డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఫిజికల్‌గా జారీ చేయరా?..ఏపీ హైకోర్టు..బ్రాండ్‌ ఏపీ…ఈ లక్ష్యం దిశగానే కొత్త పారిశ్రామిక విధానం: బాబు..మాజీ మంత్రి జోగి రమేష్ కు బిగ్ షాక్!..జోగి కుమారుడు అరెస్ట్..నంద్యాలలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ.. హైదరాబాదులో దవాఖానాలు కిటకిట..

???? బ్రాండ్‌ ఏపీ…ఈ లక్ష్యం దిశగానే కొత్త పారిశ్రామిక విధానం: బాబు..టాప్‌-5 రాష్ట్రాలతో పోటీ పడాలి.. 15% సమగ్ర వృద్ధే లక్ష్యం..నీతి ఆయోగ్‌ ఆలోచనలు.. పరిగణనలోకి తీసుకోవాలి..ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మనకు 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు
పశ్చిమ కంటే తూర్పు తీర ప్రాంతం రోడ్డు,రైలు, విమానయానంతో అనుసంధానం ..ఇవన్నీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం..16న పారిశ్రామికవేత్తలతో భేటీ
100 రోజుల్లోగా ముఖ్య పాలసీలు: సీఎం
????డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఫిజికల్‌గా జారీ చేయరా?.. ఏపీ హైకోర్టు.. డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను ఫిజికల్‌గా ఇవ్వకుండా కేవలం డిజిటల్‌ రూపంలో జారీ చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వాటిని ఫిజికల్‌గా జారీ చేసే విషయంలో చట్టంలో ఎలాంటి నిషేధమూ లేదని గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, కేంద్ర రవాణాశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది.
డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలను ఫిజికల్‌ రూపంలో జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పంజాబ్‌కు చెందిన రాహత్‌ ద సేఫ్‌ కమ్యూనిటీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కమల్‌ ఏపీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌ ఇటీవల సీజే ధర్మాసనం ముందు విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్ల జారీ కోసం వాహనదారులు ప్రభుత్వానికి నిర్దేశిత సొమ్మును చెల్లిస్తున్నారన్నారు. అయినప్పటికీ వాటిని ఫిజికల్‌ రూపంలో జారీ చేయడం లేదని, కేవలం డిజిటల్‌ రూపంలోనే అందజేస్తున్నారని వివరించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
**స్కూల్ వ్యాన్ ల ఫిట్ నెస్ పరీక్షలకు సీఎం ఆదేశం*
అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లె హైవే క్రాస్ సమీపంలో స్కూల్ వ్యాను బోల్తాపడిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ అధికారులు డ్రైవ్ నిర్వహించాలని, ఫిట్ నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
????*మాజీమంత్రి జోగిరమేష్ ఇంట్లో ACB తనిఖీలు..
తనిఖీలు చేస్తున్న 15 మంది ఏసీబీ అధికారులు.. *ఇంటిని స్వాధీనం చేసుకుని కొనసాగిస్తున్న సోదాలు** *అగ్రిగోల్డ్ వ్యవహారంలో ACB విచారణ..

*మాజీ మంత్రి జోగి రమేష్ కు బిగ్ షాక్!… వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలింది. ఇందులో భాగంగా విజయవాడ శివార్లలోని ఇబ్రహీపట్నం లోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు..గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు చెలరేగిపోయారని.. ప్రధానంగా అప్పట్లో మంత్రులుగా ఉన్నవారి అక్రమాలకైతే అడ్డూ అదుపూ లేకుండా పోయిందనే విమర్శలు కూటమి పార్టీల నుంచి బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా అయన ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు.వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలింది. ఇందులో భాగంగా విజయవాడ శివార్లలోని ఇబ్రహీపట్నం లోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ప్రధానంగా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఫిర్యాదులు అందడం వల్లే ఈ దాడులు జరిగినట్లు చెబుతున్నారు.*అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములను విక్రయించారనే ఆరోపణలను జోగి రమేష్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ భూములు సీఐడీ అధీనంలో ఉన్నప్పటికీ ఆయన వాటిని కొనుగోలు చేసి, భారీ ధరలకు విక్రయించారనే ఆరోపణలు గతంలో విపరీతంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో సుమారు ఐదు కోట్ల రూపాయలను ఆయన ఆర్జించారనే ఆరోపణలు ఉన్నాయి.అంబాపురంలో 69/2, 87 సర్వే నెంబర్లలోని సుమారు 2,300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉండగా.. దాన్ని గతంలో సీఐడీ స్వాధీనం చేసుకుంది. అయితే ఈ భూమిని రమేష్.. తన సమీప బంధువుల పేరు మీదకు బదలాయించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం!

????జోగి రమేష్ కుమారుడు అరెస్ట్… చంద్రబాబుకు మాజీమంత్రి ప్రశ్నలు! అనంతరం కొన్ని గంటలకే జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా… ఈ రోజు తెల్లవారుజామున వియవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను తనిఖీ చేసినట్లు చెబుతున్నారు. అనంతరం కొన్ని గంటలకే జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు… మంగళవారం తెల్లవారుజామున సుమారు 15 మంది అధికారు జోగి రమేష్ నివాసంలో సోధాలు చేపట్టారు.ఈ క్రమంలో పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ సోదాలు అయిన కొన్ని గంటలకే జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను మరికొంతమందితో కలిసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన జోగి రాజీవ్… తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఇదే సమయంలో… కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని వెల్లడించారు. మరోపక్క తన కుమారుడు రాజీవ్ అరెస్ట్ పై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబుని ప్రశ్నించారు. ఇందులో భాగంగా… అగ్రిగోల్డ్ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని చెప్పిన జోగి రమేష్.. తాను కానీ, తన కుటుంబం కానీ అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో ఏదైనా తప్పు చేసి ఉంటే విజయవాడ నడిరోడ్డులో ఉరేసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా… బలహీన వర్గాలకు చెందిన తమను వేధించడం న్యాయమా చంద్రబాబు నాయూ అంటూ ప్రశ్నించారు. తన కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే పైన దేవుడున్నాడని అన్నారు. ఇదే క్రమంలో… “మీరు మమ్మల్ని తొక్కొచ్చు..రెడ్ బుక్ తీయొచ్చు.. మాపై కేసులు పెట్టోచ్చు.. మీరు మరీ ఇంత దుర్మార్గంగా ఏమీ తెలియని కుర్రాడిపై కేసుపెట్టి జైల్లో పెట్టాలన్న వంకర బుద్దిని మార్చుకోవాలి” అని జోగి రమేష్ అన్నారు.♦

????”హార్ ఘర్ తిరంగ” కార్యక్రమంలో భాగంగా భారీ జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు NMD ఫరూక్ .*నంద్యాల పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హార్ ఘర్ తీరంగ ప్రతి ఇంటికి జాతీయ జెండా చేరాలని ముఖ్య ఉద్దేశంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో నంద్యాలలో స్థానిక టెక్క మార్కెట్ యార్డ్ నుండి గాంధీచౌక్ వరకు భారీ జాతీయజెండా ర్యాలీ నిర్వహించారు.

*ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు NMD ఫరూక్  జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించి ప్రతి ఒక్కరూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల జీవిత గాధలను గుర్తుచేసుకుని దేశ అభివృద్ధికి పూన:రంకితమవ్వాలని పిలుపునిచ్చారు*కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఐఏఎస్, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ ఎన్ డి ఫిరోజ్, డీఆర్ఓ పద్మజ, జిల్లా అధికారులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.*

*దావాఖానలు కిటకిట.. హైద్రాబాద్..*వాతావరణంలో మార్పుల కారణంగా రోగాలు ప్రబలుతున్నాయి. జర్వం, జలుబు, గొంతునొప్పి, దగ్గు, వాంతులు, విరేచనాలతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఏ హాస్పిటల్ చూసినా వైరల్ ఫీవర్ బాధితులతో కిక్కిరిసిపోతోంది.*ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా వైరల్ ఫీవర్ బాధితులుంటున్నారు. వర్షాకాలం.. కొన్ని రోజులుగా వాతావరణం ముసురుగా ఉండటంతో విషజ్వరాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పది రోజులుగా పలు రకాల జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఒక్క ఫీవర్ హాస్పిటల్‌లోనే రోజుకు 600 నుంచి 700 వరకు ఓపీ ఉంటోంది. సాధారణ రోజుల్లో ఇక్కడ 300 నుంచి 400 మంది మాత్రమే వస్తుంటారు. సీజన్‌మార్పుల కారణంగా ఈ సంఖ్య సుమారు ఐదు రెట్లు పెరిగింది.ఇక ఇన్ పేషెంట్‌గా చేరుతున్న వారి సంఖ్య రోజుకు 30 నుంచి 40 వరకు ఉంటోంది. వీరిలో ఎక్కువగా హెపటైటిస్, చికెన్ గున్యా, డెంగ్యూ, విషజర్వాల బాధితులు ఉంటున్నారు. ఒక్క ఫీవర్ హాస్పిటల్‌లో మాత్రమే కాదు ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ హాస్పిటల్స్‌లో కూడా వైరల్ ఫీవర్స్ బాధితుల సంఖ్య పెరిగింది. ప్రతి హాస్పిటల్ రోజు ఉండే సాధారణ ఓపీ కన్నా 500 వందల మంది వరకు ఎక్కువ ఒపి ఉంటోంది. పెరిగిన ఓపీ మొత్తం కూడా వైరల్ ఫీవర్స్ బాధితులేనని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..