మోదీది ఉత్త డప్పు..సీఎం రేవంత్..వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై ?..ప్రకాశం జిల్లాలో 28ఎర్రచందనం దుంగలు స్వాధీనం..వినుకొండ మర్డర్ వెనుక బ్యాక్ గ్రౌండ్?..వైద్యాధికారి రంగారావుకు ప్రమాదం..కమిషనర్ శాంతి అక్రమాలు..

????మోదీది ఉత్త డప్పు.. మనం ఎంతో చేస్తున్నా ఇంతేనా ప్రచారం.. రేవంత్!అసలు తాము చేసిన పని జనంలోకి వెళ్లకపోవడాన్ని తీవ్ర వైఫల్యంగానూ ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మోదీ సర్కారు పావలా పనిచేసి ముప్పావలా ప్రచారం చేసుకుంటోంది.. వారిదంతా డప్పు..కానీ మనం ఎంతో చేస్తున్నం.. కానీ, ప్రచారం ఏదీ..? అనేది అభిప్రాయంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. ‘‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పుడే కాదు.. పదేళ్లలో చేసింది చాలా తక్కువ.. కానీ ప్రచారం మాత్రం చాలా గొప్పగా చేసుకుంటోంది.. మనం ఏడేళ్లలోనే రూ.30 వేల కోట్ల రైతు రుణమాఫీని అమలు చేశాం. దేశానికే ఆదర్శంగా నిలిచాం.. కానీ, ప్రచారం మాత్రం లేదు. ఎందుకిలా?’’ అని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు తాము చేసిన పని జనంలోకి వెళ్లకపోవడాన్ని తీవ్ర వైఫల్యంగానూ ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మోదీ పదేళ్లలో చేయలేని దానిని తాము ఏడు నెలల్లో చేసి చూపామనేది రేవంత్ భావన. మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో మోదీ సర్కారును మించి చేశామనేది ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది. డిసెంబరులో అధికారంలోకి వచ్చింది మొదలు ఒక్కొక్కటిగా పథకాలను పట్టాలెక్కించిన తీరును ఆయన గుర్తుచేస్తూ..వాటికి తగిన ప్రచారం లభించకపోవడం పట్ల డిజప్పాయింట్ మెంట్ తో ఉన్నట్లు చెబుతున్నారు.ఇదే సమయంలో మోదీ సర్కారు చాలా తక్కువగా చేసి.. అత్యంత ఎక్కువ ప్రచారం చేసుకుంటున్న తీరును రేవంత్ ప్రస్తావించినట్లు విశ్లేషకులు.మోదీ పదేళ్లలో చేయలేని దానిని తాము ఏడు నెలల్లో చేసి చూపామనేది రేవంత్ భావన. మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో మోదీ సర్కారును మించి చేశామనేది ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది. డిసెంబరులో అధికారంలోకి వచ్చింది మొదలు ఒక్కొక్కటిగా పథకాలను పట్టాలెక్కించిన తీరును ఆయన గుర్తుచేస్తూ.. వాటికి తగిన ప్రచారం లభించకపోవడం పట్ల డిజప్పాయింట్ మెంట్ తో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మోదీ సర్కారు చాలా తక్కువగా చేసి.. అత్యంత ఎక్కువ ప్రచారం చేసుకుంటున్న తీరును రేవంత్ ప్రస్తావించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.మనం చేసిన మంచిని చెప్పండి.. ఇక ఇలాగైతే లాభం లేదని.. మనం చేసిన మంచి పని ఏమిటో ప్రజలకు చెప్పాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలను రేవంత్ కోరినట్లుగా తెలుస్తోంది. ఆ మంచిని ప్రతి మూలకు తీసుకెళ్లాలని.. ప్రతి మనిషికి తెలియజేయాలని సూచించినట్లు సమాచారం. దేశంలోని మరే పార్టీ ప్రభుత్వమూ ఒకే విడతలో రూ.31 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయలేదని.. మరి దీనిని బాగా ప్రచారం చేయాలని ఆదేశించినట్లు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.7 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రేవంత్ సర్కార్ రూ.2 లక్షల రుణాన్ని ఆగస్టు 15లోగా మాఫీ చేయాలని లక్ష్యం పెట్టుకుంది.” మనమే ఆదర్శం.. దేశానికి చెప్పండి రైతు రుణ మాఫీ ద్వారా తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. ఈ విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలను రేవంత్ కోరారు. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘనతగా దీనిని ప్రచారం చేయాలని ఆయన సూచించారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల రుణ మాఫీపైనే కాదు.. ఏడు నెలల్లో అందించిన సంక్షేమ పథకాలపైన సరైన ప్రచారం చేసుకోలేకపోయిందని రేవంత్ ఒకింత డిజప్పాయింట్ మెంట్ తో ఉన్నట్లు తెలుస్తోంది.

????వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై ?..వైసీపీలో నెంబర్ టూగా వెలుగొందిన రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీలో ఒంటరైపోయారా? జగన్ కూడా ఆయనను పట్టించుకోవడం లేదా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.తనపై ఆరోపణలు రావడం వెనుక ఉన్నది సొంత పార్టీ నేతలే అని విజయసాయి చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీకి గుడ్బై చెప్పనున్నారని సమాచారం. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో తనకున్న పరిచయాలను ఆధారం చేసుకుని కమలం గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారట.

????వినుకొండలో జరిగిన రషీద్ మర్డర్..????

దాని వెనుకున్న బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవాలంటే కొన్నేళ్ల ముందుకు వెళ్లాలి. అప్పుడు మాత్రమే ఈ హత్యకు నేపథ్యం తెలుస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే.. రషీద్ మర్డర్ దారుణం. అలాంటివి జరగకూడదని బలంగా నమ్ముతున్నాం. కాకుంటే.. ఏదైనా దారుణం జరిగినప్పుడు దాని వెనుకన్న విషయాల్లోకి వెళ్లకుండా.. పైపై విషయాలు.. ప్రచారంలోకి వచ్చిన వివరాల్ని మాత్రమే చూస్తే..అసలు నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా కనిపిస్తాయి. హత్యకు గురైన రషీద్.. హత్యకు పాల్పడిన షేక్ జిలానీలు ఇద్దరూ ఒకప్పుడు స్నేహితులే. ఈ ఇద్దరు యువకుల మధ్య చంపుకునే శత్రుత్వం ఎందుకు వచ్చిందన్నది ఆసక్తికరం. ఈ ఇద్దరు యువకులు వైసీపీలో క్రియాశీలంగా పని చేసే వారే. వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అండదండలతో వినుకొండలో హడావుడి చేసే పీఎస్ ఖాన్ గ్యాంగ్ లో రషీద్.. జిలానీలు మెంబర్లు. అయితే.. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. కాలక్రమంలో ఈ ఇద్దరు స్నేహితుల మధ్య అధిపత్య పోరు మొదలైంది. దీంతో వీరి దారులు వేరయ్యాయి. అక్కడి నుంచి నేను గొప్పంటే.. నేను గొప్ప.. అన్నది షురూ అయ్యింది. అది కాస్తా వారిద్దరి మధ్య స్నేహాన్ని చిదిమేసి.. చంపుకునే వరకు వెళ్లింది. ఈ స్టోరీలో ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. వినుకొండలో ప్రతి ఏడాది తొలి ఏకాదశి పండుగ రోజు ‘కొండ తిరునాళ్లు’ నిర్వహిస్తుంటారు. గత ఏడాది (2023) తిరునాళ్ల సందర్భంగా గ్యాంగ్ లీడర్ ఖాన్ ఒక లాడ్జిలో పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో గొడవ జరిగింది. ఆ రోజు జిలానీ బీర్ బాటిల్ తో దాడి చేయటంతో ఒక కుర్రాడు గాయపడ్డాడు. ఈ ఉదంతంలో గ్యాంగ్ లీడర్ ఖాన్.. గాయపడిన కుర్రాడికి చెందిన రషీద్ కు మద్దతుగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. బీర్ బాటిల్ తో దాడికి పాల్పడిన జిలానీ ఇంటిపై జులైలో రషీద్ తో పాటు.. ఖాన్ గ్యాంగ్ లోని కొందరు జిలానీ ఇంటిపై దాడికి పాల్పడ్డారు.ఇంట్లోని వస్తువుల్ని ధ్వంసం చేశారు. ఇంటి ముందున్న బుల్లెట్ బండిని తగలపెట్టారు. దాడి వేళలో జలానీ ఇంట్లో లేడు. అతడి అన్న జిమ్ జానీ ఉండటంతో అతడ్ని కొట్టారు. దీనిపై అప్పట్లో పోలీసులకు కంప్లైంట్ అందినా.. అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి జోక్యంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన ఇంటిపై జరిగిన దాడిపై కేసులు కట్టాలని జిలానీ ప్రయత్నించాడు. కానీ. కుదర్లేదు సరికదా..జిలానీ మీదే హత్యయత్నం కేసు పెట్టి జైలుకు పంపారు. జిలానీ.. అతడి సోదరుడి మీద మరిన్ని కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు. దీంతో.. తన పరిస్థితికి కారణమైన రషీద్ మీద జిలానీ కక్ష పెంచుకున్నాడు. కట్ చేస్తే.. ఈ ఏడాది తొలి ఏకాదశి రోజున తనకు జరిగిన దానికి బదులు తీర్చుకునేందుకు కొబ్బరిబోండాల కత్తితో నడి వీధిలో రషీద్ను జిలానీ నరికి చంపేశాడు. ఈ దారుణ హత్య వెనుక స్టోరీ ఇంత ఉంది. ఏడాదికి పైగా నేపథ్యముంది.???? వినుకొండలో జరిగిన రషీద్ హత్య ఎపిసోడ్ మొత్తం వ్యక్తిగత కక్షలతోనే అయినప్పటికీ దానికి రాజకీయ రంగును పులిమి నానా హడావుడి చేస్తున్నారు.రషీద్ మర్డర్ పూర్తిగా వ్యక్తిగత కక్షలే కారణమన్న విషయాన్ని గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి.. పల్నాడు ఎస్పీ కే శ్రీనివాసరావులు చెబుతున్నారు. అయినప్పటికీ.. ఇది రాజకీయ హత్యగా ప్రచారం చేస్తుండటం గమనార్హం.

????తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ని బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు, ఏ9 న్యూస్ టీవి ఫౌండర్ చైర్మన్ షేక్. ఖలీఫాతుల్లా బాషా,తాడేపల్లిలోని మంత్రి నారా లోకేష్ చాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

???? ప్రకాశం జిల్లాలో 28ఎర్రచందనం దుంగలు స్వాధీనం..కారుతో సహా ముగ్గురు అరెస్టు..

ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో 28ఎర్రచందనం దుంగలతో పాటు, ఒక కారును స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ చెంచుబాబు సూచనల మేరకు కడప సబ్ కంట్రోల్ ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ నరేష్ టీమ్, అటవీ సిబ్బంది సహకారంతో గురువారం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం వైపు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేసుకుని వెళ్లారు. అర్ధరాత్రి ప్రకాశం టెరిటోరియల్ ఫారెస్టు డివిజన్ బెస్తవారి పేట రేంజి తాటిచెర్ల సెక్షన్, నల్లకుంట్ల అటవీ బీటు పరిధిలోని అక్కాపల్లి చెరువు చేరుకున్నారు. అక్కడ ఒక కారు నిలిచి ఉండగా,అందులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. దీంతో వారిని టాస్క్ ఫోర్సు సిబ్బంది చుట్టుముట్టగా, వారు వాహనం వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించి ముగ్గురిని పట్టకోగలిగారు. కింద 11 దుంగలు,కారులో 17 దుంగలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ కు చెందిన పేరం రామరాజు (44), సంచర్ల పంచాయితీ రామేశ్వరం గ్రామానికి చెందిన రాచకొండ రామయ్య (25), క్రిష్ణంశెట్టి పల్లి మండలం షేక్ ఖాసిం (43)లుగా గుర్తించారు. పేరం రామరాజు అనే వ్యక్తికి తమిళనాడుకు చెందిన స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తెలిసింది. ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో నమోదు చేయగా, సీఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.

????రోడ్డు ప్రమాదంలో వైద్య అధికారికి తీవ్ర గాయాలు..

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాలలో బోల్తా పడ్డ సంఘటన జరిగింది.ఈ సంఘటనలో గిద్దలూరు కు చెందిన రంగారావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ రంగారావును గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. రంగారావు ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారిగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో విధులు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు…

????విశాఖపట్నం: దేవాదాయశాఖలో సహాయ కమిషనర్ కె.శాంతి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. వైకాపా పాలనలో ఆమె హయాంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని దేవాదాయశాఖలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా లీజుల కేటాయింపు, అనర్హులను పాలకమండలిసభ్యులుగా నియమించడం వంటివి జరిగాయి.ఆమెకు మొదటి పోస్టింగు విశాఖ జిల్లాలోనేఇచ్చారు. 2020 ఏప్రిల్ 24 నుంచి 2022 జూన్ 30వరకు సహాయ కమిషనర్గా చేశారు.ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆమె ప్రభుత్వానికిఉన్నతాధికారులు సమర్పించిన నివేదికలోవిస్తుపోయే అంశాలున్నాయి.• అప్పట్లో జరిగిన ఉల్లంఘనలపై దేవాదాయశాఖ కమిషనరుకు జిల్లా శాఖ నుంచి నివేదిక సమర్పించారు. ఉమ్మడి జిల్లాలో కొందరు దుకాణదారులకు అనుచితంగా లీజు పొడిగించడం, దుకాణాలను కేటాయించడం చేశారని, నిబంధనలు పాటించలేదని ఆని వేదికలో స్పష్టం చేశారు.• విశాఖ జిల్లా ధారపాలెం ధారమల్లేశ్వరి స్వామి ఆలయానికి చెందిన దుకాణాలకు ఎటువంటి వేలం లేకుండా కేటాయించేశారు. అనకాపల్లి మెయిన్రోడ్డులో సిద్ధేశ్వర స్వామి ఆలయం,చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం,చోడవరంలోని హార్డింగ్ రెస్ట్ హౌస్,పాయకరావుపేటలో పాడురంగ స్వామిఆలయాలకు చెందిన దుకాణాలకు ఎటువంటివేలం నిర్వహించకుండా నచ్చినోళ్లకు కట్టబెట్టారు.• సహాయ కమిషనర్గా ఉన్న శాంతి అప్పటి ఉపకమిషనర్ పుష్పవర్ధన్పై దురుసుగా ప్రవర్తించారు. అతని మీద ఇసుక చల్లిన తీరు చర్చనీయాంశమైంది.ఆదేశాలు ఉన్నా వాటిని బేఖాతరు చేస్తూ అప్పటి సహాయ కమిషనరుగా ఉన్న శాంతి అతన్ని నియమించడం చర్చనీయాంశమైంది.తరువాత విచారణలో ఇది నిజమని తేల్చారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..