భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ..జగన్ ఫొటో ఉన్నా సరే విద్యార్థులకు కిట్స్ పంపిణి..శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు..జనంలోకి జగన్..విద్యుత్ స్తంభం ఎక్కిన భర్త..ఉపాధ్యాయుడు హత్య..రెస్టారెంట్లలో కుళ్ళిపోయిన గుడ్లు.

????భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ..అప్రమత్తమైన ఆరోగ్య శాఖ కోల్‌కతా : భారత్‌లో రెండో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. కోల్‌కతాకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ(H9N2) సంక్రమించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.
భారతీయ సంతతికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఆస్ట్రేలియాలో ఉండగా ఈ వ్యాధి సోకింది. వైద్య పరీక్షల్లో చిన్నారికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారనైంది.
ఇది జరిగిన దాదాపు మూడు నెలల తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌కు వెళ్లడించింది. ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. చిన్నారి గత ఫిబ్రవరిలో తల్లిదండ్రులతో కలసి కోల్‌కతాకు వచ్చింది.
చిన్నారి కుటుంబం ఫిబ్రవరి చివరిలో సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చింది. ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత చిన్నారికి జ్వరం వచ్చింది. చిన్నారి బ్లడ్ శాంపిల్‌ను పరీక్షించగా ‘బర్డ్‌ ఫ్లూ’ వైరస్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.????తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, జ్వరంతో బాధపడిన ఆ చిన్నారిని ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందించారు. కొద్దిరోజుల క్రితమే కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు.ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత గత మే నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఈ వార్త చేరింది. దీంతో భారత్‌లోని ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.కోల్‌కతాలో చిన్నారితో పరిచయం ఉన్న వ్యక్తులకు ఆరోగ్య పరీక్షలు చేసింది. అయితే ఎవరిలోనూ వైరస్‌ కనుగొనలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆలస్యంగా నివేదిక అందినందుకు ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.ఫిబ్రవరిలో జరిగిన సంఘటనను మే రెండవ వారంలో నివేదించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా భారత్‌లో ఇది రెండో H9N2 బర్డ్‌ఫ్లూ కేసు. 2019లో ఒకరు దీని బారినపడ్డారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగా కనిపిస్తాయని వెల్లడించింది. భారత్‌లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించనప్పటికీ వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య కేంద్రం నిఘా పెంచింది.
బర్డ్‌ఫ్లూ H5N2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. బర్డ్‌ఫ్లూ వైరస్‌ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం అదే అని WHO వెల్లడించింది.సాధారణంగా పక్షులకు మాత్రమే బర్డ్‌ ఫ్లూ సోకే అవకాశం ఉంటుంది.కానీ ఒక్కోసారి మనుషుల్లో కూడా ఇది కనిపిస్తుంది
????జగన్ ఫొటో ఉన్నా సరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయ్యండి..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవని టీడీపీ ట్వీట్ చేసింది. ‘బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి,చంద్రబాబుకు ఎంత తేడా? ప్రజాధనం వృథా కాకూడదు. పాలనలో పగ, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని జగన్ బొమ్మ ఉన్నా స్కూల్ పిల్లల కిట్స్ అలాగే పంపిణీ చేయమని సీఎం చంద్రబాబు ఆదేశించారు’ అని Xలో పోస్ట్ చేసింది.

????తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం..తిరుమల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు తితిదే జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్ద జీయర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూక్లాంపెక్స్ వద్దకు తెదేపా కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.

????జనంలోకి జగన్..యాత్రకు సిద్దం..

వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.కొత్త ప్రభుత్వం కొలువు తీరటంతో జగన్ తనకార్యాచరణ సిద్దం చేస్తున్నారు.ఈ మేరకు జిల్లాల పర్యటనలకు వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం.పార్టీ ముఖ్య నేతలు ఈ మేరకు షెడ్యూల్ ఖరారు కానుంది.రెండు లక్ష్యాలతో జగన్ జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.ఇక..జగన్ వచ్చే వారం జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు
???? ఆదిలాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్య గురైన ఘటన కలకలం రేపుతుంది.

పాఠశాల పున: ప్రారంభం సందర్భంగా బుధవారం విధులకు హాజరయ్యేందుకు నార్నూరు మండలంలోని తన స్వగ్రామం నుండి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో లోకారి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు పై టీచర్ పై దాడి చేసి హతమార్చారు. అయితే ఘటన ఎందుకు జరిగింది. కారణం ఏంటో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
????అలిగి ఇంట్లో నుండి వెళ్లిపోయిన భార్య..
విద్యుత్ స్తంభం ఎక్కిన భర్త…సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉండే మోహన్ బాబు(25) మద్యం మత్తులో శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి గందరగోళం చేశాడు.
స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు, మోహన్ బాబు స్తంభం మీదే కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ అందరినీ ఆందోళనకు గురిచేశాడు. గంటన్నర పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరకు పోలీసులే స్తంభం ఎక్కి సముదాయించి కిందకు దించారు.
ఇతడు రెండేళ్లలో ఐదుసార్లు ఇలా విద్యుత్ స్తంభం ఎక్కాడు.. భార్య తిట్టినా, కోపం వచ్చినా ఇలాంటి పనులు చేస్తాడని తెలిపిన పోలీసులు.

????మిరమిట్ల గొలిపే విద్యుత్ లైట్లు, వెరైటీ రుచులంటూ ఆకర్షణీయమైన బోర్డులతో ఆకట్టుకుంటున్న హోటళ్ల నిర్వాహకులు నాణ్యత పాటించడం లేదు. కనిపించి, కనిపించని విద్యుత్ లైట్ల వెలుతురులో రెస్టారెంట్లలో కూర్చున్న కస్టమర్లకు నిర్వాహకులు కుళ్లిపోయిన, నాణ్యతలేని ఆహారం అంటగడుతు పబ్బం గడుపుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యంపై ఏ మాత్రం పట్టించుకోకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వివరాల్లోకి వెళితే… మంచిర్యాల పట్టణంలోని స్వాగత్ ఫ్రైడ్ రెస్టారెంటు నుంచి క్రాంతి అనే యువకుడు ఆన్‌లైన్‌లో ఎగ్ మంచూరియా ఆర్డర్ పెట్టాడు. తీరా అది ఓపెన్ చేస్తే కుళ్లిపోయిన గుడ్డు ముక్కలు, దుర్వాసన రావడంతో సదరు యువకుడు ఆ రెస్టారెంటు వెళ్లి ఆర్డర్ చేసిన ఎగ్ మంచూరియాను చూపించి నిర్వాహకులు ప్రశ్నించారు. నిర్వాహకుడు ఇదేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. లోపల ప్యాక్ చేసేది, చేసింది మాకెలా తెలుస్తుంది. నీకు ఇష్టమైంది చేసుకో, ఎవరికైనా చెప్పుకో, కౌంటర్ వద్దకు వచ్చి గొడవ చేశావంటూ నీ పైనే కేసు పెడుతానంటూ బెదిరింపులకు గురి చేశాడు. అంతే కాకుండా ఈ రెస్టారెంట్ ఓ కమ్యూనిస్టు పార్టీ నాయకుడి కొడుకుది కావడంతో వారి నుంచి సైతం ఫోన్లు వస్తుండటం కొసమెరుపు.పట్టించుకోని అధికారులు…నిత్యం ఆహార నాణ్యతను చూసే సంబంధిత శాఖ అధికారులు ఏమీ పట్టించుకోకపోవడంతో రెస్టారెంటు, హోటళ్ల నిర్వాహకుల వ్యాపారం మూడు పువ్వులు.., ఆరు కాయలుగా సాగుతున్నది. అసలు మంచిర్యాలలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో, లేదో కూడా తెలియడం లేదు. తనిఖీలు లేవు, పర్యవేక్షణ లేదు. అధికారులు వారి కనుసన్నుల్లో ఉండడంతోనే హోటళ్ల నిర్వాహకులు, ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.ఏం చేసుకుంటారో చేసుకోమన్నారు????క్రాంతి.. ఫుడ్ ఆర్డర్ చేసిన బాధితుడు..మేం మంచిర్యాలలోని స్వాగత్ ఫ్రైడ్ రెస్టారెంట్ నుంచి ఎగ్ మంచూరియా ఆర్డర్ పెట్టాం. మాకు వచ్చిన పార్సిల్లో కుళ్లిపోయిన గుడ్లు వచ్చాయి. దుర్వాసన రావడంతో దానిని స్వాగత్ ప్రైడ్ రెస్టారెంటుకు వచ్చి చూపించాం. నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఏం చేసుకుంటారో చేసుకోండి, అన్నింటిని చూడలేం కదా అంటూ దురుసుగా సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆ నాణ్యతలేని మంచూరియాను డస్ట్ బిన్లో పడేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తామంటే చెప్పుకోండి, మీరిక్కడ గొడవ చేయడానికి వచ్చారా.. వెళ్లండంటూ పంపించేశారు. అధికారులు స్పందించి ఇలాంటి రెస్టారెంట్లపై అదికారులు చర్యలు తీసుకోవాలి.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..