కామ్రేడ్ల జ్యోస్యం ఫలించేనా?..హర్యానా ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు..ఫారిన్ విరాళాల పేరుతో రూ. 7 కోట్లు టోకరా !..కోడూరు తైదుపాడు గ్రామాల్లో యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా..నరసరావుపేట ఐసిఐసిఐ బ్యాంక్ లో కూడా మోసం..ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు..విశాఖపట్నంలో ప్రారంభంకాబోతున్న టాటా కన్సల్టేన్సీ సర్వీసెస్..రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్

???? నేడు ఏపీ కేబినెట్ భేటీ..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. చెత్త పన్ను రద్దు, కొత్త మున్సిపాలిటీలో పోస్టుల భర్తీ, దేవాలయాలకు పాలక మండలి నియామకం, ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
???? రతన్‌ టాటా దయగల అసాధారణ వేత్త: ప్రధాని మోదీ..దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘రతన్‌ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త. దయగల అసాధారణ వ్యక్తి. భారతదేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఎంతోమందికి ఆయన ఆప్తుడయ్యారు’’అని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మెరుగైన సమాజం కోసం ఆయన తన వంతు కృషి చేశారని కొనియాడారు.
????వ్యాపారం, దాతృత్వంలో ‘రతన్‌ టాటా’ శాశ్వత ముద్ర వేశారు: రాహుల్‌ గాంధీ..
బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా మృతి పట్ల కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనను విజన్ కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్‌ టాటా శాశ్వత ముద్ర వేశారన్నారు. రతన్‌ టాటా కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి రాహుల్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
???? నిజమైన మానవతావాదిని కోల్పోయాం: సీఎం చంద్రబాబు..రతన్‌ టాటా మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘తమదైన దృష్టితో ప్రపంచంపై ముద్రవేసిన కొందరు వ్యక్తుల్లో రతన్‌ టాటా ఒకరు. మనం ఒక వ్యాపారవేత్తనే కాదు.. నిజమైన మానవతావాదిని కోల్పోయాం. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి, దాతృత్వశీలిగా జాతి నిర్మాణంలో ఆయన పాత్ర తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రతన్‌ టాటాను అభిమానించేవారికి, టాటా గ్రూప్‌నకు తన ప్రగాఢ సానుభూతి’’ అని చంద్రబాబు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు
** రతన్ టాటా జీవితం విజయంతో కూడిన అసాధారణ ప్రయాణం: సీఎం రేవంత్..


భారతదేశంలోని గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరైన రతన్ టాటా మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి మరియు విచారం వ్యక్తం చేశారు. “ఒక దూరదృష్టి గల నాయకుడు, మానవతావాది మరియు భారతదేశ కార్పొరేట్ ప్రపంచంలో ఒక లెజెండరీ వ్యక్తి అయిన రతన్ టాటా జీవితం వినయం మరియు విజయంతో కూడిన అసాధారణ ప్రయాణం.” అని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
????త్వరలో విశాఖపట్నంలో ప్రారంభంకాబోతున్న టాటా కన్సల్టేన్సీ సర్వీసెస్(TCS )*
*నారా లోకేశ్ బిగ్ అనౌన్స్మెంట్*
విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లిమిటెడ్ కంపెనీ రాబోతున్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దీని ద్వారా 10వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
దేశంలో వ్యాపారం చేసేందుకు ఏపీని నంబర్-1గాతీర్చిదిద్దడం లో ఇదో మైలురాయి అని పేర్కొన్నారు.
కాగా నిన్న బిగ్ అనౌన్స్ మెంట్ ఉండబోతున్నట్లు లోకేశ్
ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ బిగ్ అనౌన్స్మెంట్ ఇదే..
???? క్రీడా మైదానానికి రూ.60 లక్షలు ఇచ్చిన పవన్‌ కల్యాణ్..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అన్నమయ్య జిల్లాలోని మైసూరవారిపల్లి పాఠశాలకు పవన్‌ తన సొంత నిధులతో క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన సొంత ట్రస్టు నుంచి రూ.60 లక్షలతో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను బుధవారం రాత్రి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీ సభ్యులకు అందజేశారు.
????ఏషియన్ టేబుల్ టెన్నిస్లో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు*
కజకిస్తాన్ లో జరుగుతున్న ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్-2024లో భారత మహిళలజట్టు చరిత్ర సృష్టించింది. ఇందులో భారత జట్టు తొలిసారి కాంస్యం సాధించింది. ఏషియన్ టేబుల్ టెన్నిస్ యూనియన్
ఈ పోటీలు నిర్వహిస్తున్న 1972 నుంచి
భారత మహిళల టీమ్ పతకం సాధించడం ఇదే తొలిసారి.
సెమీఫైనల్లో జపాన్ చేతిలో భారత్ 1-3తో ఓడిపోగా, మరో సెమీఫైనల్లో చైనా 3-0తో హాంకాంగు ను ఓడించింది. మూడో స్థానం సాధించిన భారత్ జట్టు మొదటిసారి కాంస్య పతకాన్ని సాధించింది.
????2024 గానూ కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్*
2024 సంవత్సరానికి రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది.
‘ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్’కు గాను డేమిస్ హసాబిస్, జాన్ ఎం.జంపర్ లకు అలాగే ‘కంప్యూటేషనల్ ప్రొటీన్ డిజైన్’కు గాను డేవిడ్ బెకర్ కు ముగ్గిరికి సంయుక్తంగా నోబెల్ ప్రైజ్ వచ్చింది.
????ప్రముఖ టాటా సంస్థల చైర్మన్ పద్మ విభూషణ్ రతన్ టాటా మృతికి సంతాపం తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి .
రతన్ టాటా అనారోగ్య కారణంతో మృతి చెందడం ఎంతగానో కలచి వేసింది. ఎన్నో లక్షల మందికి జీవనోపాధి కల్పించిన గొప్ప వ్యక్తి ఆయన.. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుచూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు.
????హర్యానా ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పేపర్ బ్యాలట్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని ఆయన అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘మరో ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు… హర్యానా ఎన్నికల ఫలితాలు భిన్నంగా లేవు. మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి.రెండింటినీ సాధించాలంటే ఏకైక మార్గం, పేపర్ బ్యాలెట్‌కి తిరిగి వెళ్లడం.
అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే మరియు డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మనం కూడా పేపర్ బ్యాలట్ వైపు వెళ్లే సమయం ఇది. పేపర్ బ్యాలెట్ ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి’ అని జగన్ అన్నారు.
????తాడిపత్రి లో వెలసిన శ్రీ చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు పరిశే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తాడిపత్రి DSP రామకృష్ణుడు గారిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శేషపణి పాల్గొన్నారు*
????????ప్రజలకు ఉచిత ఇసుకను పారదర్శకంగా సరఫరా చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యమని, అందులో భాగంగా జిల్లా ప్రజలకు ఇసుకను అందుబాటులో తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్లో జిల్లాలో ఇసుక లభ్యత, సరఫరాపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ మరియు అడిషనల్ ఎస్పీ లతో కలసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం జులై 8 నుండి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీను తీసుకొని రావడం జరిగిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో జులై 8 వ తేదీ నుండి 62, 291 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచిత ఇసుక పాలసీ కింద ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ రోజు కు మన జిల్లలో ఇసుక స్టాక్ పాయింట్స్ లేవని, జిల్లాకు అవసరమైన ఇసుకను నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లోని ఇసుక స్టాక్ పాయింట్స్ నుండి సరఫరా జరుగుచున్నదని కలెక్టర్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో స్థానిక అవసరాల కోసం మొత్తం 285 వాగులు మరియు వంకలను గుర్తించడం జరిగిందన్నారు. గుర్తించిన వాగులు, వంకల నుండి సమీపంలోని గ్రామాల ప్రజలు తమ సొంత గృహ నిర్మాణాల అవసరాలకు వాడుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు.
???? కాశినాయన పుణ్యక్షేత్రం అయిన జ్యోతి క్షేత్రంలోని సమస్యలపై కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ని కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్
కడప జిల్లా .. కాశి నాయన :
గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కాశినాయన క్షేత్రం లోని ఆలయ నిర్మాణాలను ఆడుకుంటున్న అటవీ శాఖ అధికారులు కాశినాయన ఆశ్రమ కమిటీ కోరిక మేరకు కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కి ఆలయానికి అవసరమైన కనీస అభివృద్ధి పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, అధిక సంఖ్యలో వచ్చిన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా 2014 ఫిబ్రవరిలో కేసు కూడా పెట్టారని బిజెపి కడపజిల్లా అధ్యక్షులుగా వంగళ శశిభూషణ్ రెడ్డి, బిజెపి కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు , మాజీ ఎమ్మెల్యే విజయమ్మ , బద్వేల్ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ కి తెలియజేయడం జరిగింది.
అందులో భాగంగా కేంద్ర మంత్రి ని కలిసి కాశి నాయన క్షేత్రంలోని ఆలయ నిర్మాణాలకు 15 ఎకరాల స్థలం కేటాయించాలని కోరిన రాష్ట్ర మంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్ త్వరలోనే కాశి నాయన భక్తులకు శుభవార్త రానుందని సమాచారం.
????టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు*
*అమరావతి :-* రాజ్యసభ మాజీ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వెంకటరమణ, మస్తాన్ రావుకు పార్టీ కండువాలు కప్పి చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
????పల్నాడు జిల్లా ..చిలకలూరిపేట ICICI బ్యాంక్‌లో భారీ మోసం.. ఇదే తరహాలో నరసరావుపేట బ్యాంక్ లో కూడా మోసం వెలుగులోకి రావడం తో …సీఐడీ దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం ఆదేశం..*????????????
అతని పేరు నరేష్..ఐసీఐసీఐ చిలకలూరిపేట బ్రాంచ్ మేనేజర్..మరొక అతను పేరు హరీష్ ..బ్యాంక్‌లో అప్రైజర్‌గా పనిచేస్తాడు. ఇద్దరూ కలిసి చేతులు కలిపారు.
ఇంకేముంది తమకిష్టమొచ్చినట్లు మోసాలకు పాల్పడ్డారు.
యడ్లపాడుకు చెందిన ఓ మహిళ తన ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులను చిలకలూరిపేటలోని ఐసీఐసీఐ బ్రాంచ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసింది.అయితే కొద్దీ రోజుల తర్వాత ఆమె బ్యాంక్‌కు వచ్చి ఆరా తీయగా ఆమె డిపాజిటే లేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఆమె కంగుతింది.
మరికొంత మంది తాము తీసుకున్న రుణం కంటే తమ పేరుపై అధిక రుణం ఉన్నట్లు గుర్తించారు.
అదే విధంగా బంగారు ఆభరణాలు తనఖా పెట్టి తెచ్చుకున్న రుణం కంటే అధిక రుణం తమ పేరు మీద ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఒక్కొక్కరుగా బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. అయితే బ్యాంక్ సిబ్బంది సరైన సమాధానం చెప్పలేదు. దీంతో వీరంతా వెళ్లి చిలకలూరిపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మోసాలన్నింటికి కారణం మేనేజర్ నరేష్, బ్యాంక్ అప్రైజర్‌గా పనిచేస్తున్న హరీషే అని బాధితులు వాపోయారు.
ఇది జరిగిన రెండు రోజుల తర్వాత ఇదే తరహా మోసాలు నర్సరావుపేట బ్రాంచ్‌లోనూ బయటపడ్డాయి. ఆయిల్ వ్యాపారులు ఓడీ తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. అయితే తమకున్న లిమిట్ కంటే అధిక మొత్తంలో పెంచి దానిలో కొంత భాగాన్ని ఇతరులకు నగదు ఇచ్చినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని ఐదుగురు వ్యాపారులు బ్యాంక్‌కు వెళ్లి నిలదీయగా అప్పటి మేనేజర్ నరేష్, అప్రైజర్ హరీష్ పాత్ర ఉన్నట్లు చెప్పారు. అదే విధంగా మరికొంత మంది డిపాజిట్లలో కూడా తేడా ఉన్నట్లు తేల్చారు. దీంతో బ్యాంక్ ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది.
ఖాతాదారుల ఆందోళన నేపధ్యంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బ్యాంక్‌కు వెళ్లి ఖాతాదారులతో మాట్లాడారు. అదే సమయంలో సీఐడీ డీజీ రవిశంకర్‌‌తో కూడా ఫోన్లో మాట్లాడారు. దీనిపై సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని నరేష్, హరీష్‌పై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసిందని ఆయన తెలిపారు. వారిద్దరిపైనే కాకుండా ఇందులో ఉన్న సిబ్బంది అందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పుల్లారావు డిమాండ్ చేశారు. అయితే ఖాతాదారులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి నష్టపోయిన వారికి న్యాయం చేస్తామన్నారు.
????బయట టీ తాగుతున్నారా?
హైదరాబాద్ లో కొన్ని ముఠాలు నకిలీ టీ పౌడర్ తయారు చేయడం కలకలం రేపుతోంది. 300 కిలోల టీ పొడి, 200 కిలోల కొబ్బరి చిప్పల పొట్టు, చెరో 5 కిలోల ఎరుపు, ఆరెంజ్ రంగులు (తినకూడనివి), వివిధ కృత్రిమ ఫ్లేవర్లను ఫతేనగర్ కోణార్క్ టీ షాపులో బుధవారం టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరవ్యాప్తంగా పలు టీ స్టాల్స్ లో ఈ పౌడర్ ను విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు.
???? సికింద్రాబాద్: రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్..????????????
రైస్ పుల్లింగ్ ముఠాను బుధవారం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, మహంకాళి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర మాట్లాడుతూ. శివసంతోష్, మంజునాథ్, ప్రతాప్లు ముఠాగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో తనను మోసం చేశారని శశికాంత్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 25 లక్షల నగదు, రాగి పాత్ర స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు
???? కొత్త రకం టెక్నీక్ ….దొంగలు ఇలా కూడా ఉంటారా?????????????…అసలు ఏమి జరిగింది అంటే !
అమాయకులను ఆసరాగా చేసుకొని పలు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి. తాజా చిలకలూరిపేటలో పోలీసులకు చిక్కిన ఐదుగురు సభ్యుల ముఠా వినూత్న తరహాలో ప్రయాణీకులను దోచుకుంటుంది.
చిలకలూరిపేటలో మండిలో ప్రతి శనివారం గొర్రెలు, మేకలు అమ్మకాలు జరుగుతుంటాయి. చుట్టు పక్కల ప్రాంతాల నుండి కాపరులు ఇక్కడకు వచ్చి తమ గొర్రెలు, మేకలను విక్రయించుకొని వెళతారు. అయితే మోసాలకు పాల్పడుతున్న ముఠా వీరినే టార్గెట్ చేసి దోచుకుంటున్నారు. కొద్దీ రోజుల కిందట బాపట్ల జిల్లా మార్టురు మండలం నాగరాజుపల్లికి చెందిన రాంబాబు నాయక్, బాబు నాయక్‌లు తమ పదహారు పొట్టేళ్లను అమ్ముకోగా 1.15 లక్షలు వచ్చాయి. వాటిని తీసుకొని ఇంటికి వెళ్లటానికి ఆటో కోసం ఎదురు చూస్తుండగా నలుగురు ప్రయాణీకులతో కూడిన ఆటో వారి వద్దకు వచ్చింది.ఆ ఆటలో కొందరు ప్రయాణికులు మూడు బిళ్లల ఆట ఆడాలని, డబ్బులు వస్తాయని ఆశచూపారు. దాదాపు రూ.17500 నగదును వారు పొగొట్టుకున్నారు. దీంత వారంతా కలిసే మోసం చేస్తున్నారని గ్రహించిన రాంబాబు, బాబు నాయక్ లు వారితో గొడవకు దిగారు. వెంటనే ఆటోలు ఉన్నవారంతా కలిసి వీరిద్దరిని కిందకి నెట్టి వేసి అక్కడ నుండి పరారయ్యారు.
దీంతో రాంబాబు, బాబు నాయక్‌లు చిలకలూరిపేటలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఉన్న డబ్బును దోచుకున్నారని ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.సాతులూరుకి చెందిన ఐదుగురు సభ్యలు ముఠా ఇటువంటి మోసాలకు పాల్పడుతుందని గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. అయితే కేవలం 17500 రూపాయల మాత్రమే ఆటలో పొగ్గొట్టుకున్నారని పోలీసుల తేల్చారు. అయితే ఆటోలో ప్రయాణీకుల మాదిరి ప్రయాణిస్తూ మూడు బిల్లల ఆట ఆడుతూ తోటి ప్రయాణీకులను దోచుకుంటున్నారని నర్సరావుపేట డిఎస్పీ నాగేశ్వరావు చెప్పారు.ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
????కోడూరు తైదుపాడు గ్రామాల్లో యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా…చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న గ్రామ రెవెన్యూ డిపార్ట్మెంట్..ప్రభుత్వ ఆదాయానికి గండి పడ్డ మా జేబులు మాత్రం నిండాలి అనే రీతిలో ఈ అధికారులు…
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం..
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలంలోని కోడూరు గ్రామంలో మరియు మైలవరం మండలం తైదుపాడు గ్రామంలో ఎస్సీ కాలిని వెంబడి నిల్వ చేసిన ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా కొనసాగుతూనే వుంది. ఇసుక వ్యాపారం జోరుగా ఇక్కడి నుండి రాత్రి సమయాల్లో పెద్ద పెద్ద లాఠీలతో ఇసుక ఇతర ప్రాంతాలు ఎగుమతి చేస్తున్నారని గ్రామస్తులు తెలియజేశారు గ్రామ రెవిన్యూ అధికారికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం మాత్రం శూన్యం అని ఆ గ్రామ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంతా వగులను కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి అధికారులు అభివృద్ధి పనుల పేరిట తాత్కాలిక అనుమతులు పొంది ఇసుకను డంప్‌చేసి రాత్రి సమయంలో చుట్టూ ప్రక్కల ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో ఇసుకను భారీ ఎత్తున డంప్‌ చేసి అది కూడా రోడ్ పక్కన పెద్ద పెద్ద జెసిబి లో పెట్టి లారీలతో తరలిస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు గురిచేస్తున్నాయి ఇకనైనా మైలవరం నియోజకవర్గం ఉన్నత అధికారులు మరియు జిల్లా కలెక్టర్ అక్రమ రవాణా చేస్తున్న ఇసుకపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు…
????????ఫారిన్ విరాళాల పేరుతో రూ. 7 కోట్లు టోకరా !
ఫారిన్ ఫండ్స్ వచ్చాయని.. ట్యాక్స్ లు కడితే 30% వాటా ఇస్తామని వల.. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటున్న సైబర్ క్రైం డిపార్ట్మెంట్
???? ఫోర్బ్స్ జాబితాలో మళ్లీ టాప్ ప్లేస్‌లోకి ముకేశ్ అంబానీ..ఇండియాలోని టాప్-100 సంపన్నుల జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్..మరోమారు అగ్రస్థానాన్ని పదిలపరుచుకున్న ముకేశ్ అంబానీ..సంపన్నుల నికర విలువ తొలిసారి ట్రిలియన్ డాలర్లు దాటినట్టు పేర్కొన్న ఫోర్బ్స్
???? *ఏపీలాంటి ఫలితాలే వచ్చాయి.. పేపర్ బ్యాలెట్ కు వెళ్లాల్సిన సమయం ఇది: హర్యానా ఫలితాలపై జగన్ సంచలన వ్యాఖ్యలు*
హర్యానా ఎన్నికల ఫలితాలు గందరగోళానికి గురి చేస్తున్నాయన్న జగన్..
ఏపీ ఫలితాలకు.. హర్యానా ఫలితాలు భిన్నంగా లేవని వ్యాఖ్య..యూఎస్ సహా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నాయన్న జగన్..
????????గుంటూరుకు 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి*
గుంటూరుకు కేంద్ర ప్రభుత్వం 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేసింది. బుధవారం ఈఎస్ఐసీ 194వ సమావేశంలో ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్ణయం తీసుకున్నారు.
గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రి కోసం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గతంలో చేసిన అభ్యర్థన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఆసుపత్రి కోసం భూసేకరణ ప్రతిపాద నకు కేంద్రం ఆమోదం తెలిపింది. గుంటూరు జల్లాలో మిర్చి యార్డు, స్పిన్సింగ్ మిల్స్, కోక కోల తదితర పరిశ్రమల్లో పనిచేసే దాదాపు 50 వేలమంది కార్మికు లకు ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుంది.
???? కామ్రేడ్ల జ్యోస్యం ఫలించేనా..!!!ఏపీలో కూటమి స‌ర్కారు పాల‌న‌కు 100 రోజులు పూర్త‌య్యాయి. అయితే.. ఈ వంద రోజుల పాల‌న ఒక ఎత్తు అయితే.. గ‌త నెల‌లో చోటు చేసుకున్న ప‌రిణామాలు మ‌రో ఎత్తు. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి క‌లిపారని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై ఇటు అధికార ప‌క్షం, అటు విప‌క్షాలు కూడా పెద్ద ఎత్తున ర‌గ‌డ చేశాయి. అయితే.. ఈ విష‌యంలో డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రింత దూకుడు చూపించారు. ఏకంగా ఆయ‌న ప్రాయ‌శ్చిత్త దీక్ష పేరుతో 11 రోజులు దీక్ష చేశారు. దుర్గ‌గుడి మెట్లు శుభ్రం చేశారు. తిరుమల‌కు పాద‌యాత్ర‌గా వెళ్లారు.(అలిపిరి నుంచి). ఈ ప‌రిణామాల‌పై తాజాగా కామ్రెడ్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ వెనుక బీజేపీ ఉంద‌న్న‌దివారి ఉవాచ‌. అంతేకాదు.. రాష్ట్రంలో మ‌రో రెండేళ్ల‌కు.. చంద్ర‌ బబును గ‌ద్దె దింపి..ఆ సీటును బీజేపీ వ‌శ ప‌రుచుకునే అవ‌కాశం ఉంద‌ని కూడా సీపీఎం సీనియ‌ర్ నేత శ్రీనివాస‌రావు వ్యాఖ్యానించారు. అంతే కాదు.. బీజేపీ.. చాలా వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్‌ను త‌న దారిలోకి తీసుకువెళ్లింద‌ని.. అందుకే చేగువేరా కాస్తా.. శ్రీవారికి ప‌ర‌మ భ‌క్తుడు అయిపోయాడ‌ని కూడా వ్యాఖ్యానించారు. దీని ఉద్దేశం బీజేపీ విస్తరించ‌డ మేన‌ని కామ్రెడ్ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ బీజేపీ, ఆర్ ఎస్సెస్ ట్రాప్ లో పడ్డారని కూడా విమర్శించా రు. ప‌వ‌న్‌ వైఖరి ఏపీకి తీవ్ర నష్టం తెచ్చేలా ఉందనన్నారు. ఇదిలావుంటే, ఏపీలో మతపరమైన ఉద్రిక్తత లను రెచ్చగొట్టడం ద్వారా తెర వెనక బీజేపీ ఆరెస్సెస్ కీలక పాత్ర పోషిస్తున్నాయనే విష‌యంపై కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతోంది. రతన్ టాటా మరణంపై మాజీ ప్రేయసి పోస్ట్! ఇప్పుడు కామ్రెడ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను తేలిక‌గా కొట్టిపారేయ‌లేం. ఎందుకంటే.. గ‌తంలో మ‌హారాష్ట్ర విష‌యంలోనూ శివ‌సేన ను చీల్చ‌డంలోనూ.. ఏక్‌నాథ్ షిండేను ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కించ‌డంలోనూ.. అమిత్‌షా పాత్ర అంద‌రికీ తెలిసిందే. అయితే.. ఆ రేంజ్‌లో కాక‌పోయినా.. బీజేపీ త‌లుచుకుంటే ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న వాద‌న కూడా ఉంది. కానీ, ప్ర‌స్తుతం ఉన్న టెక్నిక‌ల్ ఇష్యూల‌ను గ‌మ‌నిస్తే.. టీడీపీకి ఒంట‌రిగానే 134 సీట్లు ఉన్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కూలిపోయే అవ‌కాశం అయితే లేదు. కానీ, క‌మ్యూనిస్టుల వాద‌న‌ను కూడా ప‌రిశీలించాల్సి ఉంటుంది
????ఈవీఎంల మీద పోరులో జగన్ కాంగ్రెస్ ఒక్కటవుతారా ?..దాంతో ఏదో జరిగింది అంటూ కాంగ్రెస్ పెద్దలు డౌట్లు వ్యక్తం చేయడం మొదలెట్టారు. కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అనూహ్యంగా ఓటమి పాలు అయింది. మధ్యాహ్నం వరకూ ఫలితాల తీరు ఒకలా వచ్చి ఆ తరువాత ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఏకంగా 18 సీట్ల నుంచి బీజేపీ 48కి ఎగబాకి అక్కడ ఫిక్స్ అయింది. కాంగ్రెస్ అయితే మొదట్లో 55 పై దాటి నంబర్ కనిపించింది. ఇక చివరికి చూస్తే 37 దగ్గర ఫిక్స్ అయింది.దాంతో ఏదో జరిగింది అంటూ కాంగ్రెస్ పెద్దలు డౌట్లు వ్యక్తం చేయడం మొదలెట్టారు.నిజానికి హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఈసారి ఓట్లూ సీట్లూ బాగా పెరిగాయి. ఆ పార్టీ 40 శాతం ఓటు షేర్ ని సాధించింది. బీజేపీకి 39 శాతం ఓటు షేర్ దక్కింది. కానీ సీట్లలో మాత్రం రెండు పార్టీల మధ్య తేడా పదకొండు సీట్లుగా ఉంది. దీంతో ఏదో జరిగే ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేష్ నుంచి చాలా మంది అనుమానిస్తున్నారు. రాహుల్ గాంధీ అయితే దీని మీద ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ వాదనకు ఇండియా కూటమిలో మద్దతు సంగతి పక్కన పెడితే భిన్న అభిప్రాయాలు వినిపించాయి. ఆప్ అయితే మితిమీరిన అతి విశ్వాసంతో కాంగ్రెస్ హర్యానాలో బొక్క బోర్లా పడింది అంటోంది. కాంగ్రెస్ తో కలసి కాశ్మీర్ లో కూటమి కట్టిన నేషనల్ కాన్ఫరెన్స్ అయితే కాంగ్రెస్ ముందు హర్యానా ఓటమి మీద ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించింది.ఇలా వేటికవే మాట్లాడుతున్న వేళ అనూహ్యంగా వైసీపీ నుంచి కాంగ్రెస్ కి మద్దతు స్వరం వినిపించడం విశేషం. జగన్ అయితే బీజేపీ మీద విమర్శలు డైరెక్ట్ గానే చేశారు. ఈవీఎంల పనితీరు బాలేదని అన్నారు. తమకు ప్రజలలో మద్దతు ఉన్నా ఘోరంగా ఓటమి ఎదురైంది అని ఆయన నాలుగు నెలల క్రితం నాటి ఫలితాలను గుర్తు చేసుకున్నారు. దేశంలో బ్యాలెట్ విధానం రావాలని కోరుతున్నారు విజయసాయిరెడ్డి అదే మాట అంటున్నారు. ఈవీఎంల మీద ఈ ఇద్దరు నేతలూ కాంగ్రెస్ తరహాలో డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కి వైసీపీ నుంచి ఫుల్ సపోర్టు వచ్చిందని అంటున్నారు. అయితే బీజేపీని ఇలా డైరెక్ట్ గా జగన్ వ్యతిరేకించడానికి కారణం ఆ పార్టీతో ఇక కలయిక ఉండదని చెప్పడమే అంటున్నారు. ఎటూ జనసేన సనాతన ధర్మం హిందూత్వ తో ఉంది. బీజేపీకి అలా శాశ్వత మిత్రుడు దొరికారు అని అంటున్నారు. మరో వైపు టీడీపీ కూడా తన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎన్డీయేను వీడదు అని అంటున్నారు. దాంతో వైసీపీకి జాతీయ స్థాయిలో ఇండియా కూటమి తోనే అంతా అని అంటున్నారు. కాంగ్రెస్ ఓటమి చెంది కొంత వీక్ అయిన వేళ ఆ పార్టీ వైపుగా ఉంటే ఫ్యూచర్ లో ఏపీలో పొత్తులకు అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు.
???? మరి ఈవీఎంల మీద పోరుకు కాంగ్రెస్ తో భుజం కలిపి వైసీపీ ముందుకు వస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉందని అంటున్నారు. జగన్ చాలా కాలం తరువాత కాంగ్రెస్ కి అనుకూలంగా బీజేపీకి యాంటీగా బాహాటంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారని అంటున్నారు. హర్యానా ఫలితాలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వచ్చాయని ఆయన చెప్పడం అంటే మోడీ సర్కార్ కి ఎదురు నిలవడమే అని అంటున్నారు. ఏపీ ఫలితాలు అలాగే వచ్చాయని ఆయన పోలిక కూడా పెట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం ముఖ్యం అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు పెడుతూంటే భారత్ లో ఈవీఎంలు ఎందుకు అని ఆయన అంటున్నారు. ఈవీఎంల విషయంలో కాంగ్రెస్ మండిపడుతున్న వేళ జగన్ చేసిన ఈ కామెంట్స్ హస్తం పార్టీకి చాలా తీయగానే ఉంటాయని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో ఏ రకమైన రాజకీయ పరిణామాలు సంభవిస్తాయన్నది చూడాల్సి ఉందని అంటున్నారు.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా