బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు కరోనా..చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ. భుజంపై మోసు కెళ్లిన అన్నలు..361 మొబైల్ లు రికవరీ చేసిన ప్రకాశం పోలీస్.. మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన ముత్తుముల.. స్కూల్ కిట్లను పంపిణీ చేసిన ఎంపీపీ అమూల్య.

???? బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు కరోనా❓బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డట్లు తెలిసింది.గత కొన్ని రోజుల నుంచి మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఐసొలేషన్‌లో ఉన్నారు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి కూడా ఆయన పాల్గొనలేదని సమాచారం. కాగా అక్షయ్ నటించిన ‘సర్ఫిరా’ ఇవాళ థియేటర్ల లో విడుదలైంది.

????చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ. భుజంపై మోసు కెళ్లిన అన్నలు..

ఉత్తరప్రదేశ్ లోని లఖీం పూర్ ఖేరీ జిల్లాలో గుండెల్ని పిండేసే సంఘటన చోటుచే సుకుంది. టైఫాయిడ్ బారిన పడిన ఓ టీనేజీ బాలిక మెరుగైన వైద్యం అందక కన్నుమూయడంతో ఆమె మృతదేహాన్ని ఇద్దరు సోద రులు భుజంపై మోసుకుం టూ ఏకంగా 5 కిలోమీటర్లు నడిచిన ఉదంతం తాజాగా వెలుగు లోకి వచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని పాలియాలో శివానీ అనే బాలిక తన ఇద్దరు సోదరులతో కలిసి నివసిస్తూ 12వ తరగతి చదువుతోంది. రెండు రోజుల కిందట శివానీ టైఫాయిడ్ బారినపడింది. ఆమెను సోదరులు స్థానిక వైద్యుడికి చూపించగా మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆస్పత్రికి తరలించాలని సూచించారు.కానీ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పాలియాలోని రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. శారదా నది ఉప్పొంగడంతో జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. వాహన రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈలోగా ఆమె పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే దారిలో మరణించింది. దీంతో ఇక చేసేదిలేక సోదరులు విలపి స్తూనే ఆమె మృతదేహన్ని 5 కిలోమీటర్లమేర భూజాన మోసుకుంటూ తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తీశాడు. ఆ వీడియోలో రైలు పట్టాల పక్క నుంచి సోదరి మృతదేహాన్ని అన్నలిద్దరూ తీసుకెళ్లడం కనిపించింది.

????అచ్చెన్నాయుడుకి శుభాకాంక్షలు తెలిపిన ముత్తుముల…ఈ రోజు ఏపీ సచివాలయంలోని మినిస్టర్స్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమలు, మార్కెటింగ్, సహకార మరియు మత్స్యశాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడుని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు

????కేవలం వారం రోజుల్లో సుమారు రూ.50,54,000/- విలువైన 361 దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను రికవరీ చేసిన ప్రకాశం పోలీసులు.ప్రకాశం జిల్లా…సెల్ ఫోన్ చోరీలకు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు.. అభినందించిన జిల్లా ఎస్పీ..గరుడ్ సుమిత్..

దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను కనుగొనడానికి సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడే ప్రొఫెషనల్ గ్యాంగ్‌లు రిసీవర్లను పట్టుకోడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించి 8 ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ బృందాలు విశేష ప్రయత్నాలు చేసి తక్కువ వ్యవధిలో (1 వారంలోపు) 361 దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను గుర్తించారు. ఇద్దరు మొబైల్ దొంగతనాల నేరస్థులను వాటిని కొనే 5 మొబైల్ షాప్ యజమానులను అరెస్టు చేయటం జరిగింది. సాంకేతికత ఇతర ఆధారాలను ఉపయోగించి దొంగిలించబడిన మొబైల్‌లను సేకరించటం జరిగింది. దీనికి సంబంధించి 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి..

????బద్రీనాథ్ హైవే మూసివేత.. చిక్కుకుపోయిన 3000 మంది యాత్రికులు!*బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసి వేయడంతో రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 3,000 మంది యాత్రికులు, ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు.జోషిమఠ్ వద్ద కొండచరియలు విరిగి పడడంతో రహదారిని మూసివేశారు. మరో 24 గంటల పాటు రోడ్డును బ్లాక్ చేయనున్నట్లు సమాచారం. ప్రయాణికులను SDRF, NDRF బృందాల సహాయంతో సురక్షితంగా తరలిస్తున్నామని, ఆహారం, నీరు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

????తన కూతురిని అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు .. ఏడాది గడిచినా ఇప్పటికీ కేసు ఫైల్ చేయలేదు.. నంద్యాల పోలీస్ స్టేషన్ల చుట్టూ న్యాయం కోసం తిరుగుతున్న ఓ తల్లి ఆవేదన..

మార్కాపురం పట్టణానికి చెందిన షేక్ మౌలాలి,ఖాసీంబి దంపతులకు ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు. భర్త మౌలాలి చిన్న చికెన్ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసేవాడు. అతనికి వచ్చే ఆదాయంతో కాసింబి కూడా పలకల ఫ్యాక్టరీలో కూలీ పనిచేస్తూ పిల్లలను పోషించుకునేవారు . ఒక్కగానొక్క కూతురైన మున్నీని ఎంతో గారాబంగా చూసుకునే వారు. ఆమెను బీకాం కంప్యూటర్స్ మరియు టిటిసి వరకు చదివించారు.???? 2018లో తమ సమీప బంధువు అయిన గిద్దలూరు మండలం, కొమ్మునూరు గ్రామానికి చెందిన షేక్ ఖాసీం కుమారుడు కరీముల్లా కు రెండు లక్షలు నగదు మూడున్నర తులాల బంగారు, ఒక బంగారుఉంగరం తదితరాలు కట్న కానుకలుగా ఇచ్చి ఇస్లాం సంప్రదాయం ప్రకారం వివాహం జరిపారు. కరీముల్లా నంద్యాలలోనే వికాస్ ప్రింటర్స్ లో పనిచేసేవాడు.వారికి ఇద్దరు కుమారులు కలిగారు. కరిముల్లాకు వివాహానికి ముందే తన సమీప బంధువైన ఓ మహిళతో అక్రమ సంబంధం ఉండేదని,వివాహమైనప్పటికీ వారి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుండడంతో, కరీముల్లా మా భూమి దంపతులు మధ్య అనేకమార్లు వివాదాలు జరిగేవని, మాబున్ని అంటే తనకు ఇష్టం లేదని,మీ కుటుంబం అంతా దరిద్రులని,ఆమెను అనవసరంగా పెళ్లి చేసుకున్నానని, కరీముల్లా అనేక సూటి పోటి మాటలతో ఆమెను అసభ్యకరంగా తిట్టి కొట్టేవాడని మున్ని తల్లి కాసింబి ఆమె మామ, చిన్న కాసిం తెలిపారు. దీంతో మాబుని తనంటే ఇష్టం లేకుంటే తనను తన పిల్లలను తన పుట్టింట్లో వదిలేస్తే తమ బతుకుతామని పలుమార్లు చెప్పి ఏడ్చేదని వారు తెలిపారు . తాము సముదాయించి పంపే వారం అన్నారు.దీంతో తన కూతురి పీడ వదిలించుకోవాలనే దురుద్దేశంతో కరిముల్లా 2023 జూన్ 29 రాత్రి తమ కూతురు అకస్మాత్తుగా కింద పడిపోయిందని తమకు ఫోన్ చేయగా తాము వెళ్లేసరికి తమ కూతురు విగత జీవురాలై పోస్టుమార్టం గదిలో కనిపించిందని కాసింబి కన్నీరు మున్నీరుగా గుండె లవిసేలా రోదిస్తూ ఆరోపించింది . తన కూతురు పొట్ట ఎంతో ఉబ్బి పోయి ఉందని ఛాతీ పై కమిలిన గాయాలు ఉన్నాయని,తన అల్లుడు కరీముల్లా ఆమెను తీవ్రంగా కొట్టడం వలన గాని లేదంటే ఏదైనా మందు తాగించి హత్య చేసి ఉంటాడని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై అప్పట్లో నంద్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు .???? ఐతే ఏడాది దాటిన నేటికీ చార్జి సీటు దాఖలు చేయకపోవడంపై అనుమానాలు ..2023 జూన్ 30వ తేదీన కేసు నమోదు అయితే నేరం మోపబడిన ముద్దాయి పై పోలీస్ శాఖ వారు కేసు ఫైల్ చేయక పోవడం,సంబంధిత కోర్టులో ఇప్పటి వరకు దాఖలు చేయకపోవడంపై, అలాగే పోస్టు మార్టం రిపోర్ట్ లో మృతురాలు ఒంటి పై గాయాలు లేవన్న అంశాల పై 2023 ఆగస్టు 1వ తేదీన ల్యాబ్ నుండి ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్టు వచ్చిన కోర్టులో సబ్మిట్ చేయకపోవడంపై మున్ని బందువులు అనుమానాలు వ్యక్తం చేశారు. సంబంధితపోలీసు శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి కేసుపై సమగ్రమైన విచారణ జరిపి మున్ని మృతికి కారకులైన వాడిని కఠినంగా శిక్షించాలని ,లేని పక్షంలో న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాలు చేపడతామని మున్ని తల్లి బంధువులు హెచ్చరించారు.

????స్కూల్ కిట్లను పంపిణీ చేసిన ఎంపీపీ అమూల్య..ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బోడ్డువానిపల్లి గ్రామంలోని ఎంపీ యూపీ పాఠశాలలో శుక్రవారం ఎంపీపీ కామూరి అమూల్య విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ అమూల్య మాట్లాడుతూ… ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు బాగా వినియోగించుకొని బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. తల్లితండ్రులు గురువులు మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి,సూరవారి పల్లి సర్పంచ్ కాశమ్మ, మాజీ సర్పంచ్ బాల్ రెడ్డి,మండల విద్యాశాఖ అధికారులు వెంకటరత్నం,వెంకటేశ్వర్లు మరియు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

???? విద్యార్థినిపై లైంగిక వేదింపులు చేసిన హెడ్ మాస్టర్.. విషయం బయటకి రాకుండా రూ. 1.5 లక్షలకు రాజీ కుదిర్చిన పోలీస్ అధికారి, విద్యాశాఖ అధికారి..కామారెడ్డి – బాన్సువాడ మండలంలోని దేశాయిపేట జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ నరేందర్ తన పాఠశాలకు చెందిన ఒక విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, శనివారం ఒక స్కూల్ రూంలో లైంగికంగా వేధించాడు.. ఇది చూసిన విద్యార్థులు ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు.దీంతో వాళ్లు సోమవారం పాఠశాలకు రాగ నరేందర్ గైర్హాజరయ్యాడు.. ఈ విషయం బయటకి వెళ్లకుండా ఓ పోలీస్ అధికారి, ఓ విద్యాశాఖ అధికారి, పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిసి ఆ విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి రూ. 1.5 లక్షలకు రాజీ కుదిర్చారు.ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విద్యార్థిని తల్లిదండ్రులతో మాట్లాడి, హెడ్ మాస్టర్ నరేందర్ మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

???? రిజిస్ట్రేషన్ రూల్స్ ప్రకారం గా తప్పుగా దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేస్తే సెక్షన్ 81 ప్రకారం గా వారిని 7 ఏళ్ల జైలు* శిక్ష కు గురవుతారు. తప్పు చేసిన అధికారులతో పాటు… ఎవరైతే అధికారులతో ఈ పని చేయించారో వారు కూడా ఈ శిక్షనే వేస్తారు. హైకోర్టు సుప్రీంకోర్టు, GO, తీర్పులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అవినీతి అధికారులు నాయకులు, మరి ఈ అవినీతి నీచ అధికారులు పైన నాయకుల పైన ఆదాయ పన్ను శాఖ వారు మరియు, ED, IT, CB,CiD శాఖలు ఏం చేస్తున్నాయి ప్రజాధనం జీతాలుగా తీసుకుంటూ కళ్ళు ఉండి గుడ్డివాడిలా నటిస్తున్నారా మీ నుండి తప్పించుకున్న ఈ అవినీతిపరులను పంచభూతాలు ప్రకృతి విడిచిపెట్టదు ఘోరమైన శిక్షలు తప్పవు ఈఅవినీతిపరులకు, స్థానిక సంబంధిత ఉద్యోగస్తులకు శిక్షణ తప్పవు, రండి చేయి చేయి కలపండి భావితరాల భవిష్యత్తు కోసం అవినీతి అంతం వైపు అడుగులు వేయండి.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..