కాంగ్రెస్ అధిష్టానానికి పంపడానికి రూ.650 కోట్లు సమకూర్చిన కాంగ్రెస్ నాయకుడు..! పవన్ పై సిపిఐ నేత రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు..ప్రపంచం అంతం కాబోతుందా? న్యూక్లియర్ రియాక్టర్ దాడికి సిద్ధం అవుతున్న పుతిన్..?.వక్ఫ్‌ సవరణ బిల్లుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం..హైడ్రా కమిషనర్‌పై కేసు నమోదు..10 ఏళ్ల చిన్నారిపై వీఆర్ఏ అఘాయిత్యం..వెంకటరెడ్డి వెనుక వేల కోట్లు కొల్లగొట్టిన ఘనుడు ఎవరో అందరికీ తెలుసు: షర్మిల..”వైసీపీ నేత శిల్పా కు ‘హైడ్రా’ నోటీసులు..

????ముఖ్యమంత్రి చంద్రబాబుతో లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఎ.యూసుఫ్ అలీ భేటీ.
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి…
వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడులపై చర్చ.
????హైడ్రా కమిషనర్‌పై కేసు నమోదు…
కమిషనర్‌ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదు..హైడ్రా అధికారులు ఇల్లు కూల్చేస్తామని భయభ్రాంతులకు గురి చెయ్యడంతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ అనే వృద్ధురాలు..
దీంతో కేసు సంఖ్య 16063/IN/2024 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్న మానవ హక్కుల కమిషన్.
????రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి ఘన స్వాగతం..
*రేణిగుంట: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై. చంద్రచూడ్ గారు తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సిజెఐకి ఘన స్వాగతం లభించింది.
జస్టిస్ పి.కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఆఫ్ చిత్తూరు జిల్లా, జస్టిస్ వై. లక్ష్మణరావు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు, జస్టిస్ రాఘవ స్వామి రిజిస్ట్రార్ ప్రోటోకాల్ హైకోర్టు ఆఫ్ ఏపీ, జస్టిస్ రామకృష్ణ రిజిస్ట్రార్ మేనేజ్మెంట్ హై కోర్టు ఆఫ్ ఏపీ, చిత్తూరు జిల్లా ఉమ్మడి డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి ఈ. భీమారావు, చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్ గురునాథ్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, పి కోటేశ్వరరావు ప్రోటోకాల్ మెజిస్ట్రేట్, ధనుంజయ నాయుడు ప్రోటోకాల్ సూపరింటెండెంట్ తదితరులు గౌ. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఆదివారం ఉదయం భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
????సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు…
దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, సెలబ్రిటీలు శ్రీవారి లడ్డూ వివాదంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. లడ్డూ తయారీలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి జంతువుల కొవ్వులు కలిపినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదంలో దోషులు ఎంత పెద్దవారు ఉన్నా వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీవారికి మత రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ సహా అన్ని పార్టీల నాయకులు, మీడియా మొత్తం తిరుమల లడ్డూ సమస్య చుట్టూనే తిరుగుతున్నారని రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆ వివాదానికి స్వస్తి పలకాలని కోరారు. మాజీ సీఎం జగన్‌…వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తే తిరుమల అపవిత్రమవుతుందంటూ కొందరు అధికార పార్టీ ప్రతినిధులు వ్యాఖ్యానించడం సరికాదని రామకృష్ణ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లూ సీఎంగా ఉన్న జగన్‌ స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదన్నారు. అలాంటిది ఇప్పుడు సాధారణ భక్తుడిలా తిరుమలకు వెళ్తానంటున్న జగన్‌ ను డిక్లరేషన్‌ అడగడం సరైన విధానం కాదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.???? డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భార్య క్రిస్టియన్‌ కాదా? మరి ఆయన తిరుమలకు ఎలా వెళ్తున్నారు? అని రామకృష్ణ నిలదీశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి దీక్షలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.పవన్‌ డిప్యూటీ సీఎం అయ్యింది లడ్డూపై దీక్షలు చేయడానికా అని మండిపడ్డారు.అవసరమైతే లడ్డూ వ్యవహారంపై సీఎం, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడతారని పవన్‌ కల్యాణ్‌ కు ఏం సంబంధమని రామకృష్ణ నిలదీశారు. లడ్డూ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సిట్‌ విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు. దేవుడిని అడ్డుపెట్టుకుని మరొకరిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మతం, కులాల పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యలను వీడాలని సూచించారు.
????బండి సంజయ్ లా మారుతున్న పవన్ కళ్యాణ్..ఊగిపోవడమేనా?
రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ అంశం పైన చర్చించుకుంటున్నారు. పొద్దున లేస్తే చాలు.. తిరుమల లడ్డు గురించే వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు తిరుమలలో శ్రీవారి లడ్డు కల్తీ అయిందని స్వయంగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఈ వివాదం రాజుకుంది.
ఈ తరుణంలోనే వైసీపీ పార్టీ పైన తెలుగుదేశం తమ్ముళ్లు, కూటమిలో ఉన్న జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలు రెచ్చిపోయి మాట్లాడుతున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతానికి చెందిన వాడని… అందుకే లడ్డును కల్పి చేసి ఉంటాడని కూటమి పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే ఈ లడ్డు వివాదం లో.. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు.
అచ్చం తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమార్… వ్యవహరించినట్లుగానే.. హిందుత్వం గురించి పవన్ కళ్యాణ్ ఏపీలో వాదిస్తున్నారు. లడ్డు విషయంలో 11 రోజుల దీక్ష కూడా చేపట్టారు పవన్. దుర్గగుడి మెట్లు కూడా కడిగి ఫోటోలకు ఫోజులిచ్చారు. హిందూ ధర్మం గురించి ఎవరైనా.. చెడ్డగా మాట్లాడితే చీల్చి చెండాడుతానంటూ… ఓ బిజెపి కార్యకర్త లాగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్. *టాలీవుడ్ హీరో కార్తీ అలాగే నటుడు ప్రకాష్ రాజ్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్.గతంలో తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కూడా ఇలాగే వ్యవహరించేవారు. అభివృద్ధి, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా… కేవలం హిందుత్వ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు బండి సంజయ్. ఏపీ లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా అదే ధోరణి తో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల కంటే ముందు ప్రకటించిన హామీల విషయంలో.. దృష్టి పెట్టకుండా… హిందుత్వ వాదాన్ని పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
*హైదరాబాద్‌*..*వక్ఫ్‌ సవరణ బిల్లుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం*..*వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌ జేపీసీ ఛైర్మన్‌ జగదాంబికా పాల్‌కు వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వ్రాతపూర్వకంగా అందజేసిన జేపీసీ మెంబర్‌ వి.విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌*
*వక్ఫ్‌ బిల్లుపై టీడీపీ డబుల్‌ గేమ్‌ ఆడుతోంది – హఫీజ్‌ ఖాన్‌*..*ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హఫీజ్‌ ఖాన్‌ ఏమన్నారంటే…
శనివారం హైదరాబాద్‌లో వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు జేపీసీ సమావేశం జరిగింది,ఈసమావేశంలో ఈ వక్ఫ్‌ సవరణ బిల్లును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందో లిఖితపూర్వకంగా ఇచ్చాం,ఈ సవరణ బిల్లుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా వ్యతిరేకం, దీని వల్ల ముస్లిం సమాజానికి జరిగే నష్టాన్ని వారికి వివరించాం. వక్ఫ్‌ భూములకు సంబంధించి కలెక్టర్‌కు అథారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, వక్ఫ్‌ భూములకు సంబంధించి వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఉంది, ట్రిబ్యునల్‌ను బలహీనపరిచేలా ఈ బిల్లు ఉంది, ఈ బిల్లు వస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది, ముస్లిం సమాజం అంతా దీనిని వ్యతిరేకిస్తుంది. మా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ చాలా స్పష్టంగా ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పారు, దీనిపై లోక్‌సభలో మిథున్‌రెడ్డి , రాజ్యసభలో విజయసాయిరెడ్డి ఈ వక్ఫ్‌ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో కూడా ఉభయసభల్లో చెప్పారు. ఈ రోజు జేపీసీ మెంబర్‌ విజయసాయిరెడ్డి వ్యతిరేకిస్తూ లిఖితపూర్వకంగా ఇచ్చారు, అయితే టీడీపీ మాత్రం పార్లమెంట్‌లో ద్వంద వైఖరి అవలంభిస్తుంది, ఈ ఇష్యూని గందరగోళంలో పడేస్తుంది, టీడీపీ ఇప్పుడు కూడా రెండు కళ్ళ ధోరణి అనుసరిస్తుంది, టీడీపీ పార్లమెంట్‌లోనే వ్యతిరేకించి ఉంటే జేపీసీ వరకు వచ్చేది కాదు, కానీ అక్కడ మద్దతిచ్చి ఇక్కడ ఇలా నాటకాలు ఆడుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు వివిధ ముస్లిం సంఘాలు వక్ఫ్‌ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకించినా టీడీపీ మాత్రం డబుల్‌ గేమ్‌ ఆడుతూ ముస్లింలకు మరోసారి ద్రోహం చేస్తుంది, దీనిని ముస్లిం సమాజమంతా గమనించాలి.
????వైసీపీ నేత శిల్పా మోహ‌న్ రెడ్డికి ‘హైడ్రా’ నోటీసులు..
సంగారెడ్డి జిల్లాలోని న‌ల్ల‌వాగును క‌బ్జా చేసి వెంచ‌ర్ వేసిన‌ట్లు గుర్తింపు..
వెంచ‌ర్‌లోని అక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించే ప‌నిలో అధికారులు..
వైఎస్ఆర్ మంత్రివ‌ర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న శిల్పా మోహ‌న్ రెడ్డి..
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత శిల్పా మోహ‌న్ రెడ్డికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఆయ‌న సంగారెడ్డి జిల్లా స‌దాశివ‌పేట మండ‌లం నాగ్స‌న్‌ప‌ల్లిలోని న‌ల్ల‌వాగును ఆక్ర‌మించి వెంచ‌ర్ వేసిన‌ట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఇటీవ‌ల స‌ర్వే చేప‌ట్టిన అధికారులు వెంచ‌ర్‌లోని అక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.
క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన‌ శిల్పా మోహ‌న్ రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాజీ సీఎం వైఎస్ఆర్ మంత్రివ‌ర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయ‌న ఫ్యామిలీ వ్యాపారంతో పాటు వెంచ‌ర్లు వేసి నిర్మాణాలు చేప‌ట్టేది. శిల్పా మోహ‌న్ రెడ్డి మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే న‌ల్ల‌వాగును క‌బ్జా చేసి వెంచ‌ర్‌లో నిర్మాణాలు చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం.
???? వెంకటరెడ్డి వెనుక వేల కోట్లు కొల్లగొట్టిన ఆ ఘనుడు ఎవరో అందరికీ తెలుసు: షర్మిల..
గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ..
వెంకటరెడ్డి వంటి తీగలే కాకుండా పెద్ద డొంకలు కదలాలన్న షర్మిల..అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుతిన్నారంటూ ధ్వజంగత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గనులశాఖ (ఏపీఎండీసీ) మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీకి సంబంధించి వెంకటరెడ్డి వంటి తీగలే కాకుండా, పెద్ద డొంకలు కూడా కదలాలని పేర్కొన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా విచారణ జరపాలని స్పష్టంచేశారు. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడిన ఘనుడు వెంకటరెడ్డి అయితే, తెరవెనుక ఉండి అన్నీ తానై వేల కోట్లు కొల్లగొట్టిన ఆ ఘనాపాఠి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని షర్మిల వివరించారు.
“ఐదేళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుతిన్నారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారు… నిబంధనలను బేఖాతరు చేసి వారు అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. ఎన్జీటీ నిబంధనలను సైతం తుంగలో తొక్కారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులను సొంత ఖజానాకు తరలించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ స్కాంపై ఏసీబీతో విచారణతో పాటు, సమగ్ర దర్యాప్తు జరిపించాలి. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సహజ వనరులపై దోపిడీపై సీబీఐ విచారణ కోరండి” అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
????కాంగ్రెస్ అధిష్టానానికి పంపడానికి రూ.650 కోట్లు సమకూర్చిన కాంగ్రెస్ నాయకుడు..!!!
సంచలనంగా మారిన ఈడీ సోదాలు..
కర్ణాటక తరహాలోనే ఇక్కడి నుంచి నిధుల తరలింపు
త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు తెలంగాణ నుంచి నిధులు పంపుతున్నట్టు సమాచారం..!!
హవాలా రూపంలో హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు డబ్బులు తరలించినట్టు ఈడీ అధికారుల అనుమానం..!!
ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సమయంలో కర్ణాటక నుంచి హైదరాబాద్ లోని కొన్ని బ్యాంకులకు నిధులు వచ్చిన సంగతి తెలిసిందే..!!
అదే తరహాలో ఢిల్లీ అధిష్టానానికి ఇక్కడి కాంగ్రెస్ నాయకుడు రూ.650 కోట్లు సమకూర్చి పెట్టినట్టు సమాచారం..!!
దాంట్లో బాగానే ఈడీ సోదాలు అని తెలుస్తుంది..
????10 ఏళ్ల చిన్నారిపై వీఆర్ఏ అఘాయిత్యం.. పోక్సో కేసు నమోదు..అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరులో నిన్న పదేళ్ల చిన్నారిపై వృద్ధుడు తిరుపాలు అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. అతను ఆ గ్రామ VRAగా పనిచేస్తున్నారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు తిరుపాలుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పుట్లూరు ఎస్సై హేమాద్రి తెలిపారు.
????ప్రపంచం అంతం కాబోతుందా? న్యూక్లియర్ రియాక్టర్ దాడికి సిద్ధం అవుతున్న పుతిన్..!
రెండున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఆయుధాలు అయిపోతున్నాయ్.. చిట్టెలుకలా భావించిన ప్రత్యర్థి ఎంతకూ లొంగడం లేదు. దానికి నుంచి పాశ్చాత్య దేశాల మద్దతు ఆపడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. భారత ప్రధాని మోదీ సాగిస్తున్న శాంతి ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడం లేదు. మోదీని మించి మరే నాయకుడికి పుతిన్ ను ఆపే శక్తి లేదు. తాజాగా ఆయన ఓ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.
తమపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న దేశానికి అణుశక్తి కలిగిన మరో దేశం సహకరిస్తే దానిని తీవ్రంగా పరిగణిస్తామని పుతిన్ తేల్చి చెప్పారు. దీని వెనుక ఆయన ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది. ఈ హెచ్చరిక అమెరికాను ఉద్దేశించినదే. లేదా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలకు సంబంధించినది కూడా. కాగా.. అణ్వాస్త్రాలు లేని దేశం చేసే దాడికి మద్దతు పలికితే.. అది రెండు దేశాలు కలిపి చేస్తున్నట్లు భావిస్తామని కూడా పుతిన్ పేర్కొన్నారు. అంటే ఉక్రెయిన్ మద్దతుగా ఉన్న దేశాలను ఉద్దేశించి మాట్లాడారు.
పుతిన్ ఇప్పుడే కాదు.. ఉక్రెయిన్ పై యుద్ధం మొదలు పెట్టిన 2022 ఫిబ్రవరి 24 తర్వాత కొద్ది రోజులకే అణ్వాయుధాన్ని వాడతామని హెచ్చరించారు. అయితే ఆ పరిస్థితి రాలేదు. ఇప్పుడు చేసిన హెచ్చరికతో తామిచ్చే జవాబు అణ్వాయుధాలతోనా? అనేది చెప్పలేదు. కాగా.. ఉక్రెయిన్ కు నాటో దేశాలు పెద్ద ఎత్తున ఆయుధాలు అందిస్తున్నాయి. వాటితోనే ఇప్పటి వరకు అది పోరాడుతూ వస్తోంది.
తాజాగా జెలన్ స్కీ కూడా మరిన్ని ఆయుధాలు ఇస్తే రష్యాను ఓడిస్తానని ప్రకటన చేశారు. నాటో ఉక్రెయిన్ కు దీర్ఘ శ్రేణి ఆయుధాలు అందించింది. వాటిని ప్రయోగిస్తే.. అది రష్యా నాటో యుద్ధంగానే చూస్తామని పుతిన్ అంటున్నారు. తాము ఇచ్చే ఆయుధాలపై అమెరికా అమెరికా సహా నాటో దేశాలు ఉక్రెయిన్ కు కొన్ని పరిమితులు విధించాయి. వాటిలో దీర్ఘ శ్రేణి ఆయుధాలు కూడా ఉన్నాయి. అయితే రష్యా అణు ముసాయిదాలో ఇటీవల మార్పులు చేశారు. దీని ప్రకారం శత్రువుల విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూజ్ క్షిపణులు.. డ్రోన్లను ప్రయోగిస్తే అణ్వస్త్రాలను వాడేందుకు రష్యా నిర్ణయం తీసుకోవచ్చు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..