????జగన్ సీరియస్ యాక్షన్…ఉండేదెవరు ?
వైసీపీలో కదలిక మొదలైంది. నిన్నటి దాకా పార్టీ పూర్తి నైరాశ్యంలో ఉంది. ఓటమి భారీగా ఉంది. వైసీపీలో కదలిక మొదలైంది. నిన్నటి దాకా పార్టీ పూర్తి నైరాశ్యంలో ఉంది. ఓటమి భారీగా ఉంది. దిక్కు తోచని నంబర్ తో వైసీపీ రిజల్ట్ ని అందుకుంది. దానిని భరించడం అధినేతకే కష్టం అయింది. వైసీపీలో కొంతమంది ఓటమిని కనీస మాత్రంగా అయినా ఊహించారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా యాభై సీట్లకు తగ్గవని అనుకున్నారు. కానీ బొత్తిగా 11 సీట్లు అంటేనే వైసీపీలో అలజడి రేగింది. ప్రకంపనలౌ పుట్టాయి. ఎందుకొచ్చిన రాజకీయం అనుకున్న వారూ ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్య నెల రోజుల కాలం ఇట్టే సాగిపోయింది. ఓటమిని అలా కౌగలించుకుంటూ కూర్చోవడం కుదరదు. అందుకే ఇపుడు మెల్లగా నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తన అభిప్రాయాలను చెబుతున్నారు. తప్పు ఒప్పులను చెబుతున్నారు. అవి అన్నీ మీడియా ముఖంగానే ఉండడం విశేషం. అదే సమయంలో జగన్ సైతం జిల్లాల వారీగా నేతలను పిలిచి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. మరి ఆయనకు వారి నుంచి అందుతున్న ఫీడ్ బ్యాక్ ఏమిటో తెలియదు కానీ వైసీపీలో సమూల ప్రక్షాళనకు జగన్ నడుం బిగించారు అని అంటున్నారు. పార్టీలో దాదాపుగా వంద దాకా అసెంబ్లీ సీట్లలో మార్పులు భారీ ఎత్తున చేసి కూడా చేదు ఫలితాలు మూటకట్టుకున్న జగన్ ఇపుడు నియోజకవర్గాల ఇంచార్జిల నియామకాలను కొత్తగా చేపడుతున్నారు. అందులో భాగంగా కృష్ణా జిల్లాలో పెడన అసెంబ్లీ ఇంచార్జిగా మాజీ మంత్రి జోగి రమేష్ ని జగన్ నియమించారు. ఆయన ఇటీవల ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేశారు. పెనమలూరుకు కొత్త ముఖాన్ని తీసుకుని వచ్చారు. ఇపుడు అనేక నియోజకవర్గాలలో ఇదే తీరున నియామకాలు జరుగుతాయని అంటున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కదిరిలో మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఓడిన పార్టీ నుంచి నేతలే బయటకు పోతారు. ఉన్న వారిని కాచుకోవడమే కష్టం అవుతుంది. అటువంటిది పార్టీలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయి నేతను సస్పెండ్ చేయడం ద్వారా జగన్ తాను ఏమి చేయదలచుకున్నదీ చెప్పేసారు అని అంటున్నారు.ఈ సిద్ధారెడ్డి సస్పెండ్ చేయకపోయినా పార్టీ మారుతారు అని అంటున్నారు. అయితే ఆయన పార్టీ అభ్యర్థి ఓటమికి కారకుడు అని నిర్ధారించుకుని ఈ యాక్షన్ తీసుకోవడం ద్వారా జగన్ పార్టీలోని ఇతర నేతలకు ఒక సందేశం పంపారని అంటున్నారు ఎవరినీ ఉపేక్షించేది లేదన్నదే ఆ సందేశం అని అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ అదే కదిరి నియోజకవర్గానికి ఇటీవల ఎన్నికలో ఓడిన బీఎస్ మక్బూల్ అహ్మద్ నే నియమించారు. ఇక చాలా చోట్ల వెన్ను పోట్లు చోటు చేసుకున్నాయని వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల అభ్యర్ధులు ఇచ్చిన డబ్బులు కూడా తినేసి కూటమి అభ్యర్థుల కోసం కృషి చేసారని వార్తలు ఉన్నాయి. అవి ఏపీలో చాలా చోట్ల జరిగాయని అంటున్నారు. దాంతో అటువంటి వారిని గుర్తించి వేటు వేసే పనిలో వైసీపీ హై కమాండ్ ఉందని అంటున్నారు. అదే విధంగా మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలు పాత కొత్త వారితో నియమిస్తారని ఆ తరువాత జిల్లా కార్యవర్గాలను ప్రకటిస్తారని ఆ మీదట రాష్ట్ర కార్యవర్గాలను ప్రకటిస్తారని అంటున్నారు. ప్రస్తుతం జగన్ ఈ కసరత్తులో బిజీగా ఉన్నారు అని అంటున్నారు. అదే సమయంలో పార్టీలో ఉండేవారు ఎవరు వెళ్లేవారు ఎవరూ అన్న సమాచారం కూడా పార్టీకి పక్కాగా ఉందని అంటున్నారు పలువురు సీనియర్లు అయితే ఈ రోజుకీ ముఖం చాటేస్తున్నారు. అలాగే చాలా మంది చివరి రెండేళ్లలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఈ రోజున ఫీల్డ్ లోకి దిగేందుకు ఆసక్తిగా లేరు. ఇలా చాలా చోట్ల చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఉన్న నేపధ్యంలో జగన్ మరోసారి 175 నియోజకవర్గాలను ముందు పెట్టుకుని కసరత్తు చేస్తున్నారుట. మరి ఈ కసరత్తు తరువాత పార్టీ పటిష్టం అవుతుందా కొత్త ఉత్సాహం వస్తుందా లేక పార్టీలో నుంచి వెళ్ళే వారు వెళ్తారా అన్నది చూడాల్సి ఉంది.
???? దివ్యాంగబాలికకు వీల్ చైర్ పంపిణీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్..ప్రకాశం జిల్లా ఒంగోలు నందు శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ ప్రాంగణంలో బేస్తవారిపేట మండలం సలకలవీడు మజరా కొత్తపల్లి గ్రామానికి చెందిన చింతా నాగమణి అనే బాలికకు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ వీల్ చైర్ అందజేశారు. లబ్ధిదారుని అమ్మమ్మ చింత సారమ్మ తో పాటు పలువురు నాగమణికి వీల్ చైర్ లేనందువలన ఎదురవుతున్న ఇబ్బందులను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి అర్చన ని లబ్ధిదారునికి వీల్ చైర్ సమకూర్చాల్సిందిగా ఆదేశించారు. దీంతో సంబంధిత సిబ్బంది వీల్ చైర్ ను కలెక్టరేట్ ప్రాంగణంనకు తీసుకురాగా జాయింట్ కలెక్టర్ నాగమణికి అందజేశారు.
????పరిశ్రమలు నిబంధనలు నిర్దేశిత భద్రతా ప్రమాణాలు ఉండేలా చూడాలి..జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా..పరిశ్రమల నిర్వహణ నిర్దేశిత భద్రతా ప్రమాణాల మేరకు ఉండేలా చూడాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు సహించబోనని ఆమె చెప్పారు. శుక్రవారం ప్రకాశం భవనంలోని తన ఛాంబరులో జిల్లా పరిశ్రమలకేంద్రం (డి.ఐ.సి.), కాలుష్య నియంత్రణ మండలి (పి.సి.బి.), ఏ.పి.ఐ.ఐ.సి., అగ్నిమాపక, ఫ్యాక్టరీలు,కార్మిక శాఖ అధికారులతో ఆమె ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
???? యర్రగొండపాలెంలోని మోడల్ డిగ్రీ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేపట్టిన టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ..కూటమి ప్రభుత్వంలోనే మోడల్ డిగ్రీ కళాశాల పూర్తి చేసి విద్యార్థులకు వసతి కల్పిస్తాము.యర్రగొండపాలెం పట్టణంలోని మోడల్ డిగ్రీ కళాశాలను యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. అసంపూర్తిగా ఉన్న డిగ్రీ కళాశాలను నేరుగా వెళ్లి పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపాల్, అధికారులకు అడిగి సమస్యలను అడిగితెలుసుకున్నారు.అసంపూర్తిగా ఉన్న డిగ్రీ కళాశాల పూర్తి చేయడానికి కావలసిన నిధుల గురించి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు అడిగి తెలుసుకున్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో మోడల్ డిగ్రీ కళాశాల కనీస వసతులు కల్పించలేకపోయారని, ఒక్క ఇటుక కూడా వేయకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేశారని ఎద్దేవా చేశారు…ఈ సందర్బంగా మోడల్ డిగ్రీ కళాశాలకు కావలసిన బాలుర, బాలికల వసతి గృహాలు, మౌళిక వసతులను గురించి ఇప్పటికే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకెళ్లానని, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అత్యవసరంగా కావలసిన మౌళిక వసతులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు..త్వరలో అసంపూర్తి భవనాలు పూర్తి చేసి వసతి గృహాలను అందుబాటులో తీసుకువస్తామని, నియోజకవర్గంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు… కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు…
???? జిల్లాలో గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి ప్లాన్ అఫ్ యాక్షన్ ను పటిష్టంగా అమలు చేస్తున్న జిల్లా పోలీసులు…ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి పై ఉక్కుపాదం మోపిన జిల్లా పోలీస్ అధికారులు..జిల్లా వ్యాప్తంగా అనుమానిత ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు…6 కేజీల గంజాయి సీజ్ చేసిన చీరాల 2టౌన్ పోలీసులు..ఐదుగురు ముద్దాయిలు అరెస్ట్..చీరాల సీఐ సోమశేఖర్ ను వారి సిబ్బందిని..అభినందించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్..
???? కరకట్టపై ఫైళ్ల దహనం కేసు వేగవంతం.. కీలక పత్రాలు స్వాధీనం…నిందితుడు రామారావు ఫ్లాట్‌తోపాటు, పీసీబీ కార్యాలయంలో ఏకకాలంలో విచారణ..రిటైరయ్యాక కూడా ఫైళ్లు ఇంట్లో ఎందుకున్నాయని ప్రశ్న..ఎవరి ఆదేశాలతో ఫైళ్లను ఇంట్లో ఉంచుకున్నారని ఆరా..పీసీబీ కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజీల పరిశీలన..విజయవాడ కరకట్టపై ఫైళ్ల దహనం కేసును వేగవంతం చేసిన పోలీసులు నిన్న కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చైర్మన్‌గా పనిచేసిన సమీర్‌శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రామారావును ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్న పోలీసులు నిన్న ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. విజయవాడలోని ఆయన ఫ్లాట్‌తోపాటు పీసీబీ ప్రధాన కార్యాలయంలోనూ ఏకకాలంలో రెండు బృందాలు విచారణ చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయన ఇంటి నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఫైళ్లను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎవరి ఆదేశాలతో పెట్టుకున్నారు? ఎక్కడి నుంచి వాటిని తీసుకొచ్చారు? వంటి ప్రశ్నలకు ఆయన నుంచి అధికారులు సమాధానాలు రాబడుతున్నట్టు తెలిసింది. గత నెల 27న సాయంత్రం పీసీబీ కార్యాలయం నుంచి ఫైళ్లు బయటకు వెళ్లనట్టు అనుమానిస్తున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
????ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ తొక్కిసలాటలో చనిపోయిన హిందూ భక్తుల కుటుంబాలకు 10000,గాయపడిన వారికి 5000 ఆర్థికసహాయం చేసిన జామియత్ ఉలమాయే హింద్.ఈ కార్యక్రమాన్ని మనసులను కలిపే కార్యక్రమంగా మౌలానా అర్షద్ మదని తెలిపారు.
????గిద్దలూరు అభివృద్ధికి సహకరించండి: మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణని కోరిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణని మినిస్టర్స్ క్యాంపు కార్యాలయంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి గిద్దలూరు నగర పంచాయతీ అభివృద్ధికి సహకరించాలన్నారు. పశ్చిమ ప్రకాశంలో అత్యంత వెనుకబడిన గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని పలు అంశాల పై చర్చించి వినతి పత్రం అందచేశారు.
????మాజీ సీఎం జగన్‍పై కేసు నమోదు – జగన్‍తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ పై కేసు నమోదు – సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508(34) ప్రకారం కేసు – టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఫిర్యాదుతో నగరంపాలెం పీఎస్ లో కేసు నమోదు – కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు – తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారన్న రఘురామ – కేసులో ఏ3గా జగన్ పేరు నమోదు చేసిన పోలీసులు – ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారాంజనేయులు – ఏ4గా విజయపాల్, ఏ5 గా డాక్టర్ ప్రభావతి పేరు – నిన్న ఈ-మెయిల్ ద్వారా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు – మాజీ సీఎం జగన్ ఒత్తిడి మేరకే తనను అరెస్ట్ చేశారన్న రఘురామ.
???? నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారు -టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు… ఐదుగురు ఆగంతకులు నన్ను దారుణంగా హింసించారు. వీడియో తీసి జగన్ కు చూపించారు – తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేశారు – అన్ని డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి – జగన్ పై కోర్టులో కేసులు వేసినందుకే హత్యకు కుట్ర చేశారు – గత ప్రభుత్వంలో న్యాయవ్యవస్థపై నమ్మకం లేకుండా చేశారు – జగన్ రెడ్డి, సునీల్ ఇద్దరూ కలిసి నాపై కుట్ర చేశారని ఆరోపించారు.
???? సచివాలయానికి వెళ్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు – సమస్యలతో వచ్చిన ప్రజలను చూసి రోడ్డుపై కాన్వాయ్ ఆపిన సీఎం – యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించిన చంద్రబాబు – నక్సల్స్ చేతిలో హతమైన సివేరి సోము భార్యను పలకరించిన సీఎం – సోము భార్య ఇచ్చావతి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు – సోము కొడుకు చదువు బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చిన సీఎం – వైసీపీ గూండాల దాడిలో సర్వస్వం కోల్పోయాన్న అరకులోయ సర్పంచ్ – సర్పంచ్ శ్రీనివాస్ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు
????అంబానీని ప్రశంసించినవారే నేడు విమర్శిస్తున్నారే! అంబానీ ఇంట పెళ్లి కుదురింది అంటే? నిరుపేదలకు అన్నదానం చేయడం అన్నది ఎంతో కాలంగా చేస్తోంది అంబానీ కుటుంబం అంబానీ ఇంట పెళ్లి కుదురింది అంటే? నిరుపేదలకు అన్నదానం చేయడం అన్నది ఎంతో కాలంగా చేస్తోంది అంబానీ కుటుంబం. స్వయంగా వాళ్ల చేతలు మీదుగానే ఆ కార్యక్రమం జరుగుతుటుంది. ఖరీదైన అన్ని రకాల వంటకాలు వండించి స్వయంగా వడ్డిస్తారు. అన్నదానంలో ఎనలేని తృప్తిని అంబానీ ఫ్యామిలీ పొందుతుంది. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక సమయంలో జామ్ నగర్ లో కూడా పేదలకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే.అన్ని రకాల వంటకాలు రుచి చూపించాలని తన స్థాయికి ఏమాత్రం తగ్గకుండా అన్నదానం చేసారు. ఈ పెళ్లి ఘట్టం మొదలైన నాటి నుంచి కూడా వివిధ ప్రాంతాల్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇలా అన్నదానం చేసిన సమయంలో నెటి జనులంతా అంబానీ దయాహృదయాన్ని ఎంతగానే మెచ్చుకున్నారు. గొప్ప వ్యాపార వేత్త నిరుపేదలకు తన స్వహస్తాలతో వడ్డించడం అన్నది ఎంతో గొప్ప విషయంగా నెటి జనులు కీర్తించారు. అయితే అదే నెటి జనులు నేడు అంబానీని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 5000 కోట్ల రూపాయల పెళ్లి ఖర్చు చూసి అంతా విస్తు పోతున్నారు. అంతకు ముందు దేశ , విదేశాల్లో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు చూసి అంతా నివ్వెర పోయారు. అయితే అంబానీ డబ్బు ఉందని అంత డబ్బు ఖర్చు పెట్టి చేయడం అవసరమా? అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.???? ఇంత ఖర్చు తో హడావుడి అవసరమా? నిరాడంబరంగా చేస్తే? ఆయన స్థాయి తగ్గిపోతుందా? ఎందుకు అవనసర ఖర్చు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.???? మరోవైపు ఇటీవలే జీయో ఛార్జీలు కూడా భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. వాటిని ఉద్దేశించి ప్రజల మీద బాదేసి ఇన్ని వేల కోట్లు రూపాయలతో పెళ్లిళ్లు చేసుకుంటారా? 500 కోట్లు… 300 కోట్ల రూపాయల ఖరీదు గల నగలు ధరిస్తారా? అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా నడిచిన సంగతి తెలిసిందే. ప్రశంసించిన వారే నేడు విమర్శించడం ఆసక్తికరంగా మారింది.

