచలనంగా మారింది. ఈ తరుణంలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని, లేకుంటే సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతామని ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబయి ట్రాఫిక్‌ పోలీసుల వాట్సాప్‌ నంబర్‌కు గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెసేజ్‌ పంపారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దు… సల్మాన్‌ ఖాన్‌ ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా ఆయన రూ.5 కోట్లు ఇవ్వాలి… ఈ మొత్తం ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ కంటే ఆయన దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని దుండగులు హెచ్చరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, మెసేజ్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నామని ముంబయి పోలీసులు వెల్లడించారు. ఈ నెంబరు ఎవరిదో గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ నివాసం వద్ద భద్రతను పెంచారు. గతంలో బెదిరింపులు రావడం, ఆయన స్నేహితుడైన సిద్ధిఖీని దారుణంగా హత్య చేయడంతో పోలీసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
???? గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో హైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ విద్య సదస్సు కు ముఖ్యఅతిథిగా హాజరైన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క
జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించిన మంత్రి సీతక్క.. సదస్సుకు హాజరైన తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్, ప్రముఖ ngo, సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులు
ఈ సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమల శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ
గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ ను ప్రోత్సహించేందుకు మీరంతా సమావేశం అయినందుకు అభినందనలు
నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు
కార్పొరేట్, సాఫ్ట్వేర్ కంపెనీలు జీవోలను ఒక వేదిక మీదికి తీసుకొచ్చిన నిర్మాన్ సంస్థ ఫౌండర్ మయూర్ కి ప్రత్యేక అభినందనలు
మారుమల గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విద్యను అందించటానికి మీరంతా ముందుకు వచ్చారు
*సారం లేని భూమి విద్య లేని జీవితం ఒక్కటే*
అందుకే విద్య అనేది చాలా ముఖ్యం
దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే
సమాజంలో ఇంకా అంతరాలు ఉన్నాయి..
విద్యా బోధనలో కూడా అంతరాలు ఎక్కువగా ఉన్నాయి..
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది..
మైదాన ప్రాంతాల, అటవీ ప్రాంతాల మధ్య విద్య విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంది..
పట్టణ ప్రాంతాలకు మెరుగైన విద్య అందుతుంది..
గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు..
అందుకే విద్యలో ఉన్నంతరాలను తొలగించాలి..
సమానత్వ సాధన దిశలో విద్య కీలకం..
హైదరాబాదులో ఎలాంటి ఎడ్యుకేషన్ వుందో, మరుమల పల్లెలో అలాంటి విద్య ఉండాలి..
ఆ దిశలో మా ప్రభుత్వం కృషి చేస్తుంది..
గ్రామీణ విద్యార్థులు అవకాశం కల్పిస్తే బాగా రాణిస్తారు..
కానీ వారికి అవకాశాలు వస్తువులు లేపటం వల్ల వెనుకబాటుతనానికి గురవుతున్నారు..
అందుకే గ్రామీణ విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది..
అందుకు మీ వంతు సహకారం అందించండి
సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి ..
ఉన్నత విద్యవంతులున్న.సమాజంలో కనీస విద్యా లేనివారు సమాజంలో ఉండటం బాధాకరం..
అందుకే అంతరాలను తగ్గించే ఎందుకి మీ వంతు చేయూత ఇవ్వండి…
అభివృద్ధి వీకేంద్రీకరణ జరగాలి, అప్పుడే అందరికీ సమాన అవకాశాలు అందుతాయి..
అప్పుడు సమాజంలో పోరాటాలు ఉండవు ..
పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే మా లక్ష్యం ..
అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే వివక్షతా భావం ప్రజల్లో పెరుగుతోంది..
అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు..
మీకేంద్రీకరణ జరిగితేనే సమానత్వం సాధ్యపడుతుంది ..
అచ్చంపేట, ఆదిలాబాద్,ములుగు, భద్రాచలం వంటి అటవీ ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి మీరు ముందుకు రావడం ప్రపంచానికి ఆదర్శం..దేశమా అధిక రంగంలో దూసుకుపోతున్నా నిలువ నీడలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ..వారికి అండగా మీరు నిలిస్తే ప్రపంచమే హర్షిస్తుంది ..
డిజిటల్ విద్యలో ప్రభుత్వ ప్రయత్నమూ లో మీరు భాగస్వాములు కండి..మీ సి ఎస్ ఆర్ ఫండ్స్..మీరంతా గ్రామాలకు తరలండి…అటవీ గ్రామీణ పరిస్థితులను చూడండి..విద్యా వ్యవస్థ సరిగా లేనిచోట పర్యటించి ప్రణాళిక రూపొందించండి..ఆదివాసి గిరిజన ప్రాంతాల విద్య అభివృద్ధికి కృషి చేస్తే దేవుళ్ళుగా మిమ్మల్ని ఆరాధిస్తారు..నోరులేని నిస్సహాయుకులకు వద్దకు వెళ్లండి..
*ఒక్కో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోండి..
అప్పుడు మీరే మార్పుకు నాంది పలికిన వారవుతారు..
మనసుంటే మార్గం ఉంటుంది..చిత్తశుద్ధి, మంచి ఆలోచనలు ఉంటే కఠిన పరిస్థితులను అధిగమించగలుగుతాం..అటవీ శాఖ అభ్యంతరం పెడితే..కంటైనర్ ఆస్పత్రి, కంటైనర్ స్కూల్ ను ఏర్పాటు చేశారు..ఒక మంచి పని చేస్తే జీవితంలో గొప్ప ఆనందం అనుభూతి మిగులుతుంది..పుట్టుకకు చావుకు మధ్య ఉన్న సమయాన్ని సమాజ మార్పు కోసం వెచ్చించాలి..చుట్టూ ఉన్న పల్లెను అభివృద్ధి చేస్తే ఆనందమే వేరు..
ములుగు ఎన్నో ప్రత్యేకతలకు వేదిక ..అందరూ పర్యటించండి..ఏసి గదిలో పనిచేసే మీరు అప్పుడప్పుడు అడవి గాలి పీల్చుకోవాలి..ప్రకృతిని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తే మీ ఆయుష్షు 30% పెరుగుతుంది..ములుగుకి వచ్చి డిజిటల్ విద్య బలోపేతానికి కృషి చేయండి.
????మూసీ నది పునరావాస మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చిన ప్రభుత్వం..
పునరావాసం పొందిన 17 స్వయం సహాయక మహిళా సంఘాలకు చెక్కులు అందజేసిన మంత్రి సీతక్క..
కార్యక్రమంలో పాల్గొన్న ఎంఐఎం ఎమ్మెల్యేలు బలాలా, కౌసర్ మోయినుద్దీన్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, సేర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి..
17 గ్రూపుల నుంచి 3 కోట్ల 44 లక్షల చెక్కులను అందుకున్న 172 మంది మహిళలు..
*మంత్రి సీతక్క..
*ఒక ప్రాంతం నుంచి మరొక చోటుకు వెళ్ళినప్పుడు కొంత కష్టంగా ఉంటుంది..
కానీ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది..*మూసీ నది వరద ఉదృతి పెరిగితే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది..
*ప్రకృతి వైపరిత్యాలు దేశంలో సంభవిస్తున్నాయి..
మంచి వాతావరణంలో మనం జీవించాలి..
*మంచి గాలి , నీళ్లు దొరికే ప్రదేశంలో జీవనం సాగించాలి..*ఒక తరం మూసీ నదీ పరీవాహక ప్రాంతంలో ఇబ్బందుల్లో నివసించారు..*రేపటి తరమైన మంచి వాతావరణంలో బతికేలా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది..మహిళా గ్రూపులలో ఒక్కో మహిళలకు 2 లక్షలు రూపాయలు రుణాలు ఇస్తున్నాం..
2 లక్షల రుణాలలో లక్షా 40 వేలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది..కేవలం 60 వేలను మహిళా సంఘాలు కట్టాల్సి ఉంటుంది..ప్రభుత్వం సహాయంతో మంచి వ్యాపారాలు చేసుకోవాలి..కుట్టు మిషన్లను సైతం మూసీ నది మహిళా సంఘాలకు ఇస్తాం ..వివిధ రకాల వ్యాపారాలకి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తాం..మూసీ నది పునరావాస పొందిన వారి పిల్లలకు అన్ని రకాల విద్యా సదుపాయాలను కల్పిస్తున్నాం
???? చంద్రబాబు సార్..ఈ పోస్టు కార్డులు చూసైనా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వండి…ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి పోస్టు కార్డుల ఉద్యమం..మూడు రోజుల పాటు ప్రతి నియోజకవర్గం నుంచి వేలాది పోస్టు కార్డులను సీఎం చంద్రబాబుకు పంపిస్తామన్న వైఎస్ షర్మిల..వీటిని చూసైనా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారని భావిస్తున్నట్లు వెల్లడి.
????కర్నూలు జిల్లా కప్పట్రాలలో యురేనియం తవ్వకాలపై స్థానికులు వ్యతిరేకం..
యురేనియం నిక్షేపాల నిర్ధారణ కోసం 68 బోర్లకు అనుమతి ఇచ్చిన కేంద్రం కప్పట్రాళ్ల రిజర్వాయర్ ఫారెస్ట్ లో 6.8 హెక్టార్లలో తవ్వకాలు చేపట్టిన అధికారులు..
కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదిస్తే తవ్వకాలు..
యురేనియం తవ్వకాలపై కప్పట్రాళ్ల వాసులు వ్యతిరేకత
????విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి బస్సులో ప్రయాణించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి..
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్..
????రెడ్ బుక్…అరెస్టుల పర్వం మొదలైంది.
అమరావతి ..హత్య కేసులో & టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో నందిగం సురేష్ – లోపలే ఉన్నాడు
నటి లైంగిక వేధింపుల కేసులో కుక్కల విద్యాసాగర్ – లోపలే ఉన్నాడు. అరాచక పాలనకు పల్నాడు జిల్లా కేంద్రంగా పట్టం కట్టిన పిన్నెల్లి బ్రదర్స్ – రాష్ట్రం వదిలి పారిపోయారు.. సజ్జల, జోగి, అప్పిరెడ్డి, అవినాష్, కొడాలి, వంశీ – ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.*వారి వారి బాధ్యతలు మరిచి ప్రవర్తించిన ముగ్గురు ఐపీఎస్ లు – ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు..సోషల్ మీడియా వేదికల్లో గత వైసిపి ప్రభుత్వం హయాంలో చేలరేగిపోయిన కొందరు వైసీపీ కార్యకర్తలు జైల్లో ఉండి వచ్చారు.. మరి కొందరు 41A తీసుకొని బ్రతుకు జీవుడా అంటూ రోజురోజు దినదిన గండంగా గడుపుతున్నారు…మళ్ళీ కూటమి ప్రభుత్వంపై లేనిపోని అభండాలు వేసిన, ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేసిన రిపీట్ అయితే లోపలికి పోతారు అని వాళ్లకు తెలుసు… బోడి గుండు కి మోకాలికి తేడా తెలియని బోరుగడ్డ అనిల్ అనే ఒక వైసిపి ఉగ్రవాది ఈరోజు లోపలికి వెళ్లాడు .. ఇంకా 15, 20 కేసుల్లో ఉన్నాడు కాబట్టి లోపలికి పోతే ఎప్పుడు వస్తాడో అతనికే తెలియదు.
ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు వాగుతూ వీడియోలు చేసిన వాళ్లు ఎవరూ బయట తిరగట్లేదు..సోషల్ మీడియా అకౌంట్స్ క్లోజ్ చేసుకొని, నోటికొచ్చినట్టు మాట్లాడిన నోటికి తాళం వేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లారు..
లిక్కర్ స్కాం – వాసుదేవ రెడ్డికి మ్యూజిక్ నడుస్తుంది.
ఏపీఎండీసీ – వెంకట రెడ్డి కీ కూడా.. టీటీడీలో పూర్తి స్థాయి లో ప్రక్షాళన మొదలు అయింది…సుబ్బా రెడ్డి కీ, ధర్మా రెడ్డికి వణుకు మొదలు అయింది… *మెజారిటీ వైపీఎస్ లు, వైసీపీ అనుకూల అధికారులు లూప్ లైన్లో కి వెళ్లారు ..ఇంకా ఎన్నో…… ఎన్నెన్నో…*అన్నీ కేవలం 125 రోజుల్లోనే & అది కూడా చట్ట పరంగా…*ఎక్కడ కూడా ప్రభుత్వం వ్యక్తిగతంగా వెళ్లలేదు..సోషల్ మీడియాలో మార్ఫింగ్, బూతులతో పోస్టులు వేసే వాళ్ళకి ఇంకా తెలియట్లేదు..*ప్రభుత్వంలో తప్పులు ఉంటే ప్రశ్నించండి ప్రభుత్వం సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉంది…అంతేకానీ లేనిపోని మార్ఫింగులు, వ్యక్తిగత దూషణలు, ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తే చట్టం ముందు చేతులు కట్టుకొని నిలబడవలసి వస్తుంది తస్మాత్ జాగ్రత్త*
????అక్రమంగా తరలిస్తున్న 150 కేజీల గంజాయిని పట్టుకున్న పడమట సీఐ పవన్ కిషోర్..కృష్ణ:గన్నవరం;తమిళనాడుకు చెందిన రమేష్ వినేష్ కుమార్, కుమరన్ మేరీ మూర్తి, అనే ఇద్దరు వ్యక్తుల దగ్గర సుమారు 150 కిలోలు గంజాయిని సిఐ పవన్ కిషోర్ స్వాధీనం చేసుకున్నారు…
తరలిస్తున్న ఇద్దరూ విశాఖపట్నం నుండి చెన్నైకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు, గుర్తించి పక్కా సమాచారంతో పట్టుకోన్న పడమట పోలీసులు…
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పడమట పోలీసులు..
????దారుణం.. కన్న కూతురిని వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసిన తల్లి!!! హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అల్వాల్‌లో ఓ తల్లి కన్న కూతురిని వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో తల్లి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లిపై ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఆ యువతిని సఖి సెంటర్‌కు తరలించారు. దీంతో అల్వాల్ పీఎస్ ముందు బాలిక తల్లి, మద్దతుగా మరో మహిళ గొడవకు దిగారు. ఇద్దరు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
????ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి, బంధువుల ఆందోళన ..
హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుర్కపల్లి మండలం మాదాపూర్‌కు చెందిన ఎంటెక్ విద్యార్థిని నిఖిత(23) ఛాతి నొప్పితో ఈసీఐఎల్‌లోని శ్రీకర హాస్పిటల్‌లో చేరింది. నిన్న వైద్యుల నిర్లక్ష్యంతో యువతి మృతి చెందిందని, మెడికల్ మాఫియా నడుస్తుందని, హాస్పిటల్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది
????టెన్త్ ,ఇంటర్ లో ప్రతిభ కనపరచిన 26 మంది హోంగార్డ్ పిల్లలకు ప్రోత్సాహకరంగా చెక్కులు అందజేత..జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా..మరియు హోంగార్డ్ కమాండెంట్ మహేష్ కుమార్.. రాయలసీమ రీజియన్ .. నంద్యాల జిల్లాలోని హోంగార్డ్ కుటుంబాలలోని విద్యార్థినీ విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో అన్ని రంగాలలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా ,స్ఫూర్తిగా నిలవాలని తెలియజేస్తూ ప్రస్తుతం 2023-2024 సంవత్సరంలో టెన్త్ ,ఇంటర్ పరీక్షలలో 80%మరియు అంతకంటే ఎక్కువ శాతం ప్రతిభ కనబరిచిన 26 మందికి కొందరికి 2000/-రూపాయల చొప్పున మరికొందరికి 1000/-చొప్పున మొత్తం 46,000/-రూపాయలను ప్రోత్సాహకరంగా జిల్లా హోంగార్డ్స్ వెల్ఫేర్ ఫండ్ నుండి చెక్ లను జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా చేతులమీదుగా విద్యార్థినీ విద్యార్థులు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ విధంగా హోంగార్డ్ కుటుంబాలను పిల్లలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే ఈ చిరు కానుకలు మీకు ముందున్న జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ఇది ఒక ప్రోత్సాహకరంగా ఉంటాయని తెలియజేశారు. మీ ముందున్న ఈ రెండు సంవత్సరాలు అనగా ఇంటర్మీడియట్ చాలా కష్టంతో కూడుకున్నదని ఈ సమయాన్ని వృధా చేయకుండా బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానం చేరుకోవాలని ఆకాంక్షించారు మీరు ఇప్పుడున్న వయస్సులో సెల్ ఫోన్స్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో సమయం వృధా చేయకుండా మరియు అనవసరంగా బయట తిరుగుతూ చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు అలవాటు పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో ఉండాలంటే ఇది చక్కని అవకాశామని తెలియజేశారు.ఈ రెండు సంవత్సరాలు తల్లిదండ్రులు మీ పిల్లలపై నిఘా ఉంచాలని చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వారిని నియంత్రించి మంచి మార్గంలో నడిపించాలని భవిష్యత్తులో మీ పిల్లలు దేనిపై రాణించగలరు తెలుసుకొని ఆ దిశగా ముందుకు నడిపించాలని అప్పుడే విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించగలరని మరియు అన్ని కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ లో పాల్గొనేలా మీ పిల్లలను సిద్ధం చేయాలని తెలియజేశారు.
ఇప్పటివరకు మీ యొక్క పర్సనల్ లైఫ్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ మీ పిల్లలని చక్కగా చదివించారని ముందున్న చదువులలో మంచి మార్కులు సాధించే విధంగా మీ పిల్లలను ప్రోత్సహించాలని మరి ఒకసారి మనం కలుసుకునేటప్పుడు ఈ 26 మంది మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ మందితో ఈ యొక్క హాల్ నిండిపోయి మీ పిల్లలకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా వారి జీవితాన్ని మంచి మార్గం వైపు నడిపిస్తారని ఆకాంక్షిస్తున్నానని తెలియజేశారు.కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్ జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N.యుగంధర్ బాబు,AR డి.ఎస్.పి శ్రీనివాసులు,RI లు నాగభూషణం,మంజునాథ్ పాల్గొన్నారు.
???? తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో టీడీపీ అధినేత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారాచంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో పాల్గొనీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పుష్పాంజలి ఘటించిన మడకశిర ఎమ్మెల్యే యం.యస్ రాజు
???? రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి. ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు. ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేస్తూ సవరణ ఉత్తర్వులు జారీ. స్థానిక అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి. గతంలో రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్లబండ్లకు మాత్రమే అనుమతి. ప్రస్తుతం ఈ నిబంధనను ట్రాక్టర్లకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
????పోలీస్ స్టేషన్‌లోనే ఒంటికి నిప్పుంటించుకుని ఆత్మహత్యా యత్నం..కాపాడబోయిన పోలీసులకు గాయాలు!!!!
జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడే సంఘటన జరిగింది. భార్యాభర్తల పంచాయతీలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని పట్టించుకున్నాడు. అతన్ని అడ్డుకుబోయిన పోలీసులకు ఆ నిప్పoటుకుని తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో స్పందించిన తోటి సిబ్బంది హుటాహుటీన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకలతండాకు చెందిన లాకవత్ శీను – అతని భార్య రాధిక మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు చెలరేగుతున్నాయి. భర్త వేధింపులు భరించలేక మనోవేధన గురైన రాధిక పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శ్రీనును పోలీసులు పాలకుర్తి పోలీస్ స్టేషన్ పిలిపించారు. భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రములో ఒక్కసారిగా ఊగిపోయిన శ్రీనివాస్ తన వాహనంలోని పెట్రోలు తీసి తన ఒంటిపై కోసుకున్నాడు. అంతటితో ఆగకుండా వెంటనే నిప్పుంటించుకున్నాడు.
????డిస్ లెక్సియా పై అవగాహన ర్యాలీ*
కంభం: పిల్లల భాషణ వైకల్యాలపై అప్రమత్తంగా వుండాలనీ, వారిని అర్థం చేసుకుని అండగా నిలవాలని ఎంఈఓ బి.మాల్యాద్రి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం డిస్ లెక్సియా అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయురాలు నూర్జహాన్ మాట్లాడుతూ సాధారణ పిల్లలలో సైతం డిస్ లెక్సియా,డిస్ క్యాలిక్లియా మరియు డిస్ గ్రాఫియా లాంటి వైకల్యాలతో నిర్దిష్ట అభ్యసన సామర్థ్యాలు లేకపోవడాన్ని పాఠశాల స్థాయిలో గుర్తించవచ్చనీ, అటువంటి వారికి ప్రత్యేక బోధన చేయడం ద్వారా వారిలో పురోభివృద్ధి సాధించవచ్చని తెలిపారు.అనంతరం కందులాపురం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బి.మాల్యాద్రి, సిఆర్పి మురళీమోహన్, ఉపాధ్యాయులు నూర్జహాన్, శారదాదేవి,సుహాసిని, శరబమ్మ,ఈశ్వరి, కె.కిరణ్ కుమార్, ఖాసింపీరా, వరికుంట్ల.వెంకటేశ్వర్లు, అరుణ్ కుమార్,ఫిజికల్ డైరెక్టర్లు మురళీకృష్ణ,సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా