అమెరికాలో సైతం ఉచిత పథకాలు.. బీజేపీకి చిర్రెత్తుకొచ్చేలా కేజ్రీవాల్ పోస్ట్!..ఇరాన్‌పై సైబర్ అటాక్ ..కేసీఆర్ పలవరింత కాదు పాలన మీద ఫోకస్ చేయ్..రేవంత్ రెడ్డి..రైలు పేరొకటి.. కానీ వెళ్లే రూటు మరొకటి..దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు..లోకో పైలట్ మర్డర్ మిస్టరీ వీడింది…జగిత్యాలలో ఫారెస్ట్ ఆఫీస్‌లో అధికారుల లిక్కర్ దావత్!!!అక్రమంగా తరలిస్తున్న 80 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం

???? ఏపీలో విచిత్రమైన ఘటన జరిగింది. రైలు పేరొకటి.. కానీ వెళ్లే రూటు మరొకటి.. రైల్వే సిబ్బంది నిర్లక్ష్య వైఖరి అయోమయానికి గురైన ప్రయాణికులు.
శుక్రవారం ఉదయం 10.02 గంటల సమయంలో.. కొత్తవలస రైల్వేస్టేషన్‌కు తొమ్మిది గంటలకు రావాల్సిన విశాఖపట్నం- అరకు (08525) దసరా స్పెషల్‌ రైలు గంటకు పైగా ఆలస్యం కాగా.. ప్రయాణికులు వేచి ఉన్నారు. ఈలోపు అరకు స్పెషల్‌ రైలు వస్తున్నట్లు అనౌన్స్‌మెంటు చేయడంతో.. ప్రయాణికులు లేచి ఆ రైలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇంతలో తాంబరం నుంచి బెంగాల్‌ వెళ్లే రైలు స్టేషన్‌కు వచ్చింది. ఆ వెంటనే మరో రైలు వచ్చి వెళ్లింది.
ఆ రెండు రైళ్లు వచ్చిన వెళ్లిన తర్వాత మచిలీపట్నం, విశాఖపట్నం పేరుతో మరో రైలు వచ్చి ప్లాట్‌ఫాంపై వచ్చి ఆగింది. ఈ రైలుకు ఎలాంటి అనౌన్స్‌మెంటు లేదు. ప్లాట్‌ఫామ్‌పై వ్యాపారాలు చేసుకునే వాళ్లు అరకు రైలు వచ్చింది త్వరగా ఎక్కండి అంటూ పెద్దగా కేకలు వేశారు. కానీ ఆ రైలుపై ఉన్న బోర్డులు మాత్రం మరోలా కనిపిస్తుండంతో అరకు రైలు అవునా కాదా అన్న కన్ఫ్యూజన్ ఉంది. అయితే క్యాంటీన్‌ వ్యాపారుల సమాచారంతో ఒక్కసారిగా ప్రయాణికులు పరుగులు తీశారు. కానీ రైలుపై సరైన సమాచారం తెలిపే బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో కొద్దిసేపు గందరగోళం కనిపించింది. మహిళలు, చిన్నారులతో రైలు ఎక్కేందుకు ఇబ్బందిపడ్డారు.. ఈ అంశంపై అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు, పర్యాటకులు కోరుతున్నారు. ఇలాంటి సందిగ్థం లేకుండా చూడాలంటున్నారు.
???? కడప జిల్లా..మైదుకూరులో పట్టపగలే దొంగలు పేట్రేగిపోతున్నారు.. నంద్యాల రోడ్డులోని ఓ మహిళ మెడ నుంచి బంగారు గొలుసును లాకెళ్లిన దొంగ.. అవాక్కైన చుట్టుపక్కల ప్రజలు కేకలు వేసిన బాధ్యత మహిళ.
???? ఒక పందెం కోడి.. కుటుంబం మొత్తాన్ని బలి తీసుకుంది..!!!
భర్త, కుమారుల మృతిని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య..
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వకుంటలో కోడికి ఈత నేర్పడానికి వెళ్లి భర్త వెంకటేశ్వరరావు (45), కుమారులు మణికంఠ (15), సాయి కుమార్ (13) కాలువలో మునిగి చనిపోయారు.
అయితే భర్త, కుమారులు ఒకేసారి అకాల మరణంతో దూరం కావడాన్ని భార్య దేవి(36) భరించలేకపోయింది.. వారినే తలుచుకుంటూ తీవ్ర మానసిక వేదనకు గురైంది.
దీంతో శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరుగుదొడ్డిలో ఇనుప రాడ్డుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది…
????????దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు..నాగర్ కర్నూల్‌కు చెందిన కృష్ణయ్య గౌడ్ అనే మతిస్థిమితం లేని వ్యక్తి ఆహారం కోసం దుర్గామాత దగ్గరికి వెళ్ళాడు.అక్కడ ఆహారం కోసం వెతికినా ఏమీ దొరకకపోవడంతో కోపంతో మండపాన్ని చిందరవందర చేసి, దుర్గామాత చేయిని విరగ్గొట్టాడని పోలీసులు తెలిపారు.
నిందితుడు కృష్ణయ్య గౌడ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు…
????విజయవాడలో సంచలనం సృష్టించిన లోకో పైలట్ మర్డర్ మిస్టరీ వీడింది…*
బీహార్‌లోని బక్సర్‌ జిల్లా బారు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే దేవ కుమార్‌ సాహో రైల్వే లోకో పైలట్ ఎబినేజర్‌ను హత్య చేసిట్టు గుర్తించారు…గురువారం తెల్లవారు జామున విజయవాడ రైల్వే స్టేషన్‌ శివార్లలోని ఎఫ్‌ క్యాబిన్‌ వద్ద విధులు కు వెళుతు ఉన్న లోకో పైలట్‌పై నిందితుడు ఇనుప రాడ్డుతో దాడి చేశాడు.
డబ్బు కోసమే లోకో పైలట్‌ పై నిందితుడు దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. పది రోజుల క్రితం ఉపాధి కోసం బీహార్‌లోని బక్సర్‌ నుంచి విజయవాడకు వచ్చిన సాహోకు ఎక్కడా పని దొరకలేదు. దీంతో తీవ్రమైన ఒత్తడితో డబ్బు కోసం ఏదైనా నేరానికి పాల్పడాలని భావించాడు.
ఇంద్రకీలాద్రి వద్ద దసరా ఉత్సవాలు జరుగుతున్న ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి మత్తులో హంగామా సృష్టించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వదిలేశారు…
అక్కడి నుంచి కాలినడకన బయల్దేరి ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్‌పై రాయితో దాడి చేశాడు.
డ్రైవర్‌ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
నైజాంగేటు రైల్వే ట్రాక్‌ వెంబడి స్టేషన్‌ పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు. అక్కడ గూడ్స్ బోగీలను ప్లాట్‌ఫాం మీదకు షంటింగ్ చేస్తున్న డ్రైవర్‌ వద్ద డబ్బులు ఉంటాయని భావించి అతడిని డబ్బులు అడిగాడు. డబ్బులిచ్చేందుకు డ్రైవర్ నిరాకరించడంతో అతనిపై ఇనుప రాడ్డుతో దాడి చేసినట్టు జిఆర్పీ డి ఎస్ఆర్పి రత్నరాజు తెలిపారు.
లోకో పైలట్‌ మీద అగంతకుడు దాడి చేస్తున్న విషయాన్ని ట్రాక్‌పై విధుల్లో ఉన్న కీమెన్‌ గమనించి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు…
యార్డులో విధుల్లో ఉన్న మరో కో పైలట్ పృధ్వీరాజ్‌కు కీమెన్‌ సమాచారం ఇవ్వడంతో మరికొంతమంది రైల్వే కార్మికులతో కలిసి తొలుత రైల్వే ఆస్పత్రికి, అక్కడి నుంచి మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు..
చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందాడు. రైల్వే డ్రైవర్ హత్య తర్వాత ప్రత్యేక బృందాలు రైల్వే ప్రాంగణాల్లో గాలింపు చేపట్టడంతో కృష్ణాజిల్లా దోసపాడు రైల్వే స్టేషన్‌లో నిందితుడు పట్టుబడ్డాడు.సిబ్బంది లేరు..యార్డులో పర్యవేక్షణ సాధ్యం కాదు..విజయవాడ రైల్వే స్టేషన్‌ పరిసరప ప్రాంతాల్లో గత రెండేళ్లలో ఆరు హత్యలు జరిగాయి. నిర్మానుష్యంగా ఉండటంతో గంజాయి ముఠాలు తిష్ట వేస్తున్నాయి. రాత్రి సమయాల్లో విధులు నిర్వర్తించే రైల్వే సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారు..రైల్వే యార్డుల్లో కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో బిక్కు బిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న నైజాంగేట్ లెవల్‌ క్రాసింగ్‌ను పూర్తిగా మూసేయడంతో సాధారణ ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అదనుగా గంజాయి సేవించడానికి యువతకు అడ్డాలుగా మారాయి. రైల్వే పరిధిలోని ప్రాంతాల్లో నిఘా బాధ్యత తమది కాదని స్థానిక పోలీసులు వదిలేస్తున్నారు..
విజయవాడ రైల్వే జిఆర్పీ పరిధిలో 70మంది పోలీసులు విధులు నిర్వర్తించాల్సి ఉంటే ప్రస్తుతం 17మంది మాత్రమే సిబ్బంది అందుబాటులో ఉన్నారు…
కనీసం మూడో వంతు కూడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది..
దీంతో రైల్వే స్టేషన్‌లో భద్రతతో పాటు రైల్వే పరిసర ప్రాంతాల్లో నిఘాను పూర్తిగా వదిలేశారు.
రైల్వేకు చెందిన పరిసర ప్రాంతాల్లో ఆర్పీఎఫ్‌ భద్రత అంతంత మాత్రంగానే ఉంటోంది. ఆదాయపరంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యధికంగా ఆదాయాన్ని సంపాదించే విజయవాడ రైల్వే స్టేషన్‌లో కనీస భద్రతా ఏర్పాట్లు కూడా లేవు. తగినంత సిబ్బంది లేకుండా తాము ఏమి చేయలేమని జిఆర్పీ అధికారులు చేతులెత్తేస్తున్నారు.
విజయవాడ రైల్వే స్టేషన్‌లో విధులతో పాటు ఇతర బాధ్యతల పర్యవేక్షణ చేపట్టాలంటే స్థానిక పోలీసుల సహకారం కూడా ఉండాలని జిఆర్పీ అధికారులు చెబుతున్నారు…
విజయవాడ డివిజన్‌కు పశ్చిమగోదారి జిల్లా, విజయవాడ కమిషనరేట్‌, కృష్ణ జిల్లా పోలీసుల నుంచి సిబ్బందిని కేటాయించాల్సి ఉంటుంది. అయా జిల్లాల నుంచి పోలీసుల్ని రైల్వే విధులకు ఇవ్వకపోవడంతోనే రైల్వే స్టేషన్ పరిసరాల్లో వరుస హత్యలు జరుగుతున్నాయని చెబుతున్నారు…
*????జగిత్యాలలో ఫారెస్ట్ ఆఫీస్‌లో అధికారుల లిక్కర్ దావత్..వన్య ప్రాణి మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్ల దసరా దావత్ చేసుకున్నారని అనుమానాలు.
నెమలి, అడవి పంది మాంసంగా అనుమానాలు, మాంసం శాంపిల్ తీసుకుని ల్యాబ్‌కి పంపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం.దావత్ కు హాజరైన జిల్లా ఫారెస్ట్ సిబ్బంది, కొందరు బీట్, సెక్షన్ ఆఫీసర్లు. ఇదేంటని ప్రశ్నించిన మీడియా పై దురుసుగా ప్రవర్తించిన ఆఫీసర్లు.
తనకు సమాచారం లేదన్న జిల్లా అటవీ శాఖ అధికారి.. శాఖ పరమైన చర్యలు ఉంటాయని తెలిపిన అటవీ శాఖ అధికారి…
???? టెక్నాలజీస్‌ స్కాంపై ఈడీ విచారణ. 17 వేల మంది బాధితుల నుంచి రూ.229 కోట్లు వసూళ్లు. దేశవ్యాప్తంగా పెట్టుబడుల పేరుతో డబ్బుల వసూళ్లు. ఇప్పటికే హైదరాబాద్‌ సీసీఎస్‌లో DKZపై కేసు నమోదు. పెట్టుబడికి రెండింతల లాభం ఇస్తామంటూ వసూళ్లు. ఒకే వర్గం వారిని టార్గెట్‌ చేసి వసూళ్లకు పాల్పడ్డ DKZ. DKZ డైరెక్టర్‌ అయేషాను అరెస్ట్‌ చేసిన సీసీఎస్‌. DKZ స్కాంలో 16 మంది నిందితుల కోసం గాలింపు. హవాలా మనీలాండరింగ్‌ జరిగినట్లు ఈడీ గుర్తింపు.
???? ఇరాన్‌పై సైబర్ అటాక్.. కీలక పరిపాలన కేంద్రాలు, అణుస్థావరాలే లక్ష్యంగా దాడి.. సైబర్ దాడులు ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ అనుమానం.. ఇజ్రాయెల్- ఇరాన్ ఘర్షణలతో మరింత ఉద్రిక్తతంగా పశ్చిమాసియా..
???? తోట్లవల్లూరు .. పామర్రు నియోజకవర్గం.. కృష్ణాజిల్లా… ఈరోజు PDS రైస్ ను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులను యాకమూరు సెంటర్ నందు అరెస్టు చేయడం జరిగింది… కేసు నమోదు.
మైలవరంకు చెందిన వలస గంగరాజు అనే అతను TATA Intra V30 ఏకమూరు వద్ద నుండి ఉయ్యూరు చెందిన కంతేటి నిరంజన్ కు చెందిన 85 PDS రైస్ బస్తాలను నూజివీడు కి చెందిన సోల రాముకు తరలిస్తూ ఉండగా ..
తోట్లవల్లూరు పోలీసు వారు DT, PDS, రెవెన్యూ వారి సమక్షంలో రైడ్ చేయడం జరిగింది.
సుమారు 42 క్వింటాళ్ల PDS రైస్ వెహికల్ తో పాటు ను సీజ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నారు.
***???? కర్నూలు: పత్తికొండ మార్కెట్‌లో తగ్గిన టమోటా ధరలు..రూ.20కి పడిపోయిన కిలో టమోటా ధర..
మూడు రోజుల క్రితం రూ.100 పలికిన కిలో టమోటా..
ఒక్కసారిగా ధర రూ.20కి పడిపోవడంతో రైతుల ఆందోళన
** అమరావతి: సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు..
నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా చేపట్టిన చర్యలపై సమీక్ష
*** ????మ‌ద్యం దుకాణాల‌కు రికార్డుస్థాయిలో ద‌ర‌ఖాస్తులు.. ప్ర‌భుత్వానికి భారీ ఆదాయం!
దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చి ఉంటాయని అధికారుల అంచ‌నా..తద్వారా ప్ర‌భుత్వానికి రూ.1800 కోట్ల వరకూ ఆదాయం..
వత్సవాయి దుకాణానికి అత్యధికంగా 132 దరఖాస్తులు
శుక్రవారం సాయంత్రం ఏడింటికి ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువు
ఈ నెల 16 నుంచి అమ‌ల్లోకి కొత్త మ‌ద్యం పాల‌సీ
***మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి అయన తరపున ₹ 50 లక్షల చెక్కును మరియు రామ్ చరణ్ తరపున ₹ 50 లక్షల చెక్కు అందజేశారు.
***????గుంటూరు జిల్లా పోలీసు కార్యలయంలో ఆయుధాగారం వద్ద సాంప్రదాయ బద్ధంగా ఘనంగా ఆయుద పూజా కార్యక్రమం జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ నిర్వహించారు..
విజయ దశమి దసరా పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ, పోలీసు అధికారులు , సిబ్బందికి, మరియు మీడియా మీత్రులకు, మీడియా ప్రతినిధులకు విజయ దశమి శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేసారు
జిల్లా పోలీసు కార్యలయం నందు గల ఆర్ముడు రిజర్వ్ విభాగం నందు గల ఆయుధాగారం నందు దుర్గామాతకు అత్యంత భక్తి శ్రద్ధలతో జిల్లా ప్రజలు మరియు జిల్లా పోలీసులు వారి కుటుంబ సభ్యులు సుఖఃశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో వున్న ఆయుధాగారంలోని పోలీసులు దైనందిన విధుల్లో వినియోగించే అన్నిరకాల ఆయుధాలకు మరియు (MT section) మోటారు ట్రాన్సుపోర్ట్ విభాగంలోని వివిధ రకాల వాహనాలకు, కమ్యూనికేషన్స్ విభాగం దగ్గర కోలువై వున్న రాజ్య లక్ష్మి అమ్మ వారి గుడి వద్ద, మరియు డి పి ఓ నందు వివిధ విభాగాల్లో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్ని ఎ విభాగంలో కూడా పోలీసు అధికారులకు విధుల పరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసి పోలీసు అధికారులు చేయు అన్ని కార్యక్రమాలు సాజావుగా జరిగే విధంగా చూడాలని కొబ్బరి కాయలు కోట్టి అమ్మ వారిని ప్రార్థిస్తూ పూజా కార్యక్రమం నిర్వహించారు.
ఈసందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు పోలీసు అధికారులకు సిబ్బందికి, మీడియా మిత్రులకు, మీడియా
ప్రతినిధులకు మరియు కుటుంబ సభ్యులకు, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తు దుర్గా మాత అనుగ్రహముతో ఆశీస్సులతో జిల్లా ప్రజలు, జిల్లా పోలీసులు సంతోషంగా జీవించాలని,జిల్లా పోలీసులకు తమ దైనందిన విధులు, సేవల్లో విజయాలు చేకూరాలని , ఆయు:రారోగ్యాలతో పోలీసుశాఖ ప్రతిష్ట పెంపొందేలా పోలీసు విధులు నిర్వహించాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.
????పల్నాడు జిల్లా: నరసరావుపేట టు టౌన్ పీఎస్ పరిధిలో పోలీసుల తనిఖీలు*..ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 80 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం*..*బియ్యం తరలిస్తున్న ఫిరంగిపురంకి చెందిన కుంభా నాగరాజుపై కేసు నమోదు.
**మ‌ద్యం దుకాణాల‌కు రికార్డుస్థాయిలో ద‌ర‌ఖాస్తులు.. ప్ర‌భుత్వానికి భారీ ఆదాయం!
దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చి ఉంటాయని అధికారుల అంచ‌నా ..తద్వారా ప్ర‌భుత్వానికి రూ.1800 కోట్ల వరకూ ఆదాయం ..వత్సవాయి దుకాణానికి అత్యధికంగా 132 దరఖాస్తులు..శుక్రవారం సాయంత్రం ఏడింటికి ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువు
ఈ నెల 16 నుంచి అమ‌ల్లోకి కొత్త మ‌ద్యం పాల‌సీ
***ప్రమాదవశాత్తూ వెల్డింగ్ కార్మికుడి మృతి*
చిలకలూరిపేట బస్టాండ్ సమీపంలో శుక్రవారం వెల్డింగ్ కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. ఓ పౌండ్రీలో షేక్ జానీ బాషా(43) వెల్డింగ్ పని చేస్తుండగా గ్యాస్ లీకై.. మంటలు వ్యాపించాయి. ఘటనలో అతని కాళ్లు, చేతులు కాలిపోయాయి. వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
????కేసీఆర్ పలవరింత కాదు పాలన మీద ఫోకస్ చేయ్.. రేవంత్ రెడ్డి పదవిని చేపట్టిన క్షణం మొదలు ఇప్పటివరకు గులాబీ బాస్ కేసీఆర్ ను మాటలతో ఉతుకుడు కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. రాజకీయ ప్రత్యర్థిని ఎలా డీల్ చేయాలన్నది ఒక ఎత్తు అయితే.. గులాబీ బాస్ కేసీఆర్ లాంటి అధినేతను డీల్ చేసే విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఈ విషయంలో ఏ చిన్న తేడా కొట్టినా మొదటికే మోసం కలగటం ఖాయమన్న విషయాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి దగ్గర దగ్గరగా ఏడాది కావొస్తోంది. పదవిని చేపట్టిన క్షణం మొదలు ఇప్పటివరకు గులాబీ బాస్ కేసీఆర్ ను మాటలతో ఉతుకుడు కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఇలాంటి తీరు కొత్తల్లో బాగానే ఉన్నా..
పోను పోను ఈ తీరుకు ప్రజలు నెగిటివ్ గా స్పందించే వీలుంది. ఎందుకుంటే.. గత ప్రభుత్వం.. ప్రభుత్వాధినేత తప్పు చేసిన కారణంగానే అధికార బదిలీ జరిగిందన్న విషయాన్ని తాజా పాలకులు గుర్తించాలి. వారి తప్పుల్ని ఎత్తి చూపటం తప్పు కాదు. కానీ.. అది మాత్రమే పని. వేరే పని లేదన్నసంకేతాలు ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని రేవంత్ గుర్తించాలి. వేదిక ఏదైనా.. ప్రోగ్రాం మరేదైనా సరే గత ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపైనా.. ఆయన తీసుకున్న నిర్ణయాలపైనా అదే పనిగా దుమ్ముత్తి పోయటం మొదట్లో ఆసక్తిని కలిగించేలా ఉన్నా.. పోను పోను అదో మోనాటనీలా మారుతుందన్న విషయాన్ని రేవంత్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అన్నింట్లోనూ తప్పులు చేశాడు.. పొరపాటు నిర్ణయాలు తీసుకున్నారంటూ మాటలతో మంట పుట్టే మాటలు బాగానే ఉన్నా.. మరి.. ఏడాది (దగ్గర దగ్గరగా)కి వచ్చేస్తున్న వేళలోనూ.. పాత తీరులోనే కేసీఆర్ ను ఉతుకుడు ప్రోగ్రాం పెడితే ఏం బాగుంటుంది చెప్పండి?
తాజాగా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్.. ఎప్పటిలానే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రభుత్వ విధానాల్ని విమర్శించారు. తమ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్ని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో భ్రష్టు పట్టిన విద్యాశాఖను ప్రక్షాళన చేసేందుకు ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నట్లు చెప్పిన రేవంత్.. ‘టీచర్ల కష్టాల్ని గుర్తించి 21 వేల మందికి పదోన్నతలు ఇచ్చాం. బదిలీలు చేపట్టాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల విధి నిర్వహణకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాం” అని చెప్పటం బాగానే ఉన్నా.. ఈ సందర్భంగానూ కేసీఆర్ ను మాటలతో ఉతుకుడు ప్రోగ్రాం చేపట్టటం అంతగా సూట్ కాలేదన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ డెవలప్ మెంట్ పేరుతో కేసీఆర్ పదేళ్ల కాలంలో రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేశారని.. రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినట్లుగా పేర్కొన్నారు. పేద పిల్లలకు విద్యను అందించాలని మాత్రం అనుకోలేదంటూ మండిపడ్డారు. గురుకులాలకు ఏటా రూ.10 కోట్లు ఇచ్చినా కనీస సౌకర్యాలు సమకూరేవని.. ఎస్సీలను చెప్పులు కుట్టుకోమని.. ఎస్టీలు పందులు పట్టుకోమని.. బీసీలు గొర్రెలు.. బర్రెలు యామని.. చేపలుపట్టమని.. గౌడన్నలు ఈదులు గీసుకోమని చెప్పారంటూ మండిపడ్డారు.
”బీసీ ప్రజలు గొర్రెలు.. బర్రెలు కాస్తూ బతకాలా? మీ కుటుంబంలో మాత్రం కొడుకు.. అల్లుడికి మంత్రుల ఉద్యోగాలు.. బిడ్డకు ఎమ్మెల్సీ.. తోడల్లుడి కుమారుడికి ఎంపీ సీటు ఇప్పించుకున్నారు. మేం సమతా మార్గంలో ముందుకు వెళుతుంటే.. బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల సొసైటీ కార్యదర్శిగా పని చేశారు కదా? మీ హయాంలో గురుకుల పాఠశాలల్లో అసౌకర్యాలపై చర్యలు ఎందుకు చేపట్టలేదు?” అని ప్రశ్నించారు సీఎం రేవంత్. ఈ ప్రశ్నలు బాగానే ఉన్నా.. వాటికి సమాధానంగా తమ పాలనను చూపించాల్సిన అవసరం సీఎం రేవంత్ మీద ఉందన్న విషయాన్ని ఆయన మర్చిపోతున్నారు. ఇంకెంతకాలం ప్రశ్నలు? తన పాలనతో సమాధానాలు చూపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. విమర్శలు ఒక స్థాయి వరకు మాత్రమే బాగుంటాయన్నది రేవంత్ ఎప్పుడు గుర్తిస్తారు. ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన మొదట్లో కేసీఆర్ కాస్త మాట్లాడినా.. ఆ తర్వాత నుంచి మాట్లాడటం మానేశారు. ఆ మాటకు వస్తే.. ఆయన రాజకీయానికి దూరంగా ఉన్నట్లుగా వ్యవహరిస్తూ ఫాంహౌస్ కు పరిమితం అయ్యారు. ఇలాంటి వేళలో.. గత పాలకుడ్ని మరపించేలా వ్యవహరించాల్సిన రేవంత్.. కేసీఆర్ పాలనను గుర్తు చేసుకునే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వటం ఇప్పుడో చర్చగా మారింది. హైడ్రా కావొచ్చు.. మూసీ ప్రక్షాళన కావొచ్చు.. రియల్ ఎస్టేట్ తిరుగోమనం కావొచ్చు.. ఇవన్నీ ప్రభుత్వానికి ప్రతికూల అంశాలే. రాజకీయాల్లో చురుకుగా ఉండాల్సిన ప్రతిపక్ష నేత వానప్రస్థానానికి వెళ్లినట్లుగా వ్యవహరిస్తున్న వేళ.. తనకు మరెవరూ ప్రత్యామ్నాయం లేరన్న భావనను కలిగించటం అవసరం కదా? ఇప్పటికి కేసీఆర్ ను.. ఆయన పాలనను దూషించటం వల్ల వచ్చే కొత్త లాభం ఏమిటి? అన్న ప్రశ్నలు చాలా అవసరం. ఈ విషయాన్ని రేవంత్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
????అమెరికాలో సైతం ఉచిత పథకాలు.. బీజేపీకి చిర్రెత్తుకొచ్చేలా కేజ్రీవాల్ పోస్ట్!
ప్రస్తుతం మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉచిత పథకాలు అమలవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు పరిమితంగా ఈ స్కీమ్స్ ను అమలు చేస్తుండగా మరికొన్ని రాష్ట్రాలు లిమిట్ దాటి ఈ స్కీమ్స్ ను అమలు చేస్తున్నాయి. అడ్డూ అదుపు లేకుండా ఉచిత పథకాల అమలు వల్ల దేశానికి తీరని నష్టం కలుగుతుందని చాలామంది భావిస్తారు. అయితే అమెరికాలో సైతం ఉచిత పథకాల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల హామీల్లో భాగంగా తాను అధికారంలోకి వస్తే కరెంట్ బిల్లులను సగానికి సగం తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అయితే ట్రంప్ పోస్ట్ ను కేజ్రీవాల్ రీపోస్ట్ చేయడంతో పాటు ఉచితాలు అమెరికా వరకు వెళ్లాయంటూ కామెంట్ చేశారు. ఉచిత పథకాలు ఓట్లపై ప్రభావం చూపుతాయని ట్రంప్ సైతం నమ్ముతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఉచిత పథకాల హామీలు అమెరికాలో ట్రంప్ కు అధికారాన్ని తెచ్చిపెడతాయో లేదో చూడాల్సి ఉంది. కేజ్రీవాల్ బీజేపీకి చిర్రెత్తుకొచ్చేలా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం టార్గెట్ చేసే ఛాన్స్ వస్తే ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఉచిత పథకాలు దేశ ఆర్థిక పరిస్థితికే ప్రమాదం అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అర్హత లేకపోయినా కొంతమంది ఉచిత పథకాలు పొందుతుండటం గమనార్హం. ఉచిత పథకాల విషయంలో ప్రజల్లో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. కేజ్రీవాల్ ఈ కామెంట్లు చేయడం గురించి చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ ఢిల్లీలో మంచి పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజల ప్రశంసలను అందుకుంటున్నారు. పాలిటిక్స్ లో కేజ్రీవాల్ సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా