ఓడరేవులన్నీ ఆదానీ హస్తగతం..యోగీకి పొగ పెడుతున్నారా ?..బిజెపి ధృత్తరాష్ట్ర కౌగిలిలో టిడిపి…విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి ..అంబటికీ చీర జాకెట్..పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు..కంభంలో బాలయ్య జన్మదిన వేడుకలు ..త్రిపురాంతకం ఎంపీపీ రాజీనామా.

???? ఓడరేవులన్నీ ఆదానీ హస్తగతం ! ముఖ్యంగా దేశంలోని దాదాపు అన్ని ఓడరేవులు, కీలక విమానాశ్రయాలు ఇప్పుడు గౌతమ్‌ అదానీ కనుసన్నల్లోనే ఉన్నాయి.

దేశంలోని ఓడరేవులన్నీ దాదాపు ఆదానీ హస్తగతం అవుతున్నాయి. గుజరాత్‌ లో 4, ఆంధ్రప్రదేశ్‌ లో 2, తమిళనాడులో 2, గోవాలో 1, మహారాష్ట్రలో 1, కేరళలో 1, పుదుచ్చెరిలో 1, ఒడిషాలో 1 పోర్టు ఇప్పటి వరకు ఆదానీ గ్రూపు చేతిలో ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులో పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా ఓడరేవు చేరింది. వీటితో పాటు ఆదానీకి శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌లోనూ పోర్టులు ఉన్నాయి. మోదీ హయాంలోనే అదానీ గ్రూప్‌ అన్ని రంగాల్లో వేగంగా విస్తరించుకుంటూ పోయింది. ముఖ్యంగా దేశంలోని దాదాపు అన్ని ఓడరేవులు, కీలక విమానాశ్రయాలు ఇప్పుడు గౌతమ్‌ అదానీ కనుసన్నల్లోనే ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీసెజ్‌) లిమిటెడ్‌.. కోల్‌కతాలోని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ పోర్టు కంటైనర్‌ ఫెసిలిటీ కార్యకలాపాలు, నిర్వహణ కోసం ఐదేండ్ల కాంట్రాక్టును కుదుర్చుకున్నది. కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా ఈ డీల్‌ను పొందినట్టు ఏపీసెజ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఇప్పటికే దేశంలోని 13 పోర్టులు, టెర్మినల్స్‌ అదానీ గ్రూప్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వీటిలో 45 బెర్తులున్నాయి. ముంద్రాలోగల దేశీయ తొలి పోర్ట్‌ ఆధారిత సెజ్‌, తిరువనంతపురంలోగల తొలి డీప్‌ వాటర్‌ ట్రాన్స్‌షిప్‌మెంట్‌ పోర్ట్‌ కూడా అదానీ చేతిలో ఉండడం గమనార్హం. నిర్మాణం ప్రారంభం! భారతదేశం తూర్పు తీరంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ డాక్‌.. అతిపెద్ద కంటైనర్‌ టెర్మినల్‌. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇక్కడ దాదాపు 0.63 మిలియన్‌ టీఈయూ (20 అడుగులకు సమానమైన యూనిట్‌) హ్యాండ్లింగ్‌ జరిగింది. పశ్చిమ బెంగాల్‌తోపాటు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, అస్సాం, ఇతర ఈశాన్య రాష్ర్టాలతోపాటు నేపాల్‌, భూటాన్‌లకు సేవలు అందాయి. ఈ డాక్‌కు సింగపూర్‌, పోర్ట్‌ కెలాంగ్‌, కొలంబో పోర్ట్‌ హబ్‌ల నుంచి రెగ్యులర్‌ లైన్‌ సర్వీస్‌ కాల్స్‌ కూడా ఉన్నాయి.

???? యోగీకి పొగ పెడుతున్నారా ? ఈ నేపథ్యంలో యూపీ పరాజయాలకు యోగీ ఆదిత్యనాథ్ ను బాధ్యుడిగా చేయాలని చూస్తున్నట్లు బీజేపీ శ్రేణులలో చర్చ నడుస్తున్నది.

బీజేపీ కంచుకోట అనుకున్న ఉత్తరప్రదేశ్ లో ఆ పార్టీ ప్రతిష్ట బీటలు వారింది. 2019లో 62 స్థానాలు సాధించిన బీజేపీ ఇప్పుడు కేవలం 33 స్థానాలకే పరిమితమైంది. 2019లో 49.6 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 41.4 శాతానికి పడిపోయింది. ఈసారి బీజేపీ 49 మంది సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వగా 27 మంది ఓడిపోయారు. దీంతో బీజేపీ కేవలం 240 లోక్ సభ స్థానాలకు మాత్రమే పరిమితమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు భాగస్వామ్యపక్షాల మీద ఆధారపడాల్సి వచ్చింది. 2019లో 49.6 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 41.4 శాతానికి పడిపోయింది. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ(అమేథీ), అజయ్‌ మిశ్రా(ఖేరి), మహేంద్రనాథ్‌ పాండే(చందౌలి), ఎనిమిదిసార్లు ఎంపీగా పనిచేసిన మేనకా గాంధీ(సుల్తాన్‌పూర్‌), మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌ కుమారుడు రాజ్‌వీర్‌ సింగ్‌(ఎటా) తదితర ప్రముఖ బీజేపీ నేతలు ఓడిపోయారు. ఈ నేపథ్యంలో యూపీ పరాజయాలకు యోగీ ఆదిత్యనాథ్ ను బాధ్యుడిగా చేయాలని చూస్తున్నట్లు బీజేపీ శ్రేణులలో చర్చ నడుస్తున్నది. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా ప్రకటన యోగీకి చెక్ పెట్టేందుకేనని అంటున్నారు. యోగీ మీద ఒత్తిడి పెంచేందుకే ఆయన ఈ ప్రకటన చేశారని అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో కేంద్ర నాయకత్వం తప్పిదమే ఈ ఫలితాలకు కారణమని యోగీ వర్గం వాదిస్తుండగా, యూపీలో వరుసగా జరిగిన ప్రశ్నా పత్రాల లీకేజీలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల వాయిదాలు, పెరిగిపోయిన నిరుద్యోగం, వంటి అంశాలు ఎన్నికల్లో బీజేపీకి నష్టం చేశాయని అంటున్నారు. అందుకే యోగీని వీటికి బాధ్యుడిని చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని చెబుతున్నారు. కొంతకాలం ఆగితే ఏం జరుగుతుందో తెలుస్తుంది.

???? బీజేపీ యొక్క ధృతరాష్ట్ర కౌగిలి నుండి టీడీపీ కాపాడబడుతుందా! .. రేకా చంద్ర శేఖర రావు…

బీజేపీతో స్నేహం చేసి పతనమైన పార్టీలు ఎన్నో ….ఎన్నెన్నో ..1.) ఒక నాడు 30 సంవత్సరాల క్రితం బహుజన సమాజ్ పార్టీ , సమాజ్ వాదీ పార్టీ కలయికతో ఉత్తర ప్రదేశ్ లో ఆ రెండు పార్టీల ప్రభుత్వం ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఏర్పడింది. ఆ రెండు పార్టీల మద్య విభేదాలు చిలికి చిలికి గాలి వానగా మారిన తర్వాత బీజేపీ మద్దత్తుతో మాయావతి ముఖ్యమంత్రిగా బీ యస్ పీ ప్రభుత్వం ఏర్పడింది. ఇదేమిటి అన్న వారికి మనువాద, మతోన్మాద బీజేపీ కంటే సమాజవాది పార్టీయే మనకు ప్రధాన శత్రువు అని బహెన్ మాయావతి చెప్పారు. తర్వాత క్రమంగా బీ యస్ పీ పతనం అయ్యి  ఆ స్తానాన్ని బీజేపీ ఆక్రమించింది. బీజేపీతో పోరాడుతున్న సమాజవాదీ పార్టీ బతికి వుంది, బలంగా ఉంది..2.) కాశ్మీర్ లో బీజేపీతో స్నేహం చేసిన పీడీపి నేడు అడ్రస్సు గల్లంతయ్యింది.3.)పంజాబ్ లో బీజేపీతో స్నేహం చేసిన అకాలీ దళ్ మసకబారింది. ఒక నాడు అది ఆరాష్ట్రాన్ని పాలించింది.4.)తమిళ నాడులో తనతో స్నేహం చేసిన అన్నా డియంకే ఉనికిని కోల్పోయింది. ఆ పార్టీ తమిళనాడుని అనేక సార్లు పాలించింది. నేడు ఆ పార్టీ రెండు మూడు ముక్కలయి లేవలేక పోతున్నది.5.)తనతో స్నేహంగా ఉంటున్నందుకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్  బీజేడి.. పార్టీకి నేడు నడుములు ఇరిగాయి. బీజేపీ మొదటి సారిగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది.6.) మహారాష్ట్రలో బలమయిన శివ సేన, శరద్ పవర్ పార్టీలను రెండు రెండు పార్టీలుగా చీల్చి , అందులోని ఒక్కొక్క వర్గాన్ని తమ తొత్తులుగా బీజేపీ మార్చుకుంది.7.) రెండు స్తంభాల ఆట బీజేపీ – కాంగ్రెసులతో ఆడుతూ ఎలాగో తన జే డీ యూ ఉందని అనిపించుకుంటున్నాడు నితీష్ కుమార్ .8.) విడి పోయిన టీడీపీ ని మరల కూటమిలోకి వచ్చేలా చేయగలిగింది బీజేపీ .అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని టీడీపి నేడు బలమైన శక్తిగా నిలబడింది. మైనారిటీ సంకీర్ణ కేంద్ర ప్రభుత్వంలో ఉంటూ ఆంధ్ర ప్రదేశ్ హక్కులను, రావలసిన వాటాలను చంద్రబాబు సాధించుకో గలిగితే తెలుగు దేశం నిలబడుతుంది. అన్ని పార్టీలను బ్లాక్ మెయిల్ చేసిన విధంగా టీడీపీ బ్లాక్ మెయిలింగుకి గురి అవుతుందా ! తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ని ప్రగతి పథాన నిలుపగలుగుతాడా !కాలమే చెబుతుంది.బీజేపీతో పోరాడుతున్న డియంకే, సమాజ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెసు వంటి పార్టీలు బతికి బట్ట కడుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు కాపాడబడాలంటే సమాఖ్య వ్యవస్త బలంగా ఉండాలి.సమాఖ్య వ్యవస్తను రద్దు చేసి యూనిటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు కావాలని కోరుకునే బీజేపీ రాష్ట్రాల హక్కులను ఎందుకు కాపాడుతుంది?ఈ లాజిక్ ని మరచి పోయిన ప్రాంతీయ పార్టీలు పతనం అవుతాయి.సమాఖ్య వ్యవస్త బలంగా ఉండాలన్న లక్ష్యం కలిగిన వాడు యన్టీఆర్. ఆయన వారసులం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ సమాఖ్య వ్యవస్త బలంగా ఉండాలి అన్న శక్తులతో కాక , సమాఖ్య వ్యవస్త పట్ల, రాష్ట్రాల హక్కుల పట్ల ఏ మాత్రం గౌరవం లేని బీజేపీతో చేస్తున్న స్నేహం నిలబడుతుందా!మైనారిటీలతో మైత్రిని కోరుతూ, మైనారిటీలకు రక్షణగా ఉండే తెలుగు దేశం బీజేపీ మోసపు ఎత్తుగడలకు గురయ్యి మైనారిటీ వ్యతిరేక పార్టీగా మారి యన్టీఆర్ కి ద్రోహం చేస్తుందా! బీజేపీ యొక్క ధృతరాష్ట్ర కౌగిలి నుండి టీడీపీ కాపాడబడుతుందా! వేచి చూద్దాం!

????ముంబై విమానాశ్రయంలో 32.79 కేజీల బంగారం స్వాధీనం :జూన్ 10..ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద రూ.19.15 కోట్లు విలువ చేసే 32.79 కేజీల బంగారాన్ని గుర్తించారు.లోదుస్తులు, బ్యాగుల్లో 72 బిస్కెట్లను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని వారిద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

????విద్యుత్ షాక్ తో అన్నదమ్ములు మృతి..ప్రకాశం జిల్లా గిద్దలూరు లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఓ శుభకార్యానికి ఆటోలో సప్లయర్స్ సామాన్లు తరలించి తిరిగి తీసుకు వెళుతున్న క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ నీటి మోటర్ వైర్లు ఆటోకు తాకి విద్యుత్ సరఫరా కావడంతో ఆటలో ఉన్న అన్నదమ్ములు శీలం లోహిత్ (18) శీలం సాయి (16) అక్కడికక్కడే మృతి చెందారు. మొదట కుటుంబ సభ్యులు అన్నదమ్ములను ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు కానీ అప్పటికి ఇద్దరు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

????వైసీపీ నేత అంబటి రాంబాబుకు చీర, జాకెట్, పూలు ఇచ్చేందుకు వచ్చిన తెలుగు విద్యార్థి నేతలు.చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం.. అడ్డుకున్న పోలీసులు. ఇంటి ముందు అంబటి ఫొటోకు బొట్టు పెట్టి, కుర్చీలో వస్తువులు పెట్టిన విద్యార్థి నేతలు.

???? అనకాపల్లిలో శ్రీనూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న పవన్ కళ్యాణ్మొక్కు తీరడంతో అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దర్శించుకున్న పవన్ కళ్యాణ్.

????టిడిపి సీనియర్ నాయకులకు సన్మానం..గిద్దలూరు నియోజకవర్గంలో ముత్తుముల అశోక్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచిన సందర్భంగ సోమవారం కంభం మండల టీడీపీ అధ్యక్షులు తోట శ్రీను , ఒంగోలు పార్లమెంట్ నాయకులు కేతం శ్రీను, కొత్తపల్లి శ్రీను, ఒంగోలు పార్లమెంట్ మైనారిటీ నాయకులు ఎన్టీఆర్ గౌస్, సీనియర్ నాయకులు సయ్యద్ నూరుల్లా ఖాద్రీ,టీడీపీ పట్టణ అధ్యక్షులు మాధవ మూర్తిలను అర్బన్ కాలనికి చెందిన జేడీ బాబు, మెడిగ శ్రీను ఘనంగా సన్మానించారు .కార్యక్రమంలో మహబూబ్ బాషా , బషీర్,కాకర్ల పిచ్చయ్య, హుస్సేన్ , ముజీబ్, మున్నా , మాజ్ ,ఇస్మాయిల్, కాశయ్య తదితరులు పాల్గొన్నారు

???? కంభం లొ ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు ..  కంభం మండలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు జూనియర్ గౌస్ ఆధ్వర్యంలో,హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాల క్రిష్ణ 64 వ పుట్టిన రోజు సందర్భంగా కంభం పట్టణం లో అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు నూరుల్లా ఖాద్రీ, సోమయ్య,కేతం శ్రీనివాసులు,సయ్యద్ గౌస్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు దాదా తదితరులు పాల్గొన్నారు

???? త్రిపురాంతకం ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి రాజీనామ..రాజీనామా పత్రాన్ని జడ్పీ సీఈవోకు రాజీనామ అందజేసిన ఎంపీపీ.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..