చంద్రబాబు, రేవంత్ భేటీ !.మంత్రి కింజరావును కలిసిన ఎమ్మెల్యే ముత్తుముల..రీఛార్జిల భారంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.. హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు..ఈనెల 10న డిమాండ్స్ డే జయప్రదం చేయాలి-సిఐటియు..

????అప్పుల్లో కూరుకుపోయాం ఆర్థికంగా ఆదుకోండి.. ఆర్థిక మంత్రి నిర్మలకు ఏపీ సీఎం వినతి..గత ప్రభుత్వ నిర్ణయాలు, పనుల కారణంగా రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులలో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు వివరించారు. ఆర్థికంగా తమ రాష్ట్రాన్ని ఆదుకోవలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా.. వివిధ మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి తగినంత సహాయం చేయాలని కోరారు. నిర్మలతో జరిగిన భేటీలో పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీయే ఎంపీలు ఉన్నారు. అనంతరం కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. సాయంత్రంలోగా మరికొందరుకేంద్రమంత్రులతోనూ చంద్రబాబునాయుడు సమావేశమై.. రాష్ట్రపరిస్థితుల గురించి వివరించనున్నారు. జపాన్ రాయబారితోనూ చర్చలు జరుపనున్నారు. సాయంత్రానికి ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని చంద్రబాబు హైదరాబాద్ బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం భాగ్యనగరంలో చంద్రబాబు భారీ ర్యాలీలో పాల్గొంటారు. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో పలువురు కేంద్రమంత్రులతో సమావేశమైన చంద్రబాబు కీలక విషయాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, రాజధాని అమరావతి నిర్మాణానికి చేయూతనందించాలని ప్రధానిని కోరారు. అలాగే ఈ నెల నాలుగో వారంలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగనుండగా.. అందులో ఏపీకి ఇచ్చే ప్రాధాన్యతపై చర్చించారు. అమరావతి నిర్మాణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన తొలి జీతాన్ని విరాళంగా ఇచ్చారు. సీఎం చంద్రబాబునాయుడికి రూ.1.57 లక్షల చెక్కును అందజేశారు. రాజధాని నిర్మాణానికి విరాళమిచ్చిన ఎంపీని చంద్రబాబు అభినందించారు.

????తన మొదటి జీతాన్ని అమరావతికి విరాళం ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు..న్యూ ఢిల్లీ : విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణానికి విరాళం అందజేశారు. ఎంపీగా అందుకున్న తొలి జీతం రూ.1.57 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. ఎంపీలందరి సమక్షంలో ఈ చెక్కును అందజేశారు. దీంతో ఎంపీ అప్పలనాయుడిని చంద్రబాబు అభినందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు.

???? చంద్రబాబు, రేవంత్ భేటీ.. ముహూర్తం ఫిక్స్..తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీకి ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్లో ఇరువురు సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్లోని సంస్థల పంపిణీ, విద్యుత్ సంస్థలపై ప్రధానంగా చర్చ జరగనుంది.

????రీఛార్జి భారం..కేంద్రంలో మోడీ మూడోసారి పీఠం మీద కుదురుకున్న కొద్దిరోజులకే ప్రయివేటు టెలికం కంపెనీలు మొబైల్‌ రీఛార్జి ధరలను భారీగా పెంచి, ప్రజలపై రూ.20 వేల కోట్ల భారాన్ని మోపాయి.ఈ భారాల మోతకు తొలుత జియో ఉపక్రమించగా, ఎయిర్‌టెల్‌, వోడా దానిని అనుసరించాయి.నిర్వహణ వ్యయానికి తగ్గట్టుగా ధరలను పెంచటం అనివార్యమైందని అవి బయటికి ప్రకటించినా – జనం మొబైల్‌ అవసరాన్ని లాభాల మూటలుగా మార్చుకోవటమే వాటి అసలు ఉద్దేశం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌ జియో రూ.20,607 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, ఎయిర్‌టెల్‌ రూ.7,467 కోట్ల లాభాన్ని వెనకేసుకొంది. అయినా, ఈ కంపెనీల ధనదాహం తీరలేదు. దేశంలో మొబైల్‌ ఫోన్లను వాడుతున్న కోట్లమంది నుంచి తలో కొంత అదనంగా పిండుకున్నా – వేల కోట్లను సులభంగానే గడించవచ్చునని గట్టిగా నిర్ణయించుకున్నాయి. బయటికి పరస్పరం పోటీదారులమన్నట్టు పోజులిస్తూ- ఛార్జీల వడ్డనలో మాత్రం కూడబలుక్కునే వ్యవహరించాయి. ఒకే తరహాలో టారిఫులను పెంచి, వినియోగదారుల నెత్తిన భారాలు మోపాయి. రిలయన్స్‌ జియో తన టారిఫ్‌ను 12 – 25 శాతం మధ్య పెంచగా, ఎయిర్‌టెల్‌ 11 – 21 శాతం మేర హెచ్చించింది. ఎక్కువమంది అనివార్యంగా వాడే ప్లాన్ల మీద తెలివిగా భారాలను వడ్డించాయి. కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత వైఖరి, కార్పొరేట్లకు దోచిపెట్టే ధోరణీ ఈ ప్రొవైడర్ల దోపిడీకి మార్గం సుగమం చేస్తున్నాయి.ప్రయివేటు టెలికం కంపెనీలు రంగంలోకి రాకముందే దేశంలో మూలమూలకీ విస్తరించిన ప్రతిష్టాత్మక ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌). బిజెపి ప్రభుత్వం దాని కాళ్లకు బంధనాలు వేసి, కుట్రపూరితంగా కూలదోసి, కార్పొరేటు కంపెనీలకు రకరకాల రాయితీలతో, అవకాశాలతో విస్తరించే భూమికను ఏర్పరిచింది.▪️బిఎస్‌ఎన్‌ఎల్‌ తన సేవలను విస్తరించటానికి, సాంకేతిక శక్తిసామర్థ్యాలను పెంచుకోవటానికి ప్రయత్నించిన ప్రతిసారీ అడ్డంకులు కల్పించింది. బిఎస్‌ఎన్‌ఎల్‌ అనేది ఒక అసమర్థ సంస్థగా చిత్రీకరించే పనిని బిజెపి నాయకులే స్వయంగా చేపట్టి, ప్రచారం చేశారు. ఊరూరా నెట్‌వర్కు ఉన్న సంస్థను, సాంకేతిక నిపుణులు ఉన్న సంస్థను అడుగడుగునా అవహేళన చేశారు.▪️వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 3జి, 4జి, 5జి సేవల్లోకి వెళతామన్న ప్రతిసారీ అనుమతి నిరాకరించారు. 2016లో మోడీ నోట్ల రద్దు ప్రకటించి, డిజిటల్‌ చెల్లింపుల ప్రస్తావనను చర్చలోకి తెచ్చిన కొద్దిరోజులకే అంబానీ గారి జియో వ్యూహాత్మకంగా రంగప్రవేశం చేసింది. ▪️ఆకర్షణీయమైన తక్కువ టారిఫ్‌ ప్రకటించి,కొద్దిరోజు ల్లోనే లక్షలాది మంది వినియోగదారులను గుప్పిట పట్టింది. జియో విస్తరణకు ఇంతగా సేవలందిస్తున్న మోడీ ప్రభుత్వం… బిఎస్‌ఎన్‌ఎల్‌ సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడు తుంటే – కర్కశంగా కత్తి ఝళిపిస్తోంది. బిఎస్‌ఎన్‌ఎల్‌ హైస్పీడు డేటాను తన వినియోగదారులకు అందివ్వాలని ప్రణాళికలు వేసుకుంటే- అందుకు అనేక విధాలుగా మోకాలడ్డింది. ▪️ప్రయివేటు ప్రొవైడర్లు రెండు,మూడు దశలు ముందుకెళ్లిన తరువాతనే ఈ సంస్థకు మొదటి దశ సేవలకు అంగీకారం తెలిపే వైఖరిని అవలంబిస్తోంది. నాణ్యమైన సంస్థల నుంచి 4జి, 5జి నిర్వహణా పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలు చేస్తామని బిఎస్‌ఎన్‌ఎల్‌ అభ్యర్థిస్తే – ఏళ్ల తరబడి కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి అతీగతీ లేదు. ▪️ఈ ద్రోహపూరిత నిర్లక్ష్యం కారణంగా 2023-24లోనే, బిఎస్‌ఎన్‌ఎల్‌ 1.8 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయింది. ఒక్క గత మార్చిలోనే 23.54 లక్షల మంది వైదొలిగారు. అదే నెలలో జియో 21.43 లక్షల మందిని, ఎయిర్‌టెల్‌ 17.5 లక్షల మందిని కొత్త కస్టమర్లుగా పొందాయి. ▪️బిఎస్‌ఎన్‌ఎల్‌ బలంగా ఉన్నప్పుడు నిజమైన రెగ్యులేటర్‌గా వ్యవహరించి, ప్రయివేటు ప్రొవైడర్ల ధరలు అదుపులో ఉండటానికి కారణమైంది.క్రమేణా విస్తరణ కుంటుపడి, ప్రయివేటు కంపెనీల విజృంభణకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.▪️ప్రజలకు ఈ భారాల మోత లేకుండా ఉండాలీ అంటే బిఎస్‌ఎన్‌ఎల్‌ 5జి సేవలతో బలంగా విస్తరించాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం తగిన అనుమతులూ, సహాయ సహకారాలూ అందించాలి. ప్రయివేటు టెలికం కంపెనీల ధరల దూకుడుకు కళ్లెం వేయటం బిఎస్‌ఎన్‌ఎల్‌ బలోపేతం కావటం ద్వారానే సాధ్యం..

????ఈరోజు బాపట్ల జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ & జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ వెంకట్ మురళి ని మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిచడం జరిగింది ఇలాగే ముందు కు సాగుతూ మరి కొన్ని కార్యక్రమలు చేయాలని ప్రోత్సహించిడం జరిగింది.. కార్యక్రమం లో స్టేట్ కో ఆర్డినేటర్ నరేంద్ర గుప్తా,జిల్లా sc వింగ్ నిలంబరం ,జిల్లా యూత్ ఇంచార్జి ధోని రాజు తదితరులు పాల్గొన్నారు.

????జాతీయ మానవ హక్కుల సంఘం న్యాయ సేవ (National Human Rights & justice Movement) ఆధ్వర్యంలో దేశాయిపేట జగ్జీవన్ రావ్ కూడలిలో ఇద్దరు పేద చిన్నారులకు వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం మరియు దుస్తులు ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో ఇంతేజరగంజ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, మరియు NHR&JM రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాకుబ్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలేపాక మధు , వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు పోలేపాక రాణి , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సౌరం అభిలాష్, జిల్లా జాయింట్ సెక్రెటరీ కొగిల సుధాకర్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మేకల కమలాకర్,జిల్లా కోఆర్డినేటర్ సౌరం చిన్నయ్య,జిల్లా మహిళ జనరల్ సెక్రెటరీ బాకారం శోభ,జిల్లా వైస్ ప్రెసిడెంట్ పద్మ,సెక్రెటరీ కవిత,పాల్గొన్నారు

???? *ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మరియు పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు .

???? రద్దయిన స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ శానిటైజర్ వర్కర్ ని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి. గిద్దలూరు మండలం ప్రభుత్వం పాఠశాల కళాశాలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల మండల సమావేశం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం నందు ఎస్ కే సమీరా అధ్యక్షతన జరిగింది.సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి ఆవులయ్య సిఐటియు మండల కార్యదర్శి బి నర్సింలు పాల్గొని మాట్లాడుతూ ముళ్లపాడు గ్రామంలోని డీఎన్ టి స్కూలు ఎన్రోల్మెంట్ లేకపోవడంతో ఆ స్కూల్ ను రద్దు చేయడం జరిగిందని అందులో పని చేసే ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు బదిలీ చేయడం జరిగిందని కానీ అదే స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ పారిశుద్ధ్య కార్మికురాలు ,మధ్యాహ్నం భోజనం పథకం కార్మికురాలను ముళ్లపాడు లోని హైస్కూల్లో ప్రత్యామ్నాయంగా చేర్చాలని అన్నారు.ఈనెల 10వ తేదీన దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా డిమాండ్స్ డే జరుగుతుందని కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు.సమావేశంలో స్కూల్ శానిటైజర్ వర్కర్స్ యూనియన్ నాయకులు పుష్ప ,ఎస్.కె జహీరా వై రాధా తదితరులు పాల్గొన్నారు

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..