????’పుతిన్ – ట్రంప్.. ఓ రహస్య స్నేహం’… తెరపైకి సంచలన విషయం! ఇది యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తుని నిర్ధేశించే అవకాశం ఉందా అనే చర్చా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అధ్యక్ష పీఠాన్ని అదిరోహించేది ఎవరు అనే చర్చ బలంగా నడుస్తోంది. ఇక ఎన్నికల ప్రచారంలో హరీస్ – ట్రంప్ మధ్య మాటల యుద్ధాలు పీక్స్ కి చేరుతున్నాయి. ఈ సమయంలో ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అవును… మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇది యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తుని నిర్ధేశించే అవకాశం ఉందా అనే చర్చా తెరపైకి వచ్చింది. అదే… రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ట్రంప్ రహస్యంగా టచ్ లో ఉన్నారనే విషయం! 
.. వివరాళ్లోకి వెళ్తే… అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్.. అత్యంత రహస్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో టచ్ లో ఉన్నారని.. కోవిడ్-19 మహమ్మారి సమయంలో రహస్యంగా ఆ దేశానికి టెస్ట్ కిట్లు కూడా పంపించారని చెబుతూ.. అమెరికాకు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్ట్ రాసిన పుస్తకంలో ఈ విషయాలు పెర్కొన్నారు. జర్నలిస్ట్ బాబ్ వుడ్ వర్డ్ రాసిన “వార్” అనే పుస్తకం అక్టోబరు 15న విడుదల కానుంది. అయితే… ఈ లోపే ఆ పుస్తకంలోని పలు కీలక విషయాలను అమెరికా మీడియా సంస్థలు తమ కథనాల్లో ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ – వ్లాదిమిర్ పుతిన్ కి సంబంధించి రహస్య స్నేహం ఉందనే విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది. ఇందులో భాగంగా… ఈ ఏడాది ఆరంభంలో తన ఫ్లోరిడా ఎస్టేట్ నుంచి ట్రంప్ అత్యంత రహస్యంగా పుతిన్ తో ఫోన్ కాల్ మాట్లాడినట్లు జాబ్ ఆ పుస్తకంలో వెల్లడించారని యూఎస్
మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. 2011లో ట్రంప్ అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయినప్పటినుంచీ పుతిన్ తో కనీసం 7సార్లు రహస్యంగా మాట్లాడినట్లు ఈ పుస్తకంలో తెలిపారు జాబ్! ఇదే సమయంలో 2020లో కోవిడ్ సమయంలో టెస్ట్ కిట్ల కొరత విపరీతంగా ఉన్న వేళ పుతిన్ వ్యక్తిగత వినియోగం కోసం ట్రంప్ కొన్ని కిట్లను బహుమతిగా పంపించారనీ జాబ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. దీంతో… ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధ్యక్ష ఎన్నికల వేళ ఈ వార్త ట్రంప్ భవిష్యత్తుపై ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉందనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతుందని అంటున్నారు. ఇక ఈ వ్యవహారంపై డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఏ విధంగా విరుచుకుపడబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
????ఒంగోలు QIUS ఇంజనీరింగ్ కాలేజీ చట్ట విరుద్ధ చర్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి .. పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ డిమాండ్..
-విద్య చట్ట రక్షిత సంస్థలు ( APSCHE , APHERC ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) కళాశాలల యాజమాన్యాలకు అనుకూల వైఖరిని విడనాడాలని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ..రాష్ట్ర గౌరవాధ్యక్షులు మలి రెడ్డి కోటా రెడ్డి. అడ్వకేట్. రాష్ట్ర అధ్యక్షులు నరహరి.శిఖరం రాష్ట్ర కార్యదర్శి జీ.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
ఒంగోలు QIUS ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం చట్ట విరుద్ధంగా విద్యార్థి తల్లిదండ్రుల ను ఫీజుల ఒత్తిడి చేస్తూ ..కమిట్మెంట్ లెటర్ లో సంతకం చేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది చట్ట విరుద్ధం దినిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము..
కన్వీనర్ కోట కింద ఈ కళాశాలలో చేరిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకం క్రింద వసతి దీవెన విద్యా దీవెన కళాశాలకు చెల్లించకపోయినా విద్యార్థి తల్లిదండ్రులే బాధ్యత వహించి చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. అలా చెల్లించని విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేస్తూ ప్రతి విద్యార్థికి లెటర్ రూపంలో ఇచ్చింది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమైన చర్యని విద్యార్థి తల్లిదండ్రులం తెలియజేస్తున్నాము.
గతంలో ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ కమిటీ మరియు విద్యార్థి తల్లిదండ్రులు పలుమార్లు ఇదే కళాశాల యాజమాన్యం ఏటా బిల్డింగ్ ఫీజు ,యూనివర్సిటీ ఫీజు, లైబ్రరీ, ఐటి ఫీజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫీజు, తదితర ఫీజులను వసూలు చేస్తున్న వివరాలను ఫిర్యాదు చేయడం జరిగింది.సకాలంలో ప్రభుత్వం విద్యా వసతి దీవెన విడుదల చేయకపోయినా సందర్భాలలో విద్యార్థి తల్లిదండ్రుల చెల్లించాలని లేకుంటే పరీక్షలకు హాజరు కానివ్వమని ఇబ్బందులకు గురిచేసిన అంశాలను.. విద్యార్థి తల్లిదండ్రులుఈ అప్పు చేసి కళాశాలల యాజమాన్యాల ఒత్తిడికి తలగ్గినటువంటి పరిస్థితి నీ మరియు రాష్ట్రంలో అన్ని ఇంజనీరింగ్ కాలేజీల లో విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల ల యాజమాన్యాల నుండి ఎదుర్కొంటున్న ఇదే రకమైన సమస్యలను పలుమార్లు APSCHE , APHERC ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఫిర్యాదు చేసిన కమిషన్ లు విచారణ చర్యలు తీసుకోనటువంటి పరిస్థితిని కమిషన్ ల వైఖరిని విద్యార్థి తల్లిదండ్రులం నిరసన వ్యక్తం చేస్తున్నాము .
విద్యార్థి తల్లిదండ్రులు గా మేము కోరేది ఒకటి చట్టం అమలు చేసేందుకు ఏర్పడినటువంటి విద్య చట్ట రక్షిత సంస్థలు (APSCHE , APHERC ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) కళాశాలల యాజమాన్యాలకు అనుకూల వైఖరిని విడనాడాలని విద్యార్థి తల్లిదండ్రులపై రకరకాల ఫీజులతో ఒత్తిడి చేస్తున్న కళాశాల యాజమాన్యల పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.విద్యార్థి తల్లిదండ్రులకు ప్రశాంతమైన వాతావరణం లో ఉన్నత మైన విద్యనందించేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

????సీఎం సమక్షంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల జన్మదిన వేడుకలు..
విజయవాడ : ఉండవల్లిలోని సీఎం నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు ఎమ్మెల్యే ముత్తుముల. అశోక్ రెడ్డి పుట్టినరోజు కావటంతో సీఎం చంద్రబాబు స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. వారితో పాటు రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణ, అనగాని సత్య ప్రసాద్, మరియు టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు..
????కొవ్వూరు మండలం, కాపవరం గ్రామంలో రైతు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం విజయవాడ వెళుతూ మార్గమధ్యంలో నల్లజర్ల లోని శ్రీ వెంకట సత్య రైస్ మిల్లును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు..మూసి ఉన్న గోడౌన్ లో భారీ ఎత్తున రేషన్ బియ్యం నిలువ ఉన్నట్లు కనుగొన్న మంత్రి..
బియ్యం సంచులపై విదేశీ కంపెనీల పేర్లు ఉన్నట్లు గుర్తింపు..
టార్చిలైట్ వెలుగులో స్టాక్ ను పరిశీలించిన మంత్రి..
అక్రమ రవాణా కోసం విదేశాలకు సరఫరా చేసేందుకు వీటిని ఇక్కడ నిలవ చేసినట్లు ప్రాథమికంగా గుర్తింపు.
????అర్ధవీడు: గుండెపోటుతో తహశీల్దార్ మృతి*
ప్రకాశం జిల్లా అర్ధవీడు తహశీల్దార్ కుక్క ముడి దాసు గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. ఆయన స్వస్థలమైన మాచర్ల నుంచి విధులకు హాజరయ్యేందుకు అర్ధవీడుకు వస్తుండగా మార్గం మధ్యలో దాసు గుండెపోటుకు గురయ్యారు. మార్కాపురంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా వైద్యుల సలహా మేరకు అంబులెన్సులో గుంటూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో తహశీల్దార్ మృతి చెందాడు.దాసు గతంలో పుల్లలచెరువు,
యర్రగొండపాలెం తాహశీల్దార్ గా విధులు నిర్వహించారు. ఆయన మృతికి పలువురు విచారం వ్యక్తం చేశారు.
???? నంద్యాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే మా లక్ష్యం.*
*రాబోయే రోజుల్లో నంద్యాలలో రీజనల్ జాబ్ మేళా ఏర్పాటు చేసి అతిపెద్ద ఐటీ కంపెనీల ప్రతినిధులను మేనేజర్లను నంద్యాలకు తీసుకువచ్చి నంద్యాల యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం.*నంద్యాల నిరుద్యోగ యువతి యువకులకు అండగా ఉంటా ..నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నందు ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు ముఖ్య అతిధిగా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి NMd ఫిరోజ్ పాల్గొన్నారు.*
*ఈ జాబ్ మేళాకు వివిధ బహుళ జాతి కంపెనీల ప్రతినిధులను నంద్యాలకు తీసుకువచ్చి గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ , యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నంద్యాలలో జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది.*
*NMd ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు నిర్వహించిన జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు . 5 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయని దాదాపు 415 కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు .*
*నిరుద్యోగులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని ప్రతి నెల జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందన్నారు*
*20 లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలలో ఇవ్వాలనేదే తెలుగుదేశం పార్టీ ఆశయమన్నారు . ఈ ఆశయానికి అనుగుణంగా మంత్రివర్యులు నారా లోకేష్ సారథ్యంలో ఖచ్చితంగా సాధిస్తామని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు అలాగే నాకు తెలిసిన హైదరాబాద్ కంపెనీలను కూడా నంద్యాలకు తీసుకుని వచ్చి జాబ్ మేళా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.*
????ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా మదరసాలో ఫాతిమా స్వచ్చంద్ర సేవా సంస్థ దుప్పట్లు పంపిణీ*
ప్రకాశం జిల్లా *గిద్దలూరు* ఎమ్మెల్యే *మముత్తుముల అశోక్ రెడ్డి* పుట్టినరోజు పురస్కరించుకొని బుధవారం *రాచర్ల* మండల కేంద్రంలోని *మదరసా* లో *ఫాతిమా స్వచ్చంద సేవ సంస్థ* అధ్యక్షులు *నంద్యాల ఖాసింవలి* విద్యార్థులకు దుప్పట్లు పండ్లు తినుబండారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుతూ ప్రార్థన చేశారు.అనంతరం మదరసాలోని విద్యార్థులు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఖాదర్ వలి, ఖాదర్ బాషా దూదేకుల దస్తగిరి,మౌలానా పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్ ఎస్ రహమాన్..
????ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల సమీపంలో అమరావతి అనంతపూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనంపై
వెళుతున్న వారిని ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే సాయి అనే వ్యక్తి మృతి మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*కంభం:జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం*
ప్రకాశం జిల్లా కంభం పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై బుధవారం ముందు వెళ్తున్న క్రేన్ ను ఆటో వెనక నుంచి ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.తీవ్రంగా గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.క్షతగాత్రులు ఇద్దరు భార్యా భర్తలుగా పోలీసులు గుర్తించారు.జరిగిన ప్రమాదం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
‘పుతిన్ – ట్రంప్..ఓ రహస్య స్నేహం’..ఒంగోలు QIUS ఇంజనీరింగ్ కాలేజీ చట్ట విరుద్ధ చర్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి మూసి ఉన్న గోడౌన్ లో భారీ ఎత్తున రేషన్ బియ్యం నిలువ ఉన్నట్లు కనుగొన్న మంత్రి..నంద్యాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం ఎన్ ఎన్ డి ఫిరోజ్..సీఎం సమక్షంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల జన్మదిన వేడుకలు..గుండెపోటుతో తహశీల్దార్ మృతి..
Recent Posts

