???? ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన పాలసీపై ముఖ్యమంత్రికి వివరించారు. 
వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలు, ఆయా రంగాల్లో ఉన్న నిపుణులతో చర్చించి కొత్త పాలసీలు రూపొందించినట్లు వివరించారు. ఎలక్ట్రానిక్స్ పాలసీపై చర్చించిన ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే క్యాబినెట్ లో ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా ఐటీ పాలసీ, డ్రోన్ పాలసీపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. వీటిని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఈనెల 22, 23వ తేదీల్లో తలపెట్టిన అమరావతి డ్రోన్ సమ్మిట్ పై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ భాగస్వామ్యంతో ఎపి డ్రోన్ కార్పొరేషన్ ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది.
????తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,361 మంది భక్తులు.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 28,850 మంది భక్తులు.. శ్రీ వారి హుండీ ఆదాయం రూ.3.91 కోట్లు
????తిరుమల ప్రకటన..16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
తిరుమలకు వాతావరణశాఖ భారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి 15వ తేది మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
???? బెజవాడ లో విచ్చలవిడిగా పేకాట..!!!
• జూదంలో జోగేష్కు ఎదురులేదు..• పేరుకే ఉల్లిపాయల వ్యాపారం..• లోనంతా పేకాట వ్యవహారం..
• బట్టబయలు చేసిన భవానీపురం పోలీసులు..! •24మందిని అదుపులోకి తీసుకుని 1,52000 స్వాధీనం..
విజయవాడ.. రాజులు రాజ్యాలు పంచుకుంటే నేటి తరంలో కొందరు నేతలు పార్టీ జెండాలను అడ్డుపెట్టుకుని పేకాట రాయుళ్లుగా నగరాలను పంచుకుంటున్నారు. వ్యాపార కేంద్రానికి దిగ్గజంగా మారిన విజయవాడలో పేకాటను విచ్చలవిడిగా మార్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలే విజయవాడ ప్రజల ఇలవేల్పు అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి మహా త్సవాలు అంగరంగ వైభవంగా ముగిసి భవానీ మాలాధారులు దుర్గమ్మ దర్శనానికి పోటెత్తుతున్నారు. భక్తి పారవశ్యంతో మునిగి తేలుతున్న బెజవాడలో ఇలాంటి పేకాట శిబిరాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అంటూ పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి వారి వల్లే మాయనిమచ్చ వస్తుందని అడ్డగోలుగా నాకు ఎవరు అడ్డురారు అనే విధంగా జూదంలో జోగేష్ పవర్ చూపిస్తునన్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. పశ్చిమ కేంద్రంగా ఎంతో కాలం నుంచి లక్షలాది రూపాయలతో జూదలు నడిపించడం పేరుకే ఉల్లిపాయల వ్యాపారం అని చెప్పి లోపల పేకాట నిర్వహించడం అతనికే సాధ్యం అని ఈ ప్రాంతంలో చర్చంశనీయంగా మారింది. గత కొన్ని రోజులుగా పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి జూదం నిర్వహిస్తున్నారు. కొందరు పోలీసులను మచ్చిక చేసుకుని ఇతగాడు ఈ వ్యవహారం నడిపిస్తున్నాడనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ ఓ మాజీ నాయకుడి అండ చూసుకుని జోగేష్ జూదం నిర్వహిస్తున్నాడని అందరికి తెలిసిందే. గత కొన్నాళ్లుగా పేకాట ఆడుతూ ఉల్లిపాయలు వ్యాపారం చేస్తున్నానే ముసుగులో పేకాటను ప్రధాన వృత్తిగా చేసుకుని పలువురు పోలీసులను సైతం బెదిరిస్తూ పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులకు భవానిపురం పోలీసులకు అందిన సమాచారం మేరకు సోమవారం పేకాట నిర్వహిస్తున్న ప్రాంతంపై మెరుపు దాడి చేసి జోగేష్ ను అతని తోపాటు ఉన్న మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా పేరు చెప్పి పలువురు పోలీసులను జోగేష్ బెదిరిస్తున్నాడని ఇటీ ఇటీవల పార్టీకి సమాచారం అందింది. ఇటువంటి బెదిరింపులు మానుకోవాలని పార్టీ పెద్దలు జోగేష్ కు పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతను ఏ మాత్రం మార్చుకోక పేకాట శిబిరాలు నిర్వహిస్తూనే ఉన్నాడు. జోగేష్ తో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1,52,000 నగదు రికవరీ చేశారు. భవానిపురం పోలీసుల్ని పలువురు అభినందిస్తున్నారు.
????ఏపీలో న్యూ లిక్కర్* *పాలసీ..ప్రారంభంలోనే రూ. 2400 కోట్ల ఆదాయం*
ఏపీలో మద్యం షాపులకు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించారు. షాపు దక్కించుకున్న వారు చెల్లించే తొలి విడత లైసెన్స్ రుసుముతో సుమారు రూ.300 కోట్ల ఆదాయం లభిస్తుంది. అలాగే వారం రోజులు సరకు కొనుగోలు ద్వారా మరో రూ.300 కోట్లకు పైగా వస్తుంది. ఇప్పటికే ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం లభించింది. మొత్తంగా నూతన పాలసీ ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం సమకూరుతుంది
????భూకబ్జాలను ప్రోత్సహిస్తున్న విద్యుత్ మున్సిపల్ అధికారులు.. టాక్స్ రద్దు చేసినప్పటికీ విద్యుత్ సౌకర్యం కొనసాగిస్తున్న అవినీతి అధికారులు..విద్యుత్ అధికారుల తనిఖీ*..చీరాల:* బాపట్ల జిల్లా చీరాల పట్టణం లో మున్సిపల్ రోడ్డు మార్గం ఆక్రమించి అక్రమ పద్ధతుల విద్యుత్ సౌకర్యం పొందిన రెండు సర్వీసులను తక్షణమే తొలగించి మంజూరు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు జర్నలిస్టు నాగార్జున రెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదు విషయమై జిల్లా విద్యుత్ శాఖ అధికారులు సోమవారం సాయంత్రం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
2021 వ సంవత్సరంలో చీరాల పట్టణంలో పులి ప్యాలెస్ పేరుతో నిర్మించిన అక్రమ భవన నిర్మాణం విషయమై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం WP 5525/2021 కేసు విచారణలో భాగంగా అక్రమ నిర్మాణాలకు విద్యుత్ సౌకర్యం చట్ట వ్యతిరేక చర్యగా పేర్కొంటూ రాష్ట్ర విద్యుత్ బోర్డు చైర్మన్ ను మందలించినప్పటికీ, ట్రస్ట్ ఆధ్వర్యంలోనీ చీరాల టౌన్ హాల్ భూమిని కొనుగోలు చేశామంటూ పులి వెంకటేశ్వర్లు మున్సిపల్ రోడ్డు మార్జిన్ ఆక్రమించి నిర్మించిన కమర్షియల్ షాపులకు మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు భూకబ్జాదారులతో కుమ్మక్కయి ప్రజాప్రయోజనాలను తుంగలో తొక్కి అవినీతికి పాల్పడి తప్పుడు పద్ధతిలో ఇచ్చిన విద్యుత్ సౌకర్యాలను తక్షణమే తొలగించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు నాగార్జున రెడ్డి జిల్లా కలెక్టర్ కు చేసిన ఫిర్యాదు పై సోమవారం సాయంత్రం జిల్లా విద్యుత్ శాఖ అధికారులు విచారణ జరిపారు. న్యాయస్థానం ఉత్తర్వులను కాదని భూకబ్జాదారులకు సహకరించడం వెనుక మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడి సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన భూములను భూకబ్జాదారులకు దారాదత్తం చేయడం ప్రభుత్వ యంత్రాంగం తమ అధికార విధులను దుర్వినియోగం చేయడమేనని ఫిర్యాదు గారు నాగార్జున రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ , విద్యుత్తు శాఖ అధికారులు కోర్టు కేసుల ముసుగులో భూకబ్జాదారులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ప్రజా ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని నాగార్జున రెడ్డి ఆరోపించారు.
విచారణ సందర్భంగా జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఆంజనేయులు, స్థానిక విద్యుత్ అధికారులు, ఫిర్యాదు ఎం నాగార్జున రెడ్డి, చీరాల అభివృద్ధి సాధన సమితి ప్రతినిధులు శీలం రవికుమార్ వల్లపు బాల అంకమ్మరావులు పాల్గొన్నారు.
???? డీజే సౌండ్‌కు గుండెపోటుతో యువకుడు మృతి..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కొంకాపల్లిలో అమలాపురం మండలం బండారులంకకు చెందిన పప్పుల వినయ్(22) కొంకాపల్లిలో నిర్వహించిన దసరా ముగింపు ఉత్సవంలో పాల్గొన్నాడు.
ఈ క్రమంలో డీజే పాటల మధ్య స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ డీజే సౌండ్‌కు సొమ్మసిల్లి పడిపోయాడు.
వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు..**ఏదేమైనప్పటికీ డీజే సౌండ్ వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తు తుండడంతో డీజేలా సౌండ్లను పరిమితమైన చేయాలి.. లేదంటే డీజేలను బహిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
???? ప్రియురాలి సజీవ దహనం… లారెన్స్ బిష్ణోయ్ ఫ్లాష్ బ్యాక్ తెలుసా?..
లారెన్స్ ది పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ జిల్లా ధత్తరన్ వాలీ గ్రామంలోని ఓ సంపన్న కుటుంబం. లారెన్స్ 12వరకు చదివాడు.. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధీఖ్ హత్యతో ముంబై మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో… దేశవ్యాప్తంగా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మార్మోగుతోంది. దీంతో… ఎవరీ బిష్ణోయ్, ఇప్పుడు ఎక్కడున్నాడు, ఈ వ్యవహారాలు ఎప్పుడు మొదలు పెట్టాడు మొదలైన విషయాలపై చర్చ మొదలైంది. అవును… బాబా సిద్ధీఖ్ హత్యతో ముంబై మహా నగరం ఉలిక్కిపడటంతో పాటు.. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గురించిన చర్చా మొదలైంది. పైగా 31 ఏళ్ల ఈ పంజాబీ గ్యాంగ్ స్టర్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అయినప్పటికీ అతడి సోదరుడు, అనుచరుడు కెనడా నుంచి గ్యాంగ్ ను నడిపిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయంలో ఆందోళనకారంగా మారింది. లారెన్స్ ది పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ జిల్లా ధత్తరన్ వాలీ గ్రామంలోని ఓ సంపన్న కుటుంబం. లారెన్స్ 12వరకు చదివాడు.. అనంతరం పంజాబ్ యూనివర్సిటీ పరిధిలోని దయానంద్ ఆంగ్లో వేద కళాశాల (డీఏవీ) లో చేరాడు. ఈ క్రమంలో జాతీయ స్థాయి అథ్లెట్, పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా చేశాడు. ఆ తర్వాత జరిగిన పరిచయంతో లైఫ్ మారింది! ఇందులో భాగంగా… విద్యార్థి రాజకీయాల్లో గోల్డీ బ్రార్ తో పరిచయం ఏర్పడటం.. కొన్నాళ్లకు మెల్లమెల్లగా అసాంఘిక కార్యకలాపాలు మొదలుపెట్టడం జరిగిపోయాయి. ఈ సమయంలో కాలేజ్ గ్యాంగ్ వార్ లో అతడి ప్రియురాలిని ప్రత్యర్థి వర్గం సజీవ దహనం చేసింది! దీంతో అతడు పూర్తిగా నేరాల వైపు మళ్లినట్లు చెబుతుంటారు. ఈ క్రమంలోనే 2018లో తన అనుచరుడు సంపత్ నెహ్రాతో కలిసి సినీ స్టార్ సల్మాన్ ఖాన్ హత్యకు కుట్రపన్నడంతో జాతీయ స్థాయి వార్తలకెక్కాడు. ఇదే క్రమంలో… లారెన్స్ సన్నిహితుడు జస్విందర్ ను గ్యాంగ్ స్టర్ జైపాల్ భుల్లర్ హత్య చేశాడు. మరోపక్క బిష్ణోయ్ గ్యాంగ్ సీమాంతర ఆయుధ స్మగ్లింగ్ చేస్తుందని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఆరోపిస్తోంది. ఇక లారెన్స్ ను చంపేందుకు ఇప్పటికే ఢిల్లీలోని గ్యాంగ్ స్టర్స్ కాచుకుని కూర్చొన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అతడిని వివిధ కేసుల్లో జైలు నుంచి కోర్టులకు తరలించడం పోలీసులకు కత్తిమీద సాముగా మారిందని చెబుతున్నారు. సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు!: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడటం.. దానికి సంబంధించిన కేసు ఇప్పటికీ నడుస్తుండటం తెలిసిందే! ఈ కృష్ణజింకలను బిష్ణోయ్ వర్గం వారు పవిత్రంగా పరిగణిస్తారు. దీంతో… వీటిని వేటాడంపై అదే వర్గానికి చెందిన లారెన్స్ కు ఏమాత్రం నచ్చలేదు. ఫలితంగా… 2018 నుంచి సల్మాన్ లక్ష్యంగా ఈ గ్యాంగ్ పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ లో సల్మాన్ ఇంటిపై కాల్పులు కూడా జరిపింది. అంతక ముందు అతడి ఫామ్ హౌస్ వద్ద రెక్కీ నిర్వహించినట్లు చెబుతుంటారు. జైలు నుంచి ఎలా నడిపిస్తున్నాడు..?: ప్రస్తుతం బిష్ణోయ్ గ్యాంగ్ లో పలువురు ప్రొఫెషనల్ షూటర్లు ఉన్నారు. చిన్నా చితకా కలిపి వీరి సంఖ్య సుమారు 700 వరకూ ఉండోచ్చని చెబుతున్నారు. ఇక వీరి నెట్ వర్క్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లలో విస్తరించింది. లారెన్స్ ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్నా.. తన గ్యాంగ్ ను మాత్రం నిరాటంకంగా నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో అతడి సోదరుడు అన్మోల్, మిత్రుడు గోల్డీ బ్రార్ లు ఈ వ్యవహారాలు చూసుకొంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోనే వీరు భయానక గ్యాంగ్ గా పేరు తెచ్చుకొంది. ఈ నేపథ్యంలోనే ముంబైలో ఖాళీగా ఉన్న మాఫియా రాజ్యాన్ని ఆక్రమించడానికి లారెన్స్ & కో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది!
ప్రియురాలి సజీవ దహనం…లారెన్స్ బిష్ణోయ్ ఫ్లాష్ బ్యాక్ తెలుసా?..డీజే సౌండ్‌కు గుండెపోటుతో యువకుడు మృతి..భూకబ్జాలను ప్రోత్సహిస్తున్న విద్యుత్ మున్సిపల్ అధికారులు..బెజవాడ లో విచ్చలవిడిగా పేకాట..16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
Recent Posts

