రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. ????టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

????రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !!!.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి ఎస్ ఆర్.. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం హాయిగానే ఉంది కదా. అటు చంద్రబాబు ఇటు పవన్ ప్రశాంతంగా తమ పనిని తాము చేసుకుంటున్నారు కదా అని అంతా అనుకోవచ్చు. కానీ ఇదే కూటమిలో బీజేపీ ఉంది. అందుకే బీజేపీ ఏపీలో తన అధికారాన్ని విస్తరించుకునేందుకు పవన్ కళ్యాణ్ ద్వారా చురుకుగా పావులు కదుపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు (వి ఎస్ ఆర్)సంచలన ఆరోపణలు చేశారు.
ఈ మేరకు రోడ్ మ్యాప్ ని సిద్ధం చేస్తున్నారు అని ఆయన అన్నారు. నెల్లూరు లో జరిగిన సీపీఎం మహా సభలలో ఆయన మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వాని అస్థిరపరచేందుకు కేంద్ర స్థాయిలోనే కుట్ర సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ విషయంలో బీజేపీ పవన్ కళ్యాణ్ ని పావుగా వాడుకుంటోందని అన్నారు.
*పవన్ కళ్యాణ్ బీజేపీ ఆరెస్సెస్ ట్రాప్ లో పడ్డారని కూడా ఆయన విమర్శించారు. ఆయన వైఖరి ఏపీకి తీవ్ర నష్టం తెచ్చేలా ఉందని అన్నారు. ఇదిలా ఉండగా ఏపీలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం ద్వారా తెర వెనక బీజేపీ ఆరెస్సెస్ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. రెండేళ్ల వ్యవధిలో చంద్రబాబుని గద్దె నుంచి దించేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేయాలన్నది బీజేపీ మాస్టర్ ప్లాన్ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు.
ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో విద్వేషాలను చొప్పించడం వెనక ఉంది ఇదేనని ఆయన అన్నారు. మత విద్వేషాలు కనుక జరిగితే ఏపీ కూడా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మాదిరిగా అశాంతి తో రగిలిపోవాల్సిందే అని ఆయన హెచ్చరించారు.
మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సీపీఎం నేత స్పష్టం చేశారు ధరలు మండిపోతున్నాయని నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, అలాగే ఏ రకమైన అభివృద్ధి లేదని ఆయన అన్నారు. దాంతో నాలుగు నెలలకే టీడీపీ ప్రభుత్వం తీరు పట్ల ఫైర్ అవుతున్నారని అన్నారు.
ఈ నేపధ్యంలో శ్రీవారి లడ్డూల ఇష్యూ తెచ్చి ఏపీలో తమ రాజకీయం పండించాలని బీజేపీ చూస్తోందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే పవన్ ప్రాయశ్చిత్త దీక్ష మీద లెఫ్ట్ పార్టీలు మండిపడుతున్నాయి. అదే టైం లో ఏపీలో బీజేపీ మత రాజకీయానికి ఆస్కారం కల్పించే వాతావరణం ఏర్పడుతోందని కూడా ఆందోళన చెందుతున్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే రాజకీయ చతురుడు, అపర చాణక్యుడు చంద్రబాబుని గద్దె దించడం సాధ్యమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎంత పవన్ కి బీజేపీ మద్దతు ఇచ్చినా ఆ రెండు పార్టీలు కలిస్తే ఉన్న నంబర్ 29 ఎమ్మెల్యేలు మాత్రమే. ఇక వైసీపీని కూడా కలుపుకున్నా 40 దగ్గర నంబర్ ఆగిపోతుంది. మరి మ్యాజిక్ ఫిగర్ 88ని చేరుకోవాలంటే టీడీపీ నుంచి కచ్చితంగా 48 మందిని చీల్చి బయటకు తేవాలి..
అయితే కేంద్రంలో బీజేపీ కనుక తలచుకుంటే ఇవేమీ కష్టం కాబోవని కూడా అంటున్నారు నయానా భయనా నాయకులను తమ వైపు తిప్పుకోవడంలో కమలం పార్టీ దేశంలో కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి చోట్ల తన మార్క్ ని చాటుకుందని కూడా గుర్తు చేస్తున్నారు. దాంతో ఏపీలో ఏమైనా జరగవచ్చా అంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్నది కూడా ఉంది.కేంద్రం ఏపీలోని ఎంపీల మీద ఆధారపడి ఉంది. కానీ ఏపీ కూడా ఆర్థిక అవసరాల కోసం కేంద్రం మీద ఆధారపడి ఉంది. దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలకంగా మారుతారు అని అనుకున్న నాడు కామ్రేడ్స్ చెప్పినట్లుగా ఆయనను మాజీ సీఎం గా చేయడానికి అయినా ఆపరేషన్ స్టార్ట్ చేసినా చేస్తారని అంటున్నారు. సో కామ్రేడ్ వి ఎస్ ఆర్ ఆరోపణలు మాత్రం ఆసక్తిని పెంచుతున్నాయనే చెప్పాల్సి ఉంది.
????ఏపీలో 2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం????: సీఎం చంద్రబాబు*
ఏపీలో నడికుడి- శ్రీకాళహస్తి, కోటిపల్లి-నరసాపురం మధ్య రైల్వే లైన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. “ రాష్ట్రంలో రూ.75 వేల కోట్ల రైల్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. 2027లోగా బుల్లెట్ రైలుపనులు ప్రారంభం కావొచ్చు. ఐటీ లిటరసీ,డిజిటల్ హబ్ పెట్టాలని కేంద్రాన్ని కోరాం డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని కోరాం. క్లౌడ్ ఉన్న నాలెడ్జ్ ను పూర్తిగా వినియోగించుకుంటాం” అని సీఎం చంద్రబాబు వివరించారు.
????కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
సీఎం అధికారిక నివాసానికి వచ్చిన కేంద్రమంత్రి సెయిల్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్ విలీనంపై కీలక చర్చలు జరిపారు.
ఈ భేటీలో ఎంపీలు, ప్రముఖులు పాల్గొన్నారు.
????హరియాణా ఎన్నికలపై కాంగ్రెస్ సంచలన ప్రకటన..!!!
హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా EVMలలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ప్రజల అభీష్టాన్ని BJP తారుమారు చేసిందని దుయ్యబట్టింది. హరియాణాలోని 3 జిల్లాల్లో EVMల పనితీరుపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. BJPది ప్రజాభీష్టాన్ని తారుమారు చేసిన విజయంగా అభివర్ణించారు.
????ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..
భర్తకు రూ.లక్షల్లో వేతనం, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న ఆమె.. ఈ ఏడాది తన తల్లి అస్తికల నిమజ్జనం కోసం హైదరాబాద్‌కు రాగా.. ఇక్కడ ఓ ట్యాక్సీ డ్రైవర్‌ పరిచయమయ్యాడు. అతని మాయమాటలకు విని, భర్త ఇండియాలో ఉన్న సమయంలో లండన్‌ లోని ఓ పార్క్‌లో పిల్లలను వదిలేసి హైదరాబాద్‌కు వచ్చింది. భర్త ఫిర్యాదుతో ఆర్జీఐఏ పోలీసులు ఆమెను గోవాలో అదుపులోకి తీసుకుని మంగళవారం భర్త వద్దకు పంపించారు.
????*ఉత్సవాలు, పండగను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని కోణాల్లో భద్రత చర్యలు చేపడుతున్నాం*..విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి, ఐపిఎస్.. *బందోబస్తు ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి..
విజయనగరం ఉత్సవాలు, శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి తొలేళ్ళు,సిరిమానోత్సవం పండుగ సందర్భంగా జిల్లా పోలీసుశాఖ ఏర్పాటు చేస్తున్న బందోబస్తు, భద్రత ఏర్పాట్లును విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి అక్టోబరు 8న క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత మరియు ఇతర పోలీసు అధికారులతో కలిసి శ్రీ పైడితల్లమ్మ దేవాలయం, క్యూ లైన్లు, దేవాలయం వెనుక భాగం, కమాండ్ కంట్రోల్ రూం, మూడు లాంతర్లు, గురజాడ అప్పారావు రోడ్డు, కోట జంక్షను ప్రాంతాలను, గుర్తించిన పాత భవనాలను స్వయంగా సందర్శించి, క్షేత్ర స్థాయిలో భద్రత ఏర్పాట్లును పరిశీలించారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి, ఐపిఎస్ మాట్లాడుతూ – అమ్మవారి పండగ, ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపధ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా 2000మందితో భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనాల రెగ్యులేషను, మళ్ళింపులు చేపడుతున్నామని, వాహనాల పార్కింగు చేసేందుకు ప్రత్యేకంగా పార్కింగు ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నామని, చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగు జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిరిమాను మరియు ఇతర రధాలు తిరిగే మార్గంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు రాకుండా ఐరన్ బ్యారికేడింగు ఏర్పాటు చేయాలని, ముఖ్య కూడళ్ళలో మూడు అంచెల్లో ఐరన్ బ్యారికేడింగు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు సిరిమానోత్సవంను తిలకించే విధంగా భద్రత చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా పోలీసుశాఖ చేపట్టే చర్యలకు సహకరించాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాల్లో కూడా భద్రత ఏర్పాట్లు చేపడుతున్నామని విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి అన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కె చౌదరి, ఎస్.శ్రీనివాస్, టి.శ్రీనివాసరావు, ఎస్.లక్ష్మణరావు, సూరి నాయుడు, దేవాదాయ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, పలువురు ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
????SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి*..విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన మురళి మోహన్ పై కఠిన చర్యలు వెంటనే చేపట్టాలి*
*శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలి*
*PDSU_AISF_యూత్ కాంగ్రెస్*
చేబోయిన అచ్యుత్ అనే విద్యార్థికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా మానసికంగా హింసించి ఆత్మహత్య ప్రయత్నానికి ప్రేరేపించినటువంటి పి. మురళీమోహన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బంధువులు.విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం DRO గారికి వినతిపత్రం అందజేశారు . ఈ సందర్భంగా విద్యార్థి అన్నయ్య ఏ. ప్రవీణ్, మేనత్త కే సుహాసిని.. PDSUజిల్లా అధ్యక్షుడు కాకినాని, యువజన కాంగ్రెస్ నాయకులు రాయల సతీష్, ఏ.ఐ.ఎస్.ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఏం సాయి కుమార్ మాట్లాడుతూ గత కొంతకాలంగా ఎన్.ఆర్ పేటలో గల SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కరస్పాండెంట్.పి మురళీమోహన్ ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని అందుకు నిదర్శనమే ఇ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం అని నాయకులు అన్నారు. అతనిపైన పోలీస్ స్టేషన్లో కేసులు కూడా గతంలో నమోదయాయని వారు తెలిపారు. మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి నాగార్జున యూనివర్సిటీ గాని ఆంధ్ర యూనివర్సిటీ గాని ఎగ్జామ్స్ సంబంధించి పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ పాల్పడే సెంటర్ గా SVRK కళాశాలకి పేరు ఉందని వారు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నంకి ప్రేరేపించినటువంటి కరస్పాండెంట్ పి. మురళీమోహన్ పైన ఇప్పటిదాకా కేసు నమోదు చేయకపోవడం పట్ల పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయని కావున వెంటనే మురళీమోహన్ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. మరియు విజయవాడ హాస్పటల్లో విద్యార్థి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే కనీసం ప్రభుత్వం నుంచి గాని అధికారులు నుంచి గాని ఎటువంటి స్పందన లేకపోవడం చాలా దారుణమని.మరియు విద్యార్థి యొక్క భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నటువంటి SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల గుర్తింపు రద్దుచేసి కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఒకే బిల్డింగులు లో 5 రకాల విద్యాసంస్థలు మరియు హాస్టల్ నిర్వహిస్తున్న అధికారులకు కనబడడం లేదా అని వారు అధికారులు ప్రశ్నించారు. విద్యార్థుల కోసం పనిచేస్తున్నటువంటి విద్యా సంఘ నాయకులపై కేసులు ఎంతవరకు సమంజసం అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరస్పాండెంట్ పై కేసు నమోదు చేసి అతన్ని శిక్షించేంతవరకు విద్యార్థి, యువజన సంఘాలుగా ఈ పోరాటం కొనసాగిస్తామని వారు ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్. యు జిల్లా ఉపాధ్యక్షుడు బి వినోద్, నగర అధ్యక్షుడు యం. క్రాంతి, ఏఐఎస్ఎఫ్ నాయకులు సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
????చికెన్ వ్యర్ధాలు అక్రమ రవాణాపై వారిపై విస్తృత దాడులు నిర్వహిస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న పెదపాడు ఇన్చార్జి ఎస్ఐ కట్టా శారద సతీష్ వారి యొక్క సిబ్బంది*
పర్యావరణానికి హాని మరియు ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని కలిగించేటు వంటి చికెన్ వ్యర్ధాలు అక్రమ రవాణా లను అరికట్టే విషయాలలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలను నిర్వహిస్తున్న నేపథ్యంలో 08.10.2024 వ తేదీ నాడు పెదపాడు ఎస్ఐ కి రాబడిన సమాచారం మేరకు పెదపాడు మండలం రామచంద్రపురం గ్రామములో వాహన తనిఖీలు నిర్వహించుచుండగా AP 39 Y 5916 నెంబరు గల మహీంద్రా ట్రక్కులో అక్రమంగా చికెను వ్యర్థాలను రవాణా చేస్తున్న విషయంపై డ్రైవర్ మరియు వాహనం యొక్క యజమాని పై కేసును నమోదు చేసినట్లు గా పెదపాడు ఎస్ఐ కట్టా శారద సతీష్ తెలియ చేసినారు.
*వాహనం ను స్వాధీనం చేసుకొని చికెను వ్యర్థాలను ధ్వంసం చేసిన పోలీసు అధికారులు*
????రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్య సూసైడ్
NTR: విజయవాడలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అజిత్ సింగ్ నగర్కు చెందిన నాగరాజు ప్రసాదంపాడులో వంట మాస్టర్గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బీఆర్టీఎస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న నాగనాజు భార్య ఉష ఇంటిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
????టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు..???? టీ షాపును నడుపుతూ ఒక్క సిమ్రనే కాకుండా.. గతంలో ‘గ్రాడ్యుయేట్‌ ఛాయ్‌వాలీ’ ప్రియాంక గుప్తా, ‘ఎంఏ ఇంగ్లిష్‌ చాయ్‌వాలీ’ టుక్‌టుకీ దాస్‌, ‘బీటెక్‌ ఛాయ్‌వాలీ’ వర్తికా సింగ్‌, ‘పీజీ ఛాయ్‌వాలీ’ రాధా యాదవ్‌, ‘నర్సింగ్‌ ఛాయ్‌వాలీ’ ప్రీతీ ఝా, ‘బీటీసీ ఛాయ్‌వాలీ’ సృష్టి వర్మ.. తదితరులు కూడా తాము పొందిన సర్టిఫికెట్ల పేరుతోనే టీస్టాల్స్‌ వ్యాపారం ప్రారంభించి లక్షల రూపాయలు సంపాదిస్తూ వార్తల్లో నిలిచారు.
????టీ అమ్ముతూ నెలకు రూ. 1 లక్షకు పైగా సంపాదిస్తున్న మోడల్‌???? పూణేలో మోడల్‌లా తయారై టీస్టాల్‌ నడుపుతోన్న సిమ్రన్‌.. తన ఆహార్యంతోనే కాదు.. తాను చేసే రుచికరమైన టీతోనూ స్థానికుల్ని ఆకట్టుకుంటోంది. ఇందుకు కారణం.. ఆమె తనదైన స్టైల్‌లో టీ తయారుచేయడమే! కప్పుకి రూ. 10 చొప్పున రోజుకు 300 కప్పులకు పైగా ఛాయ్‌ అమ్ముతున్నారు. తన టీస్టాల్‌ వ్యాపారంతో ప్రస్తుతం నెలకు రూ. 1 లక్షకు పైగానే సంపాదిస్తున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎప్పుడైనా వచ్చి మా స్టాల్‌లో టీ రుచిని ఆస్వాదించమని సిమ్రన్‌ చెబుతున్నారు
????మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే..
మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
కొమురంభీం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న మున్సిపల్ సిబ్బందికి మంగళవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మద్దత్తు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కార్మీకులకు జీతం రాక ఇబ్బందులు పడుతున్నారని వారికి దసరా బోనస్ కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్ కమిషనర్ తో ఫోన్ ద్వారా మాట్లాడి వాళ్ల సమస్యలను తొందరగా పరిష్కారించాలని అన్నారు.
????రాజన్న సేవలో కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి..
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ మంగళవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రికి ఈవో కె. వినోద్ రెడ్డి పూల మొక్కతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం అర్చకులు ఆశీర్వదించగా ఈవో లడ్డూ ప్రసాదం అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు, బిజెపి నాయకులు ఉన్నారు.
????❤️❤️❤️ ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్యలు????: వనపర్తి ఎస్పీ గిరిధర్..
నేటి కాలంలో విద్యార్థినిలు ప్రేమ పేరుతో మోసపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని, సెల్ ఫోన్ వినియోగం ఎక్కువైందని, చాలా మంది సోషల్ మీడియాకు అలవాటుపడి సమయాన్ని వృధా చేసుకోవడం, భవిష్యత్తు నాశనం చేసుకోవడం జరుగుతుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ భవనంలో ఎస్పీ, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు అపర్ణ ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
????కొల్లాపూర్ ఆర్డీఓ సస్పెన్షన్ ????????????
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్డీఓ పి. నాగరాజు విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మంగళవారం ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భూములకు సంబంధించిన నకల్, ఇతరత్రా పత్రాలు కావాలంటే సదరు రైతులకు సకాలంలో ఇవ్వకుండా వేధిస్తున్నట్టు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓను సస్పెండ్ చేశారు.
????వనపర్తి: 15 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్..????????????
వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ గిరిధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా పరిధిలోని పెబ్బేరు మండలంలోని శివారులో పేకాట ఆడుతున్న 15 మంది నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ. 6, 35, 600 నగదు, 4 కార్లు, 3 బైకులు, 15 మొబైల్స్ స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.
???? బెల్లంపల్లిలో ప్రేమికుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య????????????
బెల్లంపల్లి మండలం చాకెపల్లి గ్రామానికి చెందిన జక్కం అంజలి (18) ప్రేమికుడి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తాళ్ల గురిజాల ఎస్సై రమేష్ తెలిపారు. గత ఏడేళ్ల క్రితం నుంచి చిన్న గుడిపేట గ్రామానికి చెందిన యాటకల రాజు, అంజలి ప్రేమించుకుంటున్నారు. గత మూడు నెలల నుంచి ఐదు లక్షలు కట్నం కావాలని, అనుమానంతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పేర్కొన్నారు.
????అమరావతి: APPSC అపాయింట్‌మెంట్‌ లెటర్లపై ఏపీపీఎస్సీ ప్రకటన.
APPSC మెంబర్లు అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇవ్వరు.
APPSC మెంబర్స్‌ ఆఫీస్‌ల నుంచి వచ్చే లెటర్లు నమ్మొద్దు.
అపాయింట్‌మెంట్‌ లెటర్ల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే ఇచ్చి మోసపోవద్దు. అన్ని శాఖాల్లో ఉద్యోగాలు విధి విధానాలకు లోబడి జరుగుతాయి. -ఏపీపీఎస్సీ
???? రోజా మీడియా గొట్టాలతో మాట్లాడరా…? నగరి మేడం లొకేషన్ ఎక్కడ…?
“పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం” ఒకప్పుడు మీడియా వర్గాలు ముఖ్యంగా వైసీపీ అనుకూల మీడియా వర్గాలు ఎంతగానో ఎదురు చూసే సందర్భం అది. తాడేపల్లి ప్యాలెస్ లో అయినా, తిరుమల కొండ అయినా మైక్ దొరికితే చాలు మేడం గారు తాండవం ఆడేవారు. కాని ఇప్పుడు మాత్రం సీన్ అంతా రివర్స్ లో నడుస్తోంది. అసలు రోజా మీడియా సమావేశాలు ఎక్కడా కనపడటం లేదు. కాని రోజా విరుచుకుపడ్డారు, దుమ్మెత్తిపోశారు, రోజా మార్క్ కామెంట్స్ అంటూ కాస్త అప్పుడప్పుడు హడావుడి నడుస్తోంది.
కానీ… కానీ… మీడియా మైకుల ముందుకు మాత్రం రోజా రావడం లేదు. అరెస్ట్ భయమో లేక మొహం చెల్లకో ఆమె సొంత నియోజకవర్గానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఎప్పుడైనా మాట్లాడినా ఓ రికార్డ్ వీడియో వదులుతున్నారు. అందులోనే కౌంటర్ లు సెటైర్ లు. అవి కూడా పెద్ద ఘాటుగా ఏం ఉండటం లేదు. ఎవరో కోసం మాట్లాడినట్టే ఉంటున్నాయి. అసలు రోజా ఇండియాలో లేరని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె తన కుమార్తె వద్ద ఉంటున్నారని… ఇప్పట్లో ఇండియా వచ్చే అవకాశం లేదని అంటున్నారు.
మీడియా ముందుకు వస్తే మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తమ అధినేత జగన్ పద్ధతినే ఈ విషయంలో రోజా ఫాలో అవుతున్నారు. ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ అయి వచ్చి అది మాట్లాడేసి… ఏమైనా ప్రశ్న అడిగితే… డిస్ట్రబ్ చేయకు అంటూ వెళ్ళిపోతున్నారు జగన్. విజయవాడ వరదల్లో జరిగింది అదే. కాకినాడ జిల్లా వరదల్లో కూడా అదే సీన్ రిపీట్. ఈ బాధ అంతా ఎందుకని ప్రజలను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమాన్ని మళ్ళీ బయటకు తీసి… మాట్లాడేస్తున్నారు. లడ్డూ వ్యవహారం అంత జరుగుతున్నా జగన్ మీడియాను ఫేస్ చేయలేదు. పొరపాటున ఏ టీడీపీ అనుకూల మీడియాకో రోజా దొరికితే లేని పోనీ ప్రశ్నలు అన్నీ అడిగే అవకాశం ఉంటుంది. అందుకే రికార్డ్ చేయడం మినహా లైవ్ కి రోజా ఆసక్తి చూపడం లేదు. ఏదేమైనా రోజా లాంటి నేత మీడియా ముందుకు రాకపోవడంతో పెద్దగా పొలిటికల్ వార్తల్లో స్టఫ్ ఉండటం లేదనే భావన చాలా మందిలో ఉంది.
???? టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం..ప్రసాదం తయారీ కేంద్రంలోకి వెళ్లి..
తిరుపతి లడ్డూ వివాదం వేళ టీడీపీ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయవాడ దుర్గ గుడిలో ఎలాంటి రక్షణ కవచాలు వాడకుండా దేవుడి ప్రసాదం రుచిచూడటం వివాదాస్పదమైంది.భక్తులు మండిపడుతున్నారు..
????ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి చేరుకొని అందరికి ఆదర్శంగా నిలిచాడు.*
శ్రీ కాంత్ నాగపూర్ కి చెందిన యువకుడుడు ఒకప్పుడు ఆటో డ్రైవర్ ఇప్పుడూ డ్రైవరే కాకుంటే ఇప్పుడు అతన్ నడిపే త్రీ వీలర్ ఆటో కాదు ఫ్లైట్. ఔను మీరు చదువుతున్నది నిజమే. 12వ చదువు ఆపేసిన అతనే ఈరోజు ఇండియన్ ఎయిర్ లైన్స్ లో పైలట్..ఎలా? అంటే ….శ్రీకాంత్ పంత్వానే నాగ్ పూర్ లోని మురికివాడలో నివసించే వాడు. తండ్రి ఒక వాచ్ మెన్ ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువాపేసిన శ్రీకాంత్ ఇంటి అవసరాల కోసం ఒక కొరియర్ ఆఫీస్ లో డెలివరీ బాయ్ గా చేరాడు.
అనుకున్న సమయానికి డెలివరీ చేయటానికి ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాడు కొన్నాళ్ళకి ఫైనాన్స్ లో ఒక ఆటో కొనుక్కున్నాడు కూడా. ఐతే ఒక డేలివరీ కి వెళ్లటం అతని జీవితాన్నే మలుపు తిప్పింది.
ఒక రోజు అతను ఒక పార్సెల్ డెలివరీ కోసం ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ శిక్షణ పొందుతున్న క్యాడెట్లతో మాట్లాడినప్పుడు ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశం లేకుండా కూడా పైలట్ అవచ్చూ అని తెలిసింది..
అప్పటివరకూ శ్రీ కాంత్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులే పైలట్ ఔతారు అనుకునే వాడట. ఆ తర్వాత ఎయిర్ పోర్ట్ బయట టీ అమ్మే అతనితో జరిపిన సంభాషణ ద్వారా పైలట్ శిక్షణా కోర్స్ కి స్కాలర్ షిప్ ఉంటుందనే విషయం తెల్సింది.
ఇక అతను ఆగదల్చుకోలేదు. తన ఆగిపోయిన చదువుని మళ్ళీ మొదలు పెట్టాడు.12th లో తన స్కాలర్ షిప్ కొసం కావాల్సిన అర్హత మార్కులపైనే అతని దృష్టి అంతా.
పాస్ అయ్యాడు పైలట్ శిక్షణా తరగతులకు హాజరయ్యే అర్హత సంపాదించి కోర్స్ లో జాయిన్ అయాడు కూడా. ఐతే మొదటినుంచీ మాతృ భాషలోనే చదివిన శ్రీకాంత్ కి ఇంగ్లిష్ ఒక పెద్ద అడ్డంకి గా తయారయ్యింది.ఐనా తన సహ విధ్యార్తుల సహాయం తో ఆ సమస్యనీ అధిగమించాడు.
రాత్రింబవళ్ళు ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్ మీదా పట్టు సాధించాడు. మొత్తానికి ఫ్లైయింగ్ కలర్స్ అకాడెమీ నుంచి తన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ని పొందాడు.
కానీ సర్టిఫికెట్ తో బయటికి వచ్చిఉన శ్రీకాంత్ కి ఆర్థిక మాంధ్యం దెబ్బ తో ఉద్యోగం దొరకటం కష్టమయింది.
ఒక కంపెనీలో ఎగ్జిగ్యూటివ్ గా చేరాడు కొన్నాళ్ళు అదే కంపెనీలో పని చేస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. ఎట్టకేలకు ఇండిగో ఎయిర్లైన్స్ నుంచి పైలట్ ప్యాక్ లో ఫస్ట్ ఆఫీసర్ గా సెలక్ట్ అయినట్టు కాల్ వచ్చింది…. ఇప్పుడు శ్రీకాంత్ ఒక పైలట్.
ఇప్పుడూ అతను నడిపే వాహనానికి మూడే చక్రాలు ఐతే అది ఆటో కాదు. తన కృషి,పట్టుదలా.. సాధించాలన్న ఆశయం కలిసి అతన్ని గాల్లో ఎగిరేలా చేసాయ్… నాగ పూర్ రోడ్లనుంచి ప్రపంచ దేశాల వరకూ అతన్ని ఎదిగేలా చేసాయ్
కృషి , సాధించాలి అనే పట్టుదల బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా సాధ్యపడుతుంది .????????????????
*????హైవేల వెంట ఫుడ్‌కోర్టులు, ట్రామా సెంటర్లు, ఫార్మసీలు**రిపేర్‌ షాపులు, ఏటీఎంలు మరెన్నో సౌకర్యాలు*
*అంతర్జాతీయ ప్రమాణాలతో కేంద్రం ‘హమ్‌ సఫర్‌’ పాలసీ*
*ప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ*
రాన్నున్న రోజుల్లో రోడ్డు భద్రత, ప్రయాణ సౌకర్యాలకు ‘హమ్‌ సఫర్‌’ పర్యాయ పదంగా మారుతుందన్నారు. ఈ సౌకర్యాలన్నింటినీ పర్యావరణ హితమైన పద్ధతిలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. హమ్‌ సఫర్‌ పాలసీతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంతో పాటు ఉద్యోగాల సృష్టి జరుతుందని గడ్కరీ చెప్పారు. ‘‘ఎవరైతే ప్రయాణికుల నుంచి టోల్‌ వసూలు చేస్తారో.. వాళ్లు ప్రయాణికులకు భద్రత, సౌకర్యాలు కల్పించాలి’’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.పెట్రోలు బంకుల యజమానులు నిబంధనల ప్రకారం ప్రయాణికులకు కనీస వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. హైవేలపై ఉన్న పెట్రోల్‌ బంకుల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడం తప్పనిసరని చెప్పారు. చాలా పెట్రోల్‌ బంకుల్లో టాయిలెట్లకు తాళం వేసి ఉండటం తాను గమనించానని తెలిపారు. అలా ఉంటే పెట్రోల్‌ బంకులను మూసేస్తామని హెచ్చరించారు.
???? పార్లమెంట్ సభ్యులు KVP రామచంద్రరావు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
కీ.శే పార్వతమ్మ ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైన కారణంగా నెల్లూరు లోని వారి స్వగృహంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని వారి కుటుంబ సభ్యులని పరామర్శించి పార్వతమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ పార్లమెంట్ సభ్యులు KVP రామచంద్ర రావు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాళులు అర్పించారు.
స్టాఫ్ రిపోర్టర్ రహమాన్..
????గమనిక*
దినపత్రికలో వచ్చిన వార్త నిజం కాదు.. ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి కంభం..
మద్యము దుకాణాలకు ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ..
లాటరీ తీసే ప్రక్రియ 11 తారీకు.ఇంకా, రిజిస్ట్రేషన్ / దరఖాస్తుల సమర్పణకు ఈరోజు చివరి రోజు 09-10-2024. సాయంత్రం 5 గంటల వరకు & లాట్లు డ్రా చేసిన తేదీ వంటి ఇతర తేదీల ప్రస్తావన లేదు.
ఈ రోజు ఉదయం నాటికి కంభం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న (10) మద్యము దుకాణాలకు వచ్చిన అప్లికేషన్ వివరాలు.. 113..
ఈ రోజు సాయంత్రం 5 గంటల తో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ. కావున ఔత్సాహికులు త్వరితగతిన దరఖాస్తు చేయగలరని మనవి..

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా