సైన్యం చేతిలోకి బంగ్లాదేశ్..ప్రధాని హసీనా పరార్ ????మొదటి సారి ఒక విధ్వంసం చేసే పాలనను, గత ప్రభుత్వంలో చూసాం- సీఎం చంద్రబాబు..బషీర్ బాగ్ చౌరస్తాలో విద్యార్థుల ఆందోళన.. డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..నాటుసారా సావరాలపై దాడులు

???????????? సైన్యం చేతిలోకి బంగ్లాదేశ్.. ప్రధాని హసీనా పరార్ ???????????? గత పదినేళ్ళుగా ప్రధానిగా పాలన చేస్తున్న షేక్ హసీనా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో రాజీనామా చేసి ప్రాణాలను గుప్పటి పెట్టుకుని భారత్ కి రక్షణ కోసం రావాల్సి వచ్చింది. రిజర్వేషన్ల పేరిట ఆ దేశంలో కొన్నాళ్ళుగా సాగుతున్న దారుణ మారణ కాండ వెనక ఆర్మీ ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయి. ఇపుడు అదే ఆర్మీ ప్రజా ప్రభుత్వం పీక నులిపి అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి చూడడంతో నిజమని కూడా భావించే పరిస్థితులు ఉన్నాయి. ఇటీవలనే షేక్ హసీనా మరోసారి ప్రధానిగా నెగ్గారు. ప్రజా ప్రభుత్వం మళ్ళీ కొలువు తీరింది.

ఆమె ప్రధానిగా ఉంటూ భారత్ కి నిజమైన మిత్రుడిగా బంగ్లాదేశ్ ని ఉంచింది. ఉగ్ర కార్యకలాపాలు బంగ్లా నుంచి దేశ సరిహద్దులలో చొరబడుతున్న వేళ కట్టడి చేసే ప్రయత్నం ఆమె చేస్తున్నారు. ఇపుడు ఆర్మీ చేతులలోకి అధికారం వెళ్ళడంతో భారత్ కి ఉగ్రవాదుల దాడులు చొరబాట్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక విధంగా బంగ్లాదేశ్ ఆర్మీ చేతులల్లోకి వెళ్లడం అంటే భారత్ అన్ని విధాలుగా జాగ్రత్త పడాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ తో భారత్ కి తలనొప్పులు ఉన్నాయి. చైనాతో ఇబ్బందులు ఉన్నాయి. ఇపుడు మరో పొరుగు దేశం బంగ్లాదేశ్ ఆర్మీ చేతుల్లోకి వెళ్ళడం అంటే భారత్ వేయి కళ్ళతో తన అంతర్గత భద్రతను కాపాడుకోవాల్సి రావచ్చు. ఇక పశ్చిమ బెంగాల్ లో బంగ్లాదేశ్ నుంచి వలస వాదులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.బంగ్లా సారథిగా ప్రొఫెసర్ ఈ పరిణామాలు భారత్ కి పూర్తి స్థాయిలో చికాకు పెట్టేవే అని అంటున్నారు మరో వైపు చూస్తే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌ చేరుకున్నారు. హిండన్‌ ఎయిర్‌బేస్‌లో హసీనా విమానం ల్యాండింగ్ అయింది. అదే విధంగా బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపధ్యంలో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం సైనిక పాలనలో బంగ్లాదేశ్‌ వెళ్ళిపోయింది. భద్రతను కాపాడుకోవాల్సి రావచ్చు. ఇక పశ్చిమ బెంగాల్ లో బంగ్లాదేశ్ నుంచి వలస వాదులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.ఈ పరిణామాలు భారత్ కి పూర్తి స్థాయిలో చికాకు పెట్టేవే అని అంటున్నారు మరో వైపు చూస్తే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌ చేరుకున్నారు. హిండన్‌ ఎయిర్‌బేస్‌లో హసీనా విమానం ల్యాండింగ్ అయింది. అదే విధంగా బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపధ్యంలో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు.దీంతో ప్రస్తుతం సైనిక పాలనలో బంగ్లాదేశ్‌ వెళ్ళిపోయింది. ఈ నేపధ్యనంలో సాటి మిత్రురాలిగా ఆమెను సమాదరించి షేక్ హసీనాకు ఆశ్రయమిచ్చిన భారత్‌ తన గొప్ప మనసు చాటుకుంది. అంతే కాదు ఈ ఉద్రిక్తమైన పరిణామాల నేపధ్యంలో భారత్‌ బంగ్లా సరిహద్దులో హైఅలర్ట్‌ ని సైతం ప్రకటించారు.అంతే కాదు సరిహద్దుల్లో బలగాలను అప్రమత్తం చేసిన బీఎస్‌ఎఫ్‌ పూర్తి నిఘాని పెట్టింది. అదే విధంగా కూచ్‌బెహార్‌, పెట్రాపోల్‌ సరిహద్దుల్లో భద్రతను పూర్తి స్థాయిలో పెంచింది. అదే విధంగా భారత్‌లోని బంగ్లాదేశ్‌ ఎంబసీ దగ్గర భద్రత పెంచార్.దాంతో పాటుగా బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ మొత్తం పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.

???? వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఏపీ బ్రాండ్ దెబ్బతినేలా సాగిన గత ఐదేళ్ళ పాలన ప్రభావం నుండి బయటపడి రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలని పిలుపునిచ్చారు. సదస్సులో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… చంద్రబాబు విజన్ తో ముందుకు వెళదామని సూచించారు.
గత ముఖ్యమంత్రి, మొదటి కలెక్టర్స్ మీటింగ్ లోనే, విధ్వంసం చేస్తున్నా అని చెప్పి, ఆ మీటింగ్ నుంచే విధ్వంసం మొదలు పెట్టాడు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, అధికారులని కూడా బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి చూసాం. చరిత్రలో చేతకాని పాలనలు, అవినీతి పాలనలు చూసాం కానీ, మొదటి సారి ఒక విధ్వంసం చేసే పాలనను, గత ప్రభుత్వంలో చూసామాన్నారు.

????నేను కూడా త్వరలో ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా.1995 నాటి చంద్ర‌బాబును చూస్తార‌ని చెప్తూ వస్తున్నా, ఆ స్పీడ్ కి రావాల్సిన పరిస్థితి ఉంది..మానవత్వంతో ఆలోచిస్తే
ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది..
# ప్రజలకు ఆదాయాన్ని పెంచే విధంగా కార్యక్రమాలను చేపట్టాలి..# అధికారం ఉందని ప్రజలపై పెత్తనం చెలాయిస్తే ఒప్పుకోను మనం సేవకులం మాత్రమే..
# రాష్ట్ర విభజన కంటే కూడా ఎక్కువగా జగన్ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది
# చెడు జరిగినప్పుడు దానిని ఆధారాలతో సహా వెల్లడించాల్సిన బాధ్యత జిల్లా అధికారులకు ఉంది..
# ప్రతి నెల ఒకటవ తేదీన పేదల సేవలో అనే కార్యక్రమంతో మనం అందరం అనుసంధానం కావాలి..
*గత జగన్ ప్రభుత్వ విధానాల వల్ల ఈ రాష్ట్రంలో ఉండేవారు కూడా పెట్టుబడులు పెట్టకుండ వేరే రాష్ట్రాలకు పారిపోయారు.
*రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎక్కడా ఉండకూడదు.ప్రతి కలెక్టర్ బాధ్యతగా  పని చేయాలి
???? విద్యార్థులకు ఒత్తిడికి లేకుండా విద్యను అందించాలి.
???? ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించే విధంగా ముందుకు వెళ్తున్నాం..
# స్కూల్ యూనిఫాం పంపిణీ పై అధికారులను ఆరా తీసిన సీఎం చంద్రబాబు
: విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా చదువుకొనే పరిస్థితి కల్పించాలి
: సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ లకు సెలెక్ట్ అయ్యేలా మన విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామాన్నారు.
????బషీర్ బాగ్ చౌరస్తాలో విద్యార్థుల ఆందోళన..
హైదరాబాద్‌ నిజాం కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసు కుంది. గర్ల్స్‌ హాస్టల్‌లో యూజీ విద్యార్థినులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలంటూ స్టూడెంట్స్‌ సోమవారం ఆందోళనకు దిగారు.
బషీర్‌బాగ్‌ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థినుల ధర్నాతో లిబర్టీ నుంచి అబిడ్స్‌ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.
2022లో నిజాం కాలేజీలో యూజీ విద్యార్థినులకు గర్ల్స్‌ హాస్టల్‌ నిర్మించారని, ఆ ఏడాది హాస్టల్‌లో యూ జీ విద్యార్థుల అడ్మిషన్లు తక్కువగా ఉండటంతో పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారని తెలిపారు.
అయితే ఈ ఏడాది యూజీ అడ్మిషన్లు ఎక్కువగా రావ డంతో హాస్టల్‌లో అడ్మిషన్‌ దొరక్క బయట ప్రైవేట్ హాస్టల్‌లో ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నా మన్నారు.అందుకే గర్ల్స్‌ హాస్టల్‌ లో యూజీ విద్యార్థినులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలని ఆందోళనకు దిగారు.
ప్రిన్సిపాల్‌ బయటకు వచ్చి యూజీ విద్యార్థులకు హాస్టల్‌లో అడ్మిషన్లు ఇస్తామని హామీ ఇవ్వాలని, అప్పటివరకు ఆందోళనలు విరమించేప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు ఆందోళనకారులు.
????విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న హై స్కూల్ హెచ్ఎం….
*సంవత్సరానికి సుమారు మూడు నుండి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తున్న హెచ్ఎం*..
*విద్యా కమిటీ, పేరెంట్స్ కమిటీ అనుమతితోనే వసూలు చేశాం అంటున్న హెచ్ఎం*
*సంబంధం లేదంటున్న విద్యా కమిటీ చైర్మన్ ఆతుకూరి గోపి..*మండల కేంద్రమైన కారంపూడి లోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూలు మెయింటినెన్స్ పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుండి సుమారు 400 రూపాయలు వసూలు చేస్తున్న అనంత శివ. విద్యార్థులు తల్లిదండ్రుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంత శివ వివరణ కోరగా మా స్కూలు మా ఇష్టం మీరెవరు మమ్మల్ని అడగడానికి అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ దురుసుగా వ్యవహరించారు. వసూలు చేస్తున్నట్లు పై అధికారులు అనుమతి ఉందని వివరణ కోరగా పై అధికారులు అనుమతి అవసరం లేదు నా స్కూలుకి నేనే కలెక్టర్ నేనే బాస్ నంటూ మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది. తను వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని దానిని స్కూల్ మరమ్మత్తులకు ఖర్చు పెడుతున్నానని అన్నారు. ప్రభుత్వం నుండి జిల్లా పరిషత్ హై స్కూల్ కు నిధులు ఒక్క రూపాయి కూడా రాదని అన్నారు. పాఠశాలలోని సమస్యలపై డీఈఓ దృష్టికి తీసుకువెళ్లారా అని అడగ్గా గతంలో అనేక సమస్యలు తీసుకెళ్లాం వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులకు కానీ ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూనే తాను వసూలు చేస్తున్నది సక్రమమే అంటూ తను చెప్పిందే వేదంలాగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఆర్థిక పరిస్థితి బాగాలేక హెచ్ఎం అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఆ విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తూ పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు.. ప్రైవేట్ పాఠశాలలకు పంపలేక గవర్నమెంట్ స్కూల్ కి పిల్లలు చదువుకోవడానికి వెళుతుంటే ఇలాంటి అక్రమ వసూలు చేస్తూ స్కూలు ఖర్చుల పేరుతో లక్షల వసూలు చేస్తున్న హెచ్ఎం అనంత శివ విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమంది అడగ్గా తల్లిదండ్రుల వద్ద సానుకూలంగా సమాధానం చెబుతూ అనంతరం విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వాలు విద్యపై అనేక పథకాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని అనేక నిధులు విడుదల చేస్తుంటే కారంపూడి ప్రధానోపాధ్యాయులు అనంత శివ లాంటి వారి వల్ల ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది. అక్రమ వసులపై ప్రశ్నించిన విలేకరులపై మీరెవరు నన్ను ప్రశ్నించడానికి మీకు చెప్పాల్సిన అవసరం లేదు నా స్కూల్లోనే నా ఇష్టం. జిల్లా స్థాయి అధికారులకు మాత్రమే నేను సమాధానం చెప్తాను. గతంలో అనేక సమస్యలపై జిల్లా స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చిన వారు ఏమి చేయలేకపోయారని వారికి చెప్పిన ఉపయోగం లేదు అందుకే నా స్కూలుకి నేనే బాస్ నన్ను ఎవడు ఏమీ చేయలేడు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నా పై స్థాయి అధికారులు కానీ కలెక్టర్, గ్రామస్తులు గాని నన్ను ఎవడు ఏమి చేయలేడు అంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు అనంత శివ తన దర్పం ప్రదర్శించారు. ఇప్పటికైనా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కలగజేసుకొని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్ పై దృష్టి సారించి విద్యార్థులు పడుతున్న పలు సమస్యలను పరిష్కరించి హెచ్ఎం అనంతశివపై చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ ప్రజలు కోరుతున్నారు
**ఇరువర్గాల పై హత్యాయత్నం కేసు లు నమోదు*,
*లా & అర్డర్ సమస్య కు ఏవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు..గురజాల మండలం జంగమహేశ్వరపురం గ్రామంలో ఆదివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది… ఈ సంఘటన పై పోలీసులు ఇరు వర్గాల పై హత్యాయత్నం కేసు లు నమోదు చేశారు…త్వరలో నిందితులను పట్టుకుని అరెస్టు చేస్తామని తెలిపారు… గ్రామాల్లో ఏవరైనా లా అండ్ ఆర్డర్ కు ఆటంకం కలిగించిన, అల్లర్లకు పాల్పడినా, దురుద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ బాలకృష్ణ హెచ్చరించారు.
????పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించటమే ప్రభుత్వ లక్ష్యం…

గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి..ప్రకాశం జిల్లా, గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డయాలసిస్ సెంటర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి డయాలసిస్ సెంటర్ ని పరిశీలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన గిద్దలూరు ప్రాంతంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడాన్ని గుర్తించి, డయాలసిస్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో డయాలసిస్ రోగులు, డయాలసిస్ చేయించుకోవాలంటే మార్కాపురం, నంద్యాల వెళ్లవలసిన పరిస్థితి ఉండేదని అన్నారు. అలానే గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని వందల పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మన ప్రాంతాల సమస్యలను తీసుకువెళ్లి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డా. సూరిబాబు, డా. ఆదాం, గిద్దలూరు మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్, గిద్దలూరు పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేషా వలి, నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య మరియు పట్టణ కౌన్సిలర్లు, ఎన్డీయే కూటమి శ్రేణులు తదితరులు పాల్గోన్నారు..*
????నాటు సారా స్థావరాలపై సెబ్ అధికారులు దాడులు..
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం నాటు సారా స్థావరాలపై సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడంతో పాటు 10 లీటర్లు నాటు సారాను ఓ ద్విచక్ర వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాటు సారు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారైనట్లుగా సీఐ కొండారెడ్డి తెలిపాడు.
????ప్రాణభయం తో దేశం విడిచి పరార్ అవుతున్న బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి హసీనా, ఆమె అక్క రహేనా లు. సైనిక హెలికాప్టర్ లో పరార్ అవుతున్న దృశ్యం*. *పవర్ లో వున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా రిజర్వేషన్ కు సంబందిత ఉద్యమాన్ని అణచివేసి, అనేక మంది ప్రజల ను కాల్చిచంపించిన హసీనా. ఈ రోజు ప్రజలు హసీనా ఇంటి పై దాడికి దిగటం తో, దేశం విడిచి వెళ్లాలని సైన్యం ఆదేశించటం తో హెలికాప్టర్ లో పరార్ అయ్యారు

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..