తిరుపతి లడ్డు అంశంపై గవర్నర్ కు వినతి పత్రం.. దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి..వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు చెందిన నిర్మాణాలు కూల్చివేత..యువ ఐపీఎస్ లీలలెన్నో.. విల్లా రాణి.. పేకాట రాజు!..దూరవిద్యను సద్వినియోగం చేసుకోవాలి..ప్రసాదాన్ని కల్తీ చేసి మనోభావాలు దెబ్బతీశారు:ఎమ్మెల్యే ముతుమల

????తిరుపతి లడ్డూ అంశంపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి వినతి పత్రం అందజేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల..
కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేపించే విధంగా చర్యలు తీసుకోవాలని గోవర్నర్ ను కోరిన షర్మిల రెడ్డి.
???? డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కిలారి రోశయ్య భేటీ..డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కిలారి రోశయ్య భేటీ
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆదివారం ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనతోపాటు వియ్యంకుడు రవిశంకర్‌ కూడా జనసేన గూటికి చేరనున్నారు.
????బీహార్‌లో: ఏపీకి చెందిన బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..*
బీహార్‌ – పాట్నాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుతున్న అనంతపురం జిల్లాకు చెందిన పల్లవిరెడ్డి అనే అమ్మాయి ఉరి వేసుకొని ఆత్మహత్య..
పల్లవిరెడ్డి మృతితో క్యాంపస్‌లో అడ్మినిస్ట్రేషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఎన్‌ఐటీ సిబ్బంది తీరుపై మండిపడుతూ విద్యార్థులు ఆందోళన.
???? ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును వెలికితీసిన అధికారులు..
విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి మునిగిన మూడో పడవను అధికారులు ఎట్టకేలకు తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి బోటును వెలికితీశారు. చైన్‌ పుల్లర్లతో ఎత్తి బ్యారేజీ ఎగువకు తరలించారు. 40 టన్నుల బరువున్న ఈ పడవ బ్యారేజీ 69వ గేటు వద్ద ఢీకొని అడ్డుగా మారింది. దీన్ని ప్రస్తుతం ఇంజినీర్లు పున్నమి ఘాట్‌ వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు నాలుగో పడవ కూడా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
????దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి..మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ. 135,
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ టికెట్ పై రూ.60 పెంపుకు పర్మిషన్..
రిలీజ్ రోజున అర్థరాత్రి 12 గంటల నుంచి 6 షోలకు గ్రీన్ సిగ్నల్..28వ తేదీ నుంచి 9 రోజుల పాటు రోజుకు 5 షోల ప్రదర్శనకు అనుమతి.
????సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌.. దేవర మూవీ విడుదల కోసం కొత్త జీవోను ఆమోదించినందుకు మరియు తెలుగు సినిమాకి నిరంతరం మద్దతు తెలుపుతున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి కూడా నా కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేసిన జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌.
???? వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు చెందిన నిర్మాణాలు కూల్చివేత..
GVMC అధికారులు మరోసారి భీమిలిలో కూల్చివేతలు చేపట్టారు.CRZ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారంటూ హైకోర్టు ఆదేశాలతో కూల్చివేతలు.
సముద్ర తీరంలో హోటల్ నిర్మాణం కోసం ప్రహరీ గోడ నిర్మించిన ఎంపీ విజయ సాయిరెడ్డి కుమార్తె.
హైకోర్టులో కేసు వేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్.
????యువ ఐపీఎస్ లీలలెన్నో.. విల్లా రాణి.. పేకాట రాజు! రాష్ట్ర భద్రతను కాపాడే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. రాజ్యాంగంలో పోలీస్ వ్యవస్థ కూడా ఓ పిల్లర్. రాష్ట్ర భద్రతను కాపాడే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. రాజ్యాంగంలో పోలీస్ వ్యవస్థ కూడా ఓ పిల్లర్. అంతటి ప్రాధాన్యం గల శాఖలో పనిచేస్తున్న పలువురు పోలీసులు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అది జిల్లా స్థాయి నుంచి హైదరాబాద్ నగరం వరకూ పనిచేస్తున్న పోలీసులపై ఆ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులోనూ యువ ఐపీఎస్‌లే ఈ దారుణానికి ఒడిగట్టడం మరింత చర్చకు దారితీసింది. ఇంకొదరైతే ప్రొబేషనరీ సమయంలోనే వసూళ్లకు తెరతీస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారు డ్యూటీలోకి వచ్చీరాగానే ఈ దారుణానికి ఒడిగడుతున్నారు.ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని విచారణ కూడా చేశారు. మరో ఇద్దరు కీలక ఆఫీసర్లు అమెరికాలో ఉండిపోయారు. అయితే.. ఈ కేసు ఇలా కొనసాగుతుండగానే.. మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శతాబ్దాల చరిత్రం పోలీసు అయితే ఏం చేసినా చెల్లుతుందని కొందరి అభిప్రాయం. అందుకు పొలిటికల్ పరంగానూ సహకారం లభిస్తే అది మరింత ప్లస్ అవుతుంది. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల వేళ కొంత మంది పోలీసులు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే అపవాదు ఉంది…????ముఖ్యంగా హైదరాబాద్‌కు కీలక విభాగానికి బదిలీపై వచ్చిన ఓ ఐపీఎస్ అధికారి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.ఆమె ఎక్కడ డ్యూటీ చేసినా అక్కడ విల్లాల ధరలు కనుక్కొని ఆరా తీస్తుండడం చేస్తుంటారు. హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ ఆమెపై పలు ఆరోపణలు రావడంతో మరో చోటుకు బదిలీ చేశారు. అయితే.. అక్కడ కూడా ఆమె తీరులో మార్పు రాకపోవడంతో చర్చకు దారితీసింది. అలాగే.. మల్టీజోన్ 2 పరిధిలో ఓ జిల్లా ఎస్పీగా నియమితులైన యువ ఐపీఎస్ సైతం ఇదే తరహా అవినీతికి తెరతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నింటినీ ఖర్చు చేసినట్లుగా చూపి అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ విషయం కాస్త ప్రభుత్వం దృష్టికి కిందిస్థాయి సిబ్బంది తీసుకెళ్లడంతో చివరకు అక్కడి నుంచి బదిలీ చేశారు. వీరితోపాటే ఇంకా చాలా మందిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కొత్తగా బాధ్యతలు తీసుకున్న ప్రభుత్వం వేటు వేసింది. చాలా వరకు ప్రాధాన్యం లేని పోస్టులకు వారిని బదిలీ చేసింది. యువ ఐపీఎస్‌లుగా ఉండి అవినీతికి పాల్పడడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. హైదరాబాద్ శివారులోని డీసీపీగా నియామకం అయిన ఓ మహిళా డీసీపీ..అక్కడ కొంతకాలమే పనిచేశారు. కానీ.. ఆమె పనిచేసిన కాలంలో భూవివాదాల్లో తలదూర్చి వసూళ్లకు పాల్పడ్డారనే అపవాదు ఆమెపై ఉంది. ఓ నాలుగెకరాల భూమిని మరొకరికి కట్టబెట్టే ప్రయత్నంలో ఆమె అభాసుపాలయ్యారు. అలాగే.. రాష్ట్రంలో జూదం ఆటపై నిషేధం కొనసాగుతుంటే ఎస్పీ అయి ఉండి దానికి మద్దతు తెలిపారు. అంతేకాదు.. జూదరులను ఒక దగ్గరకు చేర్చి ప్రతీ ఆటకు రేటు కట్టి వసూళ్లకు పాల్పడినట్లు టాక్ ఉంది. నిఘా ఈ విభాగానికి విషయం తెలియడంతో ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మందలించారు. ఆ తరువాత ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేశారు.
ఇలా.. రాష్ట్రంలో ఒక్కో ఐపీఎస్ ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిష్పక్షపాతంగా ప్రజలు సేవలు అందించాల్సింది పోయి.. పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రచారం నడుస్తోంది.
????దూరవిద్యను సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వ విభాగ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కె.శివకుమార్.
కంభం CLR జూనియర్ కళాశాలకు విచ్చేసిన ప్రభుత్వ విభాగ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కే. శివకుమార్ ని సిఎల్ఆర్ జూనియర్ కాలేజీ డైరెక్టర్ శిరిగిరి బ్రహ్మం మరియు అధ్యాపకులు శాలువాతో సత్కరించారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానం ద్వారా “చదువు మళ్ళీ కొనసాగిద్దాం- బంగారు భవితను నిర్ణయించుకుందాం” అనే వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ పరీక్షల విభాగపు అసిస్టెంట్ కమిషనర్ కే శివకుమార్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండి చదవగలిగి వ్రాయగలిగిన పరిజ్ఞానం కలవారు మరియు పదవ తరగతి ఫెయిల్ అయిన వారు పదవ తరగతినీ,15 సంవత్సరాలు నుండి పదవ తరగతి పూర్తయిన వారంతా ఇంటర్ కోర్సును ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానం ద్వారా చదివే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవా లన్నారు. కార్యక్రమంలో ఏపీఓఎస్ఎస్ క్లర్క్ నాగరాజు,CLR డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ భూపనీ నారాయణ, గుండాల ముక్తేశ్వరరావు, అధ్యాపకులు ఏనుగుల రవికుమార్, షేక్ షరీఫ్, పాలిశెట్టి నవీన్, ముతకపల్లి శ్రీనివాసరెడ్డి, ఉప్పు నారాయణ, కే.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
????తిరుమల లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి మనోభావాలు దెబ్బతీశారు:ఎమ్మెల్యే అశోక్ రెడ్డి..మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ మతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీశారని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే లడ్డు ప్రసాదంలో ఆవు నెయ్యి కాకుండా జంతువుల నుంచి తీసిన కొవ్వుతో లడ్డులను తయారు చేసి ఓ మతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసేలా జగన్ వ్యవహరించారన్నారు.
????పరిపాలకుడు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని కానీ ఈ రకమైన పోకడలకు పోవటం మంచిది కాదని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.మన ఆగమన శాస్త్రం ప్రకారం ఏ రకంగా నిర్వర్తించాలో ఆ పద్ధతి ప్రకారం ఆవు నెయ్యిని ఉపయోగించి అన్ని రకాలగా నాణ్యమైన లడ్డును అందించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.గత ప్రభుత్వం కక్షపూరితమైన పరిపాలన చేసిందన్నారు. పేద ప్రజలకు ఏదో చేస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పేదల రక్తం తాగారని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు స్వయంగా వారి వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరిస్తుందన్నారు.
????వివాహ వేడుకలో కుందూరు నాగార్జున రెడ్డి..
*అర్థవీడు వైసీపీ నాయకులు ఖాదర్ ఖాన్ కుమారుని వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన మార్కాపురం మాజీ శాసనసభ్యులు, గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కుందూరు నాగార్జున రెడ్డి..వారి వెంట అర్ధవీడు మండల వైసీపీ నాయకులు,ప్రజాప్రతినిధులు ఉన్నారు…

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..