????పారిశ్రామికవేత్తలకు రెడ్‌కార్పెట్ స్వాగతం..
*ఇది వ్యాపార అనుకూల, స్నేహపూర్వక ప్రభుత్వం*
*ఇంతకంటే మంచి తరుణం రాదు: చంద్రబాబు*
ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు రెడ్‌కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘ఏపీలో ఇప్పుడు వ్యాపార అనుకూల, స్నేహపూర్వక ప్రభుత్వం ఉంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులైన యువత, బలమైన మానవనరులు మీ కోసం ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రంలో వ్యాపారాలు, వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా పారిశ్రామిక రంగానికి చెందిన అనుభవజ్ఞులతో సంప్రదింపులు జరిపి తయారు చేసిన అత్యుత్తమ పారిశ్రామిక పాలసీలూ సిద్ధంగా ఉన్నాయి. ఏపీలో వ్యాపార కార్యకలాపాలకు అనువుగా దేశంలోనే ది బెస్ట్ బిజినెస్ ఎకో సిస్టంను అభివృద్ధి చేస్తున్నాం. పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామంగా నిలుస్తుంది. పెట్టుబడులతో మీ వ్యాపారం పెరుగుతుంది.. మా రాష్ట్రమూ అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో మీ వ్యాపారాభివృద్ధికి ప్రతి అడుగులోనూ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని నేను వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నాను. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం ఎప్పుడూ లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి తరుణం ఎప్పుడూ రాదు. పారిశ్రామిక వృద్ధి ప్రయాణంలో మాతో సహకరించండి. ఏపీలో పెట్టుబడుల కోసం మేం ఎదురు చూస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
????వైఎస్ షర్మిలా రెడ్డి..APCC చీఫ్..విజయవాడ..
క్యాబినెట్ మీటింగ్ లో సూపర్ సిక్స్ లో ఒక్క సిక్స్ అయినా అమలు చేస్తారు అనుకున్నాం.. మహిళలకు శుభవార్త చెప్తారని అనుకున్నాం..
ఉచిత సిలిండర్లు, ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం రెండు లో బడ్జెట్ స్కీంలు..బాబు సూపర్ సిక్స్ లు గాలికి కొట్టుకు పోయాయి.. కొత్తగా సిక్స్ పాలసీలు వచ్చాయి.. కొత్త పరిశ్రమలు వస్తె మంచిదే పెట్టుబడులు రావాలి. ఉద్యోగాలు రావాలి.. 30 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్థం అన్నారు.. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు..జాబ్ ఫస్ట్ అనే నినాదం అని బాబు చెప్పాడు..ఇక్కడ బిలియన్ డాలర్ల ప్రశ్న.. ఇవన్నీ అమలు చేసే చిత్తశుద్ది బాబు కి ఉందా ?..2014 లో పెద్ద పెద్ద పథకాలు అన్నాడు
????అమరావతిని సింగపూర్ అన్నాడు- 3d గ్రాఫిక్స్ చూపించాడు.. అప్పుడు చెప్పిన వాటికి, ఇప్పుడు చెప్పిన వాటికి తేడా లేదు- పాత సినిమా కి కొత్త టైటిల్ పెట్టాడు.. బాబు చెప్తుంటే ఈ కథ ఎక్కడో విన్నట్లుంది అని పించింది
.. పాత గిఫ్ట్ కొత్త బాక్స్ లో ఇస్తున్నాడు
.. ఇవి అమలు అవుతాయా లేదా అనే అనుమానాలు ఉన్నాయి.. బాబు నీ ఒక విషయంలో స్వాగతిస్తున్నం
* జాబ్ ఫస్ట్ అనే నినాదం మంచిదే..రాష్ట్రంలో నిరుద్యోగం తారా స్థాయిలో ఉంది..ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు.. గత 10 ఏళ్లుగా పరిశ్రమలు లేక యువత వలసలు వెళ్ళింది..రాష్ట్రానికి నిరుద్యోగం అతి పెద్ద సమస్య
.. నిన్న చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు..రాష్ట్రంలో నిరుద్యోగులు 50 లక్షల మంది ఉన్నారు.. ఈ లెక్కన బాబు చెప్పినట్లు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే…5 ఏళ్లలో 20 లక్షలు ఇస్తారు..
ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగితే మిగతా వాళ్ల సంగతి ఏంటి ?.. ఉద్యోగాలు అని గతంలో మోడీ బీజేపీ ప్రభుత్వం కూడా మోసం చేసింది.. 20 కోట్ల ఉద్యోగాలలో మనకు ఎన్ని వచ్చాయి?..ఒక్క ఉద్యోగం ఇవ్వని మోడీ కి ఎందుకు బాబు మద్దతు ఇస్తున్నారు ?
????రాష్ట్రంలో మీరు ఇచ్చే 20 లక్షలకు తోడు మరో 30 లక్షల ఉద్యోగాలు మోడీ ఇవ్వాలి.-బాబు కేంద్రాన్ని డిమాండ్ చేయాలి-మోడీ,బాబు ఇద్దరు కలిసి కూర్చొని ఉద్యోగాల కల్పన పై వైట్ పేపర్ రిలీజ్ చేయాలి-రాష్ట్రం ఎన్ని కల్పన చేస్తామని చెప్పిందో…మోడీ కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వాలి-రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల పరిధిలో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి
-ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారో శ్వేత పత్రం ఇవ్వాలి-గత 10 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావడం లేదు-మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి తేల్చాలి
-జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని పోస్టులు భర్తీ చేయాలి
-లోకేష్ మోడీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారట
-21 మంది ఎంపీలు ఇస్తామని చెప్పి ఇచ్చారట
-అయ్య లోకేష్ గారు… మీరు ఇచ్చిన మాట సరే…మోడీ ఇచ్చిన మాట ఏంటి ?
-రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీలు అందరు మోడీకి ఊడిగం చేస్తూనే ఉన్నారు
????ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి లో నిలబడి మోడీ చెప్పారు-ఇచ్చిన మాట ఎక్కడ పోయింది
-హోదా వచ్చి ఉంటే… పరిశ్రమల కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు-పోటీ పడి మరీ పరిశ్రమలు వస్తాయి.-ప్రత్యేక హోదా ఉన్న ఉత్తరాఖండ్ లో 2 వేల పరిశ్రమలు వచ్చాయి-హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు 10 వేల పరిశ్రమలు వచ్చాయి-మరి హోదా మీద మోడీ ఇచ్చిన మాట ఎక్కడ పోయింది
-పోలవరం నాది భాధ్యత అని మోడీ అన్నాడు
-రాజధాని నీ న్యూ ఢిల్లీ మించిన రాజధాని అన్నాడు
-మట్టి కొట్టి పోయాడు తప్పితే ఒక్క రూపాయి లేదు
-వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు అన్నాడు..ఇవ్వలేదు.
-విశాఖ స్టీల్ కి ఒక్క క్యాపిటల్ మైన్ ఇస్తే మోడీకి జరిగే నష్టం ఏముంది ?-మోడీని నిలబెట్టి లోకేష్ అడగాలి
-సూపర్ సిక్స్ పాలసీలు సరే…సూపర్ సిక్స్ పతకాలు ఎక్కడ పోయాయి -20 లక్షల ఉద్యోగాలు అని అన్నారు…అంటే నిరుద్యోగ భృతి ఉన్నట్లా ? లేనట్లా ?
-నిరుద్యోగ భృతి మీద 2014 లోనే మీరు 2 వేలు ఇస్తాం అన్నారు-ఇప్పుడు 3 వేలు అంటున్నారు. ఇంత వరకు భృతి పై జాడ లేదు-తల్లికి వందనం నిధుల కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు-మహాలక్ష్మి పథకం కింద 15 వందలు అన్నారు… ఏమయ్యింది ?-ఉచిత సిలిండర్ల కు దసరా అన్నాడు…దీపావళి అన్నారు… రేపు సంక్రాంతి అంటారేమో..ఇది చాలా తక్కువ బడ్జెట్ పథకం..
-ఏడాదికి 2 వేల నుంచి 4 వేల కోట్లకు ఖర్చు అయ్యే పథకానికి నిధులు లేవా ?
????విశాఖలో బెట్టింగ్ యాప్ ముఠా గుట్టు రట్టు*
విశాఖపట్నం: విశాఖలో బెట్టింగ్ యాప్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ కేంద్రంగా బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నట్టు సమాచారం తెలుసుకున్న పోలీసులు సోదాలు నిర్వహించి.. వందల సంఖ్యలో డెబిట్ కార్డులు, చెక్ బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారంతో విచారణ చేపట్టామని విశాఖ సీపీ తెలిపారు. సైబర్ నేరస్థులకు చైనాతో సంబంధాలున్నాయని, రకరకాల పేర్లతో బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నారని వివరించారు. ఆర్‌బీఐ అనుమతి లేకుండా ఈ ముఠా యాప్ నిర్విస్తోందన్నారు. బెట్టింగ్ యాప్ సొమ్మును చైనా, తైవాన్‌కు పంపుతున్నట్టు ద్యర్యాప్తులో గుర్తించామన్నారు. నిందితుల నుంచి 10 ల్యాప్‌టాప్‌లు, 8 డెస్క్‌టాప్‌లు, కారు, బైక్, 800 చెక్‌బుక్‌లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. స్టాఫ్ రిపోర్టర్ ఎస్ఎస్ రహమాన్.
????మనదేశంలో నేరస్తులు అవినీతిపరులకే చట్టం చుట్టంగా మారి వారు తప్పించుకునేందుకు అనేక అవకాశాలు కల్పిస్తుందని పలువురు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు చేస్తున్న ఆరోపణలకు ఈ రెండు సంఘటనలే ప్రత్యేక ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు .. ????మొదటి ఫోటో..
పేరు:- గుర్మిత రామ్ రహీమ్ సింగ్.. అలియాస్ డేరా బాబా..*నేరాలు: హత్యలు, మానభంగాలు, ఇతర క్రిమినల్ కేసులు..*నేరాలు రుజువు కావడం తో 2017 ఆగస్ట్ లో హర్యానాలోని పంచకుల కోర్టు 20 ఏళ్ళు జైలు శిక్ష విధించింది..*2017 నుండి ఇప్పటి వరకు 23 సార్లు పెరోల్ మీద పిక్నిక్ కి వచ్చినట్లు జైలు నుండి బయటకు రావడం. మళ్ళీ పని పూర్తి కాగానే మళ్ళీ జైల్ కు వెళ్లడం..*ఒక రకంగా చెప్పాలంటే జైలు నుండి బయటకు వచ్చేవాడు అనడం కంటే అప్పుడప్పుడు జైలుకు వెళ్ళేవాడు అనడం కరెక్ట్..ఇది ఈ దేశ వ్యవస్థలు ఒక క్రిమినల్ కి ఇచ్చిన గౌరవం….????రెండో ఫోటో*..
పేరు : జి ఎన్ సాయి బాబా వృత్తి : ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్..పోలియో కారణంగా రెండు కాళ్ళు చచ్చుబడిపోయి 90% అంగవైకల్యం తో వీల్ చైర్ కే పరిమితం..అభియోగం :- మావోయిస్టు రచనలను తన దగ్గర ఉంచుకున్నాడు అనే అభియోగం మోపి *ఉగ్రవాదుల మీద పెట్టే దారుణమైన UAPA యాక్ట్ ని ఆయనపై పెట్టి Under trail ఖైదీ కింద దాదాపు 10 ఏళ్ళు ఘోరమైన అండ జైలు (ఉగ్రవాదులను ఉంచే)* లో బంధించారు.*మా అమ్మ నేను పోలియో వల్ల కాళ్ళుతో నడవలేకపోయినా తన భుజాల ఎత్తుకొని రోజు బడికి తీసుకెళ్లి చదివించింది. నన్ను ఇంతవాడిని చేసింది. ఆమె కాన్సర్ తో పోరాడుతూ చివరి క్షణాల్లో ఉంది నా తల్లిని చూడాలని ఉంది అని కోర్టుకు రిక్వెస్ట్ పెట్టుకుంటే, ఆయనకు అనుమతి ఇవ్వలేదు..
*కనీసం ఆ తల్లి చనిపోయిన తర్వాత కూడా చివరి చూపు చూడనివ్వవకుండా ఆయన్ను ఆ జైలులోనే ఉంచేశారు.*_
*దాదాపు పదేళ్ల తర్వాత బాంబే హైకోర్టు సాయి బాబా మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు, ఆయన నిర్దోషి అని 2023 లో తీర్పు ఇస్తే, మహారాష్ట్ర ప్రభుత్వం, ఆయనను విడుదల చేయాలి అని ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలి అని సుప్రీం కోర్టుకు వెళితే, సుప్రీం కోర్టు ఆయన విడుదల పై స్టే విధించి. మళ్ళీ సుప్రీం కోర్టు మొదటి నుండి విచారణ జరిపి ఏడాది తర్వాత సుప్రీం కోర్టు కూడా ఆయనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అని తీర్పు ఇస్తే, ఈ ఏడాది మార్చ్ లో ఆయన విడుదల అయ్యారు._
*నేను నిర్దోషిని అని ఈ ప్రపంచానికి చాటి చెప్పి వ్యవస్థలు ఎన్ని హింసలు పెట్టిన ధైర్యంగా ఆ చీకటి గదిలో ఒంటరిగా పోరాడి, చివరకు నిర్దోషిగా విడుదల అయ్యి ఈ నెల 12 న తీవ్ర అనారోగ్యం తో తుదిశ్వాస విడిచారు._
*ఇది ముమ్మాటికీ ఈ దేశం వ్యవస్థలు చేసిన హత్య. ఆయన చేయని తప్పుకు 10 ఏళ్ళు నష్టపోయారు. ఇప్పుడు ఆయన జీవితాన్నే నష్టపోయారు._
*కానీ దీని అంతటికీ కారణం అయిన వాళ్లకు ఎలాంటి శిక్షలు లేవు.*ఆ డేరా బాబా లాంటి వాళ్ళు క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యి నేరాలు రుజువు అయ్యి జైలు శిక్షలు పడిన, కావాలనుకున్నపుడు బయటకు వస్తారు._
*ఎలాంటి నేరాలు చేయని సాయి బాబా గారి లాంటి వాళ్ళు ఈ వ్యవస్థలు చేసిన హింసకు బలి ఐపోవాలా?_
*ఇదెక్కడి న్యాయం..!!??*_
???? రాసలీలలు లీక్..!!!▪️బైటపడ్డ మరో టీడీపీ నేత రాసలీలలు.▪️ఓ అమ్మాయితో రాసలీలలు జరిపిన సోషల్ మీడియా రాయచోటి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఖాదర్ బాషా.
▪️మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఖాదర్ బాషా ముఖ్య అనుచురుడు.▪️మంత్రి తరపున వ్యవహారాలు చక్కబెడతానని ప్రలోభ పెట్టి అమ్మాయిలను లొంగతీసుకుంటున్నట్లు ఖాదర్ బాషాపై ఆరోపణలు.▪️గత ఎన్నికల్లో టీడీపీ తరుపున కుప్పం అబ్జర్వర్‌గా పని చేసిన ఖాదర్ బాషా.
????అస్సాం: అగర్తల-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ లుమ్‌డింగ్-బాదర్‌పూర్ హిల్ సెక్షన్‌లోని లుమ్‌డింగ్ డివిజన్ పరిధిలోని దిబాలాంగ్ స్టేషన్‌లో పట్టాలు తప్పింది.
పవర్ కార్, ఇంజన్ సహా ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే, ఎటువంటి ప్రాణనష్టం లేదా పెద్ద గాయాలు సంభవించలేదు.
లుండింగ్ వద్ద హెల్ప్‌లైన్ నంబర్‌లు: 03674 263120 మరియు 03674 263126.
????ఐదేళ్ల చిన్నారి గొంతు కోసి చంపిన యువకులు..????
యూపీలోని ముజఫర్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. విశాల్ అనే ఐదేళ్ల చిన్నారిని బ్లేడుతో గొంతు కోసి హత్య చేశారు. విశాల్ తన తల్లితో కలిసి బహదర్‌పూర్‌లోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. అయితే ఆడుకునేందుకు బయటకు వెళ్లిన విశాల్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు గాలించగా సమీపంలోని చెరుకు తోటలో విశాల్ మృతదేహం లభ్యమైంది. కుమారుడి మృతదేహం చూసి అతడి తల్లి రోదన మిన్నంటింది. ఈ హత్య కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
????వెంకట్రామిరెడ్డీ… దిగిపో*
*మీ వల్ల ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం*
*ముక్తకంఠంతో సర్వసభ్య సమావేశం డిమాండ్*
*పదవి వీడేదే లేదు: వెంకట్రామిరెడ్డి*
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సచివాలయంలో మొదటిసారిగా అప్సా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఉద్యోగులందరూ ముక్తకంఠంతో అప్సా ప్రస్తుత అధ్యక్షుడు, వైసీపీకి వీరవిధేయుడు,జగన్‌కి పరమభక్తుడైన కె.వెంకట్రామిరెడ్డిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి దాదాపు 400 మంది ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అప్సా సభ్యులందరూ ఏకకంఠంతో తమ డిమాండ్‌ను వినిపించారు. ‘ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యవర్గం రాజీనామా చేయాలి. ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేయాలి. తద్వారా ఉద్యోగులకు మేలు జరుగుతుంది. వైసీపీకి కార్యకర్తలా పనిచేసిన వెంకట్రామిరెడ్డి అప్సా అధ్యక్షుడిగా ఉండడం వల్ల మా సమస్యలను ప్రస్తుత ప్రభుత్వానికి నివేదించలేకపోతున్నారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసమైనా అధ్యక్ష పదవికి వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయాలి. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం వల్ల మాకు ఏ ప్రయోజనాలు దక్కలేదు. కనీసం జీతం కూడా సరైన సమయానికి రాలేదు. కొత్త కార్యవర్గం ఎన్నికైతే కనీసం ఇప్పుడైనా మాకు రావాల్సిన ప్రయోజనాలు అందుతాయని ఆశిస్తున్నాం. వెంకట్రామిరెడ్డి మొండి వైఖరి వల్ల ఎన్నో దశాబ్దాల చరిత్ర గల అప్సా ఉనికికే ముప్పు ఏర్పడింది. రోసా నిబంధనల ప్రకారం అసోసియేషన్ రద్దుకు ప్రభుత్వం ఫైలు పెట్టింది. అప్సాను రక్షించుకోవడం కోసం మేమంతా ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చి అసోసియేషన్ రద్దుకాకుండా ప్రస్తుతానికి ఆపగలిగాం. దీనంతటికీ కారణమైన వెంకట్రామిరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి’ అంటూ సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. వారి వాదనను కొట్టిపారేసిన వెంకట్రామిరెడ్డి… ‘2029లో కూడా ఈ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారా? మీ డిమాండ్‌కు తలొగ్గేదే లేదు. పదవీకాలం పూర్తయ్యేవరకు వైదొలగే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు. అప్సా కార్యదర్శి శ్రీకృష్ణ మాత్రం పదవికి రాజీనామా చేస్తున్నట్టు సమావేశంలోనే ప్రకటించారు. వెంకట్రామిరెడ్డి వైఖరి నేపథ్యంలో ఉద్యోగులందరూ… ‘అప్సా ఉనికే ముఖ్యం. వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయాలన్న డిమాండ్ తో సంతకాలు సేకరించాలి. దానిని ప్రభుత్వానికి అందజేయాల’ని నిర్ణయించారు.
???? మెరీనా బీచ్‌లో ఈతకు వెళ్లి కాలేజీ విద్యార్థి మృతి (వీడియో)
చెన్నైలో గురువారం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. మెరీనా బీచ్‌లో ఈతకు వెళ్లి కాలేజీ విద్యార్థి మృతి చెందాడు. మైలాపూర్‌లోని వివేకానంద కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బీచ్‌లో ఈతకు వెళ్లారు. సముద్రంలోకి వెళ్లేసరికి కెరటాల ఎగసిపడడంతో నీటిలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఆరుగురిని కాపాడగా.. మరో విద్యార్ధి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
???? మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో నటి తమన్నా భాటియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నించారు. తల్లితో కలిసి గువాహటి ఈడీ కార్యాలయానికి చేరుకున్న తమన్నాను ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా వందల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ యాప్ ద్వారా ఐపీఎల్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నిర్వహించారు. సామాన్యులను ఆకర్షించేందుకు సినీతారలతో ప్రమోట్ చేయించారు. ఇందుకోసం నిర్వాహకులు భారీగా ఖర్చుపెట్టారు. నకిలీ పత్రాలతో వేల సిమ్‌లు, బ్యాంక్ ఖాతాలు తెరిచి బెట్టింగ్‌ల ద్వారా వచ్చిన డబ్బును హవాలా, క్రిప్టో మార్గాల్లో విదేశాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 17 మంది బాలీవుడ్ ప్రముఖులపై 2023 సెప్టెంబర్ నుంచి అధికారుల నిఘా కొనసాగుతోంది. ఈ కేసులో నటుడు సాహిల్ ఖాన్‌ను అరెస్ట్ చేసారు.

