???? చెంపదెబ్బకు లక్ష నజరానా !.. సీఆర్పీఎఫ్ జవాన్ కు మద్దతుగా నిలిచిన పంజాబ్ రైతులు..
మహిళలు వంద తీసుకుని రైతుల నిరసనలో పాల్గొన్నట్లు కంగనా అన్నదానిపై నా సోదరి మానసికంగా చాలా కోపంతో ఉన్నది. ‘చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో ఏదో జరిగిందని మీడియా ద్వారా తెలిసింది. కంగనా మొబైల్,పర్సు తనిఖీ చేసిన సమయంలో ఈ సంఘటన జరిగిందని నాకు అర్థమైంది. మహిళలు వంద తీసుకుని రైతుల నిరసనలో పాల్గొన్నట్లు కంగనా అన్నదానిపై నా సోదరి మానసికంగా చాలా కోపంతో ఉన్నది. అదే ఈ సంఘటనకు దారి తీసింది. సైనికులు, రైతులు ఇద్దరూ ముఖ్యమైనవారు.అన్ని విధాలుగా వారి విధులను నిర్వర్తిస్తున్నారు.ఈ విషయంలో మేం ఆమెకు పూర్తి మద్దతుగా ఉంటాం’ అని కంగనా రనౌత్‌ను చెంపపై కొట్టిన సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చర్యను ఆమె సోదరుడు రైతు నాయకుడు,పంజాబ్‌లోని కపుర్తలా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కార్యదర్శి అయిన షేర్ సింగ్ మహివాల్ తన సోదరికి మద్దతుగా నిలిచాడు.ఇది ఇలా ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన కంగనా చెంపపై కొట్టిన సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చర్యను పంజాబ్‌కు చెందిన ఒక వ్యాపారి కూడా సమర్థించాడు. మొహాలీలోని జిరాక్‌పూర్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ శివరాజ్ సింగ్ బెయిన్స్ ఆమెకు లక్ష రివార్డు ప్రకటించాడు. పంజాబీ ప్రజలు, పంజాబీ సంస్కృతిని రక్షించిన కుల్విందర్ కౌర్‌కు ఆయన సెల్యూట్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నిన్న చండీఘడ్ విమానాశ్రయంలో నటి, మండి లోక్ సభ సభ్యురాలు కంగనా రనౌత్ ను సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టింది. కేంద్రప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతంలో ఆందోళనలకు దిగిన మహిళా రైతుల గురించి కంగనా అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.
???? మూడు సంతకాలు వీటిపైనే!..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.అనంతరం మొదట మెగా డీఎస్సీపైన సంతకం చేస్తారని తెలుస్తోంది. తన రెండో సంతకాన్ని ల్యాండ్ టైట్లింగ్ చట్టంపైన చేస్తారని వినికిడి. మూడవ సంతకం తాము అధికారంలోకి వస్తే రూ.4000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తామన్నారు.
???? వైసీపీ షాక్ ఇవ్వనున్న కీలక నేతలు..?ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి.. కీలక నేతలు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11స్థానాల్లోనే విజయం సాధించగా.. కూటమి 164 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలోనే వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే అనుమానంతో కొందరు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
???? *అమరావతి:వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్..
????వెలగపూడి రాష్ట్ర కోత్త చీఫ్ సెక్రెటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ భాధ్యతలు స్వీకరించిన అనంతరంఆయనకు మర్యాదా పూర్వంగా కలిసిన గ్రూపు 1 అధికార్లు మరియు మేడిపల్లి అజయ్
????27 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు..సికింద్రాబాద్ నియోజకవర్గం గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్ లో వదిలేసిన 27 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే అర్బన్ డీఎస్పీ జావెద్ తెలిపిన వివరాల ప్రకారం. ఎస్సై మాజీద్ గురువారం మధ్యాహ్నం సిబ్బందితో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేస్తుండగా ప్లాట్ ఫాం నంబర్-1పై ఓ ట్రాలీ బ్యాగ్, పాక్ చేసిన బాగ్ కనిపింపించాయి. ఓపెన్ చేసి చూడగా 27 కిలోల గంజాయి దొరికింది.
????దేవినేని అవినాశ్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు..విజయవాడలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉదయం కొడాలి నాని ఇంటి వద్ద, మధ్యాహ్నం విజయవాడలోని వల్లభనేని వంశీ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినాశ్ ఇంటి పై దాడి జరుగుతుందన్న సమాచారంతో గొడవలు జరగకుండా భారీగా పోలీసులు మెహరించి ఇనుప కంచెను ఏర్పాటు చేశారు.
???? టీడీపీ వ్యక్తిపై వైసీపీ వ్యక్తి కొడవలితో దాడి..కడపజిల్లా..ప్రొద్దుటూరులో19 వార్డుకు చెందిన సోహాల్ అనే వ్యక్తి టీడీపీ నాయకుడు వీఎస్ ముక్త్యార్ తో తిరుగుతున్నడని 19 వార్డ్ వైసీపీ ఇంచార్జి నీలపురం చాంద్ బాషా కొడవలితో దాడి..టీడీపీ ప్రభుత్వం వచ్చిందని ఎక్కువ చేయొద్దంటూ ఎర్రగుంట్ల బైపాస్ లోని సినీహబ్ వద్ద సాహెల్ పై కొడవలితో దాడి చేసిన నీలపురం చాంద్ బాషా అతని అనుచరులు..స్నేహితుల సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న బాధితుడు సాహెల్..వెంటనే వైద్యం అందించిన వైద్యులు ..విషయం తెలుసుకుని హుటాహుటిన హాస్పిటల్ చేరుకుని,వివరాలు సేకరించి,కేసు దర్యాప్తు చేస్తున్న డీఎస్పీ మురళీధర్,సిఐలు శ్రీకాంత్,అబ్దుల్ కరీం, రమణారెడ్డి,వెంకటరమణ ..
????విజయవాడ పశ్చిమ భవానిపురం శివాలయం సెంటర్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించాలని టిడిపి కార్యకర్తలు ఆందోళన..ఒకసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది.. సంఘటన స్థలానికి చేరుకున్న భవానిపురం పోలీసులు.
????మల్లికార్జున స్వామిని దర్శించుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..నంద్యాల జిల్లా, శ్రీశైలం లోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్లను గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
???? పార్లమెంట్ ప్రాంగణంలో మహాత్మా గాంధీ,అంబేద్కర్, చత్రపతి శివాజీ విగ్రహాలను తొలగించడం… ఎన్ డి ఏ కూటమికి తగదు…మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బిజెపి కూటమి వైఫల్యంతో దిక్కుమాలిన చర్యలకు పాల్పడుతున్న మోడీ….తప్పుడు ఎగ్జిట్ పోల్స్ తో చిన్న మధుపర్లకు 30. లక్షల కోట్ల రూపాయల నష్టం….స్టాక్ మార్కెట్ల కుంభకోణానికి పాల్పడిన ప్రధాని మోడీ ,అమిత్ షా జోడి…షేక్ సైదా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..పొదిలి ..పార్లమెంట్ భవనం సుందరీకరణ పేరుతో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, చత్రపతి శివాజీ విగ్రహాలను పార్లమెంటు ప్రాంగణం నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్యని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సైదా అన్నారు.పాత పార్లమెంట్ భవనం ,గ్రంథాలయం నడుమ ఉన్న లాన్ లో గిరిజన నేత బిర్సా ముండా, మహారాణా ప్రతాప్ తదితల విగ్రహాలు యధా స్థానంలో ఉన్నాయి వాటిని ఏమాత్రం కదపకుండా మహాత్మా గాంధీ, అంబేద్కర్, శివాజీ విగ్రహాలను తరలించడలో ఔచిత్యం ఏమిటో దేశ ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు. మహారాష్ట్ర ఓటర్లు భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఆదరించ నందుకే పార్లమెంట్ ఆవరణలోని శివాజీ, అంబేద్కర్ విగ్రహాలను వాటి పూర్వ స్థానం నుంచి తరలించారని సైదా మండిపడ్డారు, అలాగే మహాత్మా గాంధీ జన్మస్థలమైన గుజరాత్ లోను భాజపా క్లీన్ షిప్ ఆశలు వమ్ము కావడంతో మా మహాత్ముని విగ్రహాన్ని సైతం తొలగించారని సైదా అన్నారు ఈ దేశ ప్రజలు 400 ఎంపీ స్థానాలు భాజపాకు కట్టబేడితే! రాజ్యాంగాన్ని మార్చకుండా ఉంటారా ?అని ఆయన ప్రశ్నించారు. మోదీ ,షా జోడి స్టాక్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడ్డారు….ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా జోడి కలిసి స్టాక్ మార్కెట్ కుంభ కోణానికిపాల్పడ్డారని దానివల్ల చిన్న మదుపరులు దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సైదా తీవ్రంగా విమర్శించారు. ఈ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ( జేపీసీ )ద్వారా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పుడు ఎగ్జిట్ పోల్స్ తర్వాత స్టాక్ మార్కెట్లు ఎగిసిపడి నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే స్టాక్ మార్కెట్లో కుప్పకూలాయని, ఇది దేశంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం అని, ఎన్నికలు జరుగుతున్న సమయంలో మోడీ ,అమిత్ షా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లు స్టాక్ మార్కెట్ పై వ్యాఖ్యానించారని, ఇది ఎవరిని ఉద్ధరించడం కోసం చేశారో దేశ ప్రజలకు చెప్పాలని, పెట్టుబడులపై ప్రజలకు మోడీ, అమిత్ షా ఎందుకు సలహా ఇచ్చారో దీనిపై సమగ్ర విచారణ జరపాలని సైదా డిమాండ్ చేశారు.
????మల్లికార్జున స్వామిని దర్శించుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..నంద్యాల జిల్లా, శ్రీశైలం లోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్లను గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమం లో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు…

