అయోధ్యలోనే కాదు సీతమ్మ ఊళ్లోనూ బీజేపీ ఓటమి..ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ,10 టీవీ ప్రసారాలు బంద్..కొడాలి నాని కబ్జా చేసిన స్థలం మాదే అంటూ..చంద్రబాబుకు అభినందనలు తెలిపిన ఏసిపి కిరణ్ కుమార్..రంగస్వామిని దర్శించుకున్న మాగుంట..సంగపేటలో కొండచిలువ..ఆడుదాం ఆంధ్రాలో అవినీతి?

????రాములోరి అయోధ్యలోనే కాదు సీతమ్మ ఊళ్లోనూ బీజేపీ ఓటమి.. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది.

రాముడి పేరు మీద బీజేపీ సాగించిన ప్రచారం అంతా ఇంతా కాదు. అయోధ్యలో తాము నిర్మించిన రామ మందిరాన్ని చూపించి ఓట్లు అడిగిన వైనంపై దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోని ప్రజల రియాక్షన్ ఎలా ఉన్నప్పటికీ.. అయోధ్యలో మాత్రం బీజేపీని రిజెక్టు చేశారు అక్కడి ప్రజలు. అయోధ్య రామాలయం కొలువు ఉన్న ఫైజాబాద్ ఎంపీ స్థానాన్ని సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి విజయం సాధించటం తెలిసిందే. ఈ అంశం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీసింది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఇప్పటివరకు రాములోరు కొలువై ఉన్న అయోధ్యలో బీజేపీ ఓటమిపాలు కావటంపై వార్తలు వచ్చాయి. కానీ.. సీతమ్మ ఊరుగా చెప్పే సీతాపూర్ లోనూ బీజేపీ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. కమలం పార్టీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో బీజేపీ ఓటమిపాలు కావటం సంచలనంగా మారింది. బీజేపీ అభ్యర్థి రాజేశ్ వర్మను కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్ రాథోడ్ 89,641 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ స్థానంలో బీజేపీ ఓటమిని ఎవరూ ఊహించలేదు. కాంగ్రెస్ గెలుపు అసాధ్యమనే భావించారు. అలాంటిది అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి చూపు ఈ నియోజకవర్గంమీద పడేలా చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సీతాపూర్ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సమాజ్ వాదీ పార్టీకి దక్కింది. ఆ పార్టీ సీనియర్ నేత కమలనాథులకు కంచుకోట లాంటి సీతాపూర్ స్థానం టికెట్ తనకు వద్దన్న ఆయన మాటతో కాంగ్రెస్ తన అభ్యర్థిని బరిలోకి దించాల్సి వచ్చింది.తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి నకుల్ దూబేకు టికెట్ ఇచ్చేందుకు ఆఫర్ చేసింది.ఆయన అందుకు ఆసక్తి చూపలేదు. దీంతో..అభ్యర్థులు ఎవరూ దొరకని వేళ కాంగ్రెస్ పార్టీ ఓబీసీకి చెందిన తేలీ సామాజిక వర్గానికి చెందిన రాజేశ్ రాథోడ్ కు టికెట్ కేటాయించారు. ఆయన నామినేషన్ తర్వాత పరిస్థితుల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దళితులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు మళ్లటంతో సీతమ్మ వారి ఊళ్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఓవైపు రాములోరి ఊళ్లోనే కాదు..ఆయన సతీమణి సీతమ్మ ఊళ్లోనూ బీజేపీ ఓడటం దేనికి సంకేతం? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
????మోడీ లో మార్పు!!!..తాజా సార్వత్రిక ఫలితాలతో మోడీలో చాలానే మార్పు వచ్చినట్లుగా చెప్పాలి. గతానికి భిన్నంగా తాను ఒక్కడినే ఫోకస్ అయ్యే తీరుకు భిన్నంగా.. తనతో పాటు మిత్రపక్షాలను సైతం ఫోకస్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు.. భాగస్వామ్య పక్షాలకు పెద్దపీట వేస్తున్నారు. ఎన్డీయే పక్షాలతో శుక్రవారం జరిగిన సమావేశాన్ని చూస్తే.. కొత్త మోడీ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తారు. భాగస్వామ్య పక్షాల గొప్పతనాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. తాము కలిసి ముందుకు సాగుతామన్న మాట మోడీ నోటి నుంచి వచ్చింది. మొత్తానికి గతంతో పోలిస్తే వర్తమానంలో మోడీలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న పరిస్థితి. అంచనాలు ఎలా మార్చిందంటే…? మోడీలో మార్పు ఎంతలా వచ్చిందన్న దానికి నిదర్శనంగా ఒక ఆసక్తికర ఘటనతో ముగిస్తాం. ఎన్డీయే పక్షాల సమావేశానికి హాజరైన ఆయన.. సదరు హాల్లోకి ప్రవేశ పెట్టినంతనే.. ఆయన నేరుగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని రాజ్యాంగ ప్రతిని తన నుదిటికి తాకించుకొని వందనం చేయటం గమనార్హం. అక్కడితో ఆయన ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసి.. భావోద్వేగ వ్యాఖ్యల్ని ఆ ఫోటోకు జత చేశారు. తన జీవితంలో ప్రతి క్షణమూ.. రాజ్యాంగం ప్రవచించిన గొప్ప విలువల పరిరక్షణమే అంకితమన్న మోడీ.. ‘‘నాలాంటి వెనుకబడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి దేశానికి సేవ చేయగలుగుతున్నానంటే అది కేవలం మన రాజ్యాంగం గొప్పదనం’’ అంటూ పేర్కొన్నారు. కొసమెరుపు ఏమంటే.. గడిచిన పదేళ్లుగా రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి.. 400 ప్లస్ సీట్ల సాధించిన తర్వాత రాజ్యాంగాన్ని సైతం మార్చేయాలన్నట్లుగా ఆయన వ్యవహరించి.. ఈ రోజున రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలు మోడీనా.. మజకానా? అన్న భావన కలగటం ఖాయం. కాదంటారా?
????కర్నూలు జిల్లా కోడుమూరు సీఐ మన్సురుద్దీన్ అకౌంట్ నుంచి రూ.2.20 వేలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.
సీఐ పర్సనల్ సిమ్ బ్లాక్ కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.
???? ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ,10 టీవీ ప్రసారాలు బంద్.*ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ,10 టీవీ ప్రసారాలు బంద్.ఒకే రోజు 12 లక్షలు పడిపోయిన సాక్షి పేపర్ సర్కులేషన్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని టీవీ9, ఎన్టీవీ,10 టీవీ ప్రసారాలు నిలిపివేయాలని కేబుల్ ఆపరేటర్ల ఏకగ్రీవ నిర్ణయం.ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, వాలంటీర్లు ఇలా అందరూ సాక్షి చదవాలిని గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కూడా కొట్టేయడంతో ఒకే రోజు 12 లక్షల సాక్షి పేపర్ సర్కులేషన్ పడిపోయాయి.
???? ఈనాడు సంస్థల అధిపతి రామోజీ రావు మృతి.హైదరాబాద్:

స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి.
తెల్లవారు జామున 3:45 నిమిషాలకు తుదిశ్వాస విడిచిన రామోజీ రావు..పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలింపు.** ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు
రామోజీరావు అంత్యక్రియలను అధికారిక
లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం
నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్
అక్కడి నుంచే సీఎస్కు ఆదేశాలు జారీ చేసినట్లు
సమాచారం. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని
రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు
సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఓ మీడియా
దిగ్గజానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
నిర్వహించనుండటం దేశంలో ఇదే తొలిసారి.
???? కృష్ణాజిల్లా గుడివాడ ..
కొడాలి నాని కబ్జా చేసిన తొమ్మిది ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న బాధితులు..
టిడిపి విజయంతో గెడ్డం గ్యాంగ్ అరాచకాలను ఎదిరిస్తున్న ప్రజలు..రెండు జెసిబి లతో కబ్జా చేసిన భూమి చుట్టూ ఉన్న కంచెలను తొలగించిన బాధితులు..
కొడాలి నాని అరాచకాలు నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన బాధితులు..
బాధితుల కామెంట్స్..
బిడ్డల భవిష్యత్తు కోసం కొనుక్కున్న భూమిని తన అనుచరులతో కొడాలి నాని కబ్జా చేశాడు..
ఇదేంటి అని ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసులు పెట్టి. వేధించడమే కాకుండా తమపై దాడి చేయించాడు
న్యాయం కోసం పోలీసులను వేడుకున్నాం కోర్టులను ఆశ్రయించాం.. ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగాం…
అయినా మాకు న్యాయం దక్కలేదు… వెనిగండ్ల రాము వల్లే నేడు మాకు న్యాయం జరిగింది. బాధితులు
అందరినీ 420 అనే కొడాలి నాని నే అసలైన 420 . కొడాలి నాని నీ గుడివాడ నుండి తరిమి కొడతాం
మరలా కొడాలి నానిని రాజకీయాల్లోకి రాకుండా చేస్తాం.. బాధితులు
ఆశలు వదిలేసుకున్న తరుణంలో మా పాలిట దైవంలా వెనుగండ్ల రాము అండగా నిలబడ్డారు.
ఇటువంటి మంచి వ్యక్తులు గుడివాడకు శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నాం. బాధితులు
రాము ఎమ్మెల్యే గా ఉన్నంతకాలం గుడివాడకు అంత మంచే జరుగుతుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు.
???? ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శనివారం హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఏ సి పి కే యం కిరణ్ కుమార్ ఢిల్లీలో కలిసి ఫ్లవర్స్ బొకే అందించి అభినందనలు తెలియజేశారు.
????సంగపేటలో కొండచిలువ కలకలం.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సంగపేట గ్రామంలో శనివారం కొండచిలువ కలకలం రేపింది. స్థానిక రైతుకు చెందిన ఓ గడ్డివాము దొడ్డిలో పది అడుగుల కొండచిలువ కనిపించింది. దీంతో హడలిపోయిన స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఎఫ్ఆర్ఓ ప్రియాంక, డిఆర్ఓ రంగారెడ్డి కొండచిలువను సురక్షితంగా బంధించి స్థానిక నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పాములు కనిపిస్తే వాటిని చంపకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని పాములను పట్టుకుని సురక్షితంగా అడవి ప్రాంతంలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు.
????రంగనాయక స్వామిని దర్శించుకున్న మాగుంట రాఘవరెడ్డి..

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని శనివారం టిడిపి నాయకులు మాగుంట రాఘవరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిడిపి అధికారంలోకి రావడంతో స్వామివారికి మొక్కు చెల్లించేందుకు వచ్చినట్లుగా మాగుంట రాఘవరెడ్డి తెలిపారు. అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
????”ఆడుదాం ఆంధ్ర” పేరుతో ప్రజా ధనంతో కొన్న కిట్లను స్థానిక యువతకు చేర్చకుండా దాచుకున్న వైఎస్సార్సీపీ నాయకులు.పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు నియోజకవర్గం, ఉరదాళ్ళపాలెం గ్రామపంచాయతీలో నిరుపయోగంగా పడి ఉన్న “ఆడుదాం ఆంధ్ర” సామాగ్రిని స్థానిక NDA కూటమి నాయకులు వెలికితీసి యువతకు అందించారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..