????మరోసారి మనసు దోచేసిన లులు గ్రూప్ అధినేత ఆయన తీరు తెలిసిన వారంతా ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోతుంటారు. వ్యాపారవేత్తగా సుపరిచితుడు.. భారీ మాల్స్ ను ఏర్పాటు చేయటం.. వాటిని సమర్థంగా నిర్వహించే విషయంలో తనదైన ముద్ర వేసే టాలెంట్ లులు గ్రూప్ అధినేత ఎంఏ యూసుఫ్ అలీ సొంతం. తన వరకు వచ్చే ఏ సమస్యనైనా.. ఇట్టే తీర్చేసే ఆయన తీరు తరచూ నెటిజన్ల మనసుల్ని దోచుకుంటుంది. ఆయన తీరు తెలిసిన వారంతా ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోతుంటారు. తాజాగా అలాంటి పనే మరొకటి చేశారు. అప్పు తీర్చలేక ఇల్లు చేజారిపోవటం.. మరోవైపు పిల్లల్ని..బాధ్యతల్ని వదిలేసి భర్త వెళ్లిపోయిన ఒక ఒంటరి మహిళ జీవితాన్ని తిరుగులేని విధంగా తీర్చిదిద్దిన ఆయన పె..ద్ద మనసు గురించి తెలిసిన వారంతా ఫిదా అవుతున్నారు. మెచ్చుకోళ్లతో ముంచెత్తుతున్నారు. అసలేం జరిగిందంటే.. కేరళలోని నార్త్ పరవూర్ కు చెందిన సంధ్య 2019లో ఇల్లు కట్టుకోవటానికి ఒక ప్రైవేటు సంస్థ నుంచి రూ.4 లక్షల లోన్ తీసుకుంది. ఇంటి నిర్మాణానికి మరింత డబ్బులు అవసరం కావటంతో మరింత అప్పు చేసింది. కొంతకాలం గడిచేసరికి.. ఆమె భర్త ఇంటి వదిలి వెళ్లిపోయాడు.
పిల్లలు.. వారి బరువు బాధ్యతలు సంధ్య మీదన పడ్డాయి. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన భర్త తీరుతో సంధ్య సమస్యలు మరింత పెరిగాయి. ఆమె కుటుంబ పోషణ కష్టమైంది. దీనికి తోడు ఇంటి అప్పు మరింత ఇబ్బందిపెట్టింది. ఇలాంటి వేళ.. ఇంటి లోన్ కట్టలేకపోవటం.. ఆమె చేసిన అప్పునకు వడ్డీ మొత్తం రూ.8 లక్షలు కావటంతో ఆమె అప్పు తీర్చాలంటూ లోన్ ఇచ్చిన కంపెనీలు ఒత్తిడి పెట్టసాగాయి. Also Read – ఏపీలో కొత్త లిక్కర్ ధరలు ఇవే… తీవ్ర నిరాశలో మందుబాబులు! అయితే.. సంధ్య దగ్గర ఆ మొత్తం లేకపోవటంతో రుణం ఇచ్చిన సంస్థలు ఆమె నుంచి ఇంటిని స్వాధీనం చేసుకున్నాయి. దీంతో.. కట్టుబట్టలతో.. పిల్లలతో రోడ్డు మీద నిలవాల్సిన దుస్థితి. ఆమెకు ఎదురైన కష్టం గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ పోస్టు లులు గ్రూపు అధినేత యూసఫ్ అలీ కంట పడింది. వెంటనే స్పందించిన ఆయన.. సంధ్య రుణం మొత్తాన్ని చెల్లించాలని సిబ్బందిని ఆదేశించారు. అక్కడితో ఆగని ఆయన.. వారి జీవితం సాఫీగా సాగటానికి వీలుగా రూ.10 లక్షల మొత్తాన్ని ఇవ్వాలని ఆర్డర్ వేశారు. దీంతో.. ఆమె కష్టాలు ఒక్క దెబ్బకు తీరిపోయాయి. పోయిన ఇల్లు తిరిగి రావటమే కాదు.. కుటుంబ పోషణకు భారీ మొత్తం అందటంతో నెటిజన్లు ఆయన తీరును విపరీతంగా మెచ్చుకుంటున్నారు. ఏమైనా.. యూసఫ్ అలీది పెద్ద మనసు అనటంలో ఎలాంటి సందేహం లేదు.
????విజయవాడ…నారాయణ కాలేజ్ లో ఫీజుల వేధింపులు..విద్యార్థులు శారీరక ,మానసిక ఒత్తిడి కి గురి.
ప్రభుత్వం వెంటనే స్పందించాలి..
విద్యా చట్టం, చైల్డ్ ప్రొటెక్షన్ ఆక్ట్ ప్రకారం సిబ్బంది, యాజమాన్యంపై కేసులు పెట్టాలి..ద పేరెంట్స్ కమిటీ ఆఫ్ ఏపీ డిమాండ్..
ఫీజు కట్టలేదని విజయవాడ నగరం లోని కానూరు శివ భవానీ బ్రాంచ్ అక్రమ అనుబంధ హాస్టల్ 30 మంది ఇంటర్ విద్యార్థు లను రోడ్డుపై నిలబెట్టిన విద్యార్థులను మానసికంగా శారీరకంగా హింసకు గురిచేసిన సిబ్బంది యాజమాన్యాల అమానుష వైఖరిని ఖండిస్తున్నామన్నారు.ఒకవైపు చదువుల ఒత్తిడి మరోవైపు ఫీజు కట్టకపోవడంతో అవమానం పిల్లల గురించి ఆందోళన చెందుతున్న తల్లితండ్రులు పరిస్థితి వర్ణనాతీతం.
ఫీజులు చెల్లించని పక్షంలో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి తల్లిదండ్రులతో మాట్లాడాలి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం హేయమైన చర్య అని ఖండించారు.
నగరంలో ఇంటర్ బోర్డు రాష్ట్ర కార్యాలయానికి చేరువలో ప్రభుత్వ శాఖల మరియు ఇంటర్ బోర్డు అనుమతులు లేకుండా అనుబంధ హాస్టల్ నిర్వహిస్తూ ఫీజుల బకాయిలు ఉన్నారని విద్యార్థులను మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేసిన కళాశాల యాజమాన్యంపై సిబ్బందిపై ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు వెంటనే జోక్యం చేసుకొని విచారణ జరిపి విద్యా చట్టం, చైల్డ్ ప్రొటెక్షన్ ఆక్ట్ ప్రకారం కళాశాల యాజమాన్యంపై కేసులు బనాయించాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తుందన్నారు.
????జగన్ అవినీతి సొమ్మంతా కక్కించే రోజు దగ్గరలో ఉంది..లోకేశ్..జగన్ ఇంటి చుట్టూ కంచె వేసుకునేందుకు ప్రజల సొమ్ము 13 కోట్లు ఖర్చు
*జగన్ గత ఐదేళ్లలో దోచేసిన వేలకోట్లు, సాక్షి మీడియాకి ధారపోసిన వందల కోట్లు*.. *కోట్ల రూపాయలు వెచ్చించి తిన్న ఎగ్ పఫ్‌లు, తాగిన నిమ్మకాయ నీళ్లన్నీ కక్కిస్తా:లోకేష్*.. *ఐదేళ్లూ జనం సొమ్ము మేసి తాడేపల్లి ప్యాలెస్‌లో గుట్టలుగా నోట్ల కట్టలు పోగేసుకున్న జగన్..*
*ఇంటి చుట్టూ కంచె వేసేందుకు కూడా ప్రజల సొమ్ము 13 కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ సత్య హరిశ్చంద్రుడిలా నీతి కబుర్లు*.. *దేశ అధ్యక్షుల కంటే జగన్ రెడ్డికే ప్రాణహాని భయాలు!*.. *తాడేపల్లి ప్యాలెస్, రుషికొండ ప్యాలస్, రుషికొండ ప్యాలస్‌లోని బాత్ టబ్ల నుంచి మసాజ్ టేబుళ్లు వరకు అన్ని ప్రజల సొమ్ము తోనే.. *జగన్ రెడ్డి నీ పతనం ప్రారంభం.. *మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో అవినీతి సొమ్మంతా కక్కించే రోజు దగ్గర్లోనే ఉందంటూ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.*
*జగన్ గత ఐదేళ్లలో దోచేసిన వేలకోట్లు, సాక్షి మీడియాకి ధారపోసిన వందల కోట్లు, కోట్ల రూపాయలు వెచ్చించి తిన్న ఎగ్ పఫ్‌లు, తాగిన నిమ్మకాయ నీళ్లన్నీ కక్కిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లి కంచె ఎత్తు ఇంకా పెంచే సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. ఐదేళ్లూ జనం సొమ్ము మేసి తాడేపల్లి ప్యాలెస్‌లో గుట్టలుగా నోట్ల కట్టలు జగన్ పోగేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఇంటి చుట్టూ కంచె వేసేందుకు కూడా ప్రజల సొమ్ము 13 కోట్లు ఖర్చు చేసిన జగన్, మళ్లీ సత్య హరిశ్చంద్రుడిలా నీతి కబుర్లు, ఫేక్ ట్వీట్లు చేస్తుంటాడని మండిపడ్డారు.*
*ఐదేళ్లూ జనం సొమ్ము మేసి తాడేపల్లి ప్యాలెస్‌లో గుట్టలుగా నోట్ల కట్టలు పోగేసుకున్న జగన్.. చివరికి ఇంటి చుట్టూ కంచె వేసేందుకు కూడా ప్రజల సొమ్ము 13 కోట్లు ఖర్చు చేశాడు. మళ్లీ సత్య హరిశ్చంద్రుడిలా నీతి కబుర్లు, ఫేక్ ట్వీట్లు వేస్తుంటాడు. ఐదేళ్లలో దోచేసిన వేలకోట్లు, నీ సాక్షి మీడియాకి దోచి పెట్టావ్ …*
*దేశ అధ్యక్షుల కంటే జగన్ రెడ్డికే ప్రాణహాని భయాలు! : జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌కు చుట్టూ నిర్మించుకున్న ఇనుప కంచెకు అయిన ఖర్చు జీఏడీ లెక్కల ప్రకారం 12.85 కోట్లని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ ధ్వజమెత్తారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఏ విధంగా వందల, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడో వాటికి నిదర్శనం నేడు ప్రత్యేక్షంగా కనిపిస్తున్నాయని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్, రుషికొండ ప్యాలస్, రుషికొండ ప్యాలస్‌లోని బాత్ టబ్ల నుంచి మసాజ్ టేబుళ్లు వరకు అన్ని ప్రజల సొమ్ముతోనే చేయించుకున్నాడని ఆయన దుయ్యబట్టారు. ఇష్టానుసారం మింగటం, సొంత ఖజానాకు చేర్చుకోవటం, మిగిలింది తన విలాసాల కోసం ఖర్చు చేయడం, ఇది జగన్ రెడ్డి సీఎంగా చేసిన దినచర్య అని విమర్శించారు. రాష్ట్రపతి భవన్, ప్రధాని ఇంటి చుట్టూ కూడా ఇలాంటివి ఉండవన్న పట్టాభిరామ్.. దేశ అధ్యక్షులు కంటే జగన్ రెడ్డికి ప్రాణహాని భయాలు ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు.*
???? కన్నేపల్లి మండలంలో అల్లుడిని హత్య చేసిన మామ..
కన్నేపల్లి మండలంలో అల్లుడిని హత్య చేసిన మామ
కన్నెపల్లి మండలం శాలిగాం గ్రామానికి చెందిన గోలేటి శంకర్ తన కూతురు బేబీ భర్త గోమాస నరేందర్ (37) ను గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు ఎస్సై గంగారం బుధవారం తెలిపారు. బేబీని ఏడాదికాలంగా నరేందర్ అదనపు కట్నం కోసం వేధిస్తూ ఉండడంతో పుట్టింటికి వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో అత్తగారింటికి వచ్చి తీవ్రంగా గొడవపడ్డాడు. మామా శంకర్ నరేందర్ పై గొడ్డలితో దాడి చేసి హతమార్చినట్లు వెల్లడించారు.
???? ముడా ఛైర్మన్ రాజీనామా..
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై విచారణ కొనసాగుతున్న తరుణంలో ముడా అథారిటీ ఛైర్మన్ కె.మరిగౌడ రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కూడా ఆయన కారులో బెంగళూరుకు వెళ్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
???? వైసీపీ ఓటమికి జగనే కారణం.. రాపాక సంచలనం..
వైసీపీ ఓటమికి జగనే కారణం.. రాపాక సంచలనం
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమికి జగనే కారణం అంటూ బాంబ్ పేల్చారు. వైసీపీ ఓటమికి కోటరీ కాదు.. వైఎస్ జగనే కారణమన్నారు. జగన్ ఎవరి మాట వినరని ఆరోపించారు. ఆరు నెలలకొకసారి జగన్‌ను కలిసే అవకాశం వస్తుందని, కొందరికి ఆ అవకాశం కూడా ఉండదని తెలిపారు.
????తుఫాన్ కారణంగా గిద్దలూరు పట్టణంలోని వివేకానంద కాలనీలోకి వర్షపు నీరు.. (ప్రకాశం జిల్లా గిద్దలూరు)
తక్షణమే స్పందించి లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలని అధికారులకు ఆదేశాలు..
తుఫాన్ ప్రభావంతో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో గిద్దలూరు పట్టణం,వివేకానంద కాలనీలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి సంబంధిత అధికారులతో చేరుకొని, అక్కడి పరిస్థితిని పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వర్షపు నీరు ఇళ్లలోకి చేరిన తీరును అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ కాలువలు సరిగ్గా లేకపోవటం వలన వర్షపు చేరిందని అక్కడి మహిళలు తెలియచేయగా వెంటనే అక్కడ చేరిన నీటిని దారి మళ్లీంచాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా శాశ్వత పరిష్కారం చేయాలనీ అధికారులను ఆదేశించారు. నంద్యాల రోడ్డులోని సగిలేరు వాగు వరద ఉదృతిని పరిశీలించి, వరద ఉదృతం పై అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా కంట్రోల్ రూమ్ నెంబర్ కు కానీ లేదా తనకు కానీ ఫోన్ చేయవచ్చునని తెలిపారు. రాష్ట్రంతో పాటు నియోజకవర్గంలో ఈరోజు రేపు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించి భరోసాగా నిలుస్తుందన్నారు. తమకు సమస్య వచ్చిందని తెలియగానే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని భరోసానిచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక ప్రజలు ధన్యవాదములు తెలియజేశారు.
కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ వెంకట దాసు, మండల తాహసిల్దార్ ఆంజనేయ రెడ్డి మరియు అధికార యంత్రాంగం మరియు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.*
????ఆయా ప్రాంతాలలో నిరంతర గస్తీ నిర్వహించాలని అధికారులకు ఆదేశం.జిల్లా కలెక్టర్..ప్రకాశం జిల్లా..
పొంగుతున్న వాగులు, వంకల వైపు ప్రజలు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచన. ఆయా ప్రాంతాలలో నిరంతర గస్తీ నిర్వహించాలని అధికారులకు ఆదేశం.
పరిస్థితి గురించి మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. అవసరమైన చోట ట్రాఫిక్ మళ్ళించాలని కలెక్టర్ స్పష్ఠీకరణ. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్న పశ్చిమ ప్రాంతంలోని మండలాల్లో మరింతఅప్రమత్తఅవసరమన్న కలెక్టర్. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశం. లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.ప్రభావిత ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలి. ఆయా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడి. జిల్లాలోని పరిస్థితిపై కలెక్టర్ సమీక్ష.
టెలికాన్ఫరెన్స్లో అధికారులకు పలు ఆదేశాలు జారీ.
స్టాఫ్ రిపోర్టర్ ఎస్ఎస్ రహమాన్..
????ఇద్దరు దొంగల అరెస్టు..రూ.5,15 000 స్వాధీనం.
గతనెలలో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ఓ సంస్థలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్ హెచ్ ఓ. వంశీధర్ తెలిపారు. గుంటూరు నగరంలోని శారదా కాలని, స్వర్ణభారతి నగర్ కు చెందిన ఇద్దరిని గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల వై జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి రూ.5,15,000 లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
జగన్ రెడ్డి నీ పతనం ప్రారంభం :లోకేష్..వైసీపీ ఓటమికి జగనే కారణం..రాపాక సంచలనం.. నారాయణ కాలేజీపై చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కేసు పెట్టాలని డిమాండ్.. అల్లుడిని హత్య చేసిన మామ..గిద్దలూరు వివేకానంద కాలనీలోకి వర్షపు నీరు.. నిరంతరం గస్తీ నిర్వహించాలి ప్రకాశం జిల్లా కలెక్టర్..
Recent Posts

