వైఎస్సార్ కు ఘన నివాళి..జగన్, షర్మిలతో విజయమ్మ!.మాజీ మంత్రి జోగి గైర్హాజర్.. ఒంగోలు ఎస్ కొండ గిద్దలూరు మార్కాపురంలో ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు..ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ప్రారంభించిన మాగుంట దామచర్ల..రైతు భరోసా కేంద్రంలో చోరీ..కంభంలో రేషన్ బియ్యం పట్టివేత.. ప్రమాదంలో రైతు మృతి

????వైఎస్సార్ కు ఘన నివాళి.. జగన్, షర్మిలతో విజయమ్మ! అవును… వైఎస్సార్ 75వ జయంతిని పురష్కరించుకుని వైఎసీపీ అధినేత జగన్ ఇడుపుల పాయలో తన తండ్రికి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు.. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సమయంలో జగన్ వెంట వైఎస్ విజయమ్మ, భారతి ఉన్నారు.అనంతరం షర్మిళ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. అవును… వైఎస్సార్ 75వ జయంతిని పురష్కరించుకుని వైఎసీపీ అధినేత జగన్ ఇడుపుల పాయలో తన తండ్రికి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా…ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన జగన్.. అనంతరం సమాధి వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఘాట్ వద్దకు చేరుకున్న విజయమ్మ.. వైఎస్ జగన్ ను ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టారు. తర్వాత ఇద్దరూ కలిసి స్మారకంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. వైఎసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్, విజయమ్మ కలవడం ఇదే తొలిసారి! ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్ కు జగన్ నివాళులు అర్పించిన వెళ్లిన అరగంట తర్వాత ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. అనంతరం తల్లి విజయమ్మ, భర్త అనిల్, కుమారుడు, కోడలు, కుమార్తెతో కలిసి నివాళులు అర్పించారు. మరోపక్క వైఎస్సార్ 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయంతిని పురష్కరించుకుని.. రక్తదానం, పేదలకు వస్త్రాలు పంపిణీ, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం మొదలైన సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేస్తున్నారని తెలుస్తుంది.

????దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి ఇడుపులపాయకు జోగి గైర్హాజర్**ఎట్టకేలకు అజ్ఞాతం వీడి ఇబ్రహీంపట్నం లో రహస్య స్థావరంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం!..చంద్రబాబు ఇంటిపై దొమ్మీకి వెళ్ళిన కేసులో పరారైన మాజీ మంత్రి జోగి రమేష్..జోగితో పాటు చంద్రబాబు ఇంటిపై మారణాయదాలతో పాల్గొన్న పెడనకు చెందిన జోగి అనుచరులు అజ్ఞాతంలోకి..మాజీ మంత్రి పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ తో పాటు ఆయన అనుచరుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు జల్లెడ పడుతున్న నేపథ్యం.

ఒంగోలు చర్చి సెంటర్ లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేకు కట్ చేసి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారికి నివాళిర్పిస్తున్న ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ జంకె వెంకట రెడ్డి గారు*

????మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా శిoగరాయకొండ మూలాగుంటపాడు లో గల డాక్టర్ వైయస్సార్ విగ్రహమునకు పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మాత్యులు మరియు కొండేపి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి వైస్ ఎంపీపీ సామంతుల రవికుమార్ రెడ్డి ఉన్నారు. ????ఒంగోలు చర్చి సెంటర్ లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేకు కట్ చేసి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు జంకె వెంకట రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

????ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు..ప్రజల నిర్మాణ రంగ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం అందజేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు .ఒంగోలు వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభిం చారు.ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో ప్రజలు ఇసుక కోసం నానా ఇబ్బందులు పడ్డారన్నారు. నిర్మాణ రంగం కుదేలయిందని తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే ఇసుక పాలసీని తీసుకుని వచ్చి ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తున్నారన్నారు.టన్ను ఇసుక ధర 247 రూపాయలుగా నిర్ణయించామన్నారు.అది కేవలం జెసిబి ద్వారా ఇసుకను లోడ్ చేయడానికి మాత్రమేనని తెలియజేశారు. ఉచిత ఇసుక పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేపడతామన్నారు.ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మా గుంట శ్రీనివాసులు రెడ్డి , ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు , టిడిపి నాయకులు సింగరాజు రాంబాబు , రాచగర్ల వెంకటరావు , తాతా ప్రసాద్ ,మదన్, గనుల శాఖ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు ????ఒంగోలు లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు , జనసేన జిల్లా ఇంచార్జి షేక్ రియాజ్ మరియు పలువురు నాయకులు, అధికారులు.

????మంచి మనసున్న గొప్ప మహనీయుడు.. సంక్షేమ పథకాల రూపకర్త వైఎస్సార్ సేవలు మరువలేనివి..మార్కాపురం వైఎస్సార్సీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు..రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రజా నాయకుడు, జన హృదయనేత,అపర భగీరధుడు,దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మంచి మనసున్న గొప్ప మహనీయుడు అని మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సోమవారం దివంగత మహానేత వైఎస్సార్ గారి 75వ జయంతి ని పురస్కరించుకొని మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో మార్కాపురం వైసీపీ ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే అన్నా పాల్గొన్నారు.అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకొని అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాల రూపకర్త గా మహానేత వైఎస్సార్ గారు పేరు పొందరన్నారు.మహానేత వైఎస్సార్ గారు చూపిన బాటలోనే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నడుస్తున్నారన్నారు. అనంతరం మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే అన్నా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలోని పలువురు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

????75వ వైయస్సార్ జయంతి వేడుకలు సోమవారం   గిద్దలూరు రాచర్ల గేటు సెంటర్ లో,కంభం టౌన్ లో బేస్తవారపేట టౌన్ లో గిద్దలూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్/మాజీ ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది….

????బేస్తవారిపేట లో రైతు భరోసా కార్యాలయంలో చోరీ..ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో స్థానిక రైతు భరోసా కార్యాలయంలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు కార్యాలయం వెనుక వైపు తలుపులను పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఒక ఎల్ఈడి టీవీ. ఐదు సీలింగ్ ఫ్యాన్లు. గ్యాస్ సిలిండర్.పోయ్యు ని దొంగలించటం జరిగిందిఈరోజు ఉదయం కార్యాలయం సిబ్బంది తలుపులు తెరవగా వెనక వైపు డోరు తెరిచి ఉండటంతో విషయాన్ని గుర్తించి వెంటనే బేస్తవారిపేట ఎస్సై నరసింహారావుకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.దొంగలించిన వారు బెస్తర పేట మండల పరిధిలో గ్రామాలలో ఇద్దరు వ్యక్తులు హిందీలో మాట్లాడుతూ పివిపురం ఎస్సీ పాలెం కు వెళ్లి టీవీ ని అమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో ఎస్ఐ నరసింహారావు తమ సిబ్బందితో గ్రామాలకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.మార్కాపురం నుండి క్లూస్ టీం రంగప్రవేశం చేయటం జరిగింది.బేస్తవారిపేట మండల అగ్రికల్చర్ ఆఫీసర్ జె మెర్సీ రాణి మాట్లాడుతూ కార్యాలయంలో దొంగిలించిన వారు నార్త్ ప్రాంతముకు చెందినవారుగా ఉండొచ్చని ప్రతినిధులతో తెలిపారు

????భారీగా రేషన్ బియ్యం పట్టివేత..పి.డి.స్ బస్తాలుతో సహా పట్టుకున్న అధికారులు..రేషన్ షాపునుండి నేరుగా అక్రమార్కుడి ఇంటికి చేరిన బస్తాలు..ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని రావిపాడు రోడ్డులో గల మస్తాన్ వలి స్వామి దర్గా సమీపంలోని మూడు అంతస్తుల ఒక భవనంలో భారీగా రేషన్ బియ్యం నిల్వ ఉన్నాయంటూ సమాచారం అందుకున్న కంభం గోడౌన్ డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్, ఇన్ఫర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారి అనిల్ ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. సుమారు 200 మూటల వరకు ఉండవచ్చని గోడౌన్ డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్ తెలిపారు.

???? ప్రమాదంలో గాయపడిన రైతు మృతి…కంభం మండలం జంగంగుంట్ల గ్రామానికి చెందిన దేశిరెడ్డి సుబ్బారెడ్డి (51 ) ఆదివారం సాయంత్రం 6 సమయంలో హైవే రోడ్డు దాటుతుండగా అతని బైక్ ను కారు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది .మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నారు.తన పొలంలో దుక్కి దున్నించి ట్రాక్టర్ డ్రైవర్ కోసం భోజనం తీసుకెళ్తుండగా రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది .పోస్ట్మార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ????తమ గ్రామం మీదుగా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరిగినప్పటి నుండి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..