జగన్ పై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు..ప.గో జిల్లాలో హత్య.. కత్తితో నరికిన మహిళ.. రొట్టెల పండుగలో పాల్గొన్న ఎంపీ మాగుంట.. అమెరికాలో గుంటూరు యువకుడు మృతి.. అప్పు అడిగినందుకు హత్య చేశారు.మోటర్ వెహికల్ ఇన్స్ పెక్టర్ ఆకస్మిక తనిఖి..

???? జగన్‌ పై జనసేన పార్టీ ముఖ్య నేత నాగబాబు మండిపడ్డారు. వినుకొండలో రషీద్‌ హత్య వ్యవహారంలో జగన్‌ శవ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాకముందే విమర్శలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న జగన్‌ డిమాండ్‌ పై నాగబాబు మండిపడ్డారు.

దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని దుర్మార్గ పాలన జగన్‌ హయాంలోనే చూశామని గుర్తు చేశారు. జగన్‌ ను అధికారంలోకి తీసుకురాకుండా ప్రజలు తమను తాము కాపాడుకున్నారని తెలిపారు. శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా ఉండేందుకే ధర్నా పేరుతో ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపించారు. జగన్‌ శవ రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా జగన్‌ బుద్ధి మార్చుకోవడం లేదని ఫైరయ్యారు. జగన్‌ పాలనలో సామాన్య ప్రజలు నోరెత్తాలంటే భయపడి పోయారని నాగబాబు గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన నీతులు వల్లించడం అసలు బాలేదన్నారు. వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవతో జరిగిన హత్యను రాజకీయంగా వాడుకోవడానికి శోచనీయమన్నారు. వినుకొండలో రషీద్‌ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదని నాగబాబు స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో అతను హత్యకు గురయ్యాడని చెప్పారు. తాము ఈ హత్యను సమర్థించడం లేదని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామని తెలిపారు. గత జగన్‌ పాలనలో ఎన్నో దారుణాలకు పాల్పడ్డారని నాగబాబు గుర్తు చేశారు. అమాయకులను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తేనే భౌతిక దాడులు చేసి కొట్టారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రతిపక్ష నేతలపై కేసులు కూడా పెట్టారని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిపారేశారన్నారు. ఐపీఎస్‌లను వైసీపీ నాయకులుగా మార్చి పని చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత జగన్‌ ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై పెట్టిన కేసులకు హద్దే లేదని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దందాలకు అమాయకులైన అధికారులు బలయ్యారన్నారు.

???? నెల్లూరులో మొహరం పండుగ సందర్భంగా బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీనివాసులు రెడ్డి …
????నేడు విజయవాడ లోని మాగుంట కార్యాలయం లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రైల్వే గతిశక్తి అధికారి శ్రీనివాస్,ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధికారి శ్రీనివాస్ తో టంగుటూరు, సూరారెడ్డి పాలెం, కరవది, అగ్రహారం గేట్ త్వరతగతిన పూర్తి చేయాలని మరియు రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు.
???? ఒంగోలు పట్టణంలో
సీజనల్ వ్యాధులపై తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా మండలస్థాయి అధికారులతో విక్షణ సమావేశం నిర్వహించారు ..
????మోటర్ వెహికల్ ఇన్స్ పెక్టర్ ఆకస్మిక తనిఖి…
ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సుల పై కొరడ..
నాలుగు స్కూల్ బస్సుల పై కేసు నమోదు, 50 వేలు జరిమానా…ప్రకాశంజిల్లా పొదిలిలో ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సుల పై దర్శి మోటర్ వైకిల్ ఇన్స్ పెక్టర్ రవికుమార్ ఆకస్మికంగా తనిఖి చేసారు.స్కూల్ పిల్లలను తరలించే బస్సులు సరైన కండిషనల్ లో లేక పొవడంతో 4 బస్సులకు 50,000 జరిమాన విధించినట్లు ఆయన తెలిపారు.చిన్నారులను తరలించే స్కూల్ బస్సులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని, అన్ని రక్షణ చర్యలు పాటించాలని ఆయన కొరారు.ప్రైవేటు స్కూల్స్ నియమ నిబంధనలు పాటించకుండా చిన్నారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు._
*????హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన నిందితులు..దర్యాప్తులో కేసును చేధించిన పోలీసులు.
*హత్యకు పాల్పడ్డ నలుగురు అరెస్ట్ : సీఐ పులిశేఖర్ ..అన్నమయ్య జిల్లా పీలేరు ..
గుర్రంకొండ ఏనుగులచెరువుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా పోలీసులు చెందించి నలుగురిని అరెస్టు చేశారు. వాల్మీకిపురం సిఐ పులిశేఖర్, గుర్రంకొండ ఎస్ఐ నాగార్జునరెడ్డి కథనం.. గుర్రంకొండ పెద్దమండెం రోడ్డు లోని, ఏనుగులచెరువుకట్టపై గతనెల 10న సంఘ సముద్రంకు చెందిన గంటా రామకృష్ణ(48), గుర్తుతెలియని వాహనం ఢీకొని చనిపోయాడన్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడడంతో సంఘ సముద్రానికి చెందిన కే.మల్లికార్జు (30), సద్దాం, వెంకటేష్, ఎల్లంపల్లికి చెందిన ప్రకాష్ లు పథకం హత్యచేశారని టెక్నికల్ ఆధారాలు లభించడంతో నిందితులను శనివారం అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం నిందితులుగా నిర్ధారించి, అరెస్టు చేశామని సీఐ, ఎస్ఐ లు తెలిపారు
???? గుంటూరు:తెనాలి కి చెందిన తాడిబోయిన రవి తేజ(28) అనే యువకుడు అమెరికాలో స్విమ్మింగ్ ఫుల్ లో జారిపడి మృతి.
అమెరికాలో టెక్సాస్ లోని ఆస్టిన్ సిటీలో 18న ఘటన.
????అప్పు అడిగినందుకే మహిళను హత్య చేశారు..
ముత్తారంలో ఇంట్లో చంపి గొనసంచిలో మూటకట్టి బావిలో వేశారు..హత్యలో పాల్గొన్న ముగ్గురు అరెస్ట్..
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో గత నెల 8వ తేదీన బావిలో మూటలో దొరికిన మహిళ అప్పు అడిగినందుకే మహిళను హత్య చేశారని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. మంథని పోలీస్ స్టేషన్ లో శనివారం సమావేశంలో మంథని సీఐ వెంకటేశ్వర్లు, ముత్తారం ఎస్ఐ మధుసూధన్ రావులతో కలిసి నిందితుల వివరాలను తెలిపారు. ఈ నెల 5వ తేదీన ముత్తారంకు చెందిన అమ్ము రజీత అలియస్ లావాణ్య తన ఇంటి సమీపంలో ని పెరక రాజేశ్వరి (65) వద్ద అప్పు లక్ష 50 వేలు అప్పు తీసుకుందని, రాజేశ్వరి తరుచూ అప్పుడబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఆగ్రహంతో 8వ తేదీన అప్పు ఇస్తానని రాజేశ్వరిని ఇంటికి పిలిచిన లావణ్య మరో వ్యక్తి కుక్కముడి తిరుపతితో పాటు భర్త రవి అలియాస్ రమేష్ తో కలిసి ఇంట్లో గొంతు నులిమి చంపి అదే రాత్రి గొనసంచిలో మూటకట్టి బావిలో పారుపల్లికి వేళ్లే వ్యవసాయ బావిలో వేశారన్నారు. హత్యలో పాల్గొన్న ముగ్గురిని శనివారం ఉదయం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మధుసూధన్ రావు లు అరెస్ట్ చేశారని తెలిపారు. అప్పు ఇచ్చిన రాజేశ్వరి తమను తరచుగా డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులు పెట్టేదని, అందుకే ఆమెను హత్య చేసి రాజేశ్వరి ఒంటి పై ఉన్న బంగారం తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందుతులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చమన్నారు. హత్య చేసిన నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ, ఎస్ఐ లతో పాటు కానిస్టేబుల్స్ దుబాసి రమేష్, బాలగాని కిరణ్ లను ఏసీపీ అభినందించారు.
????ప.గో జిల్లాలో హత్య.. కత్తితో నరికిన మహిళ*..
ప.గో. జిల్లా: నరసాపురం మండలం వేములదీవిలోని సర్దుకొడప గ్రామంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం. చినమైనవానిలంకకు చెందిన మైల చంద్రశేఖర్(38)ను సర్దుకొడపకు చెందిన మహిళ ఆమె ఇంటిలోనే కత్తితో తలపై నరికింది. చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంద్రశేఖర్కు భార్య, ఇద్దరు పిల్లలు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..