????సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన ఆర్థికవేత్త భేటీ…ఏపీ సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త మైఖేల్ క్రేమర్ భేటీ….ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ ను సత్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు….విద్య.. వైద్యం.. వ్యవసాయం.. నీటి పారుదల రంగాలపై ఇరువురి మధ్య చర్చ…ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ భేటీ అయ్యారు. ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ ను ఏపీ సీఎం సత్కరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి పారుదల రంగాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రొఫెసర్ మైఖేల్ క్రేమార్ అనుభవాన్ని వినియోగించుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో క్లోరినేటెడ్ నీటి సరఫరాపై ఎవిడెన్స్ యాక్షన్ అనే సంస్థతో కలిసి పని చేయనున్న ఏపీ గ్రామీణ నీటి సరఫరా విభాగం.. పైలట్ ప్రాజెక్టుగా ఏపీలోని 500 గ్రామాల్లో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
????నందిగాం గురుకులంలో విద్యార్థిని సూసైడ్..శ్రీకాకుళం జిల్లా నందిగాం అంబేడ్కర్ గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని బుధవారం ఆత్మహత్య కు పాల్పడింది. కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సీఈసీ చదువుతున్న అక్షిత(16) అనే విద్యార్థిని వసతిగృహం కిటికీకి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెది కొత్తూరు మండలం పారాపురం కొత్తూరు సమీపంలో మహాసింగి గ్రామం కాగా వసతిగృహం మరుగుదొడ్ల సమీపంలో సూసైడ్ చేసుకుంది.విషయం వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
????ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు పొత్తుల వైపు దృష్టి సారించని జగన్ ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడారు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత పొత్తుల వల్ల కలిసొచ్చే లాభాలేంటో వైసీపీకి బాగా అర్ధం అయింది. ముఖ్యంగా 40 శాతం ఓట్లు వైసీపీకి వచ్చినప్పటికీ కేవలం ఆ పార్టీ 11 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక ఎన్నికల తర్వాత ఏపీలో గొడవలు తీవ్రతరం అవుతున్నాయి. వైసీపీ నాయకులు, సానుభూతిపరులపై టీడీపీ దాడులు చేస్తోందని జగన్ ఆరోపిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఇటీవలే ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు. అక్కడ ధర్నాలో రాజకీయ హత్యలపై ఫొటోలతో కూడిన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సమయంలో రాజకీయాల్లో ఊహించని ఘటన జరిగింది. కాంగ్రెస్ తప్పా ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పలు కీలక పార్టీలు జగన్ నిరసన శిబిరానికి వచ్చి మద్దతు తెలిపాయి. దీంతో జగన్ త్వరలో ఇండియా కూటమిలో చేరనున్నారనే ప్రచారం ఏపీలో ఊపందుకుంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.**జగన్ ఢిల్లీ ధర్నాకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వచ్చారు. జగన్‌కు మద్దతు ప్రకటించారు. డీఎంకే పార్టీ, ఎన్సీపీ, శివసేన సహా ప్రతిపక్ష ఇండియా కూటమికి పార్టీల నేతలు జగన్‌కు సంఘీభావం తెలిపారు. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ అత్యంత సన్నిహితుడు. గతంలో సీఎం జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సైతం ఆయన వచ్చారు. ఆయనతో పాటు అఖిలేష్ యాదవ్ కూడా జగన్‌ను ఇండియా కూటమిలో చేర్చుకోవాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ కూడా జగన్ పట్ల సానుకూలంగా ఉందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం వైసీపీ ఏ కూటమిలోనూ లేదు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఉన్నాయి. ఈ తరుణంలో రాజకీయ దాడులను తట్టుకునేందుకు జాతీయ స్థాయిలో ఎన్డీయే వ్యతిరేక కూటమి ఇండియా పక్షంలో చేరాలని జగన్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జగన్ ధర్నాకు కాంగ్రెస్ రాకపోయినప్పటికీ ఆ పార్టీకి సన్నిహితంగా ఉండే పార్టీల కీలక నేతలు వెళ్లారు. ఏపీలో రాజకీయ దాడులను ఖండిస్తూ జగన్ పట్ల వారు సానుకూల వైఖరి ప్రదర్శించారు. రానున్న కాలంలో ఇండియా కూటమిలో వైసీపీ చేరితే ఏపీలోనూ కాంగ్రెస్, వైసీపీ జట్టుకట్టనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడుగులు ఎటువైపు పడతాయోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
???? వైఎస్ జగన్ ను ఇరికించిన సతీమణి భారతి… కూటమిపై బురద వేసే క్రమంలో జగన్ వైఫల్యాలను ఓపెన్ గా రాసేసి సాక్షి..• కూటమి ప్రభుత్వంపై విషం కక్కే ప్రయత్నంలో…..వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ఎగ్గొట్టిన రూ. 1600 కోట్ల సంగతి బయట పెట్టిన సాక్షి… ప్రభుత్వంపై ఏదో ఒకటి రాయాలనే ఒత్తిడిలో నాటి జగన్ ప్రభుత్వ వైఫల్యాలను స్వయంగా రాసేసిన సాక్షి..కూటమి ప్రభుత్వం వచ్చి 50 రోజులు కాకముందే రూ.1600 కోట్లు బకాయిలు ఉండే చాన్స్ లేనే లేదు. సాక్షి తీరుపై జగన్ మండిపాటు….వార్త రాసిన, మొదటి పేజీలో ప్రచురించిన సిబ్బంది తొలిగిస్తూ ఉదయాన్నే ఆర్డర్స్
????కలెక్టర్ ని కూడా వదలని సైబర్ నేరగాళ్ళు!!!
దేశంలో సైబర్ నేరగాళ్ల దోపిడి హద్దు అదుపు లేకుండా పోతుంది. దీనిలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా సృష్టించారు.ఈ ఖాతాను ఉపయోగిం చుకుని పలువురి నుంచి డబ్బు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తు న్నారు. కలెక్టర్ సత్య శారదా మీటింగ్ లో ఉన్నారని అర్జెంట్ గా డబ్బులు కావాలంటూ +94784977145 శ్రీలంక నంబర్ నుంచి మెసేజ్ పంపిన సైబర్ నేరగాడుడబ్బులు ఫోన్‌పే చేసి, స్ర్కీన్‌షాట్ షేర్ చేయాలని కోరాడు. పలువురికి మేసేజ్‌లు పంపించారు. దీన్ని గమనించిన కలెక్టర్ సత్య శారదా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన అసలు ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా అందరిని అప్రమత్తం చేశారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని కలెక్టర్ సూచించారు. పై నంబర్ మోసపూరితమైనది, దయచేసి జవాబు ఇవ్వ కండని కలెక్టర్ సూచించారు.వీలైనంత త్వరగా బ్లాక్ చేయమని కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ప్రతి ఒక్కరినీ కోరారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ కేటుగాళ్ల ఆటకట్టించేందుకు సిద్ధమయ్యారు.
????రేపు ఉదయం 6 గంటలకే పెన్షన్లు పంపిణీ – జిల్లా కలెక్టర్లు పాల్గొనాలని సీఎస్ ఆదేశాలు..ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఆగస్టు నెలకు 64.82 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ కోసం రూ. 2,737 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఆగస్టు 1వ తేదీనే 96 శాతం, 2వ తేదీతో 100 శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు.ఈ సారి పెన్షన్లు పంపిణీలో జిల్లా కలెక్టర్లు పాల్గొనాలని నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ ఆదేశాలు అనుగుణంగా పెన్షన్లు పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్నారు. పెన్షన్లు పంపిణీ ఎవరైనా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ సృష్టం చేశారు. గత నెలలో పెన్షన్లు పంపిణీ ఏర్పడిన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
????రన్నింగ్ బస్సులో మహిళపై అత్యాచారం.*
రన్నింగ్ బస్సులో మహిళపై అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కి..! మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలను ఒంటరిగా చూస్తే చాలు.. వారిపై దౌర్జన్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.ఈ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. నేరాలు మాత్రం ఆగడం లేదు.
కదులుతున్న బస్సులో ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నోటికి గుడ్డ పెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులో వచ్చింది. ఈ సంచలన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున జరగడంతో కలకలం రేపుతుంది.హరికృష్ణ ట్రావెల్ నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తుండగా ఓ మహిళ బస్సులో ఎక్కింది. అయితే అందులో ఇద్దరు డ్రైవర్లు మాత్రమే వున్నారు. ఎవరూ లేకపోవడంతో ఆ మహిళ ఇది ప్రకాశం వెళుతుందా? అని ప్రశ్నించింది.ప్రకాశం వెలుతుందని డ్రైవర్ తెలుపడంతో సీటులో కూర్చింది. అయితే బస్సులో ఎవరూ లేకపోవడం.. ఒంటరి మహిళ కావడంతో ట్రావెల్ డ్రైవర్ బస్సు అద్దాలను అన్నింటి క్లోజ్ చేశాడు. ఇది ఏసీ బస్సు అని ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె ఏమీ చెప్పలేకపోయింది. ఇద్దరు డ్రైవర్లు ఒక చోట బస్సును ఆపి ఆమె వద్దకు వచ్చారు.ఆమె పట్టుకుని నోట్లో గుడ్డను కుక్కారు. అయితే ఎవరికి అనుమానం రాకుండా.. ఒకరు బస్సును డ్రైవింగ్ చేస్తుండగా మరొకరు ఆమెపై అత్యాచారం చేశాడు. కదులుతున్న ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ ఈ దారుణానికి ఒడికడ్డాడు.
బస్సు ప్రయాణిస్తుండటంతో ఎవరికి ఏ అనుమానం కలగలేదు. అత్యాచారం అనంతరం బస్సు మధ్యలో ఆపి ఆమెను కిందికి దించి.. ఎవరికి చెప్పకూడదని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.వెంటనే ఆ మహిళ డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. తనపై డ్రైవర్ అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. మేడ్చల్ సమీపంలో బస్ ఉండగా పోలీసులకు ఫిర్యాదు అందడంతో అప్రమత్తమైన సిటీ పోలీసులు బస్ కోసం గాలింపు చేపట్టారు.ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేజ్ చేసి పట్టుకున్నారు. హరికృష్ణ ట్రావెల్ సంబంధించిన ఇద్దరు డ్రైవర్లని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరిక్షలకోసం బాధితురాలిని హస్పటల్ కు తరలించారు. దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.
????మనీ కోసం రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు వృద్ధులే టార్గెట్…*మనీ కోసం రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు వృద్ధులే టార్గెట్….మోసపోయిన వాళ్ళ స్టోరీస్ ఏంటి అంటే?..సోషల్ మీడియాలో యువతుల తియ్యని మాటలు విని, నిజమేననుకొని నమ్మి కాల్ చేసి మోసిపోయిన వారు ఎందరో.న్యూడ్ కాల్స్ పేరుతో నిలువు దోపిడీ ఉదంతాలు ఎన్నో. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులే వీరి లక్ష్యం.కానీ తాజాగా రూటు మార్చిన అమ్మాయిలు వృద్ధులకు ఎర వేస్తున్నారు. వీరి వలకు చిక్కిన వృద్ధులు విలవిలలాడుతున్నారు.ఇటీవల కృష్ణా జిల్లా పెనమలూరు ప్రాంతానికి చెందిన పలువురు వృద్ధులు వీరి బారిన పడిన ఉదంతాలే ఉదాహరణ.పరువు పోతుందని రూ.7 లక్షలు పంపారు :ఆయన కానూరుకు చెందిన ఓ విశ్రాంత ప్రభుత్వ అధికారి (67). రెండు నెలల కిందట ఓ ఫోన్‌కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే స్క్రీన్‌పై ఓ అందమైన భామ ప్రత్యక్షమై తనను పరిచయం చేసుకుంది. తన భర్త దుబాయ్‌లో ఉంటారని, మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చి మూడ్రోజుల్లోనే వెళ్లిపోతారంటూ పేర్కొంటూ మాటలు కలుపుతూ తన ఒంటిపై వస్త్రాలను ఒక్కొక్కటిగా విప్పి పక్కన పడేసింది. అనంతరం రేపు మాట్లాడాతానంటూ ఫోన్ కట్ చేసిన పావుగంటకు వాట్సప్‌లో ఓ వీడియో వచ్చింది. అది కూడా ఆమె ఫోన్ నంబరు నుంచి రావడంతో అధికారి దానిని తెరిచారు. అది ఆమెతో జరిపిన నగ్న వీడియోకాల్ కావడంతో బెంబేలెత్తిపోయాడు.ఈలోగా మరో ఫోన్ వచ్చింది. ఈసారి తాను ముంబయికి చెందిన ఏసీపీనంటూ పోలీస్ డ్రస్‌లో ఉన్న ఓ అధికారి వీడియో కాల్‌లో ప్రత్యక్షమయ్యాడు. మహిళలకు ఫోన్లు చేసి నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడమని బెదిరిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, మీపై కేసు కట్టి అరెస్టు చేయడానికి వస్తున్నానంటూ చెప్పడంతో విశ్రాంత అధికారి భయపడిపోయి తన పరువుపోతుందని బతిమిలాడాడు. అరెస్టు కాకుండా ఉండాలంటే రూ.7 లక్షలు తాము చెప్పిన ఖాతాకు పంపాలనడంతో ఆ మొత్తాన్ని పంపారు. నాలుగు రోజుల తరువాత తనకు వచ్చిన ఫోన్‌కాల్స్‌పై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా అక్కడ తనలాగే మోసపోయిన మరో ముగ్గురు వృద్ధులు తారసపడడంతో అవాక్కయ్యారు.**మీతో పిల్లలు కలిగితే మహర్జాతకులు అవుతారు :..పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన ఓ వడ్డీ వ్యాపారి(70) పిల్లలు విదేశాల్లో స్థిరపడగా భార్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. ఓ రోజు రాత్రి ఇతడికి ఓ వీడియోకాల్ వచ్చింది. అందులో అందమైన మహిళ తెరపై ప్రత్యక్షమై తనది మహారాష్ట్ర అని, తన భర్తతో తనకు పిల్లలు లేరని మీ పేరు జాతకం ఉన్న వ్యక్తులతో పిల్లలు కలిగితే వారు మహర్జాతకులు అవుతారనని జ్యోతిష్కుడు తెలిపారంటూ మనసులో మాట బయటపెట్టింది.ఇదే విధంగా నాలుగు రోజులు సాగిన వీరి వీడియోకాల్ సంభాషణలకు ఐదో రోజు బ్రేకు పడింది. అనంతరం ఈయనకు వాట్సప్‌లో వచ్చిన ఓ వీడియోకాల్‌లో ఆమెతో మాట్లాడిన దృశ్యాలు ఉండడంతో అతడు కంగుతిన్నాడు. తనకు వెంటనే రూ.10 లక్షలు పంపకపోతే తాను పోలీస్ కేసు పెడతానంటూ ఆమె బెదిరించడంతో పరువుపోతుందనే భయంతో అతడు ఆ మొత్తాన్ని ఆమెకు రెండు విడతల్లో పంపాడు. చివరకు ఓ పోలీస్ అధికారికి తన మొర వినిపించి ఆమె ఉచ్చులోంచి బయటపడ్డాడు.లక్షల్లో వదిలించుకున్న మరో వృద్ధుడు :పోరంకికి చెందిన వృద్ధుడైన ఓ వ్యాపారి ఇటీవల ఓ యువతితో వీడియోకాల్‌లో సంభాషించి రూ.లక్షల్లో చెల్లించుకున్నాడు. తనను కాపాడలంటూ స్నేహితులతో మొరపెట్టుకొని వారి సలహా మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసి హనీట్రాప్ ఉచ్చులోంచి బయటపడ్డాడు.ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు మా దృష్టికి వస్తున్నాయని పెనమలూరు సీఐ టీవీవీ రామారావు తెలపారు. అనేక మంది బాధితులు ఈ ఉచ్చులో పడి రూ.లక్షలు పోగొట్టుకొంటున్నారని, పాకిస్థాన్ వంటి కొన్ని దేశాల నుంచి వచ్చే అనుమానిత వీడియోకాల్స్‌ను లిఫ్ట్ చేయకూడదని సూచించారు. లిఫ్ట్ చేసినా వారితో ఎక్కువ సేపు మాట్లాడకూడదని, మన దేశంలోనూ ఈ తరహా ఫోన్లు చేసే వారున్నారని, అప్రమత్తంగా ఉంటూ సకాలంలో పోలీసులకు సమాచారం అందిస్తే హనీట్రాప్ ఉచ్చులో చిక్కుకోకుండా ఉండవచ్చని అన్నారు.
????గ్యాంగ్ రేప్ నిందితుడు అరెస్టు…!
వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ యువతిపై గాంగ్ రేప్ కేసులో నిందితుడు గౌతం రెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు. పరారీలో గౌతం రెడ్డి స్నేహితుడు శివాజీ రెడ్డి… పరారీలో ఉన్న శివాజీ రెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులు..
????రన్నింగ్ బస్సులో మహిళపై అత్యాచారం.*
రన్నింగ్ బస్సులో మహిళపై అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కి..! మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలను ఒంటరిగా చూస్తే చాలు.. వారిపై దౌర్జన్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.ఈ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. నేరాలు మాత్రం ఆగడం లేదు.
కదులుతున్న బస్సులో ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నోటికి గుడ్డ పెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులో వచ్చింది. ఈ సంచలన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున జరగడంతో కలకలం రేపుతుంది.హరికృష్ణ ట్రావెల్ నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తుండగా ఓ మహిళ బస్సులో ఎక్కింది. అయితే అందులో ఇద్దరు డ్రైవర్లు మాత్రమే వున్నారు. ఎవరూ లేకపోవడంతో ఆ మహిళ ఇది ప్రకాశం వెళుతుందా? అని ప్రశ్నించింది.ప్రకాశం వెలుతుందని డ్రైవర్ తెలుపడంతో సీటులో కూర్చింది. అయితే బస్సులో ఎవరూ లేకపోవడం.. ఒంటరి మహిళ కావడంతో ట్రావెల్ డ్రైవర్ బస్సు అద్దాలను అన్నింటి క్లోజ్ చేశాడు. ఇది ఏసీ బస్సు అని ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె ఏమీ చెప్పలేకపోయింది. ఇద్దరు డ్రైవర్లు ఒక చోట బస్సును ఆపి ఆమె వద్దకు వచ్చారు.ఆమె పట్టుకుని నోట్లో గుడ్డను కుక్కారు. అయితే ఎవరికి అనుమానం రాకుండా.. ఒకరు బస్సును డ్రైవింగ్ చేస్తుండగా మరొకరు ఆమెపై అత్యాచారం చేశాడు. కదులుతున్న ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ ఈ దారుణానికి ఒడికడ్డాడు.
బస్సు ప్రయాణిస్తుండటంతో ఎవరికి ఏ అనుమానం కలగలేదు. అత్యాచారం అనంతరం బస్సు మధ్యలో ఆపి ఆమెను కిందికి దించి.. ఎవరికి చెప్పకూడదని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వెంటనే ఆ మహిళ డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. తనపై డ్రైవర్ అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. మేడ్చల్ సమీపంలో బస్ ఉండగా పోలీసులకు ఫిర్యాదు అందడంతో అప్రమత్తమైన సిటీ పోలీసులు బస్ కోసం గాలింపు చేపట్టారు.ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేజ్ చేసి పట్టుకున్నారు. హరికృష్ణ ట్రావెల్ సంబంధించిన ఇద్దరు డ్రైవర్లని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరిక్షలకోసం బాధితురాలిని హస్పటల్ కు తరలించారు. దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.

