మెగా DSC అమలుకు,ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుకు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ధన్యవాదాలు తెలిపిన టిఎన్ఎస్ఎఫ్ నాయకులు..ఫలితాలపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మంత్రి డోలాశ్రీని కలిసిన ప్రముఖులు..తండ్రిని కడతేర్చిన కూతురు!!!..

????ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించారు నారా చంద్రబాబునాయుడు.????మెగా DSC అమలుకు తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.????రెండవ సంతకం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుకు చేసారు సీఎం చంద్రబాబునాయుడు.????అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ పై నాలుగవ సంతకం చేసిన సీఎం చంద్రబాబునాయుడు…పించన్ రూ: 4 వేలకు పెంచుతూ మూడవ సంతకం చేసిన సీఎం చంద్రబాబునాయుడు.

????మెగా డీఎస్సీపై మొదటి సంతకం పెట్టిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు..త్వరలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల*16,347 టీచర్ పోస్టుల కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు*ఎస్జిటి: 6,371; పిఈటీ : 132; స్కూల్ అసిస్టెంట్: 7725; టి జి టి: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్: 52

????సర్వే ఫలితాలు, అసలు ఫలితాలు… జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు! అవును… ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు.

ఏపీలో వచ్చిన ఎన్నికల ఫలితాలను వైసీపీ అధినేత, నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారని తెలుస్తుంది! 151 నుంచి 11 కి పడిపోవడంపై వారి విశ్లేషణలు ఓ కొలిక్కి వస్తున్నట్లు లేదని అంటున్నారు.ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉంటే మాత్రం ఇలా జరుగుతుందా అంటే… ఆ వ్యతిరేకతను జగన్ చేయించుకున్న సర్వే సంస్థలు గుర్తించలేదా అనే చర్చ తెరపైకి వస్తుంది.ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు.తాజా ఎన్నికల్లో ఓటమిపాలైన ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ సందర్భంగా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇందులో భాగంగా… ఎన్నికలకు ముందు ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించలేదని..కానీ ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయని వ్యాఖ్యానించిన పరిస్థితి.ఇదే క్రమంలో… పోలింగ్ కు ముందు, పోలింగ్ తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించామని.. ఇందులో భాగంగా 17 లక్షల శాంపిల్స్ తీసుకున్నామని జగన్ తెలిపారు. దీంతో… జగన్ ఏమి చెప్పాలనుకుంటున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. కేవలం 17 లక్షల శాంపుల్సేనా అనలేని పరిస్థితి. కారణం… ఈ నెంబర్ చిన్నదేమీ కాదు! అయితే… ఇన్ని లక్షల శాంపుల్స్ తీయించినా కూడా ప్రభుత్వ వ్యతిరేకతను సర్వే సంస్థలు గుర్తించలేకపోవడం గమనార్హం. నిజంగానే సర్వే సంస్థలు ఆ విషయాన్ని గుర్తించలేదా.. లేక, జగన్ ఆ వ్యతిరేకతను తీసుకోలేరని సర్వే సంస్థలే కావాలనే హైడ్ చేశాయా అనే చర్చా తెరపైకి వచ్చింది. అయితే…ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం తెలుసుకోవడం కోసం పూర్తిగా సర్వే ఫలితాలపైనే ఆధారపడకుండా..రెగ్యులర్ గా తమ ఎమ్మెల్యేలతో జగన్ టచ్ లోకి వెళ్లి ఉంటే ఈ ప్రమాదం సంభవించేది కాదనే వారూ లేకపోలేదు! జగన్ కూ ఎమ్మెల్యేలకూ మధ్య అడ్డుగా అన్నట్లుగా ఉన్న కోర్ కమిటీ… ప్రజలకు – ప్రభుత్వానికీ కూడా అడ్డుగా నిలిచినట్లున్నారని ఇప్పుడు అనుకున్న ప్రయోజనం ఏముందనేది మరో కామెంట్. ఏది ఏమైనా… ఓటమిని హుందాగా తీసుకోవడమే కాకుండా… ప్రజల్లో బలంగా నిలబడాల్సిన బాధ్యత కూడా జగన్ ఉందనేది పలువురు చెబుతున్న మాట. మరో విషయం ఏమిటంటే… ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎప్పుడూ కనబడదని, కనబడనివ్వరనే విషయం కూడా పెద్దలు గ్రహించాలని అంటున్నారు.

????ప్రకాశం జిల్లా మంత్రివర్యులు డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ని,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ మరియు కొండపి నియోజకవర్గం సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు మర్యాదపూర్వకంగా కలిసిన ప్రకాశం జిల్లా పూర్వ కలెక్టర్ బి.ఉదయలక్ష్మీ మరియు వారి భర్త మాజీ ఐపీఎస్ అధికారి బి.రమణ కుమార్.

???? బదిలీపై వెళ్తున్న పొదిలి సాటిలైట్ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ వెంకటస్వామిని సత్కరిస్తున్న మార్కాపురం ఎల్ఐసి అధికారులు మరియు ఏజెంట్లు

???? గత ప్రభుత్వం లో జగన్మోహన్ రెడ్డి, మాయ మాటలు చెప్పి. యువతను మోసం చేసిన సైకో జగన్మోహన్ రెడ్డి. విద్యార్థుల జీవితాలని నాశనం చెయ్యడమే జగన్ మోహన్ రెడ్డి నైజం.తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే (మెగా డీఎస్సీ) పై తోలి సంతకం పెట్టిన మన ముఖ్యమంత్రి వర్యులు (నార చంద్రబాబు నాయుడు),తెలుగుదేశం పార్టీ దమ్మున్న పార్టీ గా నిరూపించారు. యువత జీవితాలను మేలు చెయ్యడం లో చంద్రబాబుకి తిరుగులేదు. గతంలో జాతీయ ప్రథాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువత కోసం ఎన్నో పోరాటాలు చేశారు. (మెగా డీఎస్సీ ) పై తోలి సంతకం పెట్టిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రథాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకి మా ధన్యవాదాలు.T.N.S.F. జిల్లా ప్రథాన కార్యదర్శి షేక్ :గౌస్ బాషా.

????మార్కాపురం తెలుగుదేశం శాసనసభ్యులుగా ఎన్నికైన కందుల నారాయణరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదగాపూర్వకంగా కలిసిన పొదిలి తాహసిల్దార్ మహమ్మద్ జియా ఆయన వెంట ఆర్ఐ సుబ్బారావు ఆవుదాలపల్లి విఆర్ఓ అబ్దుల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

????మద్యం మత్తులో ఇరువురి మధ్య ఘర్షణ..ఒకరి హత్య*తణుకు, ప.గో.జిల్లా..తణుకు మండలం దువ్వ గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఘటన..పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు (40), దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మద్య వాగ్వాదం..మోటారుసైకిల్‌పై వెళ్లిపోతున్న భాస్కరరావును గాజుపెంకుతో చాతీ భాగంలో పొడిచిన రామకృష్ణ.బండిపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్న భాస్కరరావు.చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందిన భాస్కరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన తణుకు రూరల్‌ సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై కె.చంద్రశేఖర్‌కేసు నమోదు చేసి నిందితుడు భాస్కరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు..

????నాన్నను లేపేసిందోచ్.. మదనపల్లిలో దాష్టీకం…*ఇద్దరి ప్రియుల ముద్దుల గుమ్మ*ఒకడికి రూ.10లక్షల సుఫారి*

తనకు నచ్చని పెళ్లికి సిద్ధమయ్యాడని కన్న తండ్రినే ఓ బిడ్డ కడతేర్చిన ఘటన సభ్య సమాజాన్ని కలచి వేసింది. తప్పటడుగుల ప్రాయంలో చిటికిన వేలుతో నడక నేర్పి,, కౌమార దశలో కంటికి రెప్పలా కాపాడిన తండ్రి మమకారం..ప్రియుడి ప్రేమమత్తులో ఆ కూతురుకు గుర్తుకురాలేదా? అని మదనపల్లి జనం తమను తాము ప్రశ్నించుకునే దారుణ ఘటన ఇది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం తెల్లవారు జామున ఈ ఘాతుకం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి పట్టణంలోని ఎగువ కురవంక ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్టల్ అండ్ టెలీకమ్ కాలనీలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి నివసిస్తున్నారు. ఆయన భార్య లత ఏడాదన్నర కిందట చనిపోయారు.అప్పటి నుంచి తన ఒక్కగాని ఒక్క గారాల పట్టి హరిత (25) ను కంటికి రెప్పలా దొరస్వామి కాపాడుతున్నారు. ఆమె బీఎస్సీ బీఈడీ చదివింది. త్వరలో టీచర్ ఉద్యోగం నుంచి రిటైర్ కానున్నారు. ఉద్యోగ విరమణతో వచ్చే డబ్బుతో .. తల్లి లేని బిడ్డకు వైభవంగా పెళ్లి చేసి మెట్టినింటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. కుప్పంలో ఓ కుటుంబంతో సంబంధం కుదిర్చారు. సుమారు రూ.80 లక్షల విలువ చేసే రెండు అంతస్తుల భవనం ఆస్తిని ఈ మధ్యనే తన కూతురుకు పసుపు కుంకుమగా రిజిస్ర్టేషన్ చేశారు. ఆయనకు మద్యం అలవాటు ఉంది. బుధవారం రాత్రి మద్యం తాగి నిద్ర పోయారు. ఉదయం చూసే సరికి రక్త మడుగులో దొరస్వామి శవం కనిపించింది. మదనపల్లి పోలీసులకు ఈ సమాచారం అందింది. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వన్ టౌన్, తాలుకా సీఐలు వల్లి బసు , శేఖర్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కీలక ఆధారాలు సేకరించారు????ప్రియుడికి రూ.10 లక్షల సుఫారీ.. మాస్టార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదిస్తున్నారు.అంత్యంత గోప్యంగా అందిన పోలీసుల దర్యాప్తు సమాచారం మేరకు.. కన్నకూతురే అత్యంత క్రూరంగా చంపిందని, ఇందుకు ఇద్దరు ప్రియులను వినియోగిందనే సమాచారం బయటకు పొక్కింది. ఎందుకంటే.. . దొరస్వామి హత్య జరిగిన సమయంలో కుమార్తె హరిత ఇంటిలోనే ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని చెప్పింది. ఆ సమయంలో ఘర్షణ వినపడలేదా? దెబ్బల శబ్ధం వినపడలేదా? ఇలాంటి ప్రశ్నలు సంధించే సరికి.. తన తండ్రి దొరస్వామిని తానే చంపానని హరిత పోలీసులకు తెలిపింది. దొరస్వామి తనపై లైంగిక వేదింపులకు పాల్సడినట్టు ఆమె వినిపించిన కథను దర్యాప్తు అధికారులు నమ్మలేదు. మరిన్ని ప్రశ్నలు సంధించగా… అసలు ప్రియుల కథను విప్పిందని తెలుస్తోంది. తనకు ఇద్దరు ప్రియులు ఉన్నారు. పై అంతస్తులో రహస్యంగా సహజీవనం చేస్తుంది. రోజుకు ఒకరు పై అంతస్తుకు వస్తారు. కింది అంతస్తులోని దొరస్వామికి ఈ విషయాన్ని స్థానికులు తెలిపారు. పెళ్లి చేసి పంపించాలని నిర్ణయానికి వచ్చారు. వేరే వ్యక్తితో తనకు పెళ్లి వద్దని హరిత ఎదురు తిరిగింది. తండ్రి ఒప్పుకోలేదు. దీంతో అతడిని హతమార్చటానికి హరిత సిద్ధమైంది. ఒక ప్రియుడికి రూ.10లక్షల సుఫారీ ఇచ్చింది. అంతే దొరస్వామిని హతమార్చారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఓ ప్రియుడు తిరుమలలో వెంకన్న దర్శనం క్యూలో ఉన్నాడు. మరొక ప్రియుడి ఫోన్ ఆధారంగా ఎక్కడ ఉన్నాడో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. చపాతీల కర్రతో.. ఇనుప రాడ్డుతో తానే కొట్టి చంపానని నిందితురాలు పోలీసులకు చెప్పిట్టు సమాచారం. కానీ.. ఒంటరిగా ఆమె మాత్రమే హత్య చేసే అవకాశం లేదని, కనీసం ఇద్దరు ముగ్గురు సహకరించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె చెప్పిన కొన్ని విషయాలపై మరిన్ని అనుమానాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఈ ఉత్తమ ఉపాధ్యాయుడిని కన్నకూతురే హతమార్చినట్టు పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..