ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచ‌ల‌న‌ ట్వీట్!..ఎద్దేవా చేసిన ప్రత్తిపాటి..శాసనసభాపతిగా అయ్యన్నపాత్రుడు!..వైసీపీని వీడనున్న విడుదల రజని?..స్వరూపానంద సెక్యూరిటీ కి మంగళం..టిడిపి దాడులను ఖండించిన మాజీ ఎమ్మెల్యే కుందూరు..నాలుగు నెలల్లో 1,770 కోట్లు లూటీ..ఆదర్శవంతమైన సమాజం ఎస్ ఐ ఓ లక్ష్యం..బాలికకు అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సహాయం.

????రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..

2019 సంవత్సరానికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. 2019-24 మధ్య ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు పేర్లను తొలగించాలంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ పేర్లు లేకుండానే పథకాలు కొనసాగించాలంది.పార్టీల రంగులు, జెండాలతో ఉన్న పాసుపుస్తకాలు, లబ్ధిదారుల కార్డులు, సర్టిఫికెట్ల జారీని వెంటనే నిలిపివేయాలని సూచించింది.

????ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచ‌ల‌న‌ ట్వీట్!

ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలన్న వైసీపీ అధినేత‌**అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్‌నే వాడుతున్నాయన్న జ‌గ‌న్‌**మనం కూడా అదే దిశగా పయనించాలి*గుంటూరు, అభి మీడియా బ్యూరో ప్రతినిధి : ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహ‌న్‌ రెడ్డి తాజాగా సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలపై నమ్మకం సన్నగిల్లుతున్న వేళ పేపర్‌ బ్యాలెట్లు ఉప‌యోగించ‌డం మంచిద‌ని ఆయ‌న త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు జగన్ ఎప్పుడూ నేరుగా ఈవీఎంలను టార్గెట్ చేయలేదు. అనుమానాలు కూడా వ్యక్తం చేయలేదు. కానీ తొలిసారి ఆయన ఈవీఎంల గురించి సంచలన ట్వీట్ చేశారు. న్యాయం జరగడం మాత్రమే కాదు, కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలని జగన్ ట్వీట్ చేశారు. కాగా, ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

????మాజీమంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కామెంట్స్*
స్వార్థ రాజకీయాల కోసం జగన్‌ ఎంత నీచానికైనా దిగజారతారని ఆరోపించారు.రాష్ట్ర ప్రజల తీర్పును అవమానపరిచేలా జగన్‌రెడ్డి ఆరోపణలు..ప్రజలు ఛీకొట్టి పోమన్నా జగన్‌ తీరు మార్చుకోకపోవడం విచారకరం..జగన్ పాలనపై జనం ఎంతగా ఉడికిపోయారో ఓటింగ్ శాతాలే చెప్పాయి..ఘోరపరాభవం తర్వాత ముఖం చెల్లకే జగన్ అవాకులు చవాకులు..2019 ఎన్నికల అనంతరం ఈవీఎంలపై ఏం మాట్లాడారో మర్చిపోయారా?..జగన్‌కు 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు మంచివి, ఇప్పుడు చెడ్డవా?..ఈవీఎంల  ధ్వంసం, ఎత్తుకెళ్లడంలో వైకాపా చరిత్రను దేశం మొత్తం చూసింది..ఈవీఎంలపై జగన్ ఆరోపణలు అతడి విపరీత మనస్తత్వానికి నిదర్శనం..పిచ్చిమాటలు పక్కనపెట్టి జగన్ ఇకనైనా హుందాగా ఓటమిని అంగీకరించాలన్నారు.

????వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్.. పార్టీ మారనున్న వైసిపి మాజీ మినిస్టర్..విడదల రజినిఇప్పటికే అధిష్టానం అందుబాటులో లేని రజిని..జాతీయ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం..ఈ షోషల్ మీడియా వార్త పై రజని స్పందించాల్సిన ఉంది..

????రిజిస్ట్రేషన్ రూల్స్ ప్రకారం గా తప్పుగా దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేస్తే సెక్షన్ 81 ప్రకారం గా వారిని 7 ఏళ్ల జైలు* శిక్ష కు గురవుతారు. తప్పు చేసిన అధికారులతో పాటు… ఎవరైతే అధికారులతో ఈ పని చేయించారో వారు కూడా ఈ శిక్షనే వేస్తారుహైకోర్టు సుప్రీంకోర్టు, GO, తీర్పులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అవినీతి అధికారులు నాయకులు, మరి ఈ అవినీతి అధికారులు పైన నాయకుల పైన ఆదాయ పన్ను శాఖ వారు మరియు, ED, IT, CB,CiD శాఖలు ఏం చేస్తున్నాయి ప్రజాధనం జీతాలుగా తీసుకుంటూ కళ్ళు ఉండి గుడ్డివాడిలా నటిస్తున్నారా ఈ అవినీతిపరులను విజ్ఞానవంతులైన మేధావులు నిరుద్యోగ యువ యువతీ యువకులు ప్రజలు ప్రజా ఆస్తులను కాపాడుకోవాలి రండి చేయి చేయి కలపండి భావితరాల భవిష్యత్తు కోసం దేశం కోసం మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కి పని చెప్పండి గూగుల్లో సెట్ చేసి మెయిల్ ద్వారా చరవాణి ద్వారా ఆన్లైన్లో మెయిల్ ద్వార కంప్లైంట్ లు చెయ్యవచ్చు

*కల్తీ ఫుడ్ అని తెలిస్తే మీరు కంప్లైంట్ ఇవ్వాలిసిన ఫోన్ నంబర్స్ తెలంగాణ :-+91 9100 105 795,ఆంధ్రప్రదేశ్ +91 9440 379 755*???????????????????? మండల్ సమాచార కేంద్రం బొబ్బిలి, MCIC, ఇంచార్జ్, ఎం నర్సింగరావు విజయనగరం జిల్లా, CRPFI గౌరవ అధ్యక్షులు, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీ,PR డి సురేష్ 9133366449,

???? పవన్ కళ్యాణ్ కుYప్లస్ సెక్యూరిటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది.Yప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్టు, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా ఇవాళ సచివాలయం కు వెళ్లనున్న పవన్ తను చాంబర్ ను పరిశీలించనున్నారు. రేపు ఆయన డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

????శాసనసభాపతిగా అయ్యన్నపాత్రుడు!

శాసనసభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణస్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక జరుగుతుంది. సభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

????టీడీపీ నేతలు  దాడులను ఖండిస్తున్నా..మీడియా సమావేశంలో కుందురు..కార్యకర్తలను కాపాడు కోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమే…

గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కుందూరు నాగార్జునరెడ్డి మంగళవారం గిద్దలూరు పట్టణంలోని వారి నివాసం నందు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తుముల అశోక్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా, గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేస్తున్న దాడులను ఖండిస్తు,దాడులకు నిరసన వ్యక్తం చేశారు.ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా సహించేది లేదన్నారు.వైసీపీకి సహాకరించిన ప్రజలపై కూడా దాడులు చేస్తు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని,ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం దాడులు చేయడం మంచి పరిణామం కాదన్నారు.కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

????స్వరూపానంద సెక్యూరిటీ కి మంగళం…స్వరూపా నంద స్వామి భద్రతకు నెలకు రూ.20 లక్షల ప్రభుత్వ ధనమా? రాష్ట్రంలో పేరున్న, ఆదరణ ఉన్నస్వాములకు లేని భద్రత ఈయనకు ఎందుకు? వెంటనే పోలీసు పికెట్తొ తొలగింపునకు ఆదేశాలు ఆధ్యాత్మిక స్వామిగాగాక రాజకీయ స్వామిగా, పైరవీల స్వామిగా పేరుగాంచిన చినముషిడివాడ శారదాపీఠం స్వరూపానందకు వైసీపీ ప్రభుత్వం కల్పించిన  కేటగిరీ స్థాయి భద్రత తొలగిపోనుంది.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్థాన గురువుగా పేరుపడిన స్వరూపానంద వైసీపీ ప్రభుత్వహయాంలో ఓ రేంజ్లో రెచ్చిపోయారు. ఆయన అక్రమాలు అన్యాయాలపై విచారణకు సిద్ధమవుతున్న కూటమి ప్రభుత్వం ..అందులో భాగంగా ముందుగా భద్రతను తొలగించనుంది.నలుగురు గన్ మెన్లు,ఆరుగురు సిబ్బందితో పికెట్.. రాజు తలచుకొంటే.. అన్నట్టుగా జగన్ ప్రభుత్వంలో ఎచ్చులకు పోయి నలుగురు గన్మెన్లు, ఆరుగురు సిబ్బందితో స్వరూపానంద పెందుర్తి పీఠం వద్ద పికెట్ పెట్టించుకొన్నారు. 24 గంటలూ వీరు ఇక్కడ కాపలాకా చేయాల్సిందే. ఒక SI ఈ పికెట్కు ఇన్చార్జిగా వుండి పర్యవేక్షిస్తారు. దీనికి అదనంగా ప్రోటోకాల్ కారు (బుగ్గకారు)వుంటుంది.

????గోకవరం మండల టిడిపి దివ్యాంగుల అధ్యక్షులు అడబాల సింగరయ్యకు చార్జిబుల్ ట్రై సైకిల్ బహుకరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ*కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 18: స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం సహాయ సంచాలకులు (జిల్లా ఏడి) నరసింహమూర్తి ఏర్పాటుచేసిన చార్జిబుల్ సైకిల్ గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మండల దివ్యాంగుల అధ్యక్షులు అడబాల సింగరయ్యకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం, జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర, కొత్తపల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు దిండి రాజు తదితరులు పాల్గొన్నారు.

???? సెల్ఫీ తీసుకుంటూ నీళ్లలో జారీ పడిన కూతురు.. కూతురును కాపాడడానికి దూకి తండ్రి మృతి..కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్(47) నిన్న సెలవు దినం కావడంతో గుడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎల్ఏండీ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు.. అక్కడ కూతురూ సాయినిత్య సెల్ఫీ దిగే క్రమంలో జారీ నీటిలో పడింది.కూతురు మునిగిపోవడం చూసి తండ్రి విజయ్, 10వ తరగతి చదివే కొడుకు విక్రాంత్ ఇద్దరు దూకారు.. ముగ్గురు మునిగిపోవడం చూసి తల్లి అరవడంతో అక్కడే ఉన్న మత్స్యకారుడు శంకర్ సాహసోపేతంగా నీటిలో దూకి కూతురును, కుమారుడిని కాపాడాడు.సంతోషంగా గడుపుతూ తమ కళ్ల ముందే తండ్రి చనిపోవడంతో పిల్లలు డాడీ వస్తాడు, డాడీకి ఎం కాలేదంటూ ఎడవడంతో అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.

????నాలుగు నెలల్లో 1,770 కోట్లు లూటీ.. 5 నెలల్లోనే 8 లక్షల సైబర్‌ కేసులు!దేశంలో సైబర్‌ నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయి.గడిచిన ఐదు నెలల్లోనే సుమారు 8 లక్షలకు పైగా సైబర్‌ కేసులు నమోదయ్యాయి.గత మూడేండ్లుగా దేశంలో పౌరులు సైబర్‌ నేరాల బారిన పడటం పెరుగుతున్నది. సైబర్‌ నేరాల్లో యూపీఐ, క్రెడిట్‌కార్డు, పార్ట్‌టైమ్‌ జాబ్‌ మోసాలు అత్యధికంగా ఉన్నట్టు లోకల్‌ సర్కిల్స్‌ సర్వే నివేదికలు వెల్లడించాయి. పట్టణ ప్రజల్లో ఎక్కువశాతం పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల పేరిట పంపిన లింక్‌లు, క్యూఆర్‌కోడ్‌లకు డబ్బులు చెల్లించి మోసపోయినట్టు సర్వే తెలిపింది.

  • ????మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. కుక్కల దాడి..

ఇంటి ముందు పడుకో బెట్టిన 42 రోజుల బాబుపై కుక్కల దాడి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతూ బాబు మృతి…తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ఘటన…అమ్మమ్మ ఇంటి దగ్గర ఘటన బాబు సొంత ఊరు ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామం…

???? ఏలూరు జిల్లా.. పోలవరం..చేతబడి చేశాడని అనుమానంతో వ్యక్తి పై కత్తి తో దాడి.. పోలవరం మండలం ఎల్లండి పేట గ్రామంలో కనకదుర్గమ్మ గుడి పూజారి పై కత్తితో దాడి చేసిన వ్యక్తి ..దాడిలో పూజారి జొన్నడ పేరాస్వామికి తీవ్ర గాయాలు..పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స జరిపి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కు 108లో తరలింపు ..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలవరం పోలీసులు వివరాలు తెలియాల్సి ఉంది*

???? ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి..ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలను జారీ చేయాలంటే.. ప్రకటనలు ఇచ్చే వ్యాపార సంస్థలు, వ్యక్తులు ఇకపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి మంగళవారం నుంచే అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనను అమలు చేయడంలో ఇబ్బందులు తప్పకపోవచ్చని ప్రకటనకర్తలు, ప్రకటనల ఏజెన్సీల వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి

???? వాలంటీర్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రకటించారు. ‘చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారు.. నాకు ఒకటే ఫోన్లు, వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి..ప్రస్తుతం ఉన్న వాళ్లనే కొనసాగిస్తాం.. జూలై 1న వాలంటీర్లతో ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేస్తాం’ అని మంత్రి స్పష్టం చేశారు.

???? పార్టీ నేతలతో జగన్ భేటీ 22కు వాయిదా ..వైసీపీ MLAలు, పోటీ చేసిన అభ్యర్థులతో పార్టీ అధినేత జగన్ నిర్వహించనున్న కీలక భేటీ ఈ నెల 22కు వాయిదా పడింది. తొలుత ఈ నెల19న సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలపగా, అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు పేర్కొన్నాయి. ఎన్నికల్లో దారుణ ఓటమి, భవిష్యత్ కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.

????స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (S.I.0) భారత దేశంలో 42 సం,,లుగా విద్యార్థి, యువకులను చైతన్య పరచి, దైవాఆదేశాలకు అనుగుణంగా సమాజ పునర్నిర్మాణానికి సంసిద్ధుల్నిచేస్తోంది. విద్యాలయాల్లో నైతిక విలువలను పెంపొందిస్తూ, ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు S.I.0 కృషిచేస్తోంది.???? ప్రతి ఆదివారం చిన్న పిల్లలకు, విద్యార్థులకు, యువకులకు నైతిక శిక్షణ కొరకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తోంది, ????ఈదుల్ అజ్హా సందర్భంగా, పాలస్తీనా భూభాగం పై ఐక్యరాజ్య సమితి ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ దమన కాండను కొనసాగిస్తూ, అమాయక చిన్నారులపై, ఆసుపత్రులపై, శరణార్థి శిబిరాల పై బాంబుదాడులు చేస్తూ రాక్షస కాండ నిర్వర్తిస్తున్న ఇజ్రాయిల్ తీరును వివరించి, తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ దారుణాన్ని నిరసిస్తూ ఇజ్రాయిల్ కంపెనీ ఉత్పత్తుల్ని బహిష్కరించనలసినదిగా పిలుపునిచ్చింది. అలీనదేశ పౌరులుగా మనం దౌర్జన్యకారుల దుర్మార్గాన్ని నిరసించి, పీడిత ప్రజల పక్షాన నైతిక మద్దతను ప్రకటించడం మన బాధ్యత అని S.I.O పిలుపు నిస్తోంది.మరియు పాలస్తీనా గురించి ఎక్స్‌పో కూడా నిర్వహించడం జరిగింది….కార్యక్రమంలో ఖదీర్ బాషా  (ఎంపీజే సుప్రీం కౌన్సిల్ కన్వీనర్),రోషన్ మొహిద్దీన్ ( జాతీయ కార్యదర్శి SIO India),మొయిన్ రషీద్ (రాష్ట్ర సలహా మండలి SIO AP),నాయబ్ రసూల్ (ప్రకాశం జిల్లా ఆర్గనైజర్),ఫయాజ్ హుస్సేన్ (యూనిట్ ప్రెసిడెంట్),సుభాని (యూనిట్ సెక్రటరీ),ఇతర S.I.O సభ్యులు మరియు చోటి మస్జిద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు…

????కాలేయ మార్పిడి కోసం పోరాడుతున్న జెన్నిఫర్‌కు 10 వేల రూపాయల సహాయం చేసినఅమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు బోనేని..*కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామానికి చెందిన పల్లాల భాస్కర్ రావు కుమార్తె పల్లాల జెన్నిఫర్‌,లివర్ సిర్రోసిస్‌ వ్యాధితో పోరాడుతూ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ,హైదరాబాద్ లో వైద్యులు పరీక్షలు జరిపి ప్రాణ రక్షణకు కాలేయ మార్పిడి ఒక్కటే మార్గమని డాక్టర్స్ తేల్చి చెప్పడంతో పాటు కాలేయ మార్పిడికి సుమారు 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందనీ స్పష్టం చేసారు. ఈ సర్జరీ కొరకు దాతలు ముందుకు వచ్చిసహాయ,సహకారాలు అందించాలని బాధితురాలి తండ్రి విజ్ఞప్తి చేస్తూ ప్రకటనలో పేర్కొన్నారు.దీనికి స్పందించిన టిడిపి కొమరోలు మండల శాఖ అధ్యక్షులు బోనేని వేంకటేశ్వర్లు యాదవ్ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంటనే 10000 రూపాయలు విరాళాన్ని ప్రకటించి బాధితురాలి తల్లి,తండ్రులకు 10 వేల రూపాయల నగదును పంపిణీ చేశారు.పంపిణీ.కార్యక్రమంలో పాల్వాద్రీ వేంకటేశ్వర్లు,బొమ్మని శ్రీను,మేకల నరసింహా,కొండమ్మ,జీవనమ్మ,వెంకటమ్మ,బాల వేంకట రెడ్డి,రత్న బాబు తదితరులు పాల్గొన్నారు..మరి కొంత మంది దాతలు ముందుకు వచ్చి సహాయ,సహకారాలు అందించిబాధితురాలి ప్రాణాలు కాపాడాలని బోనేని విజ్ఞప్తి చేశారు.10 వేల రూపాయలు సహాయం చేసిన అమ్మ ఫౌండే షన్ కు, సంస్థ అధ్యక్షులుబోనేని వేంకటేశ్వర్లు కు బాధితురాలి తల్లి తండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

????జగన్ పై ప్రేమ ఉంటే ఉద్యోగాలు వదిలేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోండి: హోంమంత్రి అనిత…కొందరు పోలీసులు వైసీపీకి తొత్తులుగా పనిచేశారని వ్యాఖ్యలు..వారిలో ఇంకా వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టుందని వ్యంగ్యం..శాంతి భద్రతల విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలిపెట్టబోమని స్పష్టీకరణ*

????మాదాపూర్..దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఓ మహిళ ఆత్మహత్యాయత్నం..కేబుల్ బ్రిడ్జి పై నుండి దుర్గం చెరువులోకి దూకడానికి యత్నించిన మహిళను కాపాడిన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు. పోలీస్ వాహనంలో స్థానిక హాస్పిటల్ కు తరలింపు.

*షార్ట్ సర్క్యూట్ వల్ల చీరాల రైల్వే స్టేషన్లో చెలరేగిన మంటలు*బాపట్ల జిల్లా… చీరాల రైల్వే స్టేషన్ నందు షార్ట్ సర్క్యూట్ వల్ల నాలుగు , ఐదవ ప్లాట్ ఫామ్ మీద చాలా రేగిన మంటలు అదే సమయంలో ఐదో నెంబర్ ప్లాట్ ఫారం మీద గూడూరు విజయవాడ పాసింజర్ ట్రైన్ ఆగి ఉంది అధిక శబ్దంతో నిప్పురవ్వలు రావటం వలన భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు దీనిపై స్టేషన్ అధికారులు స్పందించి వెంటనే స్పందించి మంటలు చెలరేయకుండా చర్య తీసుకున్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..