ఇండియా కూటమికి బీటలు..మోపిదేవి అన్న అడిగితే మళ్లీ రాజ్యసభకు పంపించేవాడ్ని: జగన్..పాటిబండ్ల, వనమాల రాజీనామా ఆమోదం !..”మీడియా పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న రిపోర్టర్ అరెస్ట్.. “మహిళ ఏఎస్ఐ కి వేధింపులు…కొండా సురేఖకు రేవంత్ సపోర్ట్ .. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని కలిసిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ యాకూబ్ భాష.. ప్రైవేట్ ఆస్పత్రి అధినేతను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు..దుర్గమ్మ భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన ముస్లిం సోదరులు.. దివ్వెల మాధురి పై కేసు నమోదు..చెంచుల విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా..వెట్టి చాకిరి వ్యవస్థ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత.. సి ఐ కే. మల్లికార్జున..

????ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంతక్రియలు పూర్తి..
పార్సీ సమాజానికి చెందిన రతన్ టాటా అంత్యక్రియ లు హిందూ సంప్రదాయం ప్రకారమే నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముంబైలోని వర్లీ విద్యుత్‌ శ్మశానవాటికలో ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు ప్రార్థనల అనంతరం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియ నిర్వహించారు.
హిందూ సంప్రదాయం ప్రకారమే టాటా అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. ఆయన పార్సీ సమాజానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ హిందూ సంప్రదాయంలోనే అంత్య క్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈరోజు సాయంత్ర 4 గంటలకు ముంబైలోని వర్లీ విద్యుత్‌ శ్మశానవాటికలో టాటా అత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో పూర్తి చేసింది. ఆయన అంత్యక్రియలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, దిగ్గజ వ్యాపారవేత్తలు, పాల్గొని వీడ్కోలు పలికారు…..
????మోపిదేవి అన్న అడిగితే మళ్లీ రాజ్యసభకు పంపించేవాడ్ని: జగన్..
ఏపీలో అధికారంలోకి కూటమి ప్రభుత్వం
వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి వలసలునిన్న టీడీపీలో చేరిన మోపిదేవి..రమణన్నకు తక్కువేమీ చేయలేదన్న జగన్..
ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రిగా అవకాశమిచ్చానని వెల్లడి..ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు అధికమయ్యాయి. నిన్న మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. మోపిదేవి అన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా నా క్యాబినెట్లో మంత్రిగా చోటిచ్చి గౌరవించానని వెల్లడించారు.
“మనం 151 స్థానాలను గెలిచినప్పుడు రమణన్న గెలవలేదు… ఓడిపోయిన 24 స్థానాల్లో రమణన్న పోటీ చేసిన స్థానం కూడా ఉంది. అయినా కూడా నేను రమణన్నను మర్చిపోలేదు. ఎమ్మెల్సీలు రద్దు చేయాలనుకున్నప్పుడు మళ్లీ వీళ్ల పదవులు పోతాయేమోనని రాజ్యసభకు పంపించాం. అందుకు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ఆయన ఇప్పుడు అడిగినా మళ్లీ రాజ్యసభకు పంపించేవాడ్ని.
మొదటిసారిగా మత్స్యకార వర్గానికి చెందిన వ్యక్తిని రాజ్యసభకు పంపించింది వైసీపీ పాలనలోనే. మోపిదేవి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలో ఎక్కడా ఆయనను తక్కువ చేసింది లేదు. ఆయన పదవీకాలం ముగిసినా, మళ్లీ రీ నామినేట్ చేయాల్సి వస్తే తప్పకుండా చేసి ఉండేవాళ్లం. మనం ఎక్కడా తప్పు చేయలేదు… మంచికి ఎప్పుడూ దేవుడు సాయం చేస్తాడు. మంచి చేసే మనసు ఉన్నప్పుడు దేవుడు కచ్చితంగా తోడుగా నిలబడతాడు” అంటూ జగన్ పార్టీ శ్రేణులతో సమావేశంలో వివరించారు.
???? పాటిబండ్ల, వనమాల రాజీనామా ఆమోదం !
పార్టీ నుండి సుకన్య సస్పెండ్..*గుంటూరు..
బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర, మీడియా ప్యానల్ లిస్ట్ పాటిబండ్ల రామకృష్ణ చేసిన రాజీనామాలను భారతీయ జనతాపార్టీ ఆమోదించింది.
వనమా నరేంద్ర ఓ మహిళతో వీడియో కాల్
మాట్లాడుతూ పట్టుబడిన విషయం తెలిసిందే.
రామకృష్ణనే ఉద్దేశపూర్వకంగా నరేంద్రని ఇరికించారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో వారిద్థరి రాజీనామాలు ఆమోదించడమే కాకుండా నరేంద్రతో వీడియో కాల్ మాట్లాడిన సుకన్యను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
????తిరుపతి వర్షా ట్రావెల్ బస్సులో ఘరానా మోసం?
మూడు లక్షల విలువగల గోల్డ్ బ్యాగ్ మిస్సింగ్..
బెంగళూరు నుండి తిరుపతికి వస్తున్న సమయంలో వర్షా ట్రావెల్ లో మిస్సయిన బ్యాగ్..నిర్లక్ష్య గా సమాధానం చెబుతున్న వర్షా ట్రావెల్స్..తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పూర్తి వివరాలు తెలియవలసి ఉంది
????తిరుమలలో రీల్స్ చేయడంపై ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారులు..
దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఆయలం ముందు రీల్స్ చేసిన మాధురి.. దివ్వెల మాధురిపై కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు.. దివ్వెల మాధురిపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..
????బీజేపీ ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన లాయర్…!!*
ఉత్తరప్రదేశ్ –
లఖింపూర్ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ చెంప చెళ్లుమనిపించిన లఖింపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవధేష్ సింగ్…!!
లఖింపూర్‌లో రాబోయే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కమిటీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎమ్మెల్యే యోగేష్ లేఖ రాయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది…!!
???? రూ.2 వేల కోట్లు విలువైన డ్రగ్స్‌ స్వాధీనం..
రూ.2 వేల కోట్లు విలువైన డ్రగ్స్‌ స్వాధీనం
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. రూ.2 వేల కోట్లు విలువైన 200 కిలోల కొకైన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతవారమే రూ.2 వేల కోట్లు విలువైన డ్రగ్స్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. 10 రోజుల వ్యవధిలో రెండోసారి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు.
???? పోలీస్ స్టేషన్లోనే మహిళా పోలీసుకు రక్షణ కరువు
ఎస్సై వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యయత్నం ????????????
మెదక్ – చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సై యాదగిరి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఏఎస్సై సుధారాణి.
విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా విధులకు హాజరు కానట్లు కానిస్టేబుల్స్ తో అబ్సెంట్లు వేయిస్తున్నట్లు తెలిపిన ఏఎస్సై సుధారాణి.
కావాలని ఎస్సై యాదగిరి కక్షపూరితంగా దుర్భాషలడుతూ తనను మానసికంగా వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం చేసిన సుధారాణి.
చికిత్స కోసం జోగిపేట ఆసుపత్రికి తరలింపు.
???? మీడియా పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న రిపోర్టర్ యూసఫ్ అరెస్ట్..????????????
మీడియా పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న రిపోర్టర్ యూసఫ్ అరెస్ట్
మీడియాలో రిపోర్టర్, అక్రిడేషన్, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తానని మాటలు చెప్పిన వేములవాడ మండలం రుద్రవరం గ్రామం ఆర్అండ్ఆర్ కాలనీ చెందిన ఎండి యూసుబ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వేములవాడ ఏఎస్పీ సూరుకొంటి శేషాద్రిని రెడ్డి తెలిపారు. యూసుబ్ గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విలేఖరిగా పనిచేస్తూ పలు అవినీతి, అక్రమాల ఆరోపణలు ఉండడంతో అరెస్టు చేసారు.
????రూ.7 వేల కోట్ల స్కాం..*30వేల మంది బాధితులు….* స్టాక్ బ్రోకింగ్ పేరిట జనాలకు ఆశలు* అధిక డబ్బులు వస్తాయంటూ కుచ్చుటోపీ* పరారీలో డీవీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ నిర్వాహకులు* హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు నమోదుతక్కువ పెట్టుబడి పెట్టండీ.. ఎక్కువ లాభాలు పొందండి అంటూ ఓ స్టాక్
బ్రోకింగ్ సంస్థ ప్రజలకు కుచ్చులోనే పెట్టింది. ఏకంగా రూ.7,000 కోట్లస్కామ్ కు పాల్పడిన నిర్వాహకులు పత్తాలేకుండా పారిపోయారు.కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వేదికగా డీజీ స్టాక్ బ్రోకింగ్ పెట్టుబడులు స్వీకరించగా.. 30వేల మంది బాధితులు మోసపోయారు.
????కొండా సురేఖకు రేవంత్ సపోర్ట్ !*
కొండా సురేఖపై నాగార్జున కుటుంబం మూకుమ్మడి దాడి చేయాలని నిర్ణయించుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కొండా సురేఖకు పూర్తి స్థాయిలో సపోర్టు చేస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆమెకు అండగా ఉన్నారు. బయట జరుగుతున్న ప్రచారాలను పట్టించుకోవద్దని మంత్రిగా విధి నిర్వహణలో ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని ఆమెకు చేతల ద్వారానే సంకేతాలు పంపారు.
కొండా సురేఖ చుట్టూ ఓ మైండ్ గేమ్ ను బీఆర్ఎస్ నడుపుతోంది. కొండా సురేఖతో రాజీనామా చేయించేందుకు హైకమాండ్‌ ప్రయత్నిస్తోందన్న ప్రచారం నుంచి రేవంత్ రెడ్డి కూడా భరోసా ఇవ్వలేదన్న వరకూ రెండు వైపులా వారే ప్రచారం చేస్తున్నారు. మరో వైపు సినీ ఇండస్ట్రీలోని తమ వారితో ఖండన ప్రకటనలు చేయిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టిగా వార్నింగ్ ఇస్తే తప్ప ఆపలేదు. ఆ తర్వాత కూడా అంతర్గతంగా కొనసాగిస్తున్నారు.
కొండాసురేఖ అంశం పూర్తిగా రాజకీయ పరమైనది. నాగార్జునకు నేరుగా రాజకీయాలతో సంబంధం లేకపోవచ్చు కానీ.. రాజకీయసంబంధాలతో లబ్ది పొందారు. అందుకే కొండా సురేఖ టార్గెట్ చేశారు. ఈ కామెంట్స్ కూడా రాజకీయమే అయ్యాయి. సమంత విషయంలో క్షమాపణ చెప్పడం… కామెంట్స్ వెనక్కి తీసుకోవడంతో వివాదం సద్దుమణగాల్సింది. ముఖ్యమంత్రిగా.. తన మంత్రిని తప్పు పడితే తనను తప్పు పట్టినట్లేనని రేవంత్ భావించారు. కొండాసురేఖకు ఫుల్ సపోర్టు ఇస్తున్నారు.
????మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం*
*నిజాయితీగా విధులు నిర్వహించాలి..
*రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్..*మంత్రిని కలిసిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ యాకూబ్ భాష..అమరావతి అక్టోబర్ 10*..
*రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన యాకూబ్ భాష మర్యాదపూర్వకంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలిసారు. గురువారం అమరావతిలోని మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసి అండ్ ఎండి యాకుబ్ భాష మంత్రికి పుష్ప గుచ్చాన్ని అందించి , మైనార్టీల సంక్షేమం కోసం భవిష్యత్తులో తీసుకునే చర్యలపై కార్యాచరణ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా మైనార్టీల సంక్షేమం పాతాళానికి చేరిందని అన్నారు. మైనార్టీల సంక్షేమాన్ని తిరిగి గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బృహత్తర ప్రణాళిక దిశగా వివిధ చర్యలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలోనే గతంలో మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి మైనార్టీల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నింటినీ ప్రణాళిక బద్ధంగా అమలు చేసేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇప్పటికే చర్యలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీలకు అండగా నిలిచేందుకు, ఆర్థిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు, వ్యాపార పారిశ్రామిక రంగాలలో మైనార్టీలకు భాగస్వామ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని వీసి యాకుబ్ భాషకు మంత్రి సూచించారు. నీతిగా, నిజాయితీగా, నిస్పక్షపాతంగా మైనార్టీల సంక్షేమానికి సేవలందించాలని యాకుబ్ భాషా తో మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.*
????దుర్గమ్మ భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన ముస్లిం సోదరులు..
భిన్నత్వంలో ఏకత్వం ఇదే రాష్ట్ర ప్రగతికి మూలమంత్రం: మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ..విజయవాడ..
భిన్నత్వంలో ఏకత్వం ఇదే రాష్ట్ర ప్రగతికి మూలమంత్రం: మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి
దసరా ఉత్సవాల సందర్భంగా ఈరోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు జనాబ్ ఫారూఖ్ షుబ్లి గారి ఆదేశాల మేరకు MHPS టీమ్ విజయవాడ దుర్గమ్మ భక్తులకు తమ వంతు సేవగా 5000 మజ్జిగ ప్యాకెట్లను పంచడం జరిగినది. దసరా ఉత్సవాలు సమయంలో విజయవాడ కనకదుర్గ ఆలయానికి ప్రతీ సంవత్సరం బారులుతీరే భక్తుల కోసం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వారు గత పది సంవత్సరాలుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. “భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశ ప్రగతికి మూలమంత్రం” అని గ్రహించి ప్రతి ఒక్కరు మతాలు వేరైనా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడం అవసరమని అనేక సందర్భాల్లో MHPS అధ్యక్షులు పిలుపు ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమంలో MHPS టీమ్ సభ్యులైన సయ్యద్ ఖాసిద్, నాసిర్ హుస్సేన్, ఆఖిల్, ఇమ్రాన్, సాదిక్, షేరు, షేక్ బాబు మరియు అబ్దుల్ గఫూర్ పాల్గొన్నారు.
????ఇండియా కూటమికి బీటలు.. స్వరం మార్చిన మిత్రపక్షాలు ఇక.. ఈ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఖంగుతింది. హర్యానా సర్వేలన్నీ కాంగ్రెస్‌కే గెలుపు అవకాశాలు అని రిపోర్టులు ఇవ్వడంతో ఆ పార్టీ ఎక్కడలేని ఆశలు పెట్టుకుంది. ఫలితాల రోజు కూడా మొదట్లో ట్రెండింగ్ కాంగ్రెస్‌కు అనుకూలంగానే కొనసాగాయి. దాంతో కాంగ్రెస్ శ్రేణులంతా సంబరాల్లో మునిగాపోయారు. రౌండ్‌లు పెరుగుతున్న కొలదీ ఫలితాలు రివర్స్ అయ్యాయి. కంప్లీటుగా బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ఇక.. ఈ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఖంగుతింది. ఫైనల్లీ హర్యానాలో అధికారం చేపట్టలేకపోయింది. బీజేపీనే హ్యాట్రిక్ విజయం సాధించింది. ముందు నుంచి హర్యానాలో తామే గెలుస్తున్నామని నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ ఫలితాలు చేదు మిగిల్చడంతో ఆ పార్టీ నేతలు ఏవేవో ఆరోపణలు కూడా చేశారు. ఫలితాలను సరిగా లెక్కించలేదని, ఈవీఎంలలో లోపాలు ఉన్నాయంటూ ఆరోపించారు. కానీ.. వాటిని ఎన్నికల సంఘం ఖండించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని తేల్చిచెప్పింది. ఇప్పటికే హర్యానా ఫలితాలతో సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీకి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మరో భారీ షాక్ తగిలింది. ఈ సారి మిత్రపక్షాల నుంచి ఆ సెగను ఎదుర్కోవాల్సి వచ్చింది. చంద్రబాబు ఒక్కో ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీపై విమర్శలు చేయడం ప్రారంభించాయి. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ అవకాశవాద ధోరణితో వ్యవహరిస్తున్నదని ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. హర్యానాలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నా మిత్రపక్షమైన ఆప్‌ను కాంగ్రెస్ దూరం పెట్టిందని, అదే జమ్ముకశ్మీర్‌లో బలం లేదని ప్రాంతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌తో చేతులు కలిపిందని విమర్శలున్నాయి. హర్యానాలో ఆప్‌తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ బరిలోకి దిగి ఉంటే ఫలితాలు మరొలా ఉండేవని చెబుతున్నారు. అవకాశవాదంతోనే ఒంటరిగా బరిలోకి దిగి బొక్కాబోర్లా పడిందని మండిపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆప్ కూడా కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం కానున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని ఇప్పటికే ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మరోవైపు.. యూపీ బైపోల్స్ కోసం సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా అక్కడ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పార్టీ ముందస్తుగానే అనౌన్స్ చేసింది. అయితే ఈ ప్రకటన వెనుక కాంగ్రెస్ పార్టీపై సమాజ్‌వాదీ పార్టీకి ఉన్న ఆగ్రహమేనని అర్థం అవుతోంది. హర్యానా ఎన్నికలకు ముందు కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కోసం చర్చలు కొనసాగాయి. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ కాస్త పట్టుదలగా వ్యవహరించింది. దాంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. హర్యానాలో పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత, సాగు చట్టాలపై రైతుల ఆందోళన, రెజ్జర్ల ధర్నాలు, అగ్నివీర్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో అవి బీజేపీని ఓడిస్తాయని కాంగ్రెస్ గట్టి నమ్మింది. దాంతో ఆప్‌తో సీట్ల సర్దుబాటుకు వెనుకడుగు వేసిందని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇక మహారాష్ట్రలో ఈ ఏడాది చివరలో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటివరకు మహారాష్ట్రంలోని శివసేన (యూబీటీ) కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. కానీ.. మొదటి సారి ఆ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గ కుమ్ములాటల వల్లనే ఎన్నికల్లో ఓడిపోవాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అలాగే జరిగిందని, ఇప్పుడు హర్యానాలోనూ కుమ్ములాటల వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని ఆరోపించింది. ఓవర్ కాన్ఫిడెన్స్, అహంకారం వల్లే కాంగ్రెస్ ఓడిపోయినట్లు శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది. అటు.. తృణమూల్ కూడా కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయింది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలను తన అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నదని, ఈ విషయాన్ని ప్రాంతీయ పార్టీలు గుర్తించాలని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ట్వీట్ చేయడం సంచలనానికి దారితీసింది. తాము గెలుస్తామని అనిపిస్తే మరో పార్టీకి అవకాశం ఇవ్వం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉందని పేర్కొన్నారు. ఆ చిన్నచూపే కాంగ్రెస్ పార్టీని ఓడించిందని చెప్పుకొచ్చారు.
????తాగొచ్చి అబ్కారీ పోలీస్ కానిస్టేబుల్ ఇంటికొచ్చి దాడి చేసిన పోకిరీలు..
వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ బెల్ట్ షాప్ వద్ద తాగుతున్న వారిని నివారించేదెందుకు అబ్కారీ కానిస్టేబుల్స్ రాజేందర్, కృష్ణ వెళ్ళగా వారితో వాగ్వాదం జరిగింది.
అనంతరం అబ్కారీ కానిస్టేబుల్స్ ఇంటికి వెళ్లిపోగా వారి ఇంటికి వెళ్లి పోకిరీలు వారి ఇంటికి వెళ్లి రక్తం వచ్చేలా దాడి చేశారు…
????ఒకే ఇంట్లో నలుగురికి ఎంబీబీఎస్‌ సీట్లు*
సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం, శారద దంపతుల నలుగురు కుమార్తెలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీట్లు పొందారు.
పెద్ద కుమార్తె మమత 2018లో ఎంబీబీఎస్‌ సీట్ పొంది చదువు పూర్తి చేసి డాక్టర్ అవ్వగా.. రెండో కుమార్తె మాధవి 2020లో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొంది చదువుతుంది.
ఈ సంవత్సరం మరో ఇద్దరు కుమార్తెలు రోహిణి, రోషిణి ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందారని జిల్లాకో మెడికల్ కాలేజీ వచ్చినందుకు ఇది సాధ్యమైందని తండ్రి రామచంద్రం తెలిపాడు.
కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ బిడ్డలు ఇక్కడే ఎంబీబీఎస్‌ చదువుతున్నారని, ప్రత్యేక తెలంగాణ వల్లే ఇది సాధ్యమైందని పిల్లలతో రామచంద్రం, శారద దంపతులు హరీష్ రావును కలిశారు.
నలుగురు ఎంబీబీఎస్‌ సీట్లను పొందడం గర్వంగా ఉందని, తల్లిదండ్రుల కలలను సాకారం చేశారని హరీష్ రావు పిల్లలను అభినందించాడు…
????బతుకమ్మ సంబరాల్లో ఆపశృతి*
వరంగల్ జిల్లా: నెక్కొండ మండలంలోని అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో అపశృతి…..
యాకయ్య అనే వ్యక్తి విద్యుత్ షాక్ కు గురి కాగా అపస్మారక స్థితిలోకి వెళ్ళగా ఆసుపత్రికి తరలింపు…..
మార్గమధ్యలో మృతి.. గ్రామంలో విషాదచాయాలు
???? నంద్యాల: ఓ ప్రైవేట్ ఆస్పత్రి అధినేతను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆన్ లైన్ విచారణ పేరుతో సర్జన్ డా. రామయ్యకు బెదిరింపులు.. ఢిల్లీ పీఎస్ లో చీటింగ్ కేసులు నమోదయ్యాని బెదిరించిన కేటుగాళ్లు.. డబ్బులిస్తే కేసుల నుంచి తప్పిస్తామని.. లేదంటే అరెస్ట్ చేస్తామన్న నేరగాళ్లు.. సైబర్ నేరగాళ్లకు రూ. 38 లక్షలు పంపిన డా. రామయ్య.. టూటౌన్ పీఎస్ లో ఫిర్యాదు, కేసు నమోదు చేసి విచారణ.
???? విజయవాడ రైల్వేస్టేషన్‌లో దారుణం..
గంజాయి బ్యాచ్‌ దాడిలో లోకోపైలట్‌ మృతి..
రాళ్లు, కర్రలతో దాడి చేసిన గంజాయి బ్యాచ్‌..
తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన లోకోపైలట్‌
విధులకు వెళ్తుండగా దాడి చేసిన గంజాయి బ్యాచ్‌..
గతంలో చాలాసార్లు దాడి చేశారంటున్న రైల్వే సిబ్బంది
రైల్వే అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం
????చెంచుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
యర్రగొండపాలెం మండలం, గింజివారిపల్లె పంచాయతీ, అల్లిపాలెం చెంచు గూడెంలో సార్డ్స్ ఆధ్వర్యంలో 26 లక్షలతో నిర్మించిన బాల ప్రకాశ భవనం ను గురువారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాల ప్రకాశ భవనం పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,ఈ ప్రాంత చెంచుల విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు సార్డ్స్ సంస్థ కృషి అభినందనీయమన్నారు.
చెంచుల జీవన ప్రమాణాలు అభివృద్ది పరచడానికి, వారికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జన్ మన్ కార్యక్రమం కింద అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుచున్నదన్నారు. అల్లిపాలెం చెంచు గూడెం లో పర్యటించడం జరిగిందని, పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గ్రామస్తులు కోరడం జరిగిందని, అలాగే విద్యార్థులు చదువుకునేందుకు వసతి గృహం ను ఏర్పాటు చేయాలని గూడెం ప్రజలు కోరడం జరిగిందని తెలిపారు. గూడెం ప్రజలు తెలిపిన సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. గంజివారి పల్లె సర్పంచ్ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ, సార్డ్స్ సంస్థ 26 లక్షలతో బాల ప్రకాశ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అల్లిపాలెం చెంచు గూడెంలో 74 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని, వీరికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ గూడెంలో వసతి గృహం లేకపోవడంతో పిల్లలు విద్యకు దూరం అగుచున్నారన్నారు. గంజివారిపల్లె నుండి ఈ గూడెంకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరం వుందని, రోడ్డుకు మరమత్తులు చేపట్టాల్సిన అవసరం వుందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. 40 కుటుంబాలకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాల్సి ఉందని అలాగే కమ్యూనిటి హెల్త్ సెంటర్ ను ఏర్పాటుచేయాలని, సార్డ్స్ వారు నిర్మించిన బాల ప్రకాశ భవనంనకు ఉపాధి హామీ పథకం నిధులతో కాంపౌండ్ వాల్ నిర్మించాలని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా అల్లిపురం చెంచుగూడెం వాసులు పలు సమస్యలను జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకొనివస్తూ వినతులను సమర్పించడం జరిగింది.
తొలుత జిల్లా కలెక్టర్, కుడుముల బయన్న ఇంటిని సందర్శించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మాకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని, అలాగే మా పిల్లలు చదువుకునేలా వసతి గృహం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరడం జరిగింది.
అనంతరం జిల్లా కలెక్టర్ అంగన్వాడి కేంద్రాన్ని, న్యూట్రి గార్డెన్ ను పరిశీలించడం జరిగింది. మొత్తం ఈ కేంద్రంలో 24 మంది పిల్లలు వున్నారని, ఇందులో 15 మంది పిల్లల వివరాలు ఆన్ లైన్ లో వున్నాయని, 9 మందికి ఆధార్ కార్డు లేక వారి వివరాలు ఆన్ లైన్ లో లేవని, అందువలన వీరికి పోష్టికాహారం అందించడంలో ఇబ్బందిగా ఉంటుందని సిడిపిఓ పద్మ, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, వెంటనే ఈ గూడెంలో ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాన్ని పెట్టి ఆధార్ కార్డు లేనివారి వివరాలు నమోదుచేసి ఆధార్ కార్డులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎంపిడిఓను ఆదేశించారు.
కలెక్టర్ వెంట ఎంపిడిఓ శ్రీనివాస రావు,తహశీల్దార్ బాల కిషోర్, చైల్డ్ బిలీవ్ సంస్థ కంట్రీ డైరెక్టర్ నాన్సీ, సార్డ్స్ పిడి సునీల్ కుమార్,ఐసిడిఎస్ సిడిపిఓ పద్మ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
???? బార్‌బన్ బిస్కెట్లో ఇనుప తీగ..
కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో స్థానికంగా ఉన్న దుకాణం నుంచి హనుమాన్ రెడ్డి అనే వ్యక్తి తన పిల్లల కోసం బార్‌బన్ బిస్కెట్లు తీసుకెళ్ళాడు.
పిల్లలు తింటున్న సమయంలో ఓ బిస్కెట్లో సన్నని ఇనుప తీగ ఉండటాన్ని తండ్రి గమనించి వీడియో తీసి, పిల్లలు తింటున్న సమయంలో జాగ్రత్తగా చూడండని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు…
???? వెట్టి చాకిరి వ్యవస్థ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత..సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. మల్లికార్జున..
జిల్లా ఎస్పి ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన , వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలన కు పోలీస్ శాఖ ,కార్మిక శాఖ గిద్దలూరు న్యాయ సేవ అధికార సంస్థ ,సాంఘీక సంక్షేమ శాఖ, సార్డ్స్ సంస్థ, లార్డ్స్ సంస్థ ,రీడ్ , స్పీడ్ సంస్థలు సమన్వయంతో కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ కే మల్లికార్జున పర్యవేక్షణలో గురువారం ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ,వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన ప్రజలందరి బాధ్యత అని అన్నారు ,బాధితులను గుర్తించి వారికి పునరావాసం కల్పిస్తామన్నారు ,కంభం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆపరేషన్ స్వేచ్ఛ స్పెషల్ డ్రైవ్ కంభం ఎస్సై బి. నరసింహారావు ఆధ్వర్యంలో బేకరీ లలో, మెకానిక్ షెడ్లు, హోటళ్ళు తనిఖీలు చేసారు, ఈ సందర్భంగా హోటల్ యజమానులతో ,బేకరీ ల యజమానులతో ఎస్ఐ నరసింహారావు మాట్లాడుతూ …బాల కార్మికులు ,మానవ అక్రమ రవాణా బాధితులు ను ,వెట్టి చాకిరి వ్యవస్థ బాధితులను గుర్తించి సమాచారం ఇవ్వాలని కోరారు ,బాలల హక్కులపై వారి స్వేచ్ఛపై అవగాహన కల్పించారు, కర్మాగారాల్లో ,షాపులలో ఇటుక బట్టీలలో వెట్టి చాకిరి కి గురవుతున్న వారిని గుర్తించి వారికి పునరావసం కల్పిస్తామన్నారు.బాదితుల గురించి ఎవరైనా ఫోన్ ద్వారా గాని స్వయముగా గాని సమాచారం ఇచ్చినా వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు,
కంభం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వీరభద్ర చారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పనులలో బాల బాలికలను పనుల్లోకి తీసుకోవటం నేరమని అటువంటి వారిని గుర్తించి ,వారిపై చర్యలు తీసుకుంటామని, చదువుకునే వయసులో పాఠశాలకు పంపించాలని ,పనులకు పంపొద్దని ఆయన కోరారు, కంభం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి.బాల కాశీ నాయక్,మాట్లాడుతూ బాలలను పనుల లోనికి తీసుకుంటే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు, లార్డ్స్ సంస్థ ప్రధాన కార్యదర్శి చిట్లూరి ఏలియా మాట్లాడుతూ మైనర్లను పనిలో పెట్టుకోవద్దని, నేరమని బాలల హక్కులను కాపాడుట ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.కార్యక్రమంలో మండల పరిషత్ ఈ ఓ ఆర్ డి విజయలక్ష్మి ,రీడ్స్ సంస్థ కార్యదర్శి పారా లీగల్ వాలంటీర్ కత్తి అనోజి రావు ,స్పీడ్ సంస్థ అధ్యక్షులు డి యోబు,సాంఘీక సంక్షేమ శాఖ సిబ్బంది శ్రీను, ఉపాధి హామీ సిబ్బంది ,కార్మిక శాఖ సిబ్బంది ,పోలీసు సిబ్బంది ,మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ,స్వచ్ఛంద సేవా సంస్థల వాలంటీర్ లు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా