కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

????రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!.. ఈ క్రమంలో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమని ఆయన అప్పట్లో తెలిపారు. తమిళ అగ్రy హీరోల్లో ఒకరైన విజయ్‌ ఈ ఏడాది కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరుతో ఆయన పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టీవీకే పోటీ చేస్తుందని అందరూ భావించినా పోటీ చేయలేదు. ముందు తమ పార్టీ సంస్థాగతంగా బలపడాల్సి ఉందని.. ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తామని విజయ్‌ తెలిపారు. ఈ క్రమంలో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమని ఆయన అప్పట్లో తెలిపారు.ప్రస్తుతం విజయ్‌ తన చివరి చిత్రంలో నటించనున్నారు. కొద్ది రోజుల క్రితమై ఈ సినిమా షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమైంది.
విజయ్‌ 69వ సినిమాగా వస్తున్న ఇందులో ప్రముఖ హీరోయిన్‌ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్‌ పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇళయదళపతి విజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరు ప్రఖ్యాతుల కోసమో,కాలయాపన కోసమో తాను రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. ప్రజలతో మమేకమై వారికి సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవాండిలో అక్టోబర్‌ 27న జరుగనున్న టీవీకే తొలి మహానాడు సందర్భంగా అక్కడ తాజాగా ముహూర్త స్తంభ స్థాపన కార్యక్రమం నిర్వహించారు. టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా విజయ్‌ పార్టీ శ్రేణులకు ఓ బహిరంగ లేఖ రాశారు.పార్టీ శ్రేణులంతా పార్టీ తొలి మహానాడు ఎప్పుడు జరుగుతుందా అని నెలల తరబడి వేచి చూశారన్నారు. ఈ నేపథ్యంలో వారిని తాను, తనను వారు కలుసుకునే సమయం ఆసన్నమైందని ఆ లేఖలో వెల్లడించారు.
జరుగనున్న టీవీకే తొలి మహానాడు సందర్భంగా అక్కడ తాజాగా ముహూర్త స్తంభ స్థాపన కార్యక్రమం నిర్వహించారు. టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా విజయ్‌ పార్టీ శ్రేణులకు ఓ బహిరంగ లేఖ రాశారు. పార్టీ శ్రేణులంతా పార్టీ తొలి మహానాడు ఎప్పుడు జరుగుతుందా అని నెలల తరబడి వేచి చూశారన్నారు. ఈ నేపథ్యంలో వారిని తాను, తనను వారు కలుసుకునే సమయం ఆసన్నమైందని ఆ లేఖలో వెల్లడించారు. సర్వత్ర ఆసక్తి.. పార్టీ శ్రేణులతో తన అనుబంధం కుటుంబసభ్యులతో సంబంధం వంటిదని విజయ్‌ భావోద్వేగ లేఖ రాశారు. ఈ మేరకు తాను తొలిసారిగా కార్యకర్తలకు లేఖ రాస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజలకోసం పాటుపడాలని, వారి సమస్యలు దశాబ్దాల నుంచి ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని తెలిపారు. టీవీకే పార్టీ లక్ష్యాలను వెల్లడించేందుకే ఈ మహానాడును నిర్వహిస్తున్నామని విజయ్‌ స్పష్టం చేశారు. తనకు రాజకీయాలు తెలుసా అంటూ ప్రశ్నించే వారందరూ ఈ మహానాడు తర్వాత ఆశ్చర్యపోవటం ఖాయమని విజయ్‌ తెలిపారు. కార్యకర్తలంతా బాధ్యత కలిగిన పౌరులుగా ఉండాలని కోరారు. మంచి వ్యక్తులుగా ఉంటే ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మహానాడు జరిగే వరకు పార్టీ కార్యకర్తలంతా క్రమశిక్షణతో సైనికుల్లా మెలగాలని సూచించారు.
????కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
????గజ్వేల్ లో వెయ్యి ఎకరాల్లో ఫాంహౌస్ ఉంది. అందులో 500 ఎకరాలు ఇస్తే.. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తా..
కేసీఆర్ భూదానం చెయ్.. ఇండ్లు కట్టించే బాధ్యత నాది.
????జన్వాడలో కేటీఆర్ కు 50 ఎకరాలు ఉంది. అందులో 25 ఎకరాలు ఇవ్వు..ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా.
????బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1500 కోట్లు ఉన్నాయి.. ఒక 500 కోట్లు ఇవ్వండి.. ప్రజలకు పంచుదాం.
ఇదంతా ప్రజల నుండి దోచుకున్న సొమ్మే కదా అన్నారు.
????తిరుమలలో 13 కోట్ల 45 లక్షల రూపాయలతో నిర్మించిన అధునాతనమైన వకుళామాత కేంద్రీయ వంటశాల‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు.వారాంతపు సెలవులు యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ కొత్త కేంద్రీకృత వంటశాల‌లో లక్షా 20 వేల మంది యాత్రికులకు, అన్నప్రసాదాలు పులిహోర, సాంబర్ రైస్, పొగల్,ఉప్మా సిద్ధం చేసి సిఆర్ఓ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందించడానికి ప్రణాళిక రూపొందించారు.ఈ అన్న ప్రసాదాలను సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్, పిఎసి- I, రామ్ బాగీచా విశ్రాంతి భవనం వద్ద వున్న బస్ స్టాండ్, ఔటర్ క్యూ లైన్ల వెంట ఫుడ్ కౌంటర్లలో పంపిణీ చేస్తారు.వంటశాల‌ను ప్రారంభించిన అనంతరం
???? మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు…
తెలంగాణలో ప్రస్తుతం మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వరుస వివాదాలు హాట్ టాపిక్‌గా మారాయి. మొన్నటివరకు మంత్రి కొండా సురేఖ మెడలో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు నూలు దండ వేయటంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగటం తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. ఆ తర్వాత కేటీఆర్ మీద విమర్శలు చేస్తూ అక్కినేని కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు చేయటం రాజకీయాలతో పాటు అటు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపాయి. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే.. కొండా సురేఖకు రేవంత్ రెడ్డి సర్కార్ ఝలక్ ఇచ్చింది.మంత్రి కొండా సురేఖ దంపతులకు ప్రధాన అనుచరుడైన నవీన్ రాజ్‌కు ప్రభుత్వం ఇప్పటికే ఇద్దరు గన్ మెన్లను కేటాయించగా.. వారిని వెనక్కి తీసుకుంది. అయితే.. నవీన్ రాజ్ మీద కొంతకాలంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మంత్రి పేరు చెప్పుకుంటూ వరంగల్ జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు అధికారులను కూడా లెక్కచేయకుండా పెత్తన చేలాయిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి.
ఈ ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి చేరటంతో.. రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. దీంతో.. వరంగల్ పోలీసులు తాగాజా నవీన్ రాజ్‌కు కేటాయించిన ఇద్దరు గన్ మెన్లను వీఆర్‌కు అటాచ్ చేశారు. ఈమేరకు వరంగల్ సీపీ ఆదేశాలు జారీచేశారు. చాలా రోజులుగా నవీన్ రాజ్ మీద.. ఆరోపణలు వస్తున్నపపటికీ స్పందించని ప్రభుత్వం.. తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వివాదం నడుస్తున్న సమయంలోనే ఇలాంటి చర్యలు చేపట్టటం చర్చనీయాంశంగా మారింది.అయితే.. అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలను అటు బీఆర్ఎస్ నేతలు, ఇటు తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రముఖులు తీవ్రంగా ఖండించగా.. ఒకరిద్దరు తప్ప కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించకపోవటం గమనార్హం. అయితే.. మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించగా.. వాళ్లు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. ఆమె తన వ్యాఖ్యలను ఉపసంరించుకున్నానని చెప్పినా ఇంతగా దాడి చేయటమేంటని పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడితే.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటు మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.ఇక మహిళా కమిషన్ అయితే.. కొండా సురేఖ క్షమాపణ చెప్పకపోయి ఉంటే కల్పించుకునేవాళ్లంటూ సింపుల్‌గా ఆ విషయాన్ని తేల్చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారని.. ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ కూడా అడిగారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి.
????సయ్యద్ మెహతాజ్ బేగంను సత్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ ఎం డి ఫరూక్..
శుక్రవారం నాడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం నందు ఎన్ ఎం డి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.మంత్రివర్యులు ఎన్ ఎం డి ఫరూక్, మెహతాజ్ బేగంని గుర్తించి ముస్లిం మహిళలు బయటికి రావడమే గొప్ప అలాంటిది ముస్లిం మహిళలను రాజకీయాల్లో చురుకుగా పనిచేయడం చాలా అరుదుగా చూస్తుంటాం అని పేర్కొని పార్టీ కోసం కష్టపడుతున్నావు ఇలాగే కొనసాగు తల్లి నీకు మంచి పేరు వస్తుందని అభినందించారు ఆ అనంతరం శాలువాతో సత్కరించారు..కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆహ్వాన కమిటీ సభ్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు హసన్ భాషా, తెలుగుదేశం పార్టీ రైల్వేకోడూరు సీనియర్ నాయకులు షేక్ మస్తాన్ సాహెబ్, ముస్లిం యువజన సంక్షేమ సంఘం అధ్యక్షులు అహ్మద్ భాషా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…
????నవంబర్ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అమీన్ పీర్ దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివ శంకర్ గారితో, పోలిట్ బ్యూరో సభ్యులు & జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డితో, ముస్లిం మత పెద్దలతో మరియు దర్గా కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి *.
*ఈ సందర్భంగా మాట్లాడుతూ జరుపుతామని అలాగే ఉత్సవాల్లో విద్యుత్, ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తామని అలాగే భద్రతను కట్టుదిట్టం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది.*
???? తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు హడావుడి ఉండకూడదు: చంద్రబాబు..
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న చంద్రబాబు..
కొండపై గోవింద నామస్మరణం తప్ప మరేమీ వినిపించకూడదని వ్యాఖ్య..తిరుమల పవిత్రత, నమ్మకాన్ని కాపాడేలా పని చేయాలని సూచన..తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీవారి దర్శనానికి వీఐపీలు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని చెప్పారు. ప్రసాదాల్లో నాణ్యత నిరంతరం కొనసాగాలని అన్నారు. తిరుమలలో ప్రశాంతతకు భంగం కలగకూడదని..కొండపై గోవింద నామస్మరణం తప్ప మరేమీ వినిపించకూడదని చెప్పారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంతృప్తిగా తిరిగి వెళ్లాలని అన్నారు.
తిరుమల పవిత్రతను, నమ్మకాన్ని కాపాడేలా టీటీడీ అధికారులు, సిబ్బంది పని చేయాలని చెప్పారు. ఏ విషయంలో కూడా రాజీ పడొద్దని అన్నారు. భవిష్యత్ నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళికలు అవసరమని చెప్పారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతానికి పైగా పెంచాలని అన్నారు. అడవుల విస్తరణకు, సంరక్షణకు ప్రణాళికతో పని చేయాలని చెప్పారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
???? మహిళపై 72 మంది అత్యాచారం చేసిన కేసులో వీడియో ఆధారాలు చూసేందుకు ప్రజలకు అనుమతి..
మహిళపై 72 మంది అత్యాచారం చేసిన కేసులో వీడియో ఆధారాలు చూసేందుకు ప్రజలకు అనుమతి
ఫ్రాన్సులో ఓ వ్యక్తి తన భార్యకు డ్రగ్స్ ఇచ్చి దశాబ్దంపాటు 72 మందితో ఆమెపై లైంగిక దాడి చేయించాడు. వాటిని చిత్రీకరించాడు. ఈ కేసు విచారణలో అక్కడి న్యాయమూర్తి సంచలన నిర్ణయం వెలువరించారు. వీడియో ఆధారాలు ప్రదర్శిస్తున్నప్పుడు కోర్టులో ఉన్న సాధారణ పౌరులు కూడా చూడొచ్చని వెల్లడించారు. అయితే ఆ సమయంలో సున్నిత మనస్కులు, మైనర్లు కోర్టు పరిసరాల్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే కచ్చితంగా అవసరమైతేనే వాటిని ప్రదర్శించనున్నారు.
????ఈ నెంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దు.. ఈ నెంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దు
ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్ల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. +92తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దంటున్నారు. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఫోటోలను డీపీగా పెట్టుకుని చీట్ చేస్తారని, నమ్మితే మోసపోతారని హెచ్చరిస్తున్నారు. ఆగ్రాకు చెందిన ఓ మహిళను ఇలాగే మోసగించడంతో ఆమె గుండెపోటుతో మరణించింది.
???? 36కు చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య..
36కు చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య
నారాయణ్‌పూర్‌-దంతెవాడ జిల్లా సరిహద్దులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. తొలుత ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించగా.. అనధికారిక సమాచారం మేరకు.. క్రమేణా మృతుల సంఖ్య 14, 24, 30, 36.. ఇలా పెరుగుతూ వచ్చింది. ఎంతమంది చనిపోయారనే విషయాన్ని పోలీసులు ధ్రువీకరించకపోయినా.. మావోయిస్టు పార్టీ కాయ్‌-6కు చెందిన శ్రేణులే మృతి చెందినట్లు భావిస్తున్నారు.
???? అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!
నాగార్జున కుటుంబానికి మద్ధతు తెలిపిన ప్రియాంక గాంధీ. బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తమ కుటుంబ గౌరవాన్ని మంటగలిపారని ప్రియాంక గాంధీతో అక్కినేది అమల ఆవేదన వ్యక్తి చేసినట్టు తెలుస్తోంది.
జరిగిన సంఘటనకు తాము చింతిస్తున్నామని, కొండా సురేఖపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని అమలను ప్రియాంకా గాంధీ బుజ్జగించినట్లు సమాచారం.
????జోగులాంబ గద్వాల..డ్రగ్స్ మత్తులో యువతి యువకుల హల్ చల్….పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు…
గద్వాల పట్టణం హమాలి కాలనీలో ఘటన…ఇద్దరు యువకులు,మరో యువతిని అదుపులోకి తీసుకున్న గద్వాల పట్టణ పోలీసులు…పారిపోయిన మరో యువతి…అదుపులో ఉన్న యువకులు జిల్లా నాయకులకు బంధువులు…యువతి మహబూబ్ నగర్ కు చెందిన మహిళ గా భావిస్తున్న పోలీసులు…పట్టుబడిన యువతి యువకుల మొబైల్ పోన్లలో డ్రగ్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు…
????కడప జీల్లా**జమ్మలమడుగుకు..
జమ్మలమడుగు వైసీపీ లో మరో మారు బయట పడ్డ విబేధాలు..ఎన్నికల తరువాత అంటి అంటనట్టు ఉన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి..
పార్టీ కార్యక్రమాలకు, నియోజవర్గ ప్రజలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..
జమ్మలమడుగు లో వైవీపీ నూతన కార్యాలయనన్ని ఓపెన్ చేసిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి..
భారీ ఎత్తున హాజరైన జమ్మలమడుగు వైసీపీ కార్యకర్తలు..
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కామెంట్స్..
ఏ పార్టీలో ఉన్న మా కుటుంబాన్ని జమ్మలమడుగు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు..కార్యకర్తలకు మా కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదు..రాజకీయాలు నాకు కొత్త కాదు..రాజకీయాల్లో ఇబ్బందులు జరిగినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలో నాకు బాగా తెలుసు..జమ్మలమడుగులో వైవీపీ ని మళ్లీ పటిష్టం చేస్తాం..జగన్మోహన్ రెడ్డిని బలపరిచేందుకు నేను, మా కుటుంబ సభ్యులు అహర్నిశలు కష్టపడి పని చేస్తాం..
????పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..*విజయవాడ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఏపీ టూరిజం, 20 సూత్రాల కమిటీ మరియు APIIC, చైర్మన్లు గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నూకసాని బాలాజీ, శివరామరాజు మరియు లంకా దినకర్ బాబులకు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శుభాకాంక్షలు తెలియచేశారు.కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్,అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, వై. పాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఏరిక్సన్ బాబు,టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గోన్నారు.
????ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు కార్పొరేషన్ ఛైర్మన్ గా అధికారంగా బాధ్యతలు స్వీకరించిన దామచర్ల సత్య కు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ,రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
???? బుర్కినా ఫాస్కో: ఘోరం.. 600 మందిని నిలువునా కాల్చేశారు….*
పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో (Burkina Faso)లో అత్యంత పాశవిక ఘటన జరిగింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు కిరాతకానికి పాల్పడ్డారు.
గంటల వ్యవధిలోనే 600 మందికిపైగా పొట్టనపెట్టుకున్నారు. ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ మీడియా కథనం తెలిపింది. ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై బైక్‌లపై దూసుకొచ్చిన ఉగ్రవాదులు కన్పించినవారిని కాల్చేశారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ రెబల్స్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (JNIM), మాలిలో ఉన్న అల్-ఖైదా అనుబంధ సంస్థ, బుర్కినా ఫాసోలో ఉగ్రవాద సంస్థలు ఆ దేశంలో క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. ఉగ్రవాదులను గమనించి బాధితులంతా బర్సాలోగో శివార్లలోకి పారిపోతుండగా దొరికిన వారిని దొరికినట్లు ఊచకోత కోశారు. ఈ ఘటనలో.. ఐక్యరాజ్యసమితి దాదాపు 200 మంది మరణించినట్లు అంచనా వేయగా, ఉగ్రవాద సంస్థ JNIM దాదాపు 300 మందిని చంపినట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 600 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది.
????ఎటు చూసిన రక్తపాతమే..
ఉగ్రవాదుల దాడుల శబ్ధాలు విన్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవడానికి బర్సాలోగో పట్టణానికి 4 కి.మీ. దూరంలో ఉన్న ఒక లోయలో దాక్కున్నాడు. ఘటనతాలూకు వివరాలను ఆయన మీడియాతో వెల్లడించాడు. “నేను తప్పించుకోవడానికి లోయలోకి వెళ్లాను. కానీ దాడి చేసినవారు నన్నే అనుసరించినట్లు అనిపించింది. ఉగ్రవాదులు అక్కడి నుంచి వెళ్లిపోయాక రక్తపు మడుగులో పడి ఉన్న ఓ వ్యక్తిని చూశా. అలా మధ్యాహ్నం వరకు ఆ లోయలోనే ఉండిపోయా. జేఎన్ఐఎం ఊచకోతను రోజంతా కొనసాగించింది. బయటకి వచ్చి చూశాక మృతదేహాలన్ని చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. భయం నా గుండెల్లో పరుగులు తీసింది. అంత మంది శవాలను ఖననం చేయడం అధికారులకు కష్టంగా మారింది”అని బాధితుడు చెప్పాడు. తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సైన్యానికి మద్దతు ఇవ్వకూడదని JNIM పౌరులను హెచ్చరించడం గమనార్హం.
????RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అవిరల్ జైన్*
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అవిరల్ జైన్ నియమితులయ్యారు. పదోన్నతి పొందక ముందు, జైన్ మహారాష్ట్రకు ప్రాంతీయ డైరెక్టర్ గా పనిచేశారు. అవిరల్ జైన్ కు కరెన్సీ నిర్వహణ, విదేశీమారకద్రవ్య నియంత్రణ, పర్యవేక్షణ, మానవ వనరుల
నిర్వహణ విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.
????ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కొనకళ్ల
హాజరైన మంత్రులు అనగాని, కొల్లు రవీంద్ర
ఆర్టీసీ విలీన సమస్యలు పరిష్కరిస్తాం
కొత్తగా ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకొస్తాం
ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తాం-కొనకళ్ల నారాయణ..
????చీరాల…కారంచేడు మండలం స్వర్ణ గ్రామ సమీపంలో శనివారం టాటా ఏస్ వాహనంలో అక్రమంగా తరలిపోతున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బియ్యం లోడ్ తో సహా వాహనాన్ని కారంచేడు పోలీస్ స్టేషన్ కి తరలించారు.*
????రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటో పట్టివేత..*
గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు అడ్డ రోడ్డు వద్ద శనివారం తెల్లవారుజామున అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నా ఆటోను పొన్నూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని ఆటోను స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై కిరణ్ బాబు మీడియాకు తెలిపారు.
????చీరాల…కారంచేడు మండలం స్వర్ణ గ్రామ సమీపంలో శనివారం టాటా ఏస్ వాహనంలో అక్రమంగా తరలిపోతున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బియ్యం లోడ్ తో సహా వాహనాన్ని కారంచేడు పోలీస్ స్టేషన్ కి తరలించారు.*
????రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటో పట్టివేత..
గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు అడ్డ రోడ్డు వద్ద శనివారం తెల్లవారుజామున అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నా ఆటోను పొన్నూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని ఆటోను స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై కిరణ్ బాబు మీడియాకు తెలిపారు.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా