బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

????హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక – సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..!!
హర్యానాలో కాంగ్రెస్ ఆశలు ఆవిరి అయ్యాయి. గెలుపు ఖాయమనుకున్న చోట ఓటమి ఎదురైంది. ఎగ్జిట్ పోల్స్ తో పెరిగిన అంచనాలు..వాస్తవ ఫలితాల్లో తారుమారయ్యాయి. కాంగ్రెస్ హర్యానాలో ఓటమి వెనుక స్వీయ తప్పిదాలే ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ గెలిచింది అనటం కంటే కాంగ్రెస్ ఓడింది అని చెప్పుకోవాల్సి వస్తోంది. పార్టీ నేతల అతి విశ్వాసం..గ్యారంటీల పైనే నమ్మకం..అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో గ్యారంటీల అమలు కష్టాలతో పాటుగా సామాజిక సమీకరణాల్లో కాంగ్రెస్ దెబ్బ తింది. ఫలితంగా బీజేపీకి మరో అవకాశం దక్కింది.
**దెబ్బ తీసిన గ్యారంటీలు
ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అంచనా వేసాయి. వాస్తవ ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. తొలుత విజయం వైపు కాంగ్రెస్ దూసుకెళ్తున్నట్లు కనిపించినా అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. హర్యానాలో తొలి సారి హ్యాట్రిక్ విజయం సాధించిన పార్టీగా నిలిచింది. అయితే, కాంగ్రెస్ ఓటమి వెనుక స్వీయ తప్పిదాలే ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణలో తమకు విజయం అందించిన గ్యారంటీలే ఇక్కడా గెలిపిస్తాయని నమ్మకం పెట్టుకున్నారు. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత కర్ణాటకలోని సిద్దరామయ్య, తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వాలు వాటి అమలులో లోపాలు..కష్ట,నష్టాలను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఆ గ్యారంటీల పై నమ్మకం లేకుండా చేయటంలో సక్సెస్ అయింది.
**కాంగ్రెస్ లో విభేదాలు
హర్యానాలో బీజేపీ తమ బలాలు -బలహీనతల పై ముందుగానే అంచనాకు వచ్చింది. కాంగ్రెస్ బలహీనతలు..సామాజిక సమీకరణాలు బలంగా పని చేసే హర్యానాలో ఎవరు ఎవరితో ఉన్నారనేది పూర్తిగా పసిగట్టింది. కాంగ్రెస్ లో మాత్రం మాజీ సీఎం భూపేందర్ హుడా ఇచ్చే నివేదికల పైనే రాహుల్ ఎక్కువగా ఆధారపడ్డారు. ఆయన నిర్ణయాలే ఎన్నికల్లో కీలకం అయ్యాయి. **హుడా – షెల్జా మధ్య విభేదాలు ఎన్నికల వేళ బీజేపీకి కలిసి వచ్చాయి. కాంగ్రెస్ రెండుగా చీలింది. పదేళ్ల బీజేపీ పాలన పైన ఉన్న వ్యతిరేకత తమకు గెలుపుగా మారుతుందని హస్తం పార్టీ నేతలు అతి విశ్వాసం తో వ్యవహరించారు. సామాజిక సమీకరణాల్లోనూ అంచనాలు తప్పాయి.
**సమీకరణాల లెక్కల్లో
హర్యానాలో జాట్ ల ప్రభావం ఎక్కువ. దాదాపు 35 నుంచి 40 సీట్లలో జాట్‌లు డిసైడింగ్ ఫ్యాక్టర్. కాంగ్రెస్ 35 మంది జాట్ అభ్యర్థుల్ని బరిలోకి దించినా ఫలితం దక్కలేదు. అదే సమయంలో జాట్ ఓటింగ్ ఐఎన్ఎల్డీ చీల్చుతుందని గ్రహించిన బీజేపీ జాటేతర కులాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో సఫలం అయింది. కాంగ్రెస్ జాట్ వర్గానికి 28 సీట్లు ఇవ్వగా..బీజేపీ 16 మంది జాట్ అభ్యర్ధులకు మాత్రమే సీట్లు ఇచ్చింది. రైతు చట్టాల ప్రభావం హర్యానాలో కనిపించలేదు. రెజ్లింగ్ వివాదాలు..వినీశ్ ఫోగట్ కు సీటు తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనాలు తప్పాయి. ఆప్ తో కలిసి వెళ్లకుండా సీట్ల విషయంలో రాజీ ధోరణి లేకుండా ముందుకు వెళ్లటం కాంగ్రెస్ కు నష్టం చేసాయి.
బీజేపీ పక్కా ప్లాన్
ఆప్ కు 1.38 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ – బీజేపీ మధ్య తాజా సమాచారం మేరకు ఒక శాతం మాత్రమే తేడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక…ఎన్నికలకు ముందే బీజేపీ నాయకత్వం అప్రమత్తం అయింది. మార్చిలో సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ ను తప్పించి నాయబ్ సింగ్ సైనీకీ సీఎంగా పగ్గాలు అప్పగించింది. ఖట్టర్ ను కేంద్ర మంత్రిని చేసింది. జాట్ వైపు కాంగ్రెస్ ఆశలు పెంచుకోగా.. బీజేపీ ఓబీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది. 28 మంది ఓబీసీలకు సీట్లు ఇచ్చింది. ఇక.. ఆరెస్సెస్ నేతలు త్రిపుర తరహాలో కాంగ్రెస్ పట్టు..బీజేపీకి వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా డోర్ టు డోర్ ప్రచారం చేసారు. మోదీ ని చూసి ఓట్లు వేయాలని నినదించారు. దీంతో.. బీజేపీ ట్రాప్ లో పడిన కాంగ్రెస్ మరోసారి సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఫలితంగా బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది.
????జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు… మ్యాజిక్ ఫిగర్..? ఈ క్రమంలో తాజాగా వెలువడుతున్న ఫలితాల ప్రకారం… 56 స్థానాల్లో పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ 41స్థానాల్లోనూ.. 39 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 9 స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతుంది. జమూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం ప్రారంభమైంది. ఈ క్రమంలో తొలుత పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్ చేపట్టారు! ఈ సమయంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ అందుతున్న ఫలితాల ప్రకారం… నేషనల్ కాన్ఫరెన్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. అవును… జమ్మూకశ్మీర్ లో 90 అసెంబ్లీ సీట్లున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జమ్మూ ప్రాంతంలో 43, కశ్మీర్ రీజియన్ లో 47 సీట్లు ఉన్నాయి. అయితే.. అసెంబ్లీకి ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టనెంట్ గవర్నర్ కు ఉండటంతో.. జమ్ముకశ్మీర్ లో మ్యాజిక్ ఫిగర్ 48 అవుతుంది. ఈ క్రమంలో తాజాగా వెలువడుతున్న ఫలితాల ప్రకారం… 56 స్థానాల్లో పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ 41స్థానాల్లోనూ.. 39 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 9 స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ కూటమి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ అవ్వగా… వేర్వేరుగా పోటీ చేసిన పీడీపీ (2),బీజేపీ (24) వెనుకంజలో ఉన్నాయి. కాగా జమ్ముకశ్మీర్ లోని 90 నియోజకవర్గాలకు మూడు దశల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 న సుమారు 10 సంవత్సరాల విరామం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దుచేయబడిన తర్వాత జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. 2018 జూన్ లో మెహబూబా ముఫీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్ముకశ్మీర్ లో పీడీపీ-బీజేపీ సంకీర్ణం కుప్పకూలింది. విభజన తర్వాత నాటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇక్కడ గవర్నర్ పాలనను అమలు చేశారు.
???? పిఠాపురంలో బాలికపై అత్యాచారం.. సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ పవన్?: వైసీపీ..
కాకినాడ జిల్లా పిఠాపురంలో బాలికపై అత్యా చార ఘటనపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సేఫ్ హ్యాండ్ ఎక్కడ పవన్ కళ్యాణ్? అని నిలదీసింది. ‘పిఠాపురంలో దళిత బాలికపై టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్త దుర్గాడ జాన్ అత్యాచారం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డల మానప్రాణాలకు రక్షణ కరవైంది. హోంమంత్రిగా నీ చేతగానితనాన్ని చూసి సిగ్గుపడు అనిత’ అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు… స్టాఫ్ రిపోర్టర్ రహిమాన్..
???? ఈరోజుతో బీజేపీకి కష్టాలు షురూ.. బిజెపికి ఓట్లు తగ్గాయి.. సీట్లు పెరిగాయి.. కాంగ్రెస్ కు మంచిరోజులు!.. గడిచిన పదేళ్లుగా రాజకీయంగా తీవ్రమైన గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కు మంచి రోజులు మొదలైనట్లుగా చెబుతున్నారు. మిగిలిన అంశాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం కాలం కీలకభూమిక పోషిస్తుందని చెప్పాలి. గడిచిన పదేళ్లుగా రాజకీయంగా తీవ్రమైన గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కు మంచి రోజులు మొదలైనట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో తిరుగులేని అధికారాన్ని అనుభవించిన బీజేపీకి ఎదురుదెబ్బలు మొదలయ్యే రోజుఈ రోజు నుంచే షురూ కానుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం ఈ రోజు వెలువడే రెండు రాష్ట్రాల అసెంబ్లీ (జమ్ముకశ్మీర్, హర్యానా) ఎన్నికల ఫలితాలుగా చెబుతున్నారు. ఇటీవల ముగిసిన ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అంశాలు కనిపించట్లేదు. హర్యానా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లటం ఖాయమంటున్నారు. జమ్ముకశ్మీర్ విషయంలోనూ కాంగ్రెస్ కు సానుకూలంగా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఒకవేళ తేడా వచ్చినా హంగ్ ఏర్పడుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే మరో రెండు రాష్టాల అసెంబ్లీకి ఎన్నికల నగరా మోగనుంది. అందులో కీలకమైనది మహారాష్ట్ర. దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబయి మహానగరం మహారాష్ట్ర కిందకే వస్తుంది. గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో మహారాష్ట్ర ప్రజలు విసిగిపోయి ఉన్నారని.. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టటం ఖాయమని చెబుతున్నారు. బీజేపీ తీరుతో మహారాష్ట్ర ప్రజలు విసిగిపోయి ఉన్నారని.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రతో పాటు ఎన్నికలు జరిగే మరో రాష్ట్రం జార్ఖండ్. ఈ రాష్ట్రంలోనూ ఇప్పటికే బీజేపీ వ్యతిరేకత ప్రభుత్వం ఉంది. అయితే.. ఇటీవల కాలంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను పెట్టిన ఇబ్బందుల నేపథ్యంలో బీజేపీ ఇమేజ్ ను దెబ్బ తీసిందన్న భావన ఉంది. ఈసారి ఎన్నికల్లోనూ ఇప్పటి ప్రభుత్వానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ఈ రోజు వెలువడే ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు..మరో నెల వ్యవధిలో (నవంబరు) అసెంబ్లీ ఎన్నికలు జరిగే మహారాష్ట్ర.. జార్ఖండ్ లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున బీజేపీ చేతిలోని రాష్ట్రాలు కమలనాథులకు వ్యతిరేక కూటమి ఖాతాలోకి వెళ్లిపోతున్నట్లే. మొత్తంగా రానున్న రోజులు బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని.. కాంగ్రెస్ కు కష్టకాలం ముగిసినట్లేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందుకు ఈ రోజే పునాదిగా భావిస్తున్నారు.
????సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బ తీసేలా కథనం ప్రచురించిన సాక్షి మీడియా సంస్థపై టీటీడీ ఫిర్యాదు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బ తీసేలా కథనం ప్రచురించిన సాక్షి మీడియా సంస్థపై టీటీడీ ఫిర్యాదు చేసింది. ప్రాథమిక ఆధారాల్ని పరిశీలించిన పోలీసులు.. తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు వచ్చిన ముఖ్యమంత్రిచంద్రబాబు టీటీడీ అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పబ్లిష్ చేసిన వ్యాఖ్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. షాకింగ్ డిటైల్స్! శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రావటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన సమీక్షలో భాగంగా.. ‘‘తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిపై మన స్టాండ్ ఏంటో మీకు తెలుసు కదా. సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే సిట్ టీం విచారణకు వస్తే అంతా ఒకే మాట చెప్పాలి. ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి’’ అంటూ సమీక్షకు హాజరైన అధికారులకు చెప్పినట్లుగా ‘నేను చూసుకుంటా’ అన్న శీర్షికతో ప్రచురితమైన కథనంలో పేర్కొన్నారు. దీనిపై టీటీడీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అందులో ఒక్క అంశం కూడా సత్యం కాదని.. అన్ని అసత్యాలేనని మండిపడింది. సాక్షి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కథనాన్ని ప్రచురించిందని.. నైతికంగా దానికి సంబంధించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ ఈవో కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సాక్షి యాజమాన్యం మీద బీఎన్ఎస్ సెక్షన్లు 353(2), 356, 196(1)(ఎ) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
???? ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.. రెండు తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత.. తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇష్టం వచ్చినట్టు తెలంగాణను విభజించి.. జిల్లాలు, జిల్లాలుగా చేసేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఏకంగా 33 జిల్లాలు అవతరించాయి. ములుగు, సిరిసిల్ల, వనపర్తి లాంటి చిన్న జిల్లాలు సైతం కేసీఆర్ ఏర్పాటు చేసి తెలంగాణను ఇష్టం వచ్చినట్టు ముక్కలు చెక్కలు చేసేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. అప్పటివరకు ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా మార్చడంతో పాటు.. మన్యంలో పార్వతీపురం జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి.
వైసీపీ హయంలో ఏర్పాటు చేసిన జిల్లాలకు సరైన ప్రాతిపదిక లేకుండా పోయింది. కొన్ని జిల్లాల కు అసలు హెడ్ క్వార్టర్స్ ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అల్లూరు సీతారామ రాజు జిల్లా విషయంలో ఇదే తప్పు జరిగింది. అందుకే చంద్రబాబు తాము వస్తే జిల్లాల విభజన విషయంలో జరిగిన తప్పులను సరిచేస్తామని ప్రకటించారు. విభ‌జ‌న కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం 30 జిల్లాలు గా అవతరించబోతుందని తెలుస్తోంది.
తాజాగా పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, అమరావతి కేంద్రంగా అమరరామం, మార్కాపురం, మదనపల్లి, హిందూపురం, ఆదోనిగా కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్టు డ్రాప్ బయటకు వచ్చేసింది. జగన్ జిల్లాలను మార్చారు కానీ.. ఇంకా ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఎక్కువగా పనులు జరుగుతున్నాయి. దీనికి కారణం మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం. జిల్లాల విభజన చేసి తన పని అయిపోయిందని జగన్ చేతులు దులుపుకున్నారు. కానీ.. ఉద్యోగులు, ప్రజలకు ముప్పుతెప్పలు తప్పడం లేదు. ఈ తప్పులు అన్ని చంద్రబాబు స‌రి చేయాలని చూస్తున్నారు.
???? డిజిఎఎఫ్‌ఎంఎస్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన మొద‌టి మ‌హిళ ..
డిజిఎఎఫ్‌ఎంఎస్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన మొద‌టి మ‌హిళ ఎవరు?
సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తీ సారిన్ అక్టోబర్ 1న 46వ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (డిజిఎఎఫ్‌ఎంఎస్) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించి తొలి మహిళా అధికారిగా నిలిచారు. ఆర్తీ సారిన్.. పూణేలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుండి ఎండీ(రేడియోడయాగ్నోసిస్), టాటా మెమోరియల్ హాస్పిటల్ నుండి రేడియేషన్ ఆంకాలజీలో డిప్లొమేట్ నేషనల్ బోర్డ్‌ను కలిగి ఉన్నారు. ఆమె తన 38 సంవత్సరాల కెరీర్‌లో భారత రక్షణ దళాల మూడు శాఖల్లో సేవలందించారు.
????విజయవాడ న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి*
*ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతికి సీఎం సంతాపం*
*అమరావతి :-* రాజస్థాన్ లో విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతి చెందడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన సీఎం…వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు సీఎం సూచించారు.
???? మహరాష్ట్రలోని ఈ గ్రామంలో దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజిస్తారు..
దసరా రోజు భారత్‌లో రావణాసురుడి బొమ్మల్ని దగ్ధం చేస్తుంటారు. కానీ మహరాష్ట్రలోని అకోలా జిల్లా సంగోలా గ్రామంలో మాత్రం దసరా నాడు దశకంఠుడి నిలువెత్తు రూపాల్ని చేసి, ప్రజలు అందరూ మంగళ హారతులతో ఒక దగ్గర చేరి దశముఖుడిని పూజిస్తారు. ఈ ఆనవాయితీ 300 ఏళ్లుగా కొనసాగుతోంది. అంతేకాదు, ఆ ఊరి మధ్యలో నల్లరాయితో చేసిన పెద్ద రావణుడి విగ్రహం కూడా ఉంది.
????విశాఖపట్నం విమ్స్ లో ఖరీదైన వైద్యం ఉచితం*
ఏపీలో బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన బాధితులకు విశాఖపట్నంలోని విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లను ఉచితంగా అందిస్తున్నారు.బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఖరీదైన ఈ ఇంజెక్షన్ల (టెనెక్ట్ ప్లస్ )ను ఉచితంగానే సరఫరా చేస్తోంది. ఈ ఇంజెక్షన్ ధర రూ.40 వేల నుంచి రూ.50 వేలు మధ్యలో ఉంటుందని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. రాంబాబు తెలిపారు.
????ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు… నాగార్జున విషయాలన్నీ బయటకు తీస్తున్నాం: కొండా సురేఖ లాయర్..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శ..నాగార్జునపై చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ వెనక్కి తీసుకున్నారని వెల్లడి..
ఆర్టీఐ ద్వారా నాగార్జున విషయాలు బయటకు లాగుతున్నామన్న లాయర్..ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసినందుకు నాగార్జున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనపై కూడా తాము పరువునష్టం దావా వేస్తామని కొండా సురేఖ తరఫు న్యాయవాది తెలిపారు.అఫైర్ల గురించి కేటీఆర్,కేసీఆర్‌కు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు.నాంపల్లి కోర్టు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొండా సురేఖ మెదక్ ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గౌరవసూచకంగా ఆమె మెడలో నూలు వస్త్రాన్ని కప్పారని, కానీ దీనిని బీఆర్ఎస్ సోషల్ మీడియా అనుచితంగా చూపించిందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో ఎన్నో విషయాలు వెలుగు చూశాయన్నారు.నాగచైతన్య, సమంత విషయంలో నాగార్జున గురించి మాట్లాడిన కొండా సురేఖ ఆ తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. బీసీ మంత్రి కొండా సురేఖపై, ప్రభుత్వంపై బురదజల్లే ఉద్దేశంతో నాగార్జున పరువునష్టం దావా వేశారని ఆరోపించారు. నాగార్జున వేసిన కేసులో ఏమీలేదన్నారు. నాగార్జున విషయాలను బయటకు తీస్తున్నాం..నాగార్జున వేసిన పరువునష్టం దావా కేసులో వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసిందన్నారు. టీపీసీసీ లీగల్ సెల్ పక్షాన తాము నాగార్జునకు సంబంధించిన అన్ని విషయాలను ఆర్టీఐ ద్వారా బయటకు తీస్తున్నామన్నారు.ఆ తర్వాత నాగార్జునపై తాము పరువునష్టం కేసు వేస్తామన్నారు. బ్యూరో..m.s. రహమాన్
???? అత్తమామలను చంపేందుకు కోడలు కుట్ర. బురిడీ బాబా మహ్మద్‌ ఖలీంను ఆశ్రయించిన కోడలు. మంత్రాలు చేయించి అత్తమామలను చంపేందుకు కోడలు ప్రయత్నం. చేతబడి పేరుతో కోడల్ని బురిడీ కొట్టించిన నకిలీ బాబా. బాధిత మహిళ ఫిర్యాదుతో చేతబడి నిందితుడి అరెస్ట్‌. పాతబస్తీ బండ్లగూడలో బాగోతం.
*????కొండచిలువ ప్రత్యక్షం.*పొదిలి మండలం కంబాలపాడు ఓ ఇంటిదగ్గర కొండచిలువ కలకలం..*ఇంటి సమీపంలోని కాళీ స్థలంలోని ఓ నెట్ లో ఇరుకున్న కొండచిలువ సుమారు ఏడు అడుగులు ఉన్న కొండచిలువ..ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన గ్రామస్తులు.. కొండచిలువను బంధించి తీసుకెళ్ళి అడవిలో వదిలి పెట్టిన ఫారెస్ట్ అధికారులు..స్టాఫ్ రిపోర్టర్.. రహమాన్..
???? ఈరోజు రాచర్ల మండలంలోని జేపీ చెరువు మరియు చిన్నగాని పల్లి గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి షేక్.అబ్దుల్ రఫీక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ముందుగా గ్రామాలలో సాగు చేసినటువంటి వరి,మిరప,కంది మరియు ప్రత్తి పంటలను సందర్శించడం జరిగింది, ముందుగా వరి పంటలో పొటాషియం లోపం గమనించడం జరిగింది దీని నివారణకు గాను ఎకరాకు 25 కేజీలు పోటాష్ వేసుకోవాలని తెలిపారు, అలాగే వరిలో ఆకు చుట్టు పురుగును కూడా గమనించడం జరిగింది, గొంగళి పురుగు ఆకుమడతలో ఉండి పత్ర హరితాన్ని గోకి తిని వేయడం వలన ఆకులన్నీ తెల్లబడతాయి రైతులు దీనినే మజ్జిగ తెగులు అని కూడా అంటారు దీని నివారణకు గాను కార్టప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవలెనని తెలిపారు, అలాగే కంది పంటలో భూమిలో సరిపడినంత తేమ లేకపోవడం వలన పైరు బెట్టకు వస్తుంది అని దీని నివారణకు గాను ఎకరాకు రెండు కేజీల 19.19.19 లేదా 13.0.45 లేదా యూరియా ను పిచికారి చేయవలెనని తెలిపారు, అలాగే మిరప పంటలో తామర పురుగులను గమనించడం జరిగిందని దీని నివారణకు గాను నత్రజని ఎరువులను సిఫారసు మించి వాడరాదని అలాగే ఎకరాకు 20 నీలిరంగు జిగురు అట్టలు పెట్టవలెనని తెలిపారు, పిప్రోనిల్ 2 ml లేదా ఇమిడా క్లోప్రిడ్ 0.3 గ్రాములు లేదా స్పైరో టెట్రామెట్ 0.8 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేయవలెనని తెలిపారు, అనంతరం రైతు సేవా కేంద్రం నందు గ్రామ సభ నిర్వహించడం జరిగింది.ఈ గ్రామ సభలో మండల వ్యవసాయ అధికారి షేక్.అబ్దుల్ రఫీక్ మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువులు అవసరానికి మించి ఎక్కువగా వాడడం వలన పురుగులు తెగుళ్లు ఎక్కువ అవ్వడంతో పాటు సూక్ష్మ పోషకాలు మొక్కలు తీసుకోలేని స్థితికి వెళ్తాయని తెలిపారు దీనివలన నేల ఆరోగ్యం దెబ్బతిని పంటలు దిగుబడి తగ్గుతుందని తెలిపారు కాబట్టి రైతులు వ్యవసాయ అధికారులు సూచనలను పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే విధంగా సాగు చేయవలెనని తెలిపారు ప్రధాన పంటలలో వచ్చేటటువంటి సూక్ష్మ పోషక లోపాలు వాటి నివారణ చర్యలను గురించి రైతులకు వివరించడం జరిగింది, అనంతరం వ్యవసాయ శాఖ ద్వారా జరుగుతున్నటువంటి వివిధ పథకాలను గురించి రైతులకు వివరించడం జరిగింది అనంతరం మైక్రో ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్ ఎన్. మోహన్ కృష్ణ మాట్లాడుతూ APMIP ద్వారా చిన్న సన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై డ్రిప్పు అందిస్తున్నట్లు తెలిపారు, అలాగే sprinklers 55% రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు కావాల్సినటువంటి రైతులు రైతు సేవ కేంద్రం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు,గ్రామసర్పంచులు, జేపీ చెరువు MPTC, గ్రామ వ్యవసాయ సహాయకులు, మరియు గ్రామంలోని రైతులు పాల్గొన్నారు..డివిజన్ ఇంచార్జి అసలాం బేగ్

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా