డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..

????డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం.. ఇపుడు ఇద్దరి మధ్యన డైలాగ్ వార్ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకాయన నాలుగు నెలల క్రిత్రం డిప్యూటీ సీఎం అయ్యారు. మరోకాయన నాలుగు రోజులు అయింది ఆ పదవిని తీసుకుని. ఇపుడు ఇద్దరి మధ్యన డైలాగ్ వార్ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ డిప్యూటీలు ఎవరూ ఏంటే అందరికీ తెలిసిన వారే. ఒకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరొకరు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి మారన్. ఆయన సనాతన ధర్మం మీద గతంలో మంత్రిగా ఉన్నపుడు కామెంట్స్ చేశారు అని ఉంది. ఆయన సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అది దేశవ్యాప్తంగా ఇష్యూ అయింది. అయితే దానిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుకుని తిరుపతి వారాహి సభలో గట్టిగానే మాట్లాడేసారు.
సనాతన ధర్మం గురించి కొందరు వైరస్ లాంటిది అని అన్నారని, దానిని నిర్మూలించాలని అన్నారని అయితే ఆ ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని చేయాలనుకుంటే వారే తుడిచి పెట్టుకుని పోతారు అని కూడా హాట్ కామెంట్స్ చేశారు. దాని మీద ఇపుడు డీఎంకే నుంచి కౌటర్లు రావడం మొదలైంది. డీఎంకే డీఎంకే అధికార ప్రతినిధి సయ్యద్ హఫీజుల్లా పవన్ కామెంట్స్ మీద స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు.డీఎంకే ఎప్పుడూ ఏ మతాన్ని టార్గెట్ చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. డీఎంకే కుల వివక్షతోపాటు, అంటరానితనం మీద అలాగే, కులపరమైన వేధింపులపైన ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ఇది ఎప్పటికీ కొనసాగే పోరాటం అన్నారు.
అంటే ఆయన చెప్పినది చూస్తే సనాతన ధర్మంలో ఇవన్నీ ఉన్నాయని అందుకే తమ పోరాటం అని చెప్పకనే చెప్పినట్లు అయిందన్న మాట. అయితే ఆయన మరో మాట కూడా ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా హిందూ మతానికి ఎప్పుడూ వ్యతిరేక ప్రకటనలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఉదయనిధి స్టాలిన్ ని మీడియా చుట్టుముట్టి పవన్ చేసిన వ్యాఖ్యమల మీ రియాక్షన్ ఏమిటి అన్నది అడిగినపుడు ఆయన వెయిట్ అండ్ సీ అని చాలా స్మూత్ గా చెప్పారు. అంటే వేచి చూడమని అన్న మాట. వేచి చూడడం అంటే దేని గురించి ఎందుకు అన్నది అయితే ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇక పోతే డీఎంకే ఇండియా కూటమిలో అతి పెద్ద పార్టీగా కీలకంగా ఉంది. డీఎంకే లేకుండా ఇండియా కూటమి ముందుకు వెళ్లలేదు. ఈసారి కేంద్రంలో అధికారంలోకి ఇండియా కూటమి వస్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో 2029 నాటికి టార్గెట్ గా పెట్టుకున్నారు. అంటే మా రోజులు వస్తాయని చెప్పడమే ఉదయ నిధి స్టాలిన్ వెయిట్ అండ్ సీ కామెంట్స్ వెనక అర్ధమా అని చర్చించుకుంటున్నారు. పవన్ జనసేన అయితే అవుట్ రేట్ గా బీజేపీకి మద్దతుగా ఉంది. ఎన్డీయే ప్రభ కేంద్రంలో ప్రస్తుతం సాగుతోంది. దాంతో డీఎంకే వేచి చూడాలని అనుకుంటోందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా పొరుగున ఉన్న తమిళనాడులో ఎవరి అధికారంలో ఉన్నా ఎక్కడా వివాదాలు లేవు. ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటూ వస్తున్నారు. పైగా స్నేహ భావంతో ఉంటున్నారు. అయితే పవన్ ఇపుడు ఇండైరెక్ట్ గా అయినా చేసిన ఈ కామెంట్స్ వల్ల రెండు రాష్ట్రాల మధ్య స్మూత్ రిలేషన్స్ లో ఏమైనా తేడా వస్తుందా అన్నది చూడాలని అంటున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఆయన ఎవరితో వివాదాలకు పోరు. ఆయన సీనియర్ మోస్ట్ నేతగా దేశంలో ఉన్నారు ఆయనకు అందరూ దగ్గరి వారే అన్నట్లుగా ఉంటారు. అయితే ఇపుడు మాత్రం డిప్యూటీల మధ్య కామెంట్స్ తో ఏమి జరుగుతుంది అన్నదే చర్చగా ఉంది మరి.
????సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు*
హైదరాబాద్:అక్టోబర్ 04
మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌తో పాటు మరో ముగ్గురు శాసనసభ్యులు ఇవాళ ముంబైలోని సచివాలయం లోని మూడో అంతస్తు నుంచి దూకారు.
అక్కడ కట్టిన వలపై వారం తా పడ్డారు. షెడ్యూల్డ్ తెగల కేటగిరీలో ఒక వర్గాన్ని చేర్చడాన్ని నిరసిస్తూ వారంతా నిరసన తెలుపుతూ ఈ ఘటనకు పాల్పడ్డారు.
సచివాలయ భవనం పై నుంచి దూకి ఎవరూ ఆత్మహత్య చేసుకోకుండా ఉండడానికి ఆ వలను 2018లో ఏర్పాటు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతనే నరహరి జిర్వాల్.
ఆయనతో పాటు ముగ్గురు శాసనసభ్యులు కలిసి ధన్‌గర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీలో చేర్చాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.
వారిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం కూడా కొందరు గిరిజన ఎమ్మెల్యేలు సచివాలయ కాంప్లెక్స్ వద్ద ఆందోళనకు దిగారు.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమం త్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ హాజరైన క్యాబినెట్ సమావేశం జరుగుతుండగా వారు నిరసన తెలపడం గమనార్హం…
????నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం..
నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి(38) గుండెపోటుతో మరణించారు..నిన్న కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో HYDలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు..
అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు..
రాజేంద్ర ప్రసాద్ కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు_
????జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన, దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తాం*
జర్నలిస్టులను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అది ఏ పార్టీకి చెందిన వారైనా సరేనని తీవ్రంగా హెచ్చరించిన సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్..
ఇటీవల జర్నలిస్టులపై కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన జర్నలిస్టుల సంఘాల నేతలు సానుకూలంగా స్పందించడం తో హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు
????ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు*
*నలుగురు ఆత్మహత్యాయత్నం*
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పుణ్యమా అని ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు.. కొన్ని కుటుంబాలు నాశనం అయ్యాయి.. అయినా.. ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు నడుస్తూనే ఉన్నాయి.. ఎంతోమంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు.. పోలీసులు హెచ్చరిస్తున్నా.. సన్నిహితులు వారిస్తున్నా.. కొందరు దాని బారిన పడి పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు.. ఇక, ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజా రెడ్డి కుటుంబం శుక్రవారం ఇంటిలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుమారుడు దినేష్ (22), భార్య జయంతి (45), కుమార్తె సునీత (26) నలుగురు కలిసి ఇంటిలో పురుగుల మందు సేవించాడు నాగరాజు రెడ్డి అనే వ్యక్తి.. కొద్దిసేపటి తర్వాత అరుపులు విన్న గ్రామస్తులు 108కు సమాచారం ఇవ్వడంతో వీరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ పరిస్థితి విషమించడంతో తమిళనాడు వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనకు ప్రధాన కారణం నాగరాజు రెడ్డి కుమారుడు దినేష్.. ఆన్‌లైన్‌ యాప్‌లలో బెట్టింగ్‌కు అలవాటుపడిన దినేష్‌.. లక్షల్లో పోగొట్టుకున్నాడు.. ఎవరు ఇస్తే.. వారి దగ్గర అన్నట్టుగా అప్పులు చేశాడు.. బెట్టింగ్‌ ద్వారా సుమారు 30 లక్షలు పోగొట్టుకున్నడు.. దీనితో నాగరాజు రెడ్డి కుటుంబం అప్పులపాలు అయ్యింది.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన నాగరాజు రెడ్డి.. మొత్తం కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.. అందులో ఇంటిలోని నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది పోలీసులకు తెలిపారు స్థానికులు.
????ఏపీలో ఆ ఉద్యోగుల బదిలీల నిలుపుదల..*
ఏపీలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ-2025లో పాల్గొనే ఉద్యోగుల బదిలీలను నిలుపుదల చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సూపర్ వైజర్లు, బూత్ స్థాయి అధికారుల ట్రాన్స్ఫర్లపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ నెల 29 నుంచి 2025 జనవరి 6 వరకు తమ అనుమతి లేకుండా బదిలీ చేయొద్దని ఆదేశించింది. అక్టోబర్ 10లోపు ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది.
????హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్.. 90 స్థానాలకు పోటీలో 1,031 మంది అభ్యర్థులు.. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు.. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్.
???? మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత హత్య కలకలం సృష్టిస్తోంది. అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత సచిన్‌ కుర్మీన్‌ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయధంతో సచిన్‌ కుర్మిన్‌ను హత్య చేశారు. ముంబయిలోని బైకుల్లా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
????రూ.150 కోసం ఫ్రెండ్స్ మధ్య ఘర్షణ – వ్యక్తి మృతి..
AP: కృష్ణాజిల్లా, కంకిపాడు మండలం, ప్రొద్దుటూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రూ. 150 నగదు విషయంలో స్నేహితులు భుజంగరావు, వెంకటస్వామి మధ్య గొడవ ఏర్పడింది. వెంకటస్వామి ఆగ్రహంతో భుజంగరావు గుండెపై గట్టిగా కొట్టారు. అతను గతేడాదే హార్ట్ సర్జరీ చేయించుకోవడంతో కొట్టిన దెబ్బలకు స్పృహ కోల్పోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
????యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త.
ఆధార్ కార్డు అప్డేట్ చేయాలంటూ యూనియన్ బ్యాంక్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్లపై బ్యాంకు అధికారులు స్పందించారు. ఇలాంటి మెసేజ్లు ఎవరూ నమ్మొద్దని సూచించారు. ‘ఆధార్ అప్డేట్ చేసుకోండి.. లేదంటే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది’ అంటూ చాలా మందికి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయన్నారు. ఆ మెసేజ్లోని లింకులు ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాకర్ల చేతికి వెళ్లి అకౌంట్లో డబ్బులు మాయమవుతాయని హెచ్చరించారు.
????హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..అక్కినేని నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌ చేశారు.తమ్మిడికుంట చెరువు కబ్జాచేసి Nకన్వెన్షన్‌ నిర్మించారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి. నాగార్జునపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని భాస్కరరెడ్డి పోలీసులను కోరారు.
లీగల్‌ ఒపీనియన్‌కు పంపించారు మాదాపూర్‌ పోలీసులు. నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌‌ను ఇటీవలే కూల్చివేసిన విషయం తెలిసిందే.చెరువును కబ్జా చేసి N కన్వెన్షన్‌‌ నిర్మించారని హైడ్రా దాన్ని కూల్చివేసింది.
దీని పై నాగార్జున స్పందిస్తూ.. ఆ భూమి పట్టా భూమి అని.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు.. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిదని.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసినట్లు నాగార్జున తెలిపారు. తాజాగా ఇప్పుడు మరోసారి నాగ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కసిరెడ్డి భాస్కరరెడ్డి. మరి దీని పై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడలి. మరోవైపు మంత్రి కొండా సురేఖ సమంత, అక్కినేని ఫ్యామిలీ పై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దాంతో కొండా సురేఖ పై నాగ్ లీగల్ యాక్షన్ కు సిద్ధమయ్యారు.
????నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..
*పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల్లో ముందు వరుసలో ఉండే వ్యక్తి పార్టీ పదవుల్లో 2007 నుండి 2009 మధ్య కాలం లో తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు గాను మరియు 2009 నుండి 2014 వరకు నరసరావుపేట పట్టణ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు గాను పని చేసిన అనుభవం తో ప్రస్తుతం పల్నాడు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి బాధ్యతలు నిర్వహిస్తున్న చల్లా సుబ్బారావు అధిష్టానం గుర్తించింది. నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో గత వైసీపీ ప్రభుత్వ వేధింపులలో ఆర్థికంగా,సామాజికంగా నష్టపోవడమే కాకుండా చివరికి కట్టుకున్న భార్య మరియు పిల్లలతో కూడా జీవితం గడపనివ్వకుండా గత వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీ లెవెల్ లో ప్రత్యేక ఆదేశాలు తీస్కొని వచ్చి పీడీ యాక్ట్ తో రాజముండ్రి సెంట్రల్ జైల్ లో ఉంచి వేధింపులకు గురిచేసింది. అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో అత్యధిక కేసులతో వైసీపీ ప్రభుత్వం చే వేధింపబడిన నేతగా చల్లా సుబ్బారావు ని అధిష్టానం గుర్తించి ఇటీవల కబురు పంపడం తో తన పీడీ యాక్ట్ బుక్ తో అధిష్టానం వద్ద జరిగిన ముఖాముఖి లో పీడీ యాక్ట్ బుక్ చూసిన అనంతరం విస్మయం వ్యక్తం చేయడం పదవీ కి అర్హుడు గా సుబ్బారావు ని గుర్తించింది .పార్టీని నమ్ముకుని తన ఆస్తులు నష్టపోవడమే కాక గత వైసీపీ ప్రభుత్వంచే బాదింపబడి 27 కేసులతో గత ప్రభుత్వం పీడీ యాక్ట్ సెక్షన్ 237 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలుకే పరిమితం చేసిన సుబ్బారావు కష్టం గుర్తించి అధిష్టానం నరసరావుపేట మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవీకి హామీ ఇవ్వడం జరిగిందా ? ఆ దిశగానే ఆదేశాలు జారీ కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు నిజమైన కార్యకర్తలని గుర్తించడంలో అధిష్టానం లోతైన విశ్లేషణతో ముందుకు వెళ్తుంది అని సుబ్బారావు విషయమే ఉదాహరణ అని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా