భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి.. జిల్లా అభివృద్ధిపై ప్రశ్నించిన ఎంపీ మాగుంట…కేంద్ర బడ్జెట్ లో ప్రకాశం జిల్లాకు పదివేల కోట్లు ప్రకటించాలి..సిపిఎం నిరసన

????భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
*చార్మినార్, భాగ్యలక్ష్మి అమ్మవారి* బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా పాల్గొని..అమ్మవారికి అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు .అనంతరం ఆయన మాట్లాడుతూ..భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని..కరోనా వంటి మహమ్మరులు రాకుండా అమ్మవారు ప్రజలందరిని కాపాడలని కోరుకోవడం జరిగిందన్నారు..గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారు.. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలి.. పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , తామంతా హైదరాబాద్ అభివృద్ధి పై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతున్నామని..అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డెజైన్ తో కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మిస్తాం..కొత్తగా హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నామని,హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిస్తున్న మూసి నదిని ప్రక్షాళన చేస్తున్నాం.అక్కడ టూరిస్ట్ స్పాట్స్ అభివృద్ధి  చేసి హైదరాబాద్ అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించాలని ముఖ్యమంత్రి  కృతనిశ్చయంతో ఉన్నారని..పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామన్నారు.హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్ లో 10 వేల కోట్ల నిధులు కేటాయించామన్నారు.. మేడిగడ్డ బ్యారేజి కుంగడంలో కుట్ర ఉందన్న బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలని అడిగిన విలేకర్ల ప్రశ్నకు..దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదని..మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆరే..అయినా కుట్రలు చేస్తే డ్యామ్ లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు..పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు..
???? ఘోర రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్ శివా రులో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు  సంబంధించిన వీడియో బయటకు వచ్చింది*
*సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శేఖర్ (25) దీపిక (23) తమ ఇన్నోవా కారులో గజ్వేల్ నుంచి బయలుదేరారు తుర్కపల్లి సమీపంలో కారణాలు అతివేగంగా నడపడంతో అదుపుతప్పి అవతలి రోడ్లో వెళ్తున్న బైక్ ను బస్సును ఢీకొట్టారు శేఖర్ దీపికా మరణించ గా బైకర్ గాయపడ్డాడు..ఈ దృశ ్యాలు  బస్సు వెనకాల వెళుతున్న కారు డాష్ బోర్డు కెమెరాలు రికార్డయ్యాయి.
???? దేశంలో ఆకాంక్ష జిల్లాల కార్యక్రమ పనితీరు – పెంపుదలపై మాగుంట ప్రశ్న..
దేశంలో ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం క్రింద జిల్లాల ఎంపికకు ప్రమాణాలు, పనితీరుపై పరిశోధనలు, నిధుల కేటాయింపు – వినియోగం, ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల పనితీరు మరియు పెంపుదల గురించి ప్రభుత్వ చర్యలపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన  ప్రశ్నకు కేంద్ర  గణాంకాల మరియు కార్యక్రమాల అమలు, ప్రణాళిక మరియు సాంస్కృతిక శాఖల సహాయక (స్వతంత్ర) మంత్రి, రావ్ ఇందేర్జిత్ సింగ్  సమాధానమిస్తూ –
శారీరక శ్రమపై ఆధారవడిన భూమి లేని గృహాలు, ఆరోగ్యం – పోషణ లేని గృహాలు, కుంగుబాటులోని పిల్లల, ప్రాధమికంగా వదలివేయబడిన పిల్లలు, విధ్యుత్ లేని గృహాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు లేని గృహాలు, నీటి వసతి లేని గ్రామీణ గృహాలు, ఉపాధ్యాయుల తక్కువ నిష్పత్తి మరియు  గ్రామీణ సడక్ యోజన లేని గ్రామాలు మొదలగు ప్రమాణాల ఆధారంగా ఆకాంక్ష జిల్లాలు  ఎంపిక చేయబడునని, ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని సమగ్రమైన అంచనా వేయుటకు రెండు సంస్థలు పనిచేస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం రూ. 34.2 కోట్లు మంజూరు చేయగా, అందులో అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ.10.19 కోట్లు,  పార్వతీపురం మన్యం జిల్లాకు రూ. 5.05 కోట్లు, విశాఖపట్నం జిల్లాకు రూ. 2.93 కోట్లు, విజయనగరం జిల్లాకు రూ.5.01 కోట్లు మరియు వై.ఎస్.ఆర్. కడప జిల్లాకు రూ.11.07 కోట్లు కేటాయించబడ్డాయని, ఈ మొత్తాలను కమ్యూనిటీ గ్రంధాలయాలు, పాఠశాల భవనాలు, తరగతి గదులు, అంగన్వాడి భవనాలు, వైద్యశాలలు, మరుగుదొడ్లు నిర్మాణాలతోపాటు మంచినీటి వసతులు, అంబులెన్సులు, మౌలికవసతులు, మధ్యాన్న బోజనాలు మొదలగు వాటికి  వినియోగిస్తూన్నారని కేంద్ర మంత్రి తెలియజేశారు.

???? నీతి ఆయోగ్ సమావేశ సందర్బంగా డిల్లీలో ముఖ్యమంత్రిని కలసిన మాగుంట*..
వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు రోడ్ షో తయారు చేసేందుకు ఈ రోజు డిల్లీలో రాష్ట్రపతి భవన్ సాంసృతిక భవనంలో ప్రధానమంత్రి అధ్యక్షతణ  జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంతి, నారా చంద్రబాబు నాయుడును కలిశారు.ఈ సమావేశంలో దేశంలో సంపూర్ణ పేదరికం నిర్మూలం కావాలంటే ప్రభుత్వ – ప్రైవేటు – ప్రజాస్వామ్య భాగస్వామ్యం, నదుల అనుసంధానం, సంపన్నులు పేదవారిని దత్తత తీసుకోవడం, నదులు – అన్ని రవాణా మార్గాలు అనుసంధానం, గ్రామ స్థాయి మౌలిక వసతులు కల్పన, పరిశ్రమల స్థాపన, హరిత ఇంధనం, ప్రపంచస్థాయి ఉత్పత్తుల తయారీ, డెమోగ్రాఫిక్ మేనేజ్మెంటు  తప్పక అవరసమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఎంతో గొప్పగా సూచినందుకు  నారా చంద్రబాబు నాయుడును  మాగుంట శ్రీనివాసులు రెడ్డి అభినందించారు.

???? పాఠశాలలలో డిజిటల్ విధ్యా సేవలు పెంపుపై పార్లమెంటులో మాగుంట ప్రశ్న..
దేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ విధ్యా సేవలు పంపుదల, గత ఇదు సంవత్సరాలలో కవర్ కాబడిన మరియు  మౌలిక సదుపాయాల కల్పనకు గుర్తింపబడిన పాఠశాలలు, సేవల పెంపుకు ప్రచార మరియు అవగాహన కార్యక్రమాల ఏర్పాటు గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు  పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విధ్యాశాఖ సహాయక మంత్రి,  జయంత్ చౌదరి  సమాధానమిస్తూ –
నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రకారం సాంకేతిక జోక్యాలవలన సాంకేతికతను నేర్చుకోవడం మరియు మూల్యాంకన ప్రక్రియ వృద్ధికావడం, భాషా అడ్డంకులు తొలగడం, ఉపాధ్యాయుల నైపుణ్యం – సమర్ధత పెరగడం, దివ్యాంగుల విధ్యా ప్రవేశాలు పెరుగుదల, విధ్యా ప్రణాళిక – నిర్వహణ – పరిపాలన అమర్చుటకు, ప్రవేశాలు, హాజరు, అంచనా మొదలగు వాటిని మెరుగుపరచడం జరుగునని తెలిపారు.
ఈ పాలసీ లక్ష్యాలు సాధించుటకు పి.యం. ఇ విద్య (PM e-VIDYA) డిజిటల్, ఆన్ లైన్, ఆన్ ఎయిర్ ఎడ్యుకేషన్ కు సంబందించిన అన్ని ప్రయత్నాలను ఏకం చేస్తుందని, దిశా, డి.టి. హెచ్ టి.వి. ఛానల్, రేడియో, సి.బి.ఎస్.ఈ., శిక్షా వాణి, డైసీ, దిక్షా, సమగ్ర శిక్ష మొదలగు కీలక భాగాలను  వినియోగించబడునని, దీంతో దేశం మొత్తంలో 25 కోట్ల మంది పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు ఉపయోగం కలుగుతుందని తెలిపారు.
ఈ పధకం క్రింద గత 2021-22 నుండి 2024-25  వరకు దేశం మొత్తంలో 44,025 లాబులు మరియు 1,26,881 సమర్దవంత తరగది గదులు ఏర్పాటు కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,687 లాబులు మరియు 5,190 సమర్దవంత తరగది గదులు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. డిజిటల్ ప్రారంభ కార్యక్రమాలను పలు ప్రింటు – సాంఘిక ప్రసార మాధ్యమాలు, జి -20 – ఎక్ష్ పో సదస్సులు, సమావేశాలు, ప్రదర్శనలు, శిక్షణా కార్యక్రమాలు, సైన్సు ప్రదర్శనలు, టెక్నో మేళాలు, విద్యార్ధి పరిషత్తులు, పుస్తక ప్రదర్శనల ద్వారా స్వయంప్రతిపత్తి సంస్థలు వృద్ధిచేస్తాయని కేంద్ర మంత్రిగారు తెలియజేశారు.

????కేంద్ర బడ్జెట్ లో ప్రకాశం జిల్లాకు పదివేల కోట్లు ప్రకటించాలి. సిపిఎం …  కేంద్ర బడ్జెట్లో ఏపీకి అప్పులు మూట తప్ప గ్రాంట్ ఏమీ ఇవ్వలేదని సిపిఎం జిల్లా  నాయకులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను ప్రజా అనుకూల బడ్జెట్ గా మార్చాలని ,కేంద్ర బడ్జెట్లో ప్రకాశం జిల్లా కు 10 వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాగర్ హోటల్ సెంటర్లో నిరసన ప్రదర్శన  సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ అధ్యక్షతన జరిగింది. ???? కార్యక్రమంలో  సిపిఎం జిల్లా కార్యదర్సి సయ్యద్ హనీఫ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడే విధంగా లేదని తెలిపారు.????కార్పోరేట్ వర్గానికి, సంపన్నులకు ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ రూపకల్పన చేశారని విమర్శించారు. సామాన్యులకు కేటాయించాల్సిన బడ్జెట్లో అనేక అంశాల్లో కోతలు విధించారని విమర్శించారు. ఆహార సబ్సిడీలపై కోతలు విధించారు ఉపాధి హామీ పథకానికి నిధులు కోత విధించారని, ఇతర సంక్షేమ పథకాలు కూడా కోతలు విధించారని విమర్శించారు. ????కార్పొరేటు,సంపన్న వర్గాలకు మాత్రం మరిన్ని రాయితీలు ఇచ్చి వారి ప్రయోజనాలు చేకూర్చేలా మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని దుయ్యబట్టారు.ఈ బడ్జెట్లో ఏపీ కి నిధులు కేటాయింపులు చేయకుండా అన్యాయం చేశారని విమర్శించారు.తాము ఎన్డీఏ పక్షానే ఉన్నామని చెప్పుకుంటున్న టిడిపి జనసేన పార్టీలు రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో తీవ్రంగా వైఫల్యం విమర్శించారు. అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు  అప్పు ఇస్తామని చెప్పేరు తప్ప గ్రాంటు ఇవ్వడానికి బడ్జెట్‌లో  ప్రతిపాదన ఏదీ లేదన్నారు. బిజెపి బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రం నిధులు భారీగాఉన్నాయన్నారు.అదే ఎన్డీఏ కూడా మీకు మద్దతు ఇస్తున్న బీహార్ ప్రభుత్వానికి కూడా భారీగా నిధులు కేటాయింపులు చేశారని విమర్శించారు. ఏపీకి మాత్రం అప్పుల తప్ప ఏమీలేదని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి నిధులు గ్రాండ్ల రూపంలో ఇవ్వాలని అప్పులు కాదని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాగా గుర్తిస్తూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారని ఇది ఆహ్వానించదగిన విషయమేనని కానీ ఈ జిల్లాకు నిధుల పరిస్థితి ఏమి చెప్పలేదని విమర్శించారు పదివేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ జిల్లాకు ప్రకటించి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఈరోజుకి కూడా వలసలు పోయి బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని దాని కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
????సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి కొండారెడ్డి మాట్లాడుతూ ఏపీ విభజన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు రాష్ట్రం అప్పుల కుప్పలాగా మారిపోయిందన్నారు. ఏపీ అభివృద్ధి కావాలంటే క్రేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలి తప్ప మరో మార్గం లేదన్నారు. కేంద్రం ఇచ్చే అరకొర నిధులతో రాష్ట్ర అభివృద్ధి జరగదన్నారు. ప్రత్యేక హోదా సాధించడంలో  రాష్ట్ర ప్రభుత్వం  చిత్తశుద్ధితో వివరించడం లేదని, కేంద్రానికి బేసరత్తుగా మద్దతు ఇస్తున్నారు తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. విభజన చట్టంలో ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాగా గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని జిల్లాకు ప్రకటించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
???? సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు ఎస్ కె  మాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శ్యేతపత్రాలు విడుదల చేసి లోటు ఈ పేరుతో ప్రజలపై పన్నుల  భారాలు మోపితే సహించమని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.ముందుగా సుందరయ్య భవనము నుండి కర్నూలు రోడ్డు మీదగా సాగర్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన  కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ  సభ్యులు కంకణాల ఆంజనేయులు ,చీకటి శ్రీనివాసరావు, ఎం రమేష్ , ఊసా వెంకటేశ్వర్లు, వెల్లంపల్లి ఆంజనేయులు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ మండల కార్యదర్శులు ,శాఖా  కార్యదర్శులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..