అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు దంపతులు.. ప్రతి పౌరుడి స్వేచ్ఛకు ప్రాధాన్యత సీఎం రేవంత్.. హరీష్ రావుకు మరోసారి సవాల్.. జాతీయ పతాకానికి అవమానం..

????గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు దంపతులు..*ప్రారంభించి పేదలతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు దంపతులు..*ఏపీలో పేదలకు రూ.5కే రుచికరమైన భోజనం అందిస్తుంది అన్న క్యాంటీన్*

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యేక హెలి కాప్టర్‌లో కృష్ణాజిల్లా గుడివాడ చేరుకుని అన్న క్యాంటీన్‌ను ప్రారంభిం చారు. అంతకు ముందు ఆయనకు ఎన్టీఆర్ స్టేడియంలో ఘన స్వాగతం పలికారు టీడీపీ నేతలు, అధికారులు…
అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం ప్రజలతో చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. పేదలతో కలిసి చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి భోజనం చేశారు. పేదలలో మాట్లాడి వారి కష్టాల గురించి తెలుసుకున్నారు.పేదలతో పాటు అన్న క్యాం టీన్‌లో ఏర్పాట్లను పరిశీలిం చారు. పేదలకు భోజనం వడ్డించారు చంద్రబాబు దంపతులు.ఏపీలో పేదలకు రూ.5కే రుచికరమైన భోజ నం అందిస్తుంది, అన్న క్యాంటీన్.
ఈ నెల 16న మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతి నిధులు ఆయా నియోజక వర్గాల్లో ప్రారంభిస్తారు.
ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరే కృష్ణ మూవ్‌మెంట్‌ సంస్థ టెండర్లలో దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లలో ప్రస్తుతం 180 సిద్ధమయ్యాయి…
????హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన *డబ్ల్యూహెచ్‌వో*
ప్రపంచ వ్యాప్తంగా *విజృంభిస్తున్న మంకీ పాక్స్‌*
ఇప్పటి వరకు ఎంపాక్స్‌తో 100 మందికిపైగా మృతి
70 దేశాల్లో మంకీ పాక్స్ వ్యాప్తి-WHO అధికారుల నిర్లక్ష్యం ..
????జాతీయ జెండాకు అవమానం*
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎంపీడీఓ కార్యాల యంలో జాతీయ జెండాకు ఈరోజు మరో అవమానం జరిగింది. స్వాతం త్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక స్పెషల్ ఆఫీసర్ మండల ప్రజా పరిషత్ కార్యాల యంలో జెండా ఎగురవే సేందుకు సిద్ధమయ్యారు అధికారులు..జాతీయ జెండా పైకి వెళ్ళాక ముడి ఎంతకు రాకపోవటం తో బలంగా లాగారు. దీంతో జాతీయ జెండాకు ఉన్న ముడి వీడి జెండా ఆవి ష్కరణ జరిగింది.
కాగా వెంటనే తాడు వదిలే యటంతో జాతీయ జెండా పై నుంచి జారి నేరుగా స్పెష ల్ ఆఫీసర్ కాళ్లపై పడిపో యింది, దీనితో వెంటనే పక్కనే ఉన్న సిబ్బంది లాగి మళ్ళీ పైకి ఎగురవేశారు…
???? సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండాకు అవమానం..
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాకు అవమానం ఎదురైంది..జిల్లా కలెక్టరే ఏకంగా జెండాను తలకిందులుగా ఎగరేశారు. 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో జెండా ఎగరే సేందుకు సిద్ధమయ్యారు.
జాతీయ జెండా పైకి వెళ్ళాక జెండా ముడి విప్పగా తలకిందులుగా ఎగరడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వెంటనే జెండాను కిందకు దింపగా సిబ్బంది సరిచేసి మరోసారి ఎగరేశారు…
????  78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు సన్మానం..  కోడుమూరు.. అమర వీరుల త్యాగఫలం….బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం.. మన భారతదేశ స్వాతంత్ర్యము….. సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని..భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు…జాతీయ పండుగ దినాన్ని పురస్కరించుకొని కోడుమూరు ఆవాజ్ కమిటీ తరపున స్థానిక షాది ఖానా ఎదుట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కోడుమూరు ఆవాజ్ మండల బాధ్యులు ఎల్. మొహమ్మద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగినది…ఈ వేడుకలలో S.S.C లో ఉత్తీర్ణులైన మండల టాపర్స్ విద్యార్థులను ఘనంగా సత్కరించడమైనది…కార్యక్రమానికి కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్సురుద్దీన్, ఎస్సై శ్రీనివాసులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ శ్రీనివాసులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆంధ్రయ  కోడుమూరు సర్పంచ్ భాగ్యరత్నమ్మ మాల మహానాడు నాయకులు మునిస్వామి  సిపిఐ రాజు సిపిఎం గఫూర్ మియా, కోడుమూరు ఖాజి హాజీవలి జామియా మస్జిద్ ముతవల్లి డాక్టర్ షబ్బీర్ అహ్మద్ చోటి మస్జిద్ ముతవల్లి ఎక్బల్ , షాదీఖానా అధ్యక్షులు వహాబ్, ఆవాజ్ కోడుమూరు పట్టణ అధ్యక్షులు ఇషాక్, కార్యదర్శి హుస్సేన్ పీరా, కోశాధికారి ఇంటర్నేషనల్ హుస్సేన్, P. హుసేనప్ప, కాలీగార్ జాకిర్, మాలిక్, దావూద్, అజీజ్, R.ఖాజా, ఫైల్వాన్ భాష, చనుగొండ్ల ముతవల్లి బడేసా, మిమిక్రి ఆర్టిస్ట్ ఉస్మాన్, మాల్దర్ నబి, ఖురేషి మిన్నల్లా రఫీక్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు…

????కేంద్ర ప్రభుత్వం ముస్లింల వక్ఫ్ చట్ట సవరణపై రాష్ట్ర మైనార్టీ మంత్రి ఫరూఖ్ స్పందించారు.*కేంద్ర ప్రభుత్వం మేం చట్టం చేశాం… పాటించండి అంటే కుదరదు – వక్ఫ్ చట్ట సవరణపై భారీస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమౌతుంది – మత సంస్థల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం తగదు – సొంత నిర్ణయాలను మత సంస్థలపై రుద్దడం సరికాదు – మత పెద్దలతో విద్యావంతులు మేధావులతో చర్చించకుండా నిర్ణయం తీసుకుంటామంటే కుదరదు…???? రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళాము ..సానుకూలంగా స్పందించి త్వరలో పార్లమెంట్ కమిటీ భేటీ అవుతుంది – మార్పులు చేర్పులు చేశాక చూస్తామని హామీనిచ్చారని రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ ఎం డి ఫరూక్ మీడియా ముఖంగా తెలిపారు.*

????తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రతిపౌరుడి స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తుందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంక్షేమాభివృద్ధికి పెద్దపీట వేస్తూ, విశ్వ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలిపే పాలనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట నుంచి జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి తన సందేశం ఇచ్చారు…
???? రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ త్వరితగతిన పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతిష్టాత్మక సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం ప్రజలకు అంకితం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌజ్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
????ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల సహా ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంతో ఇతర జిల్లాల నుంచి కూడా ప్రాజెక్టుల పూర్తికి ఒత్తిడి పెరిగిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తెలిపారు. అన్ని జిల్లాల్లోని రైతులకు న్యాయం జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో వేగంగా పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు…
???? హరీష్‌రావుకు రేవంత్‌ మరోసారి సవాల్
రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం
చీము నెత్తురు ఉంటే హరీష్‌రావు రాజీనామా చేయాలి
లేకుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి-రేవంత్
హరీష్‌రావు రాజీనామా చెయ్యి
మళ్లీ ఎలా గెలుస్తావో చూస్తా-సీఎం రేవంత్
సిద్దిపేటలో హరీష్‌ను ఓడించే బాధ్యత నాది-రేవంత్
BRS పార్టీ బతుకు బస్టాండ్ అయ్యింది-సీఎం రేవంత్
బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో కలుపుతాం-సీఎం రేవంత్
???? హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఆక్రమణల కూల్చివేతలు..బాచుపల్లి ఎర్రకుంటలో ఉదయం నుంచి ఆక్రమణల కూల్చివేత..బహుళ అంతస్తులను కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది..హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఆదేశాలతో కూల్చివేతలు..హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్నా..భవనాలను ఎలా కూల్చివేస్తారంటున్న బిల్డర్లు..

????ఈ ఆంధ్ర్రప్రదేశ్ కు ఏమైంది … ఓ వైపు హత్యలు, హత్యచారాలు … మరో వైపు కబ్జాలు ??? ◾▪️ఏపీలో ఉన్నందుకు తనను తాను చెప్పుతో కొట్టుకోవలి అంటు ప్రభుత్వం పై ఎన్నారై అవేధన వ్యక్తం చేశారు.▪️ఎన్నారై సైతం అవేదన ..❓▪️కనిపిస్తే కబ్జా …❓ఆ స్థలం పై అధికార పార్టీ మంత్రీ కన్ను …❓▪️చిలకలూరిపేటలో కలకలం రేపుతున్న టెక్కీ ఫేస్బుక్ పోస్ట్…చిలకలూరిపేట మంత్రి విడదల రజిని మంత్రి అనుచరులు చిలకలూరిపేట లోని అడ్డరోడ్డు వద్ద నిర్మించిన సాయి కార్తీక్ సిటీ సెంటర్ పై మంత్రి కన్ను పడిందని అందులో తనకు ఎంట్రీ, ఎగ్జిట్ లేకుండా చేస్తున్నారన్న బాధితుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.▪️తనను తన

తల్లిదండ్రులను మంత్రి అనుచరులు చంపేస్తామని బెదిరిస్తున్నారని తమ తల్లిదండ్రులను అక్కడినుండి వచ్చేయాలని అభ్యర్థిస్తూ తన కుటుంబానికి అండగా ఉండి కాపాడాలని నారా లోకేష్ ని ట్యాగ్ చేస్తూ వేడుకొన్నారు.▪️చిలకలూరిపేటలో ఎన్నారై కి చెందిన “సాయి కార్తిక్ సిటీ సెంటర్” కబ్జా.▪️పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆవేదనతో ఎన్నారై వీడియో వైరల్.▪️చిలకలూరిపేటలో సాయి కార్తిక్ సిటీ సెంటర్ కబ్జా.▪️కాంప్లెక్స్ లోని థియేటర్స్, షాప్స్ అన్ని బలవంతంగ క్లోజ్. ▪️పోలీసులను ఆశ్రయించిన యజమాని 70ఏళ్ల వృద్దురాలు.

????ప్రకాశం జిల్లా :-  గిద్దలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో మాజీ వైసిపి కార్యకర్తల పై దాడి..! వైసిపి కార్యకర్తలైన  కో ఆప్షన్ నెంబర్ మస్తాన్ వలి,హీరో షోరూం ఎన్ రాజశేఖర్, వీరయ్య గౌడ్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి..! నేడు వీరు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆధ్వర్యంలో వైసీపీని వీడి బిజెపిలో చేరారు..!..విజయవాడ నుండి గిద్దలూరు కు ట్రైన్ ద్వారా చేరుకొని బయటికి వస్తుండగా దాడి చేసినట్లు సమాచారం..!దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..