మోడీ మూడు : సక్సెస్ మూడ్ లేదుగా ?..ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు:ల్యాండ్ టైటిల్ యాక్టిపై పీవీ రమేష్ కీలకవ్యాఖ్యలు.. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ.. బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల.. కంభంలో ఉచిత కంటి వైద్య శిబిరం..కొడాలి నాని పాలిష్చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలు..పామర్రు ఎమ్మెల్యే టిడిపిలో చేరడం లేదు!

**మోడీ మూడు : సక్సెస్ మూడ్ లేదుగా ?

మరో వైపు చూస్తే బీజేపీ బిగ్ షాట్స్ నరేంద్ర మోడీ అమిత్ షాలు రెండు సార్లు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపారు. కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అయింది. ప్రభుత్వం అయితే కొలువు తీరింది కానీ ఆ సక్సెస్ మూడ్ అయితే టోటల్ గా లేదని అంటున్నారు. ఒక వైపు బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్ బీజేపీ అపజయాలనే ముందుకు తెచ్చి హాట్ కామెంట్స్ చేస్తోంది. ఆరెస్సెస్ చీఫ్ భగవత్ నుంచి కీలక నేతలు అంతా బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది.దానికి కారణం అగ్ర నేతల అహంకారం అన్నట్లుగా పరోక్ష విమర్శలు చేస్తున్నారు. మరో వైపు చూస్తే బీజేపీ బిగ్ షాట్స్ నరేంద్ర మోడీ అమిత్ షాలు రెండు సార్లు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపారు. ఈసారి వారికి కొత్త అనుభవంగా ఉంది. మ్యాజిక్ ఫిగర్ కి 32 సీట్ల తేడాతో బీజేపీ ఉంది. దాంతో టీడీపీ జేడీయూ ల వంటి పార్టీల ఊతకర్రతో ప్రభుత్వాన్ని నడపడం అంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకో వైపు చిన్న నంబర్ కలిగిన పార్టీలు కూడా ఎన్డీయే మిత్రులు గా ఉంటూ వస్తున్నాయి. ఈ పార్టీలు కూడా మోడీ మంత్రివర్గం కూర్పు మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. శివసేనను చీల్చి అసలైన శివసేనగా గుర్తు తీసుకుని మహారాష్ట్ర సీఎం గా ఉన్న ఏక్ నాధ్ షిండే పార్టీకి ఏడుగురు ఎంపీలు ఉన్నారు. అందులో నుంచి కేంద్ర మంత్రిగా ఒకరికి చాన్స్ ఇచ్చారు. అయితే సరైన పోర్టు ఫోలియో ఇవ్వలేదని షిండే అసహనంగా ఉన్నారని అంటున్నారు. ఇక ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా కేంద్ర ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉంది. ఒకే ఒక్క ఎంపీగా ప్రఫుల్ పటేల్ గెలిస్తే ఆయనకు సహాయ మంత్రి ఇస్తామని చెప్పారు. దానికి తిరస్కరించారు. రాజ్యసభలో తమకు నలుగురు ఎంపీలు ఉన్నారు అని అజిత్ పవార్ గుర్తు చేస్తున్నారు. తమను చిన్న చూపు చూస్తున్నారు అని అంటున్నారు. ఇక నితీష్ కుమార్ కి బీహార్ లో ప్రత్యేక హోదా సెగ తప్పడంలేదు. ఆయన స్పీకర్ పదవిని జేడీయూకు ఇవ్వమని ఎన్డీయే ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి తెస్తున్నారు. అదే స్పీకర్ పదవితో పాటు ఏపీకి రావాల్సిన ఆర్ధిక ప్రయోజనాల గురించి టీడీపీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఈసారి మోడీ మంత్రివర్గం 71గా ఉంటే అందులో మిత్రులకు ఇచ్చినవి 11 మంత్రి పదవులు మాత్రమే. వీటిలో కూడా అయిదుగురుకే కేబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చారు. ఒక వైపు తాము అనుకున్న విధంగా ప్రభుత్వం సాగదని ప్రతీ దానికీ మిత్రుల నుంచి అనుమతి పొందాల్సి రావడం బీజేపీ పెద్దలకు కూడా ఇబ్బందిగానే ఉంది అంటున్నారు. ఎన్నికల ముందు ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అని బీజేపీ నేతలు సభల్లో చెప్పారు. తన కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్లు అమలు చేయనివ్వను అని మోడీ కూడా గట్టిగా అన్నారు. కానీ ఇపుడు రద్దు చేయగలరా అన్నది ప్రశ్నగా ఉందిట. ఎందుకంటే రద్దుకు టీడీపీ జేడీయూ పూర్తిగా వ్యతిరేకం అని అంటున్నారు.అదే విధంగా కామన్ సివిల్ కోడ్ కి ఈసారి అమలు తప్పదని అనుకున్నారు.కానీ అది కూడా అటకెక్కే చాన్స్ ఉందని అంటున్నారు. ఈ విషయంలోనూ బీజేపీకి మిత్రుల నుంచి సహకారం ఉండదని తెలుస్తోంది. జమిలి ఎన్నికలు అంటే మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈసారి అధికారంలోకి వస్తే 2029 నాటికి జమిలి ఎన్నికలు తప్పవని కూడా చెప్పారు. ఇపుడు చూస్తే అది కూడా సాకారం అయ్యే సూచనలు లేవు అని అంటున్నారు. అదే విధంగా కులగణన జరపాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించినా కొత్తగా జనాభా లెక్కలు చేసిన తరువాతనే అమలు చేయాలని మిత్రుల నుంచి డిమాండ్ వస్తోంది. ఇలా అనేక అంశాలల్లో పొత్తు కుదిరే చాన్స్ తక్కువగా ఉంది అని అంటున్నారు. గతంలో బీజేపీ అనుకున్నదే చేసుకుని వెళ్ళింది. ఇపుడు లోక్ సభలోనే మెజారిటీ లేదు, రాజ్యసభలో అదే పరిస్థితి పైగా ప్రభుత్వం లో టీడీపీ జేడీయూల పెత్తనం ఉంది అని అంటున్నారు. ఎపుడు ఏమి జరుగుతుందో తెలియదు అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయిఏ ఒక అపశకునం పలికారు. ప్రధాని మోడీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. బెంగళూరులో ఖర్గే మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పాటైందనడం విశేషం. ఇక మీదట మోడీకి ఆదేశించే అవకాశం లేదు. ఇది మైనార్టీ ప్రభుత్వం అని కూడా ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు అని ఆయన బాంబు పేల్చారు. అయితే ఈ ప్రభుత్వం కొనసాగాలని మేము కోరుకుంటున్నామని ఆయన సన్నాయి నొక్కులూ నొక్కుతున్నారు. ఇదే మాటను శివసేన ఉద్ధవ్ ఠాక్రే కూడా అంటున్నారు. తొందరలోనే మోడీ సర్కార్ కూలిపోవచ్చు అని ఆయన చెబుతున్నారు. ఈ ఇద్దరే కాదు చాలా మందికి డౌట్లున్నాయి. దానికి కారణం వాజ్ పేయి ఎన్డీయే సారధి కాదు, ఆయన ఏకంగా 26 పార్టీలతో అతి పెద్ద సంకీర్ణాన్ని విజయవంతంగా నాలుగున్నరేళ్ల పాటు నడిపారు. మోడీ అమిత్ షాలకు సంకీర్ణ ప్రభుత్వం నడపడం ఇదే ఫస్ట్ టైం. ఇక చంద్రబాబు నితీష్ కుమార్ ల వైఖరి మీదనే విపక్షాలు ఆశతో ఉన్నాయి. ఈ మొత్తం పరిణామాలు చూసినపుడు కేంద్రంలో మూడోసారి ప్రధాని అయ్యాను అన్న రికార్డు కోసం మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ ఆ సంబరాల మూడ్ అయితే లేదనే మాట ఢిల్లీ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

*ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు: మస్క్ఈవీఎంల ట్యాంపరింగ్ పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఓ సంచలన ట్వీట్ చేశారు.

ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనీ తెలిపారు.మనుషుల ద్వారా లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నిర్మూలించాల్సిన అవసరంఉందని అన్నారు.

**త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ: చంద్రబాబు అమరావతి: పార్టీ కోసం కష్టపడిన వారి కోసం త్వరలోనే నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తానని తెదేపా అధినేతచంద్రబాబు అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించినతర్వాత తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ మాట్లాడారు. ఎంపీలు, మంత్రులు,ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఇందులోపాల్గొన్నారు. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పార్టీకోసం పని చేశారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.

???? విజయవాడకు డిప్యూటీ సీఎం పవన్ రాక..అమరావతి:జూన్ 16..ఏపీ రాష్ట్ర ఉప‌ముఖ్య‌ మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇవాళ విజ‌య‌వాడకు రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరిలోని జ‌న‌సేన‌ పార్టీ కార్యాల యానికి ఆయ‌న వెళ్లను న్నారు. కాగా నేడో, రేపో సచివాల యంలో పవన్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

???? ల్యాండ్ టైటిల్ యాక్టిపై పీవీ రమేష్ కీలకవ్యాఖ్యలు..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ ట్విట్టర్ (0) వేదికగా ధన్యవాదాలు తెలిపారు.గతంలో తన తండ్రి పట్టాభూమి మ్యుటేషన్కు అధికారులు నిరాకరించారన్నారు. ఆర్డీవోకు పోస్టులోపంపిన పత్రాలను తిరిగి వెనక్కు పంపారని చెప్పారు. చట్టం రాకముందే భూములపై హక్కులు నిరాకరించారని పేర్కొన్నారు. అవగాహనలోపంతోగతప్రభుత్వం చట్టం తెచ్చిందని విమర్శించారు.

*పామర్రు మాజీ MLA టీడీపీలో చేరడంలేదు.!

పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ టీడీపీలో చేరుతున్నారంటూ శనివారం సాయంత్రం సోషల్ మీడియాలో కథనాలు హల్చల్ చేశాయి. జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారంటూ శనివారం విస్తృతంగా ఆ వార్త చక్కర్లు కొట్టింది. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రతినిధులు స్పందిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి చేరేది లేదంటూ అవన్నీ తప్పుడు కథనాలని తెలిపారు.

????: చంద్రబాబు బూట్లను కొడాలి నాని పాలిష్చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలు..గుంటూరులో మాజీ మంత్రి కొడాలి నాని ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు బూట్లను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి.నాని ఎక్కడున్నా బయటకు రావాలి అంటూ టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఆ ఫ్లెక్సీలు వేయించారు. కాగా ఎన్నికల ముందు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం చేసి ఆయన బూట్లు తుడుస్తానని నాని ప్రకటించినట్లు ఆ సమాచారం.

????కల్కి’ ప్రీ రిలీజ్ అతిథులుగా బాబు, పవన్?*

అమరావతీ:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఈ ఈవెంట్ కి ఏపీ సీఎం. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరినీ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.వీరితోపాటు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ ని కూడా ఆహ్వానిస్తున్నట్లు టాక్.నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఈ నెల 27న విడుదల కానుంది.

నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి పాదయాత్ర నిర్వహించిన టీడీపీ నాయకులు*

*గిద్దలూరు శాసనసభ్యులుగా ముత్తుముల అశోక్ రెడ్డి ఘణ విజయం సాధించిన శుభ సందర్బంగా పట్టణంలోని 2వ వార్డు కౌన్సిలర్ బూనబోయిన చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం రాచర్ల మండలం, నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అంబవరం, వెల్లుపల్లె, జయరాంపురం గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగించి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కును చెల్లించుకున్నారు.. నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి చేరుకున్న వారికి గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి అభినందనలు తెలియచేశారు.

*బండలాగుడు పోటీలను ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..గిద్దలూరు మండలం, ముండ్లపాడు పంచాయతీ, బురుజుపల్లె గ్రామంలో ఆదివారం శ్రీ వరసిద్ధి వినాయక అభయ ఆంజనేయ, షిరిడి సాయిబాబా స్వామి వార్ల ఆలయ 13 వ వార్షికోత్సవ వేడుకలలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందచేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను అశోక్ రెడ్డి ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గోన్నారు.*

???? ఆంధ్ర మిర్రర్… ఉన్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వారు ఆదివారం కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.కంభం పరిసర గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు వారికి శంకర కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది డాక్టర్ బిపిన్ డాక్టర్ అబోలి వారి సిబ్బంది 274 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 195 మందిని కంటి శస్త్ర చికిత్సలు అవసరం అయినట్లు ట్రస్ట్ మెయింటైనెర్ శ్రీరామ్ తెలిపారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని సోమవారం గుంటూరు లోని శంకర కంటి ఆసుపత్రికి తరలించ నున్నట్లు ఆయన తెలిపారు.

*దాచేపల్లి: కానిస్టేబుల్ ఇంట్లో చోరీ*మండలంలోని నారాయణపురంలో ఓ కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న *నాగార్జున* డ్యూటీకి వెళ్ళగా గుర్తుతెలియని వ్యక్తులు తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. కాగా 68గ్రా బంగారు ఆభరణాలు, 350గ్రా వెండి, రూ.25వేల నగదు చోరీ జరిగిందని స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

????మాజీ ఏఏజీ పొన్నవోలుపై పోలీసులకు ఫిర్యాదు ..మాజీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై టీడీపీ నేత తోపూరి గంగాధర్‌ మంగళగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌ల‌పై పొన్నవోలు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేశారు. వైసీపీ అధినేత జగన్‌ను చంపేస్తే ఏంటని చంద్రబాబు అన్నట్లు పొన్నవోలు తప్పుడు వ్యాఖ్యలు చేశార‌ని గంగాధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

???? మానవ మృగాన్ని ఉరితీయాలి: సిర్ఒఊర్ ఎమ్మెల్యే

మానవ మృగాన్ని ఉరితీయాలి: సిర్ఒఊర్ ఎమ్మెల్యే చిన్నారి సహస్రపై హత్యాచారం చేసిన మానవ మృగాన్ని ఉరితీయాలని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీశ్ బాబు డిమాండ్ చేశారు. కాగజ్‌నగర్‌ లోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో దహేగాం‌ మండలానికి చెందిన చిన్నారి సహస్ర దారుణ హత్యాచార ఘటనపై కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. సమాజంలో ఇలాంటి మానవ మృగాలకు చోటు లేకుండా చేయాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసి నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు.

???? గుండె కుడివైపు ఉందని భార్యను వదిలేసిన భర్త..

ఓ యువతిని పెళ్లాడిన వ్యక్తి ఆమెకు గుండె కుడి వైపు ఉందనే కారణంతో వదిలేశాడు. ఖమ్మంలోని జయనగర్‌కాలనీలో గంగాభవానీకి భాస్కరాచారితో 2018లో వివాహం జరిగింది. గుండె కుడి వైపు ఉందని, ఈ విషయం దాచి పెళ్లి చేశారని ఆమెను పుట్టింటికి పంపించివేశారు. దీంతో కోర్టును ఆశ్రయించగా తీర్పు వచ్చేవరకు ప్రతినెలా మనోవర్తి రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది. మనోవర్తి డబ్బులు అడిగేందుకు వెళ్లిన గంగాభవానీపై అత్తామామలు దాడి చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో బోనకల్లు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

???? వర్మ షాకింగ్ కామెంట్స్!..వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. “ఇక మీదట రాజకీయాల జోలికి వెళ్లను.నాకు తెలుసు మీరు ఈ ప్రశ్న అడుగుతారని. అందుకే ఇంతకుముందే చెప్పినట్లు నేను ఇక రాజకీయాలపై సినిమాలు తీయను. ఇక నుంచి దేవుళ్లపై మూవీస్ చేస్తాను” అంటూ చెప్పడంతో అక్కడ ఉన్నవారుఅంతా ఒక్కసారిగా నవ్వారు.

????కోఠి లోని డిఎంఈ కార్యాలయం ముట్టడికి యత్నించిన ఆశా వర్కర్లు..కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆశావర్కర్లకు 18వేలు పెంచుతామని హామీ ఇచ్చిన మేరకు 18వేల వేతనాలు పెంచాలి..ఆశావర్కర్ల నూతన నియామకాలు చేపట్టాలి..1వ తారికు రోజే ఆశా జీతాలు చెల్లించాలి అంటూ డిమాండ్

????బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి..

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ శనివారం బొమ్మలోని ఓ చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానిక ఆస్ప‌త్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ప‌రీక్షించి విజ‌య‌వాడకు తీసుకెళ్లాల‌ని సూచించారు. దీంతో హుటాహుటిన విజయవాడలోని ఆయుష్ ఆస్ప‌త్రికి పాప‌ను తీసుకోచ్చారు. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుకున్న‌ట్లు గుర్తించిన వైద్యులు.. ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని బ‌య‌ట‌కు తీశారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..