తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖలో సుమారు రూ.1000 కోట్ల కుంభకోణం..తెదేపా నేతపై వైకాపా మూకల దాడి..’అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి..’కాకినాడలో రెచ్చిపోతున్న సారా మాఫియా..కొమరోలులో పందెం రాయుళ్ల అరెస్టు.

????ఘనవిజయంతో బోణి కొట్టిన తెలుగు తేజం పీవీ సింధు..పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో తన తోలి మ్యాచ్ లో బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఘన విజయం సాధించారు.గ్రూప్ స్టేజిలో మాల్దీవులకు చెందిన ఫతీ మాత్ పై 21-9, 21-6 తేడాతో గెలుపొందారు.????

????ఇంటి నిర్మాణానికి రూ.4,00,000..2024-25 నుంచి అమలు చేయనున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇవ్వనుంది. ఇందులో కేంద్రం తన వాటాగా రూ.2.50 లక్షలు అందించనుంది. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం అధికారులతో సమీక్షించనున్నారు.

???? అమరావతి: నేడు ఆర్టీసీ, రవాణాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం,బస్సుల సౌలభ్యంపై చర్చ..కర్ణాటక, తెలంగాణ లో ఫ్రీ బస్సు అమలుపై అధ్యయనం చేసే యోచన.

????స్కిల్ యూనివర్సిటీకి ఆగస్టు 1న సీఎం శంకుస్థాపన..రంగారెడ్డి జిల్లా కందుకూరు లోని మీర్‌ఖాన్‌పేట్‌లో స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు1న శంకుస్థాపన చేయనున్నారు. 57 ఎకరాల్లో రూ.100 కోట్లతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. యూని వర్సిటీని ఏర్పాటు చేసే స్థలాన్ని ఆదివారం రాత్రి మంత్రులు, అధికారులతో కలిసి రేవంత్ పరిశీలిం చారు. కొంగర నుంచి వర్సిటీ వరకు 200 అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయా లని సీఎం అధికారులకు సూచించారు..

????జగన్… అసెంబ్లీకి వెళ్ళినప్పుడు రాజీనామా చేయొచ్చుగా? *షర్మిల*..

అసెంబ్లీకి వెళ్లని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా పదవులకు రాజీనామా చేయాలన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్లో ధ్వజమెత్తారు.ఇంతకుముంచిన పిరికితనం, చేతగానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవని విమర్శించారు. మోసం చేయడం జగన్కు కొత్తేమీ కాదని, కానీ ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఇంత దారుణంగా మోసం చేయడం, అవమానించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనంగా అభివర్ణించారు.MLA అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక కావడానికా లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని ప్రశ్నించారు. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే, తాపీగా ప్యాలస్లో కూర్చుని మీడియా మీట్లు పెట్టడానికి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోలేదని పోస్ట్ చేశారు.ఐదేళ్ల అవినీతి, దోపిడీ పాలనతో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పులకుప్పగా మార్చేశారని ప్రభుత్వం చెబుతుంటే, ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత లేదా అని నిలదీశారు. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్లో ప్రశ్నించే బాధ్యత లేదా అని షర్మిల ప్రశ్నలు సంధించారు.అసెంబ్లీకి వెళ్లనని చెప్పే నాయకుడు ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కాదన్నారు. బడికి వెళ్లని పిల్లవాడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారని, ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారని, ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోనంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు, ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్కిటికా మంచులోకి పోతారో ఎవరికి కావాలన్నారు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల రెడ్డి పోస్ట్ చేశారు.సిగ్గు సిగ్గు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు.అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

????తెలంగాణలో సంచలనం..జీఎస్టీ  వెయ్యి కోట్ల కుంభకోణంలో సోమేశ్‌ కుమార్‌!!!.. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.* వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ నిందితులుగా ఉన్న ఈ కేసులో ఐదో నిందితుడిగా సోమేశ్‌ కుమార్‌ను చేర్చారు.వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకుని మరీ వీరు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.

???? రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖలో సుమారు రూ.1000 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైంది. ఈ మేరకు ఈ నెల 26న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ను ఏ-5 గా చేర్చారు. వాణిజ్య పన్నుల శాఖకు అప్పట్లో కమిషనర్గా వ్యవహరించిన సోమేశ్ కనుసన్నల్లోనే హైదరాబాద్ ఐఐటీ రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు పక్కదారి పట్టి ఖజానాకు నష్టం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదు మేరకు ఆ శాఖలో పనిచేస్తున్న అదనపు కమిషనర్ (సేల్స్ టాక్స్) ఎస్సీ కాశీ విశ్వేశ్వరరావు (ఏ-1), డిప్యూటీ కమిషనర్ శివరామ్ ప్రసాద్ (ఏ-2), ప్రొఫెసర్ శోభన్బాబు (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటీ హైదరాబాద్), ప్లియాంటో టెక్నాలజీస్ (ఏ-4)ను నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై ఐపిసి లోని 406, 409, 120-బి ఐటీ యాక్టులోని సెక్షన్ 65 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.వాణిజ్య పన్నుల శాఖలో గతేడాది డిసెంబరులో బిగ్ లీప్ టెక్నాలజీస్ అనే సంస్థ ఇన్పుట్ టాక్స్ పేరుతో రూ.25 కోట్లు మోసం చేసిందనే వ్యవహారంతో దర్యాప్తు మొదలుపెట్టగా శాఖలోని అధికారులే అందుకు సహకరించినట్టు తేలింది. దీంతో లోతుగా దర్యాప్తు చేసి అనుమానిత అధికారులకు నోటీసులు జారీచేయడం, వారి నుంచి వివరణలు రావడం, ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరగడం, తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం… ఈ తతంతమంతా జరిగిన తర్వాత హైదరాబాద్ ఐఐటీ రూపొందించిన సాఫ్ట్వేర్ లోని డేటా మొత్తం థర్డ్ పార్టీకి వెళ్లినట్టు తేలింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుకు సైతం ఇందులో సంబంధం ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తులో భాగంగా రూ.450 కోట్ల విలువైన కుంభకోణం జరిగినట్టు స్పష్టమైంది. ఇందులో రాష్ట్ర బేవరెజెస్ కార్పొరేషన్ సైతం లబ్ధిదారుగా ఉన్నట్టు పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ పేర్కొన్నారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ సూచనల మేరకే శోభన్బాబు ఆ సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్టు పోలీసులకు అర్థమైంది. ఈ విషయం గురించి నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరిస్తూ, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నుంచి ఫిర్యాదు వచ్చిందని, మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ సహా మొత్తం ఐదుగురిపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.దర్యాప్తు అనంతరం వివరాలు తెలుస్తాయన్నారు.

???? అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న నాటు సారా మాఫియా!!!….కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వేములపాలెం గోకవరం మధ్యలో యదేచ్చగా భారీ స్థాయిలో నాటు సారా తయారీ..పగలంతా నాటుసారా తయారీ రాత్రంతా రవాణా..ప్రభుత్వాలు మారిన నాటు సారా నియంత్రణలో మాత్రం ఎటువంటి మార్పు లేదు….స్థానికుల సమాచారం మేరకు గతంలో తుట్టా అప్పలరాజు నిర్వహిస్తున్న సారా బట్టిపై ఎక్ సైజ్ అధికారులు దాడులు చేసి సుమారు 2వేల లీటర్లు బెల్లపు ఉట ధ్వంసం చేశారు.అదే తుట్టా అప్పలరాజు మళ్ళీ నాటు సారా తయారీ చేసే బట్టి పెట్టి సారా కాస్తున్నాడు…ఎక్ సైజ్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా నాటు సారా కాస్తూ ప్రజల ప్రాణాలమీదకు తెస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

????KCR, KTR ఆస్తులు పణంగా పెట్టి ప్రాజెక్టులు కట్టలేదు..మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మించినప్పటి నుంచే లీకేజీలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాజెక్ట్ పునాదుల నుంచే సరిగా పనులు జరగలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ వారి ఆస్తులు పణంగా పెట్టి ప్రాజెక్టులు కట్టలేదని.. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి కట్టారని మండిపడ్డారు. ప్రాజెక్ట్ ను రిపేర్ చేయడానికే తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరంపై మంత్రి కేటీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని అన్నారు.

????తెదేపా నేతపై వైకాపా మూకల దాడి..రెంటచింతల : రాజకీయ విభేదాలతో ఆదివారం రాత్రి రెంటచింతల ఎర్రబాలెం కాలనీలో తెదేపా నేతపై దాడి జరిగింది.పోలీసుల వివరాల మేరకు.. గత ఎన్నికల సమయంలో వైకాపా నాయకులు తెదేపా నేత బోయిన మల్లయ్యపై గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. అప్పట్నుంచి ఎర్రబాలెంలో బీసీలు రెండు వర్గాలుగా మారారు.ఈక్రమంలో ఆదివారం రాత్రి మల్లయ్య దూషణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైకాపాకు చెందిన పేర్ల పిచ్చయ్య, పేర్ల శ్రీను, పేర్ల కోటయ్య, పేర్ల లింగయ్య కర్రలతో ఆయన ఇంటి పైకి వెళ్లారు. ఆ సమయంలో మల్లయ్య అందుబాటులో లేకపోవడంతో అతని బాబాయి చౌడయ్యపై దాడి చేశారు. దీంతో చౌడయ్యకు బీపీ పెరిగి నోటి వెంట రక్తం కారింది. స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే బంధువులు స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

????అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.హైదరాబాద్ కాటేదాన్‌కు చెందిన అక్షిత్ రెడ్డి(26) అనే యువకుడు అమెరికాలోని చికాగోలో మృతిచెందాడు. ఉన్నత చదువుల కోసం అక్షిత్ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 21న స్నేహితులతో కలిసి చికాగోలోని లేక్‌మిశిగన్‌లో ఈతకు వెళ్లగా, ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. శనివారం ఇండియా చేరుకోగా, నిన్న అంత్యక్రియలు పూర్తి చేశారు.

????పంద్రాగస్టున 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం..ఆగస్టు 15న తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ చివరికి అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం 3 భవన నిర్మాణాలే పూర్తవగా, వివిధ దశల్లో 103, టెండర్ల దశలో 77 క్యాంటీన్లు ఉన్నట్లు అధికారులు నివేదించారు. ఆహార సరఫరాకు టెండర్ల ప్రక్రియ వచ్చే వారంలో పూర్తికానుందని అధికారులు పేర్కొన్నారు.

????కోమరోలు: పందెం రాయులను పట్టుకున్న పోలీసులు..ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై ప్రకాశం పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు.ఈ నేపథ్యంలో కోమరోలు మండలంలో పోలీస్ అధికారులు అక్రమంగా పందేలు ఆడుతున్న పందెం రాయులను పట్టుకుని కోళ్లను, నగదును స్వాధీనం చేసుకున్నారు.చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించి మీకు ఏదైనా సమాచారం ఉంటే దయచేసి 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..