????రోజాకు షాక్.. రూ.100 కోట్లతో ఆడేసుకున్నారట! ఆడుదాం ఆంధ్రా పేరుతో జరిగిన ప్రోగ్రాంలో రూ.100 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లుగా సీఐడీకి కంప్లైంట్ చేశారు.
ఏపీలో అధికార బదిలీ నేపథ్యంలో కొత్త పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి.గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు మంత్రుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు..ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజాపై కొత్త కంప్లైంట్ తెర మీదకు వచ్చింది. ఆడుదాం ఆంధ్రా..సీఎం కప్ల పేరుతో క్రీడాశాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా అనేక అవకతవకలకు పాల్పడినట్లుగా పేర్కొంటూ సీఐడీకి కంప్లైంట్ చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.ఆడుదాం ఆంధ్రా పేరుతో జరిగిన ప్రోగ్రాంలో రూ.100 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లుగా సీఐడీకి కంప్లైంట్ చేశారు. గత ప్రభుత్వంలోపని చేసిన శాప్ ఎండీలు..శాప్ ఉన్నతాధికారులు.. అన్ని జిల్లాల్లోని డీఎస్ డీవోలపైనా విచారణ జరపాలని కోరారు. అంతేకాదు..స్పోర్ట్సో కోటాలో మెడికల్..ఇంజినీరింగ్.. ట్రిపుల్ ఐటీ ఆడ్మిషన్లు పొందిన వారిపైనా విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఐదేళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగంలో పలు అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.వీటిపైనా విచారణ చేయాలని కోరుతున్నారు.ఈ పరిణామాల్ని చూస్తే.. ఆర్కే రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని చెబుతున్నారు.గత ప్రభుత్వంలో యాక్టివ్ గా ఉంటూ..నాటి విపక్ష నేత చంద్రబాబును..జనసేనాని పవన్ కల్యాణ్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన ఆమె తీరుపై తెలుగు తమ్ముళ్లు ఎంతటి ఆగ్రహంతో ఉన్నారో తెలిసిందే. ప్రభుత్వం కొలువు తీరిన రెండు..మూడురోజులకే సీఐడీకి కంప్లైంట్ చేయటం చూస్తే..రానున్న రోజుల్లో పలు సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
????మంత్రులకు శాఖలు కేటాయింపు: సీఎం చంద్రబాబు – సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు ????పవన్ కల్యాణ్ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ ????నారా లోకేష్ – మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ) ????వంగలపూడి అనిత – హోంశాఖ, విపత్తు నిర్వహణ ????అచ్చెన్నాయుడు – వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక ????కొల్లు రవీంద్ర – గనులు, జియాలజీ, ఎక్సైజ్ ????నాదెండ్ల మనోహర్ – ఆహార, పౌరసరఫరాలు ????పొంగూరు నారాయణ – మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి ????సత్యకుమార్ యాదవ్ – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య ????నిమ్మల రామానాయుడు – జలవనరుల అభివృద్ధి ????ఎన్‍ఎండీ ఫరూక్ – న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమం ????ఆనం రామనారాయణరెడ్డి – దేవదాయ ????పయ్యావుల కేశవ్ – ఆర్థికం, ప్రణాళిక, వాణిజ్య పన్నులు ????అనగాని సత్యప్రసాద్ – రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు ????కొలుసు పార్థసారథి – గృహనిర్మాణం, సమాచార శాఖ ????డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి – సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు ????గొట్టిపాటి రవికుమార్ – విద్యుత్ శాఖ ????కందుల దుర్గేష్ – పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ ????గుమ్మడి సంధ్యారాణి – మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం ????బీసీ జనార్ధన్ రెడ్డి – రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు???? టీజీ భరత్ – పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి ????ఎస్.సవిత – బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత ????వాసంశెట్టి సుభాష్ – కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవలు ???? కొండపల్లి శ్రీనివాస్ – ఎంఎస్‍ఎంఈ, సెర్ప్, ఎన్‍ఆర్ ఐ వ్యవహారాలు???? మండిపల్లి రామ్‍ప్రసాద్ రెడ్డి – రవాణా, యువజన, క్రీడలు
ప్రకాశం:కనిగిరి ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే డా ముక్కు ఉగ్రనరసింహారెడ్డి..సౌకర్యాలు సరిగా లేకపోవడంతో వాటికి గల కారాణాలపై వైద్యాధికారులపై ఆగ్రహం….ప్రైవేట్ హాస్పిటల్ ను తలదన్నేలా హాస్పిటల్ లో వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు.తిరిగి మరోసారి తనిఖీ వచ్చేటప్పటికి రోగులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు .
????పూరిగుడిసె కాలిపోయి నిరాశ్రయులకు మారిన బాధితులు… దాతల సహాయం కోసం ఎదురుచూపులు*
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మరియమ్మ అనే మహిళకు చెందిన పూరిగుడిసె పూర్తిగా కాలిపోయింది.మంటల్లో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కాలిపోవడంతో పాటు కూలి పని చేసి దాచుకున్న డబ్బులు కొంత బంగారం వెండి వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి.మరియమ్మకు ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు, భర్త కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందాడు.మరియమ్మ కూలి పనులకు వెళ్తేనే ఇల్లు గడుస్తుందని వెల్లడించింది.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు కాలిపోయి నిరాశ్రయులకు మారామని పూర్తిగా రోడ్డు మీద పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తూ వెల్లడించింది.దాతలు ఎవరైనా తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటుంది.ఎవరైనా దాతలు తమకు సహాయం అందించాలనుకుంటే 9949911348 ఫోన్ పే,గూగుల్ పే నంబర్ కు తోచినంత ఆర్థిక సహాయం అందించాలని మరియమ్మ కోరుకుంటుంది.
????వైసీపీ ఇంకా పూర్తిగా చావలేదు…నాగబాబు వార్నింగ్ ఏమిటి? అవును… ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ సోషల్ మీడియా వేదికగా కొన్ని విషపు రాతలు రాస్తున్నారని ఫైరవుతున్నారు నాగబాబు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. మరోపక్క వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన పరిస్థితి. ఈ సమయంలో టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి స్పిరిట్ ని దెబ్బతీసేలా కొన్ని విషయపు రాతలు రాస్తున్నారని.. వైసీపీ ఇంకా పూర్తిగా చావలేదని, బ్రతికే ఉందని అంటూ… సీరియస్ వ్యాఖ్యలు, స్ట్రాంగ్ వార్నింగ్ లతో ఒక వీడియోని విడుదల చేశారు నాగబాబు.
అవును… ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ సోషల్ మీడియా వేదికగా కొన్ని విషపు రాతలు రాస్తున్నారని ఫైరవుతున్నారు నాగబాబు. “అవి ఏమిటో మాత్రం చెప్పడం ఇష్టం లేదని” అన్నారు. అనంతరం… ఎవరైనా సరే, అటువంటి విషపు సర్క్యులేషన్స్ ని ప్రచారంలోకి తీసుకొస్తే అది చాలా తప్పని తెలిపారు. కారణం… అది టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి స్పిరిట్ కి తప్పుడు సంకేతాలు ఇస్తుందని చెప్పుకొచ్చారు. అటువంటి పనులు ఎవరు చేసినా సోర్సేమిటో కనుక్కుని తగిన విధంగా బుద్దిచెప్పాల్సి ఉంటుందని అన్నారు.పవన్ కల్యాణ్, చంద్రబాబు, మోడీ, పురందేశ్వరి చాలా కష్టపడి తయారుచేసిన అద్భుతమైన కూటమి ఇదని, అలాంటి కూటమి స్పిరిట్ ఎఫెక్ట్ అయ్యేలా ఎవరైనా రాతలు రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.ఈ సందర్భంగా ఇలాంటి రాతలు రాయించేది.. వైసీపీ ప్రేరేపితమైన కొంతమంది వ్యక్తులు అని అన్నారు. ఈ వీడియోతోపాటు… “జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి స్పిరిట్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఖశ్చితంగా తన తగిన కఠిన చర్యలు తీసుకోబడతాయి.. వైసీపీ ఇంకా పూర్తిగా చావలేదు, బతికే వుంది. ఆ కోరల్లోంచి వచ్చే విషపు రాతలివి. వాటినెవ్వరు పట్టించుకోకండి” అని రాసుకొచ్చారు. అయితే… ఇంతకూ ఆ విషపురాతలు ఏమిటి.. వేటిని విషపురాతలుగా పరిగణించాలి అనే క్లారిటీ లేకుండా… ఇలా ముసుగులో గుద్దులాట ఆడటంపై నెట్టింట కామెంట్లు వైరల్ అవుతున్నాయి! ఆ విషపు రాతలు ఏమిటో చెప్పేస్తే కార్యకర్తలు జాగ్రత్తపడతారుగా అనేది మరో కామెంట్. ఏది ఏమైనా…నాగబాబు మాత్రం ఏదో బలమైన విషయాన్నే చెప్పాలనే ప్రయత్నం చేశారని మాత్రం అభిమానులు అంటున్నారు.
????ఎస్ఐ రాసలీలలు.. హనుమకొండ జిల్లాలో చిక్కిన ఖమ్మం అధికారి..విచారించి వదిలేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు?హసన్పర్తి: ఖమ్మం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు ఇన్స్పెక్టర్ పాడు పనికి ఒడిగట్టాడు. యువతితో రాసలీలలు సాగిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన హనుమకొండ నగరంలోని చింతగట్టు సమీపాన ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ మారిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన సదరు అధికారి ఖమ్మం జిల్లాలో ఎస్ఐబీ విభాగంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు.????2009లో కానిస్టేబుల్గా విధుల్లో చేరిన ఆయన 2014లో ఎస్సైగా, ఆతర్వాత ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నాడు. ఆ ఇన్స్పెక్టర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. అయితే, మంగళవారం సదరు ఇన్స్పెక్టర్ తన ప్రియురాలితోపాటు మరికొందరు స్నేహితులతో కలిసి చింతగట్టు సమీపాన ఫంక్షన్ హాల్లో విందు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఓ గదిలో స్నేహితులు మద్యం సేవిస్తుండగా, ఇంకో గదిలో యువతితో ఆ సీఐ రాసలీలల్లో మునిగి తేలినట్లు తెలిసింది.ఈ విషయం టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలియడంతో వారు వెళ్లి యువతితో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ను చూసి షాక్కు గురైనట్లు సమాచారం. అయితే, టాస్క్ ఫోర్స్ పోలీసులను గమనించిన ఇన్స్పెక్టర్ స్నేహితులతోపాటు యువతి పారిపోయినట్లు తెలిసింది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలిపెట్టినట్లు సమాచారం. అయితే, సదరు ఇన్స్పెక్టర్ స్నేహితులను, యువతిని పోలీసులే తప్పించారా లేక పరారయ్యారా అన్నది చర్చ జరుగుతోంది. ఈ విషయమై పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకిరాలేద.
????భోపాల్: కోడళ్లను వేధించే అత్తల గురించి అందరం వింటుంటాం. సమాజంలో ఇది మామూలే. అయితే మధ్యప్రదేశ్లోని రెవా జిల్లాలోని అట్రాలా గ్రామంలో ఓ కోడలు అత్తను అతి దారుణంగా చంపింది. కొడవలితో ఒక్కసారి కాదు ఏకంగా 95సార్లు నరికి నరికి చంపింది.ఈ కేసు విచారించిన రెవా జిల్లా కోర్టు బుధవారం(జూన్12) మరణ శిక్ష విధించింది. 2022 జులై12న కోడలు కంచన్ చేతిలో అత్త సరోజ్కోల్ హత్యకు గురైంది.అత్త సరోజ్కోల్ హత్యకు మామ వాల్మీకికోల్ దగ్గరుండి కోడలిని పురిగొల్పినట్లు పోలీసులు ఛార్జీషీట్లో పేర్కొన్నారు. కానీ ఆధారాలు లేక వాల్మీకి కోల్ను కోర్టు విడుదల చేసింది

