రుణమాఫీ ఘనత కాంగ్రెస్ దే- సీఎం రేవంత్.. అధికారులపై మంత్రి దుద్దిల్ల ఆగ్రహం..రాష్ట్ర మహిళా చైర్మన్ గా నేరెళ్ల శారద..పలువురిని పరామర్శించిన ఎంపీ మాగుంట, మాజీ ఎమ్మెల్యే అన్నా.

????భవిష్యత్తులోఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కావొద్దు:

సీఎం రేవంత్ రెడ్డి..హైదరాబాద్:మేడ్చల్ జిల్లా జవహర్‌ నగర్‌లో కుక్కల దాడిలో మంగళవారం రాత్రి బాలుడు మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు.వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం తనను కలిచివేసిందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.సిటీలో ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్‌ కాకుండా వీ‎ధి కుక్కల బెడదను అరి క ట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారు లను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి..వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.చిన్నారులపై వీధి కుక్కల దాడులను అరికట్టడానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.వీధి కుక్కల దాడి ఘటన లను నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బస్తీలు,కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం ఆదేశించారు

???? అన్నం పెట్టె రైతును అప్పుల ఊబి నుండి… ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే… ఒక బృహత్తర సాహసం… “రైతు రుణమాఫీ పథకం”నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికైనా… నేడు ప్రజా ప్రభుత్వం పాలనలో రాష్ట్ర రైతాంగానికైనా… ఎంత కష్టమైనా… ఎంత భారమైనా… ఏకకాలంలో రుణమాఫీ… చేసిన… చేస్తోన్న ఘనత కాంగ్రెస్ పార్టీది.రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి… పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలు కార్యాచరణలో… తొలి అడుగు కేబినెట్ ఆమోదం కాగా… మలి అడుగు విధివిధానాల ఖరారు.ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో… రైతు సంక్షేమ కోణం ఉంటుంది…ఇది రైతన్నకు..మీ రేవంతన్న మాట.అని ఎక్స్ (ట్విట్టర్) లో సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్….
????మంత్రి నారా లోకేష్ చొరవతో ఎడారి దేశం నుండి శివ వచ్చేశాడు..కువైట్ బాధితుడు శివ స్వగ్రామం అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి చేరుకున్నారు. *బతుకుదెరువు కోసం కువైట్ వచ్చిన తాను అష్టకష్టాలు పడుతున్నానని,* కాపాడాలంటూ ఇటీవల ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో స్పందించిన మంత్రి నారా లోకేష్ శివను క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చారు.
???? బాధితులపైనే హత్య కేసు మోపిన గుంటూరు పోలీసులపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు.అమరావతి: బాధితులపైనే హత్య కేసు మోపిన గుంటూరు పోలీసులపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. నల్లపాడు పోలీసు స్టేషన్‌లో పెట్టిన ఈ కేసును రీఓపెన్ చేసి విచారణ చేయాలని హోంమంత్రి ఆదేశింశారు.తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసేందుకు వెళ్తే హత్య కేసు పెట్టి ఖాకీలు వేధింపులకు గురిచేసిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. నల్లపాడుకు చెందని శంకరలీలా తన కుమార్తెను కిడ్నాప్ చేశారని నల్లపాడు పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసిన శంకర లీలాపై హత్య కేసు పెట్టి వేధింపులకు నల్లపాడు పోలీసులు గురిచేశారు. రెండు సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ సంఘటనపై ఈ రోజు సచివాలయంలో హోంమంత్రిని కలిసి శంకరలీలా చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేసి ఖాకీలు వేధించారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. వెంటనే ఈ కేసును రీఓపెన్ చేసి ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని  పోలీసు ఉన్నతాధికారులకు హోం మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు.
????నటుడు నారాయణమూర్తికి అస్వస్థత:
సినీ నటుడు,నిర్మాత నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. దీంతో HYD నిమ్స్ ఆస్పత్రిలో డా.బీరప్ప పర్య వేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
????ఈరోజు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారదకు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్.
???? మహబూబాద్ జిల్లాలో నర్సంపేట బైపాస్ రోడ్డు రెడ్డి చికెన్ షాప్ ఓపెనింగ్ సందర్భంలో ముఖ్యఅతిథిగా వచ్చారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తోట వెంకన్న మహబూబాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెన్నూరు విజయలక్ష్మి యూత్ కాంగ్రెస్ కార్తిక్ షాప్ ఓనర్ కు అన్న శ్రీకాంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు.
????భారీ చమురు నిక్షేపాలు కనుగొన్న కువైట్..
కువైట్‌లో భారీ చమురు నిక్షేపాలను కనుగొన్నట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ సీఈవో షేక్ నవాఫ్ అల్ సౌద్ ప్రకటించారు. తేలికపాటి చమురు మరియు వాయువు తో కూడిన హైడ్రోకార్బన్ వనరులతో సహా ఇది మొత్తం 3.2 బిలియన్ బ్యారెల్స్ ఇంధనం అని అంచనా వేయబడింది. ఇది అల్ దౌరా ఆయిల్ ఫీల్డ్‌లో ప్రస్తుతంఉన్న కార్యకలాపాలకు తోడు కువైట్ మొత్తం ఉత్పత్తికి సమానం అని ఆయన అన్నారు.
???? హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనా అధికారులు స్పందించకపోవడంపై ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రూ.కోట్లు విలువైన భూములను కబ్జాదారులు ఆక్రమించారని ఉన్నతాధికారులకు ఆయన లేఖ రాశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ఫిర్యాదుతో అధికారులను మంత్రి శ్రీధర్‌బాబు అప్రమత్తం చేశారు. ఎమ్మె్ల్యే ఫిర్యాదును ప్రస్తావిస్తూ ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఉదాసీనత ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ మేరకు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి, తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఖానామెట్‌ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 41/14లోని 252.24 ఎకరాల భూమి ఉండగా 2008లో అప్పటి ప్రభుత్వం 180.13 ఎకరాలను హెచ్‌ఎండీఏకు కేటాయించింది. అందులో నుంచి 75 ఎకరాలను పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు హెచ్‌ఎండీఏ బదిలీ చేసింది. హుడా ఆధీనంలోని 105.13 ఎకరాలు, టీజీఐఐసీ యాజమాన్యం ఆధీనంలోని 75 ఎకరాల్లో అత్యధిక భాగం కబ్జాదారుల ఆధీనంలోకి వెళ్లిందని శ్రీధర్‌బాబు తెలిపారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌ గ్రామంలోని 100, 101 సర్వే నంబర్లలోని 100 ఎకరాల భూమిపై కబ్జా యత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావసరాలకు ఉపయోగపడాల్సిన విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించి తక్షణం రంగంలోకి దిగాలని సూచించారు. నిర్దిష్ట కాలవ్యవధిలో సమీక్షలు నిర్వహించి క్షేత్ర స్థాయి సిబ్బందికి బాధ్యతను నిర్దేశించాలని చెప్పారు. ఆక్రమణల సమాచారం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
????ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఏఆర్ దామోదర్..గంజాయి, డ్రగ్స్ నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు నియంత్రణ, సైబర్‌ నేరాలపై ప్రత్యేక దృష్టి… మహిళలు మరియు చిన్న పిల్లలు భద్రతను పెంచడం ప్రధాన ధ్యేయం: జిల్లా ఎస్పీ…*
???? నూతన ఎస్పీగా ఏఆర్ దామోదర్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ (క్రైమ్ )ఎస్ వి. శ్రీధర్ రావు, ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, అన్ని సబ్ డివిజనల్ డిఎస్పీలు, సీఐలు, ఆర్ఐ లు, ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.

???? ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా ఏఆర్ దామోదర్, ఐ.పి.యస్., పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా వారిని మర్యాదకపూర్వంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు  ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు,ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి మరియు జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ..

???? నేడు సాయంత్రం ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిని కందుల నివాసంలో పరామర్శించారు. తదనంతరం తన ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు.

????రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన మంత్రి..రోడ్డు ప్రమాదంలో గాయపడి ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కట్టా వారి పాలెం గ్రామానికి చెందిన రావెళ్ల వెంకటరావు కుమార్తె రావెళ్ల శ్రావణిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పరామర్శించారు. ముద్దులూరు కొండపి రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెంకట్రావు అక్కడికక్కడే మృతి చెందగా ఆయన కుమార్తె తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న మంత్రి హుటాహుటిన కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు.

????కంభం మండలంలో పలువురిని పరామర్శించిన మార్కాపురం వైసీపీ ఇంచార్జి అన్నా..

ప్రకాశం జిల్లా కంభం మండలంలో బుధవారం మార్కాపురం వైస్సార్సీపీ ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పర్యటించి ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించారు. కంభం మండలం జంగంగుంట్ల గ్రామానికి చెందిన సబ్బసాని అంకమ్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం ఇటీవల రోడ్ ప్రమాదానికి గురై మృతి చెందిన దేశిరెడ్డి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను అన్నా రాంబాబు పరామర్శించారు.అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కందులాపురం గ్రామానికి చెందిన సోముల సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరారు.ఈ సందర్బంగా అన్నా రాంబాబు వెంట కంభం మండల వైసీపీ నాయకులు, పాల్గొన్నారు

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..