????పాత రేషన్ కార్డులను రద్దు చేయనున్న ఏపీ ప్రభుత్వం..
పాత రేషన్ కార్డులను రద్దు చేయనున్న ఏపీ ప్రభుత్వం
వైసీపీ రంగులతో ఉన్న పాత రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం రద్దు చేయనుంది. వాటి స్థానంలో కొత్త కార్డులను ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే నూతన దంపతులకు కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డుల రూపకల్పనపై పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. లేత పసుపు రంగుతో ఏపీ అధికారిక చిహ్నం ముద్రించిన కార్డుల నమూనాను ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించారు. మరికొన్ని నమనాలను కూడా ప్రభుత్వం పరిశీలనకు పంపించారు.
????ఇళ్లు లేని పేదలు అందరికీ ఐదేళ్లలో శాశ్వత గృహాలు*
*రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి*
అమరావతి, అక్టోబరు 11: రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే మాట అనకుండా వచ్చే ఐదేళ్లలో నిరుపేదలు అందరికీ శాశ్వత గృహ వసతి కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్థేశం చేశారని, ఆ లక్ష్య సాధన దిశగా గృహనిర్మాణ శాఖ ముందుకు అడుగులు వేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాలా శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నాల్గోబ్లాక్ మొదటి అంతస్తులో ఆధునీకరించబడిన తన చాంబరులో శాస్త్రోత్తంగా శుక్రవారం ఆయన ప్రవేశించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనకు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ కు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్కు మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదములు తెలిపారు. ప్రజలకు మేలు చేయడానికి, పాదర్శకంగా పాలన అందజేయడానికి తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఆ దిశలోనే రాష్ట్రంలోని నిరుపేదలు అందరికీ ఎంతో పారదర్శకంగా నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఎస్సీలకు, బీసీలకు మేమే చాంఫియన్లు అని చెప్పుకునే గత పాలకుల హయాంలో గృహ నిర్మాణ శాఖలో ఎన్నో అవకతవకలు జరిగాయని, నిరుపేదల గృహ నిర్మాణాలకై కేంద్రం ఇచ్చిన దాదాపు రూ.4,500 కోట్ల నిధులను ప్రక్కద్రోవ పట్టించి నిరుపేదలకు అన్యాయం చేయడం జరిగిందన్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క యూనిట్ కు రూ.2.50 లక్షల ఋణ సహాయాన్ని అందజేస్తే, దాన్ని రూ.1.80 లక్షలకు తగ్గించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీల గృహ నిర్మాణానికై రూ.50 వేల నుండి లక్ష రూపాయల వరకు అదనంగా అందజేసే ఆర్థిక సహాయాన్ని కూడా పూర్తిగా రద్దు చేసిన ఘనత గత ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలోనే కాకుండా, ఇంకా వారికి ఏ విధంగా మేలు చేకూర్చగలమో అనే కోణంలో ఆలోచించి ప్రతిపాదనలు రూపొందించాలని ఈ మధ్య జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా తగు చర్యలు చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో ఎన్నో తప్పిదాలు జరిగాయని, రాష్ట్రాన్ని రూ.10.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దింపడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్ధితికి రాష్ట్రాన్ని తీసుకు రావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎటు వంటి ఆదాయ వనరులు, అభివృద్ది లేకుండా చేయడం జరిగిందని, గతంలో జరిగిన ఇటు వంటి తప్పిదాలు అన్నింటనీ చక్కదిద్ది రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వ వంద రోజుల పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతగానో కృషిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని, అభివృద్దిని అందిపుచ్చుకునేలా యువతీ యువకులను సిధ్దం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ ద్వారా ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేయడం జరుగుచున్నదన్నారు. ప్రజలు కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా వారికి బంగారు భవిష్యత్తును ఏర్పాటుచేసే దిశగా కృషి జరుగుచున్నదని, 2029 నాటికి రాష్ట్ర జిడిపి, ప్రతి పౌరుడి తలసరి ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హమీని అన్నింటినీ దశల వారీగా అమలు చేయడం జరుగుచున్నదని, సామాజిక భద్రతా పింఛన్లను రూ.4 వేలకు పెంచి, మూడు నెలల బకాయిలను కలిపి రూ.7 వేలు చెల్లించండం జరిగిందన్నారు. రాష్ట్రానికి మంచి నాయకత్వం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మంచి ఫలితాలు చూపగలరు అనే విధంగా ఒకే రోజున 65 లక్షల మందికి పెన్షన్ ను ప్రభుత్వోద్యోగులు పంపిణీ చేశారన్నారు. గత ప్రభుత్వ బకాయిలతో మాకు సంబందం లేదు అని భావించ కుండా గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1600 కోట్ల ధాన్య కొనుగోలు బకాయిలను రైతులకు చెల్లించడం జరిగిందన్నారు. కేంద్రం మంచి ఉద్దేశంతో భూ హక్కుల చట్టాన్ని తేవాలని ఆలోచన చేస్తే ఆ చట్టంలో అన్ని తమకు నచ్చేలా నిబంధనలను మార్చుకుని దోపిడీకి రాచమార్గంవేస్తే, వారి దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేయడం జరిగిందన్నారు. విద్య అంటే భవనాలు నిర్మించడం, రంగులు దిద్దడమే కాదని, విద్యార్థులకు చక్కని చదువు, జ్ఞానం, విజ్ఞానం అందజేయాలనే లక్ష్యంతో 16,700 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించడం జరుగుచున్నదన్నారు. ఈ దీపావళి నుండి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెపుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రకటనలు జారీలో ఇష్టానుసారంగా ప్రవర్తించడమే కాకుండా తమకు నచ్చిన పేపర్లకు పెద్ద ఎత్తున జారీచేస్తూ, నచ్చని పేపర్లు వాటంతట అవే విత్ డ్రా అయ్యే పరిస్థితులు కల్పించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయంలో రూ.200/-లు పత్రిక కొనుగోలుకు ఇస్తూ అనధికారికంగా పలానా పత్రికనే కొనుగోలు చేయాలని నిర్థేశించినట్లు సమాచారం ఉందని, దానిపై విచారణ జరుగుతోందన్నారు. సంబంధిత జీవోను కూడా రద్దు చేయడం జరిగిందన్నారు.
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎం.డి. కె.రాజబాబు, సమాచార శాఖ అదనపు సంచాలకులు ఎల్.స్వర్ణలత, సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు
???? మోడీకి సెగ పెట్టిన మొదటి రాష్ట్రం.. ! ఈ ఏడాది జరగనున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును తీసుకురావాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంకల్పం. అదేంటి అనుకుంటున్నారా? హరియాణాలో హ్యాట్రిక్ విజయంతో మంచి ఖుషీమీదున్న ప్రధానినరేంద్ర మోడీకి సెగేంటనని భావిస్తున్నారా? అంటే.. అక్కడే ఉంది చిత్రమంతా. ఈ ఏడాది జరగనున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును తీసుకురావాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంకల్పం.ఇప్పటికే జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో వేసిన కమిటీ కూడా తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చేసింది. ఇక, పార్లమెంటులో బిల్లు పెట్టి.. రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయించుకోవడమే తరువాయి.. అన్నట్టుగా మోడీ సర్కారు ధీమాగా ఉంది. కానీ, జమిలి ఎన్నికలు .. (అంటే దేశవ్యాప్తంగా పార్లమెంటుకు, అసెంబ్లీ లకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ) నిర్వహించాలంటే.. కేవలం కేంద్రం ఒక్కటే ఒప్పుకొంటే కాదు. రాష్ట్రా ల్లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాల అనుమతి కూడా తప్పని సరి. అవి ఆమోదించి.. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన తర్వాతే కేంద్రానికి సదరు చట్టం చేసేందుకు అవకాశం ఉంటుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎన్డీయే కూటమి ఉన్న ఏపీ, మహారాస్ట్ర వంటి రాష్ట్రాలను కేంద్ర ప్రభు త్వం తరచుగా దువ్వుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మూడింట రెండొంతుల రాష్ట్రాలు జమిలికి జై కొట్టాలి. అదేసమయంలో తమ అసెంబ్లీలలో తీర్మానం కూడా చేసుకోవాలి. ఈ విషయంలో కొన్ని రాష్ట్రా లు ఒకే అన్నట్టుగా ఉన్నా.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే జమిలికి ఓకే చెప్పలేదు. ఇక, తాజాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా జమిలికి వ్యతిరేకంగా అసెంబ్లీలోనే తాజాగా తీర్మానం చేసింది. దీనిని తాజాగా ఆమోదించింది కూడా. ఇక, పశ్చిమ బెంగాల్ సహా పలు ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న జార్ఖండ్ వంటివి కూడా.. జమిలికి జై కొట్టడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలోనే తొలిసారి జమిలికి వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం(అందరూ ఉన్నత విద్యావంతులే) తీర్మానం చేయడం ఒకరకంగా మోడీకి ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
???? యావత్తు దేశం నుంచి బిజెపికి కేవలం 8-10 శాతం మాత్రమే జనం నుంచి ఆదరణ ఉన్నది మిగతాదంతా వ్యతిరేకమే???..ఈ 8-10 శాతం మంది వాస్తవాలు తెలుసుకోకుండా నిజనిర్ధారణ చేసుకోకుండా, గుడ్డిగా నమ్మేవాళ్ళు మాత్రమే.బిజెపి ఈవీఎంలను హ్యాకింగ్ చేస్తూ కోరుకున్న చోట్ల గెలుస్తున్నది, ప్రజలను నమ్మించడానికి అక్కడక్కడ ఈవీఎం హ్యాకింగ్ వదిలేస్తూన్నదనీ పలువురు మేధావులు నెట్ ఇంట్లో వైరల్ చేస్తున్నారు.
????దామగుండం నేవీ రాడార్ పనుల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం…*
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్, నేవీ అధికారులు.
ఈనెల 15న పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం దామగుండంలో శంకుస్థాపన కార్యక్రమం..
????రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం:-జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు..
*గద్వాల్*:- పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని జిల్లా పరిధిలో గల ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ మరియు అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు *జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు ఐపీఎస్* ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈనెల 21 న వారోత్సవాలు నిర్వహించబడుతాయని ఈ పోటీలకు విద్యార్థులతో పాటు, యువత ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఉత్సహంగ పాల్గొనాలని అన్నారు. ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఇటీవల కాలంలో తీసిన (3) ఫోటోలు మరియు తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 20వ తేదీలోపు జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫోటోలను పోలీస్ పిఆర్వో కు అందజేయాలన్నారు.
*ఈ పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు*
*????మూడనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు*
*????అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన*.
*????ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ*.
*????ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను*
*????సైబర్ నేరాలు ఈవ్టీజింగ్,ర్యాగింగ్*
*????మత్తు పదార్థాల సేవనం వాటి అనర్దాలు*
పెంపొందించే అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2023 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటివరకు తీసిన మూడు ఫోటోలు, షార్ట్ ఫిల్మ్ మాత్రమే పంపించాల్సి వుంటుంది. ఈ నెల 20 వ తారీఖు లోపు జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలోని PRO సెక్షన్ నందు ఇవ్వాల్సి వుంటుందని మరిన్ని వివరాల కోసం 8712661828 నెంబర్ ద్వారా పీఆర్ఓ ను సంప్రదించాలన్నారు.
సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమించి తమ అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న పోటీలకు విధ్యార్థులతో పాటు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ టి . శ్రీనివాస రావు ఐపీఎస్ పిలుపునిచ్చారు.
????పేటICICI బ్యాంకులో రెండవ రోజు CID విచారణ..
చిలకలూరిపేటలోని ఐసిఐసిఐ బ్యాంక్ CID విచారణ రెండవ రోజుకు చేరింది. ఈ మేరకు బ్యాంకులో సిబ్బందిని, ఖాతాదారులను ఒకరి తర్వాత ఒకరిని పిలిచి విచారిస్తున్నారు. మీరు బ్యాంకులో ఖాతా ఎప్పుడు తీసుకున్నారు, ఖాతాలో నగదు ఎంతవరకు ఉంటుంది, ఎంత నష్టపోయారనే విషయాలపై ఆరా తీశారు. ఈ అంశాలపై ఖాతాదారులను అధికారులు విచారిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి సమాచారం వెల్లడిస్తామని తెలిపారు.
???? టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ కు ఆత్మ చెప్పిందేమో..జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమలను మళ్లీ తీసుకువస్తాం..అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం..
ఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తప్పవు..
జగన్ ప్రజల్లోకి వెళ్తానంటే మేం గేట్లకు తాళ్లు కట్టబోం..
కొలనుకొండలో సింహా కియా షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్..
మంగళగిరిః రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో సింహా కియా కార్ల షోరూమ్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో కూడా చంద్రబాబునాయుడు గారు కియా మోటార్స్ ను ఏపీకి తీసుకువస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెటర్ రాశారంటూ మాట్లాడారు. ఇప్పుడు టీసీఎస్ విషయంలో జగన్ కు ఆత్మ చెప్పినట్లుంది.. ఆయనే తీసుకువచ్చాడని. జగన్ రెడ్డి పాలనలో ఎన్ని కంపెనీలు తీసుకువచ్చారు, ఎన్ని ఉద్యోగాలు కల్పించారో బహిర్గతం చేయాలి. 2014-19 మధ్య 44వేల పరిశ్రమల ఏర్పాటుతో పాటు 8 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు స్వయంగా వైసీపీ ప్రభుత్వమే శాసనమండలిలో ఒప్పుకుంది. నేడు చంద్రబాబుగారు వచ్చిన తర్వాతనే ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇందులో భాగంగానే టీసీఎస్, లులు వచ్చాయి. అనేక పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. గతంలో జగన్ రెడ్డి తరిమివేసిన పరిశ్రమలన్నీ తీసుకువస్తాం..
అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం..
రాయలసీమకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, సర్వీసింగ్ ఉత్తరాంధ్రకు తీసుకువస్తాం. విండ్, సోలార్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు, సిమెంట్ ఫ్యాక్టరీలు కర్నూలుకు, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ కడప, చిత్తూరుకు, ఆటోమొబైల్స్ అనంతకు తీసుకువస్తాం. ఉభయగోదావరికి ఆక్వా, పెట్రో కెమికల్ పరిశ్రమలు తీసుకువస్తాం.. కృష్ణా, గుంటూరులో అనేక పెట్టుబడులు తీసుకువస్తాం. పరిపాలన కేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణకు మేం కట్టుబడి ఉన్నాం..
బుక్ ల విషయంలో నన్ను చూసి ఇన్ స్పైర్ అయినట్లుంది
బ్లూ బుక్, గుడ్ బుక్ అంటున్న వైసీపీ .. తనను చూసి ఇన్ స్పైర్ అయినట్లు ఉంది. పాదయాత్రలో వంద బహిరంగ సభల్లో మాట్లాడాను..రెడ్ బుక్ చూపించి.. చట్టాన్ని ఉల్లంఘించి, ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారులు, వైసీపీ నాయకులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని చెప్పాం. ఇప్పటికే యాక్షన్ మొదలైంది. వైసీపీ వేరే పుస్తకాలు పెడితే పెట్టుకోనివ్వండి.. మాకేం భయం లేదు..
ఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తప్పవు
వరదసాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. దాదాపు 10 రోజులకు పైగా చంద్రబాబునాయుడు , మంత్రివర్గం మొత్తం ముంపుప్రాంతాల పనులు పర్యవేక్షించారు. ఆనాడు వైకాపా ఎక్కడుంది? వరద బాధితులను ఆదుకునేందుకు కోటి సాయం ప్రకటించిన జగన్ రెడ్డి.. ఎక్కడ ఖర్చుపెట్టారో చెప్పాలి. మేం వాస్తవాలన్నీ ప్రజల ముందు పెట్టాం.. రీహాబిలిటేషన్ యుద్ధప్రాతిపదికన చేపట్టాం. సుమారు రూ.650 కోట్లు ఖర్చుపెట్టాం. ఏవైనా లోటుపాట్లు ఉంటే, సాయం అందకపోతే వివరాలు ఇవ్వాలి. దీనిపై చర్యలు తీసుకుంటాం. తప్పులు సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వైసీపీ మాదిరిగా మేం పరదాలు కట్టుకుని తిరగడం లేదు. వరదలు వస్తే జగన్ కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటలేదు. వాస్తవాలు ఇప్పుడైనా తెలుసుకోవాలి. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు వాస్తవాలు తెలుసు. మేం న్యాయబద్ధంగా వెళ్తాం..
జగన్ ప్రజల్లోకి వెళ్తానంటే మేం గేట్లకు తాళ్లు కట్టబోం
జగన్ ప్రజల్లోకి వెళ్తానంటే వెళ్లనివ్వండి. ఆయన మాదిరిగా మేం గేట్లకు తాళ్లు కట్టబోం. గతంలో చంద్రబాబు ధర్నా చేయాలంటే అనుమతులు కూడా ఇవ్వలేదు. రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ప్రజల్లోకి వెళ్లవచ్చు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..
గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం త్వరలోనే చేపడతాం. అన్నీ పద్ధతి ప్రకారం చేస్తాం. మంగళగిరిలో ఎయిమ్స్ కు నీటి సరఫరాతో పాటు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం త్వరలోనే చేపడతాం. మూడు నెలల్లో మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ పనులు చేపడతాం. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇస్తాం. పార్టీలో కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం. సనాతన ధర్మ బోర్డు విషయంలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రోడ్ల నిర్మాణం కూడా త్వరలోనే చేపడతాం. ఐదేళ్లలో రోడ్లను వైసీపీ పట్టించుకోలే.
???? అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్వహించే సదస్సు నకు విశిష్ట ఆతిధి గా పాల్గొన్న ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్,జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి పాల్గొన్నారు
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధాత్రి రెడ్డి మాట్లాడుతూ ముందుగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన బాలికలకు శుభాకాంక్షలు తెలియ చేసినారు.ప్రస్తుత పరిస్థితులలో మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని బాలికలు ఉన్నత విద్యలలో అవకాశాలను అందిపుచ్చుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఆర్మీ తదితర అన్ని రంగాలలో పురోగతి సాధించాలని,
స్వాతంత్ర్యం అనంతరం ఎవరు ఎంచుకోనటువంటి రంగాన్ని ఎంచుకున్న కిరణ్ బేడీ ఐపీఎస్ లో దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారని
బాలికలు ఎవ్వరూ ఎంచుకొనటు వంటి రంగాలలో స్పోర్ట్స్, ఆర్మీ రంగాలను ఎంచుకొని దాంట్లో ప్రావీణ్యతను సంపాదించుకుంటే మీకు దానంతట అదే గుర్తింపు లభిస్తుందని పెద్ద పెద్ద కలలు కనలని ఆ కలలను నెరవేర్చుకొనుట కొరకు ప్రతి ఒక్కరు సాధన చేయాలని ఉన్నత స్థితికి ఎదగాలంటే దానిపై మక్కువ కలిగి ఉండాలని
అమ్మాయిలు సాధన చేస్తే సాధించలేనటు వంటిది ఏమీ లేదని బాలికలకు ప్రభుత్వం వారు కల్పించేటటువంటి సదుపాయాలను మరియు పథకాలను గురించి ప్రతి ఒక్క బాలిక కూడా తెలుసుకొని ఉండాలని, దానికి టీచర్ల యొక్క సపోర్టు ను బాలికలకు అందించాలని
సుకన్య సమృద్ధి పథకం దాని వలన కలిగే ఉపయోగాలను గురించి తల్లిదండ్రులు అవగాహనను కలిగి ఉండాలని
బాలికలు విద్యలో ముందంజలో ఉన్నట్లు దానికి నిదర్శనం నూజివీడులో ఉన్న ఐ ఐ ఐ టి లో 70 శాతం మంది బాలికలు చదువుకుంటున్నారని
చైల్డ్ మ్యారేజ్ వలన కలిగే అనర్ధాలను గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బాలికలకు అన్యాయం జరగకుండా ఉండేలాగా ప్రతి ఒక్క బాలిక కూడా తమ తల్లిదండ్రులకు తెలియ చేయాలని
ఈ కార్యక్రమంలో బాలికలు నిర్వహించిన నృత్య ప్రదర్శన చాలా బాగుందని వారందరినీ పేరుపేరునా అభినందించిన జిల్లా ఎస్పీ .. సమాజం అంటేనే సమస్యలు ఉంటాయని సదరు సమస్యల పట్ల పోరాడి గెలుపొందాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బాలికలకు తెలియ చేసినారు
???? వైసీపీ మీడియాకు పెట్టిన ఖర్చు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్… షాకింగ్ లెక్కలు..! అమరావతి .
ఎన్నికలలో విజయం సాధించాలి అంటే ప్రత్యర్థులపై తప్పుడు ప్రచారం తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటే చాలు అన్నది సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా చేసే పని. ఇలా కోట్లకు కోట్లు పార్టీ తరఫున అధికారికంగా వైట్ మనీ ఖర్చు పెట్టారు అంటే … ఇక బ్లాక్ మనీ ఎంత ఖర్చు పెట్టి ఉండాలి .. ప్రజాధనంతో ఇచ్చిన ప్రకటనలు ప్రచార ఖర్చు ఎంత ఉండాలి ? అని ఆలోచిస్తే ఊహకు అందని విధంగా లెక్కలు ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మార్చి 16 నుంచి ఫలితాలు వచ్చిన జూన్ 6వ తేదీ వరకు చేసిన ఖర్చులను వైసిపి ఎన్నికల సంఘానికి సమర్పించింది. అందులో తమ మీడియా సంస్థల కోసం ఏకంగా రు. 87 కోట్లు ఖర్చు చేశామని తెలిపింది.
షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఏపీలో పోలింగ్ జరిగే వరకు రెండు నెలల గడువ ఉంది. పోలింగ్ తర్వాత ఎలాంటి ప్రకటనలు లేవు. ఈ 60 రోజులలో ఏకంగా రు. 87 కోట్ల రూపాయలకు పైగా మీడియా సంస్థలకు చెల్లించారు. ఇందులో టీవీ 9 – 10 టీవీ – ఎన్టీవీ లకు అత్యధిక భాగం ఇచ్చారు. అలాగే సినిమా ధియేటర్లలో యాడ్స్ కోసం క్యూబ్ – యూఎఫ్ వో లాంటి సంస్థలకు కూడా కోట్లలో చెల్లింపులు చేశారు. ఇక ఐ డ్రీం – సాక్షికి కూడా చెల్లింపులు చేశారు. ఇదంతా అధికారికంగా పైన చెప్పుకుంది .. ఎన్నికల షెడ్యూలు వచ్చాక పోలింగ్ మోగిసే వరకు చేసిన అధికారిక ఖర్చు కానీ షెడ్యూల్ రావడానికి ముందుగా విచ్చల విడిగా డబ్బు పంచుతూ యూట్యూబ్ ఛానల్స్‌ను .. ఫెయిడ్ జర్నలిస్టు లను పెంచి పోషించింది.
మాజీ ఏబీఎన్ జర్నలిస్టు ఒకరికి .. అతడు బయటకు వచ్చి ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నారు. అతడికి ఏడాది కనీసం కోటిముట్టి ఉంటాయి. ఓ మహిళ యాంకర్ నడిపే ఛానల్ దగ్గర నుంచి మీమ్స్ పేజీల వరకు ప్రతి ఒక్కరికి ఏడాది పాటు ప్రతి నెల నెలా లక్షలు చెల్లించేవారు. ఇది మొత్తం అనధి కారికకంగా 400 నుంచి 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
????నూతన బస్సులను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే జీవి..
వినుకొండ ఆర్టిసి డిపో కి కేటాయించిన *6 నూతన బస్సులను* రాష్ట్ర రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శుక్రవారం *ప్రారంభించారు.* *15 కోట్ల తో మోడ్రన్ బస్ స్టాండ్ ఏర్పాటుకు* ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, ఆర్టీసీ ఈడి వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా ఆర్ఎం శ్రీనివాసరావు, డిఎం, తదితరులు పాల్గొన్నారు.
???? టంగుటూరు గ్రామానికి చెందిన పమిడి రంగమ్మ అను ఆమె పోలేరమ్మ గుడికి వెళ్లి తిరిగి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో విష్ణునాలయం దాటినాక కొంచెం ముందుకెళ్లిన తర్వాత గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి ఆమెని అడ్రస్ అడుగుతున్నట్టు నటించి ఆమె మెడలోని బంగారు చైను తెంపుకొని వెళ్ళినారు. జరిగిన సంఘటనపై ఆమె ఇచ్చిన
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైనది మరియు వెనువెంటనే ఒంగోలు డియస్పి రాయపాటి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సింగరాయకొండ సీఐ Ch.హజరత్తయ్య పర్యవేక్షణలో టంగుటూరు ఎస్సై వి.నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో వాళ్ళని పట్టుకోడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయటం అయినది.
????విజయవాడ వరద బాధితులకు లక్ష రూపాయలు విరాళమిచ్చిన శ్రీ కృష్ణ దేవస్థాన కమిటీ సభ్యులు..
*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ని పట్టణంలోని శ్రీ కృష్ణ దేవస్థానం కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు.. విజయవాడ వరద బాధితులకు ఆలయ కమిటీ సభ్యుల తరుపున తమ వంతు సహకారంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1,00000-00 లు, అక్షరాల లక్ష రూపాయలు చెక్కు ద్వారా ఎమ్మెల్యే కి అందచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు..* కార్యక్రమంలో దాతలు బైలడుగు బాలయ్య, బుడతా మధుసూదన్ రావు, నంద్యాల శ్రీనివాసులు, చల్లా రమేష్, మొరస బాల గురవయ్య, యాలగాని వెంకటేశ్వర్లు, దారం గురవయ్య, బోనేని వేణుగోపాల్, ఇరగనబోయిన రవికాంత్, రంపే గంగయ్య, చల్లా రవికాంత్, చల్లా రాజనరసింహ, కుమ్మరి పాండు, చల్లా బాల నరసింహులు, మర్రిబోయిన చంద్రశేఖర్, మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.*
????ప్రభుత్వ ఉపాధ్యాయలు అసలు ఏం చేస్తున్నారు..
*ప్రభుత్వ ఉపాధ్యాయలు రియల్ ఎస్టేట్, చిట్టీలు, వడ్డీ వ్యాపారం చేయటం చట్ట రీత్యా నేరం*
*సీసీఏ రూల్ ప్రకారం ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేయటం చట్ట రీత్యా నేరం..
*కొత్తూరు మండలంలో మండల విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహారిస్తున్న తీరు..
*జిల్లా విద్యాశాఖ అధికారి ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుంటారా?*
*????ప్రతిభకు ప్రశంస*: శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఉత్తర్వులు మేరకు, అడిషనల్ ఎస్పీ(Crimes), P. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సిఐ డి. మోహన్ రావు, సోంపేట సర్కిల్ సిఐ బి మంగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ బి హైమావతి, హెడ్ కానిస్టేబుల్ గవరయ్య, పోలీస్ షణ్ముఖరావు, కుర్మరావు, ప్రసాద్, ఉషాకిరణ్, ప్రదీప్, కిరణ్ కుమార్, కామేష్, ఈశ్వరరావు అనువారు కేసులను ఛేదించి ముద్దాయి లను పట్టుకోవడంలో క్రియాశీలంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పి గారు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.
*????ప్రముఖ షూ కంపెనీ అపాచీలో దారుణ హత్య..!!!
తిరుపతి జిల్లా తడ మండలం మాంబట్టులోని ప్రముఖ షూ తయారీ సంస్థ అపాచీ కంపెనీలో దారుణ హత్య చోటుచేసుకుంది, కంపెనీలో పని చేస్తున్న ఓ వివాహితను సురేష్ అనే యువకుడు కంపెనీలో పని చేస్తున్న సమయంలో కత్తితో దాడి చేశాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి,, నిందితుడిని అదుపులోకి తీసుకున్న తడ పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తడ ఎస్ఐ కొండప్ప నాయుడు.
???? తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి, జెసి ఉమారెడ్డి దంపతులు పట్టణంలోని అమ్మవారి శాల వద్ద ఉన్న పెద్దమ్మ , గానిగ వీధి నందు చౌడమ్మ, సుంకులమ్మ పాలెం నందు సుంకులమ్మ ఆలయాల నందు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు…
????గుంటూరు జిల్లా జైలు..
మాజీ ఎంపీ నందిగం సురేష్ ను జిల్లా జైలు నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
లో బిపి తో పాటు షోల్డర్ నొప్పి తో బాధపడుతున్న మాజీ ఎంపీ నందిగం సురేష్..
హుటాహుటిన జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించిన జైలు సిబ్బంది..
ప్రభుత్వాసుపత్రిలో మాజీ ఎంపీ నందిగం సురేష్ కు టెస్టులు నిర్వహిస్తున్న డాక్టర్లు
????దివ్యంగ బాలికకు వీల్ చైర్ అందచేసిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS*
సీరోల్ గ్రామానికి చెందిన దివ్యంగ బాలిక కన్నబోయిన శ్రావ్య, వయసు:18 పుట్టుకతోనే దివ్యంగులారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన హోప్ స్టెప్ ఫౌండేషన్ సంస్థను సంప్రదించడంతో వెంటనే స్పందించి దాతల సహాయంతో వీల్ చైర్ సమాకూర్చి ఈరోజు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్ రంనాథ్ కేకన్ IPS గారి చేతుల మీదిగా బాలికకు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హోప్ స్టెప్ ఫౌండేషన్ అధ్యక్షులు నాగవెల్లి శ్రీనివాస్, ఎస్పీ PRO కుశల్, ఎస్.బి ఇన్స్పెక్టర్ చంద్రమౌళి సంస్థ సభ్యలు దుగ్గి రమేష్, ధనుష్, దిక్షిత్ పాల్గొన్నారు.
???? 6 నెలలుగా జీతాలు రావట్లేదని రోడ్డెక్కిన ఎంసీహెచ్ హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు..
జనగామ ఎంసీహెచ్ హాస్పిటల్‌లోని ఆల్ సర్వీస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలల నుండి జీతాలు రావడం లేదు.పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నామని, దసరా పండుగకి కనీసం ఒక నెల జీతం కూడా చెల్లించలేదని రోడ్డెక్కిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.అధికారులు స్పందించి వెంటనే కాంట్రాక్టర్‌ను మార్చాలని.. ప్రతి నెల అయిదవ తారీఖున జీతం వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసిన హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు…
???? తండ్రిని పట్టించుకోని కొడుకులకు ఆర్డీఓ షాక్..!!
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు రాజమల్లు ఆస్తిని ఇద్దరు కొడుకులు తీసుకున్నారు.. రాజమల్లుకు వచ్చిన డబుల్ బెడ్ రూంను పెద్ద కొడుకు భార్య పేరుపై రాయించుకున్నాడు.
ఆస్తి తీసుకొని ఇద్దరు కొడుకులు రాజమల్లును పట్టించుకోకపోవడంతో భిక్షాటన చేసుకుంటున్నాడు.
ఇటీవల వృద్ధుడు ఫిర్యాదు చేయడంతో కోడలు పేరుపై ఉన్న డబుల్ బెడ్ రూంను తిరిగి రాజమల్లుపై ఎక్కించి, కొడుకులు నెలకు ₹2000 ఇవ్వాలని ఆర్డీఓ ఆదేశించాడు…
మోడీకి సెగ పెట్టిన మొదటి రాష్ట్రం..పాత రేషన్ కార్డులను రద్దు చేయనున్న ఏపీ ప్రభుత్వం..ఇళ్లు లేని పేదలు అందరికీ ఐదేళ్లలో శాశ్వత గృహాలు..వైసీపీ మీడియాకు పెట్టిన ఖర్చు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్..నేవీ రాడార్ పనుల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం..టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ కు ఆత్మ చెప్పిందేమో-మంత్రి లోకేష్….నూతన బస్సులను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే జీవి..వరద బాధితులకు లక్ష రూపాయలు విరాళమిచ్చిన శ్రీ కృష్ణ దేవస్థాన కమిటీ సభ్యులు..అపాచీలో దారుణ హత్య..!తండ్రిని పట్టించుకోని కొడుకులకు ఆర్డీఓ షాక్..! “6 నెలలుగా జీతాలు రావట్లేదని రోడ్డెక్కిన ఎంసీహెచ్ హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు
Recent Posts

