పార్లమెంట్‌లో ‘నీట్’పై రగడ”..బాబాయి హత్యపై ధర్నా చేయలేదేం?..వీధి కుక్కల నుంచి కాపాడాలంటూ చిన్నారుల ర్యాలీ..ప్రజా ఫిర్యాదుల పరిష్కారమే పరమావధి..ప్రకాశం జిల్లా ఎస్పీ…

????పార్లమెంట్‌లో ‘నీట్’పై రగడ”..నీట్ పేపర్ లీక్ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమా వేశాల నేపథ్యంలో తొలిరోజే నీట్‌ కేంద్రంగా అధికార, విప క్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి.సభ ప్రారంభం కాగానే నీట్‌

పేపర్‌ లీక్‌ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభ మైంది. విపక్షం తరుపున కేసీ వేణుగోపాల్, అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీలు ప్రశ్నలు సంధించగా…విపక్ష సభ్యుల ప్రశ్నలకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు.నీట్‌ పేపర్‌ లీక్ చాలా పెద్ద సమస్య అని రాహుల్‌ గాంధీ అన్నారు.ఈ సమస్యను మూలాల నుంచి పెకిలించాల్సి ఉందని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ తనను తప్ప అందరినీ తప్పుపడుతున్నా రని… డబ్బునోళ్లు పేపర్లు కొని వ్యవస్థను అపహాస్యం పాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.డబ్బులు ఉన్న వాళ్లు విద్యా వ్యవస్థనే కొనేస్తున్నారుని ఆరోపించారు. పేపర్‌ లీక్‌ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని విపక్షనేత రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు…

????బాబాయి హత్యపై ధర్నా చేయలేదేం?: షర్మిల..జగన్ హత్యా రాజకీయాలు చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.సొంత చెల్లెళ్లకు జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు.వివేకా హంతకులతో జగన్ కలిసి తిరుగుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ఉండకుండా జగన్ ఏం చేస్తారని ప్రశ్నించారు.వినుకొండ హత్య వ్యక్తిగత హత్యేనని.. రాజకీయమైంది కాదన్నారు.

???? వీధి కుక్కల నుంచి కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ లో చిన్నారుల ర్యాలీ ఇటీవల కాలంలో ఒకటి తర్వాత ఒకటి చొప్పున వీధి కుక్కల కారణంగా చిన్నారుల ప్రాణాలు పోతున్న వైనం తెలిసిందే. ఇటీవల కాలంలో ఒకటి తర్వాత ఒకటి చొప్పున వీధి కుక్కల కారణంగా చిన్నారుల ప్రాణాలు పోతున్న వైనం తెలిసిందే. ఇటీవల ఇలాంటి దారుణం చోటు చేసుకోవటం తెలిసిందే. ఇలాంటివేళ.. హైదరాబాద్ మహానగరంలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్సీఎల్ కాలనీ నార్త్ కు చెందిన పలువురు చిన్నారులు.. తాజాగా చేపట్టిన ఒక ర్యాలీ అందరిని ఆకర్షించింది. సీఎం రేవంత్ అంకుల్.. మమ్మల్ని కాపాడండి అంటూ ప్లకార్డులు పట్టుకున్న చిన్నారులు తమ బుడిబుడి అడుగులతో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీ చేపట్టారు.వీరికి వారి తల్లిదండ్రులు తోడయ్యారు. రెండు రోజుల క్రితం కాలనీలోని బుక్ స్టోర్ లో పని చేసే మన్సూర్ పై వీధి కుక్క ఒకటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. దీంతో.. కాలనీలోని పిల్లలంతా ఒకటి చేరి.. తాము ఎదుర్కొంటున్న వీధి కుక్కల సమస్యను ప్రభుత్వం వరకు వెళ్లేందుకు వీలుగా వినూత్న రీతిలో ర్యాలీ చేపట్టారు. సీఎం అంకుల్.. ఎమ్మెల్యే అంకుల్.. కమిషనర్ అంకుల్.. అంటూ తమ సమస్యను తెలిపేలా ప్లకార్డులు పట్టుకున్న పిల్లలు పెద్ద ఎత్తున చేపట్టిన ర్యాలీ హైదరాబాద్ లోని మిగిలిన కాలనీలకు స్ఫూర్తిగా మారింది. తాము ఎదుర్కొంటున్న సమస్య మీద పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినా పరిష్కరించని కొంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీహరిపై చర్యలు తీసుకోవాలంటూ కాలనీ పేరెంట్స్ పలువురు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. గడిచిన రెండున్నరేళ్లలో 70 మందిని వీధి కుక్కలు గాయపర్చినట్లుగా పేర్కొన్నారు. వాటి బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

????జగన్ రఘురామ చనుకులు…అసెంబ్లీలో కనిపించిన వెంటనే వైఎస్ జగన్‌ని పలకరించిన ఆర్ఆర్ఆర్.ప్రతిరోజు అసెంబ్లీకి రా.. ప్రతిపక్షం లేకపోతే ఎలా? అంటూ జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడిన రఘురామ.అసెంబ్లీకి రెగ్యులర్ వస్తా.. మీరే చూస్తారుగా అని బదులిచ్చిన జగన్.అసెంబ్లీ హాల్‌లో జగన్‌ భుజంపై చేయి వేసి కాసేపు మాట్లాడిన రఘురామ కృష్ణం రాజు.తనకు జగన్ పక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్‌ను కోరి రఘురామ.తప్పని సరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ వెళ్లిన కేశవ్.రఘురామను పలకరించి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

????వైఎస్ఆర్సిపి ప్రాథమిక సభ్యత్వానికి, గుంటూరు నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్..అమరావతి..తన రాజీనామా లేఖను వైఎస్ఆర్సిపి అధినేత జగన్ కు పంపిన మద్దాల గిరిధర్..

????జిల్లాలో మహిళలు, పిల్లల భద్రతకు పెద్దపీట వేస్తున్న జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్..ప్రకాశం జిల్లా…
జిల్లాలో ఎవరైనా మహిళలు, పిల్లలుపై అసభ్యకరంగా ప్రవర్తించినా, అఘాయిత్యాలు, లైంగిక దాడులకు పాల్పడినా ఉపేక్షించేది లేదు.. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన పలు పోలీస్ స్టేషన్ల ఆకస్మిక తనిఖీలకు వెళ్లిన జిల్లా ఎస్పీ సత్వరం ఒక బాధితురాలికి న్యాయం చేకూర్చారు. బాధితురాలు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా మహిళలు, పిల్లలుపై అసభ్యకరంగా ప్రవర్తించినా, అఘాయిత్యాలు, లైంగిక దాడులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో మహిళలు, పిల్లల భద్రతకు వారిపై నేరాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తమ పిర్యాదుపై జిల్లా ఎస్పీ స్యయంగా స్పదించి సత్వరమే తమకు న్యాయం జరిగేలా చేసిన జిల్లా ఎస్పీ కి పోలీసులకు బాధితురాలు వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

????9వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ -2024 పోటీల్లో పతకాలు సాధించిన సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్…జూన్ 24 నుండి 30 వరకు అస్సాంలో జరిగిన 9వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ -2024 జాతీయస్థాయి పోటీలలో ఏపీ పోలీస్ శాఖ నుండి ప్రాతినిథ్యం వహించి జాతీయ స్థాయి జరిగిన పోటీల కోసం ఒంగోలులోని పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ (డిటిసి) నందు అద్భుతంగా శిక్షణ పొంది తైక్వాండో, కరాటే పెంచాక్ సిలాత్ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చేసి పతకాలు సాధించారని, ఒకవైపు పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్రీడల పట్ల ఉన్న ఆసక్తితో నిరంతర సాధన చేస్తూ జాతీయస్థాయిలో పతకాలు సాధించడం చాలా గొప్ప విషయమని ప్రసంశించారు. రాష్ట్రం నుండి జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం రాష్ట్ర పోలీస్ శాఖకు గర్వకారణమన్నారు. అలాగే భవిష్యత్తు లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాక్షించారు.???? ప్రజా ఫిర్యాదుల పరిష్కారమే పరమావధి..సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం..ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి 92 ఫిర్యాదులు..ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్…ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్‌) కార్యక్రమంను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నిర్వహించారు.

????రోడ్డు ప్రమాదం పలువురికి గాయాలు..
మార్కాపురం.. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామ సమీపంలో ఓ కారు అదుపుతప్పి బోల్తాపడంతో పలువురికి గాయాలైన సంఘటన సోమవారం జరిగింది.కంభం నుండి మార్కాపురం వైపు వెళుతున్న కారు తిప్పాయపాలెం సమీపంలోకి వెళ్ళగానే ప్రమాదవశాత్తు పొలాల్లోకి దూసుకెళ్ళింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి.ప్రమాద సమయంలో అక్కడే ఉన్న రాచర్ల మండలం చోళ వీడు పంచాయతీ సర్పంచ్ గోతం వెంకటనారాయణ గాయపడ్డ వారిని అంబులెన్స్ సహాయంతో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…

**అనకాపల్లి జిల్లా పోలీసు 6వ విడతలో రికవరీ చేసిన 176 (రూ.25 లక్షల విలువగల) మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక….ఇప్పటి వరకు మొత్తం సుమారు 3500 ఫిర్యాదులు నమోదు కాగా, మొత్తం 6 విడతల్లో 1,756 మొబైల్ ఫోన్లు సుమారు రూ.2 కోట్ల, 45 లక్షల విలువ గలవి, ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ అందజేశారు…

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..